*🙏🏻జై శ్రీమన్నారాయణ🙏🏻*
*🌺షష్టిపూర్తి🌺*
*అరవై సంవత్సరాలకు ఒకసారి మానవుడి మనో ధర్మాలతో పాటు, మానవ ధర్మాల విషయంలో మార్పులు సంభవిస్తాయి. మానవుడి బుద్ధి శక్తి కూడా 60ఏళ్లు నిరాటంకంగా పనిచేస్తుంది. అక్కడి నుంచి మానవ శరీరంలో మార్పులు మొదలువుతాయి. క్రమంగా జ్ఞాపకశక్తి క్షీణిస్తూ వస్తుంది. శరీరంలోని కండరాలు కరిగిపోతుంటాయి. అరవై సంవత్సరాలలోపు మృత్యుశక్తి ఒకసారి ప్రభావం చూపుతుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు.* అంటే ఏదో విధమైన ప్రాణాపాయం దగ్గరి వరకూ వచ్చి వెళ్తుందన్నమాట. అరవై సంవత్సరాల నుంచి ప్రతి పదేళ్లకు మృత్యుశక్తి పలకరిస్తూ ఉంటుంది. 🤔 🤔
*ప్రభవ నామ సంవత్సరంతో ప్రారంభమైన తెలుగు సంవత్సరాలు అక్షయతో ముగుస్తాయి. అంటే మనిషి పుట్టిన సంవత్సరం నుంచి తిరిగి అరవై ఏళ్ల తర్వాత అదే సంవత్సరం మొదలువుతుంది.* అప్పటి నుంచి *మళ్లీ బాల్యావస్థ మొదలవుతుంది. అంటే చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తుంటారు. అకారణంగా అలగడం, అవీ.. ఇవీ తినాలని అడగటం,ఎక్కువసేపు నిద్రపోవటం, చిన్న విషయాలకే ఆనంద పడటం, కోపం తెచ్చుకోవటం, కన్నీళ్లు పెట్టుకోవడం ఇలాంటి బాల్య చేష్టలన్నీ అరవైఏళ్ల నుంచి నెమ్మదిగా ప్రారంభమవుతాయి.* ప్రతి కొడుకూ అరవై సంవత్సరాలు వచ్చిన నాటి నుంచి తన తండ్రిని తన బిడ్డలతో సమానంగా చూసుకోవాలని ధర్మశాస్త్రం చెబుతోంది. ఆరుపదుల జీవితాన్ని ఎవరైతే ఆనందంగా జీవిస్తారో వారి జీవితం ధన్యం. *ఆ ధన్యజీవితపు జ్ఞాపకార్థమే బిడ్డలు, మనవళ్లు బంధువులు మిత్రులు కలిసి 💐💐షష్టిపూర్తి చేస్తారు* 💐💐
No comments:
Post a Comment