Friday, January 18, 2019

అద్భుతమైన చాణక్య నీతి

*.అద్భుతమైన చాణక్య నీతి.*

          *ఓ సందర్భంలో చాణక్యుడికి మరియు వారి శిష్యపరివారానికి మధ్య ఆసక్తికరమైన ప్రశ్నోత్తరాల సమయం గడిచింది. ఇవి చాలా ఉపయోగకరమని ఇక్కడ తెలియజేస్తున్నాం.*

7  ప్రశ్నలు

7  పొరబాట్లు

చాణక్యుడి సరియైన సవరణలు

👉 1 *చాణక్యుడు :*  అతి పదునైన వస్తువు ఈ ప్రపంచంలో ఏది?

*శిష్యులు:* చాలా తెలివిగా ఖడ్గం అని
బదులిచ్చారు.

*చాణక్యుడి సవరణ:* ఈ ప్రపంచంలోనే అతి పదునైనది మానవుని నాలుక. అది చాలా సులువుగా ఇతరులను అనాలోచితంగా బాధించగలదు. అందుకే దాని చాలా పొదుపుగా జాగ్రత్తగా వాడవలెను.

👉 2. *చాణక్యుడు:* ప్రపంచంలో అన్నిటికన్నా దూరంగా వున్నది ఏది?
   *శిష్యులు :* చంద్రుడు, సూర్యుడు, ఆకాశం, నక్షత్రాలు అంటూ చెప్పుకొచ్చారు.

  *చాణక్యుడి సవరణ:* కాని అన్నిటికన్నా దూరంగా వున్నది గతం. కరిగిపోతున్నకాలం  మనం ఎవరిమైనప్పటికీ, ఎంత శక్తివంతులమైనా కూడా మనము కాల చక్రంలో ముందుకు పోవడమే తప్పించి వెనుకను మరలలేము కదా. అందుకే వర్తమానమును సమృద్దిగా, బుద్దిగా ఉపయోగించుకొనేవాడు శ్రేష్ఠుడు.

👉 3 *చాణక్యుడు:* ప్రపంచంలోనే అతి పెద్ద పదార్ధం ఏది?

*శిష్యులు:*  పర్వతాలు, భూమి, సూర్యుడు అంటూ సమాధానం ఇచ్చారు

*చాణక్యుడి సవరణ:* అతి పెద్ద పదార్ధం కోరిక..
ఇవి జనులకు ఎంతలా అంటే అది ఈ సృష్టిలో వున్న అన్నింటికన్నా పెద్ద పరిమాణంలో వుంటాయి. వాటిలోనే మునిగి తేలుతూ..
అవి నెరవేరితే సుఖం లేదంటే అవి దక్కలేదనే దుఃఖంలోనే మునిగిపోయి నిజమైన ఆనందాన్ని కోల్పోతారు. కనుక అమిత ప్రభావం చూపే
ఈ విషయాల పట్ల మితముగా మధ్యేమార్గంగా వ్యవహరించుట మంచిది.

👉 4. *చాణక్యుడు :* అత్యంత బలమైనది లేక బరువైనది ఏది?
*శిష్యులు:* ఇనుము, ఏనుగు వంటి సమాధానాలు ఇచ్చారు.

  *చాణక్యుడి సవరణ:* ప్రపంచంలో బరువైనది, దృఢమైనది ప్రమాణం లేదా మాట. ఎవరికన్న చాలా సులువుగా ఇచ్చేయగలిగేది కాని నిలబెట్టుకోవడంలో కష్టతరమైనది.

👉 5. *చాణక్యుడు:* మరి అత్యంత చులకనైన గలది (తేలికగలది)

*శిష్యులు  :* దుమ్ము, పత్తి, ఆకులు, గాలి అంటూ పలు సమాధానాలు వినిపించాయి శిష్యుల నుండి.

*చాణక్యుడి సవరణ :* అన్నింటికన్నా తేలికైనది వినయం కాని చాలా మంది అది తమకి ఆపాదించుకోలేరు. తమ తమ జీవితాలలో కాస్త పురోగతి సాధించిన వెంటనే వినయాన్ని కోల్పోయి అహమును ఆభరణముగా చేసుకుంటారు. కాని అది ఎవరికి ప్రయోజనకారి కాదు కదా.. అది దహించు అగ్ని వంటిది.

👉 6. *చాణక్యుడు:*  మనకు అత్యంత ఆత్మీయులు ఎవరు?

  *శిష్యులు :* తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు అంటూ సమాధానాలు వచ్చాయి శిష్యుల నుండి.

*చాణక్యుడి సవరణ :*  అత్యంత సన్నిహితమైనది మనకు మృత్యువు. ఎందుకంటే మరణం తధ్యమైనది. అది ఏ క్షణమైనా మనకు కలుగవచ్చు.

👉 7. *చాణక్యుడు:* ప్రపంచంలోనే అత్యంత సులువైన పని?

*శిష్యులు:*  నిద్ర, భోజనం, మాటామంతీ చేయడం సులువైనవి కావొచ్చు గురువుగారు అన్నారు

*చాణక్యుడి సవరణ :* ఈ అమూల్యమైన సందేశాన్ని అందరికీ చేరవేయడం కదా అన్నిటికన్న సులువైన పని. నలుగురిని మేల్కొలిపే ఈ సందేశాన్ని తెలుసుకున్న మీరు ఆ పని చేయకుండా వుండలేరని నాకు తెలుసు అన్నారు.

No comments:

Post a Comment

Jamalapuram Sri Venkateswara Swamy Temple జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం Telangana Tirupati, Khammam District

The road access to the temple is very good, and you can easily reach it in your own vehicle. Parking is not a concern as you can park comfor...