మన ధర్మంలో ఒక్కో దేవతను ఒక్కో విధంగా పూజిస్తాము. అందులో శివునకు మరియు నరసింహ స్వామి వారికి షట్కాల పూజ నిర్వహిస్తాము. షట్ అంటే ఆరు. ఆరు కాలాలు - ప్రత్యూష కాలము, ఉదయం, మద్యాహ్నము, సాయంకాలము, రాత్రి, అర్ధరాత్రి సమయాల్లో పూజ. శివకేశవులకు బేధం లేదు. అందులోనూ శివుండు మరియు నృసింహుని తత్త్వం ఒక్కటేనని చెబుతారు. ఈ రోజు ప్రదోషమే కాక స్వాతి నక్షత్రం కూడా ఉంది. కనుక ఇలాంటి శుభసమయంలో శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారిని తప్పకుండా పూజించాలి.
లక్ష్మీనృసింహుని ఆరాధన గ్రహదోషాలను ఉపశమింపజేస్తుంది, ఋణబాధలు తొలగిస్తుంది. సంధ్యాసమయంలో ప్రతి రోజూ శ్రీ లక్ష్మీ నృసింహ ఋణ విమోచన స్తోత్రం పఠిస్తే, తప్పకుండా ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి, ధనం సంప్రాప్తిస్తుంది.
No comments:
Post a Comment