Sunday, November 24, 2019

వ్యాధులను నివారించే శీతలాదేవి.

వ్యాధులను నివారించే శీతలాదేవి.

వ్యాధులను నివారించే శీతలాదేవి.
పూర్వం అంటువ్యాధుల భయం విపరీతంగా వుండేది. పేరు ఏదైనా ఒకరి నుంచి ఒకరికి సోకే ఈ వ్యాధుల వలన మరణించేవారి సంఖ్య ఎక్కువగా ఉండేది. 
ఒక్కోసారి ఈ అంటువ్యాధుల కారణంగా గ్రామాలకు ... గ్రామాలు ఖాళీ అవుతూ ఉండేవి. 
దాంతో అంటువ్యాధుల పేరు వినగానే గ్రామస్తులు తీవ్రమైన భయాందోళనలకు లోనయ్యేవారు. 
ఇక తమని అమ్మవారే కాపాడాలని భావించి, అంతాకలిసి 'శీతలాదేవి'ని పూజించేవారు.
శీతలాదేవి అంటే సాక్షాత్తు జగన్మాత అయిన పార్వతీదేవియే. 
ఆ తల్లి అనుగ్రహంతో అంటువ్యాధులు నివారించ బడతాయని గ్రామస్తులు విశ్వసిస్తూ వుంటారు. 
అలా వివిధ రకాల రోగాల నుంచి వ్యాధుల నుంచి విముక్తిని కలిగించే శీతలాదేవిని 'శ్రావణ బహుళ అష్టమి' రోజున పూజిస్తుంటారు. 
శ్రావణ బహుళ అష్టమిని 'కృష్ణాష్టమి'గా జరుపుకుంటూ వుంటారు.
నారాయణుడి సోదరిగా చెప్పబడే అమ్మవారి అనుగ్రహాన్ని కోరుతూ ఆ తల్లికి ప్రత్యేక పూజలందించే ఈ రోజుని 'శీతలాష్టమి' అని కూడా పిలుస్తుంటారు. 
ఈ రోజున చాలామంది కుటుంబసభ్యులతో కలిసి 'శీతలావ్రతం' ఆచరిస్తూ వుంటారు. 
ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలు ఎల్లప్పుడూ తమపై వుండాలని ఆశిస్తూ 'శీతలాష్టకం'పఠిస్తారు. 
అమ్మవారికి ఇష్టమైన పులిహోర ... పాయసం ... పెరుగన్నం నైవేద్యంగా సమర్పిస్తుంటారు.
భక్తిశ్రద్ధల పరంగాను ... ప్రేమానురాగాల పరంగాను అమ్మవారిని సంతోషపెట్టడం వలన ఎలాంటి వ్యాధులు దరిచేరవని అందరూ విశ్వసిస్తూ వుంటారు. 
ఇక ఇదే రోజున అమ్మవారి ప్రీతీ కొరకు కొంతమంది 'చండీహోమం' చేయిస్తుంటారు. 
ఈ చండీహోమం చేయించడం వలన సమస్త దోషాలు ... గ్రహ సంబంధమైన పీడలు తొలగిపోయి శుభాలు చేకూరతాయని చెబుతుంటారు.
జ్వరాది వ్యాధుల్ని పోగొట్టే ’శీతలాదేవి.
విశ్వచక్రంలోనున్న దేవతాశక్తుల్ని దివ్య మంత్ర,, నామ స్తోత్రాదులతో స్పందింపజేసి అభీష్టసిద్ధుల్ని సాధించే ’శబ్దచికిత్సా’ విధానాలను మన ఋషులు ఏర్పాటు చేశారు.
వ్యాధుల్ని నివారింపజేసి, జ్వరాలను తొలగించే శక్తి ఉన్న శీతలాదేవిని ఉత్తరాది, వంగదేశం, ఉత్కళ రాష్ట్రాలలో ఎక్కువగా ఆరాధిస్తారు. 
సుమారు ప్రతి దేవాలయంలో శీతలాదేవికి చిన్న ఆలయముండడమే కాక, ప్రత్యేకించి శీతలా మందిరాలు సైతం కనిపిస్తుంటాయి. 
శీతలా స్తోత్రాలు నిత్యపారాయణాలుగా ఉండడమే కాక, అతి సామాన్యులు సైతం ఈ తల్లిని ఆరాధిస్తుంటారు.
ఒకసారి రామకృష్ణ పరమహంస శిష్యునికి అనారోగ్యం కలిగింది. అప్పుడతను మాత శారదాదేవితో రైల్లో ప్రయాణిస్తున్నాడు. 
అనారోగ్యం కారణంగా ఆ శిష్యుడు మూసిన కళ్లు తెరవలేక పోతున్నాడు.
అది నిద్రో, లేవలేని నిస్సహాయతో గానీ ఆ అస్పష్ట కలత నిద్రలోనే అతనికొక భయంకరమైన ఆకారం ఒకటి కనిపించి 'ఇప్పటికే నేను నిన్ను మృత్యువుకు అప్పచెప్పి ఉండేదాన్ని. కానీ, నీ గురువాజ్ఞ మేరకు వదిలి పెడుతున్నాను. 
అయితే, ఇందుకు కృతజ్ఞతగా నేనుచూపించే ఈ దేవతామూర్తికి నువ్వు బాగా తియ్యగా ఉండే రసగుల్లాలను నైవేద్యం పెట్టాలి' అని ఆదేశించి అదృశ్యమైంది. 
ఆ ఆకారం చూపించిన దేవతా మూర్తి ఎర్రని పట్టు వస్త్రాన్ని ధరించి ఉంది.
ఆ తరువాత చిత్రంగా అతని అనారోగ్యం నయమైంది.
ఎంత తీవ్రమైన జ్వరంగానీ, ఎంతో కాలంనుండి తగ్గకుండా పీడిస్తున్న వ్యాథులు పీడిస్తుంటే ఈ తల్లికి భక్తిశ్రద్ధలతో మొక్కుకుంటే తప్ప కుండా అవి నివారణ మవుతాయని భక్తుల ప్రగాఢవిశ్వాసం.
అనంతశక్తి స్వరూపిణియైన జగదంబ తన అనంత అనుగ్రహాన్ని వివిధ విధాలుగా అందించడానికి అనంత రూపాలను ధరించింది. 
అలాంటి రూపాలలో ఈ శీతలాదేవి ఒకటి, 
జ్వరహరణ శక్తులలో ఒకటి. 
గాడిద వాహనంపై కూర్చుని చేట, చీపురు, కలశంవంటి వాటితో ప్రకాశించే ఈ తల్లిరూపం రోగనాశక శక్తులకు సంకేతం.
జంతువులలో కూడా అనేక రహస్య శక్తులుంటాయి. 
ఆ శక్తుల్ని గమనిస్తే - కొన్ని జంతువుల ఇంద్రియాలలో సూక్ష్మశక్తులున్న విషయం స్పష్టమౌతుంది. 
ఆ ప్రత్యేకతలన్నీ విశ్వశక్తిలోని అంశాలే.
శక్తులకు సూక్ష్మ జగత్తులో ఉన్న ఆకృతులను మంత్రద్రష్టలు దర్శించి, వాటిద్వారా మనం తగిన ప్రయోజనాలను పొందాలని వివిధ స్తోత్రాలనందించారు.
గాడిద, చేట, చీపురు, కలశం - ఈపరికరాలు రోగకారక క్రిమినాశన, జ్వరహరణ శక్తులకు సంకేతాలు.
స్ఫోటకము, ఉష్ణతలు, తీవ్రజ్వరాలు నశించడానికి, పిల్లలకు వచ్చే ఆటలమ్మవంటి ’మారీ’ వేదనలు తొలగడానికి, శీతలాదేవిని తలంచి ఈ స్తోత్రం చదివితే చాలు - తప్పక ఆ వ్యాధులు నివారణ అవుతాయని శాస్త్రోక్తి. "శీతలా" నామస్మరణమే జ్వరతాపాలను పోగొడుతుందని పురాణవచనం.
శీతలా దేవి స్తోత్రం..!!
అస్యశ్రీ శీతలాస్తోత్రస్య మహాదేవ ఋషిః - అనుష్టుప్ ఛన్దః - శీతలా దేవలా దేవతా - లక్ష్మీర్బీజం - భవానీశక్తిః -సర్వ విస్ఫోటక నివృత్తయే జపే వినియోగః
ఈశ్వర ఉవాచ:
వన్దేహం శీతలాం దేవీం రాసభస్థాం దిగమ్బరామ్!
మార్జనీకలశోపేతాం శూర్పాలంకృత మస్తకామ్!!
వన్దేహం శీతలాం దేవీం సర్వరోగ భయాపహామ్!
యామాసాద్య నివర్తేత విస్ఫోటక భయం మహత్!!
శీతలే శీతలే చేతి యో బ్రూయాద్దాహ పీడితః!
విస్ఫోటక భయం ఘోరం క్షిప్రం తస్య ప్రణశ్యతి!!
యస్త్వా ముదకమధ్యేతు ధృత్వా పూజయతే నరః!
విస్ఫోటకం భయం ఘోరం గృహే తస్య న జాయతే!!
శీతలే జ్వర దగ్ధస్య పూతిగంధయుతస్యచ!
ప్రనష్టచక్షుషః పుంస్ః త్వామాహుర్జీవనౌషధమ్!!
శీతలే తనుజాన్రోగాన్ నృణాం హరసి దుస్త్యజాన్!
విస్ఫోటక విదీర్ణానాం త్వమేకామృతవర్షిణీ!!
గలగండగ్రహా రోగా యే చాన్యే దారుణా నృణామ్!
త్వదనుధ్యాన మాత్రేణ శీతలే యాన్తి సంక్షయమ్!!
నమన్త్రోనౌషధం తస్య పాపరోగస్య విద్యతే!
త్వామేకాం శీతలే ధాత్రీం నాన్యాం పశ్యామి దేవతామ్!!
మృణాల తంతు సదృశీం నాభి హృన్మధ్య సంశ్రితామ్!
యస్త్వాం సంచిత యేద్దేవి తస్య మృత్యుర్నజాయతే!!
అష్టకం శీతలాదేవ్యా యోనరః ప్రపఠేత్సదా!
విస్ఫోటక భయం ఘోరం గృహేతస్య నజాయతే!!
శ్రోతవ్యం పఠితవ్యం చ శ్రద్ధాభక్తి సమన్వితైః!
ఉపసర్గ వినాశాయ పరం స్వస్త్యయనం మహత్!!
శీతలే త్వం జగన్మాతా శీతలే త్వం జగత్పితా!
శీతలే త్వం జగద్ధాత్రీ శీతలాయై నమోనమః!!
రాసభో గర్దభశ్చైవ ఖరో వైశాఖనందనః!
శీతలా వాహనశ్చైవ దూర్వాకంద నికృంతనః!!
ఏతాని ఖరనామాని శీతలాగ్రేతు యఃపఠేత్!
తస్యగేహే శిశూనాం చ శీతలా రుజ్ఞజాయతే!!
శీతలాష్టక మేవేదం నదేయం యస్యకస్యచిత్!
దాతవ్యం చ సదా తస్మై శ్రద్ధా భక్తియుతాయవై!!
స్వస్తి..!!
లోకా సమస్తా సుఖినోభవంతు..!!
                          శ్రీ మాత్రే నమః

No comments:

Post a Comment

Jamalapuram Sri Venkateswara Swamy Temple జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం Telangana Tirupati, Khammam District

The road access to the temple is very good, and you can easily reach it in your own vehicle. Parking is not a concern as you can park comfor...