Thursday, January 17, 2019

భార్య కూ విడాకులు

మాంచి నిద్రలో ఉన్న రమణను అతని భార్య సుజాత నిద్రలేపి, కాఫీ పెట్టమని ఆర్డర్ వేసింది.
దీంతో రమణ కోపంగా బయటకు వెళ్లి ‘‘ఇక నీతో వేగలేను’’ అంటూ చెప్పులు వేసుకున్నాడు.

‘‘ఎక్కడికి వెళ్తున్నారో కాస్త చెప్పి చావండి’’ అంది సుజాత.

‘‘లాయర్ దగ్గరకు వెళ్తున్నా.. నీకు విడాకులిచ్చేస్తా’’ అని చెప్పాడు రమణ.

ఓ గంట తర్వాత రమణ పిల్లిలా వచ్చి, వంట గదిలోకి వెళ్లి కాఫీ పెట్టి ఇచ్చాడు.

‘‘ఏమైందీ? విడాకులిస్తానన్నారుగా?’’ అంది సుజాత.

‘‘నేను వెళ్లేసరికి లాయర్ అంట్లు తోముతున్నాడు’’ అని గొణుకున్నాడు రమణ.
😊😃😀

No comments:

Post a Comment

vande Bharat express.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అనేది భారతీయ రైల్వేలు నడుపుతున్న సెమీ-హై-స్పీడ్, ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ రైలు సేవ. దీనిని గతంలో 'ట్రైన్ 18...