🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*స్నేహితుడంటే…?*
➖➖➖✍️
```
*అమ్మ అనే పదం తర్వాత ఆత్మీయతను ధ్వనింపజేసే ఏకైక పదం స్నేహం.
*స్నేహం అనేది ఆ దేవుడిచ్చిన గొప్ప వరం. అమ్మా, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లెలు, అన్న మొదలైన బంధాలను ఆ దేవుడే సృష్టించి ఇచ్చినా స్నేహితులను మాత్రం మనల్నే ఎంచుకోమన్నాడు.
*అందుకే మంచి స్నేహాన్ని సంపాదించుకుని భద్రంగా కాపాడుకుంటే అది మన జీవితాన్ని సంతోషంగా ఉంచుతుంది.
*తెలుగు కవి ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి "సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ" అన్నారు.
*మంచి స్నేహాన్ని సంపాదించుకోవడం అంత సులభం కాదు.
*స్నేహం అనేది ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ దానికి ఒక నిర్ధిష్టమైన లెక్కలు, అంచనాలు ఉండవు.
*మనలా ఆలోచించే, మనకు గురువులా బోధించి, దారి చూపి, తప్పు చేసినప్పుడు మందలించే వ్యక్తి నిజమైన స్నేహితుడు.
*మంచి స్నేహితుల మధ్య ఎటువంటి మొహమాటాలు, రహస్యాలు ఉండవు. అవసరమైనప్పుడు నిస్సంకోచంగా తమ కష్టసుఖాలు ఒకరికొకరు పంచుకుంటారు.
*కష్ట సమయంలో కలత చెందిన మనసుకి వెన్నలా చల్లదనాన్ని, ప్రశాంతతను కలిగించే దివ్య ఔషధం స్నేహం.
*స్నేహం ఓ మధురమైన అనుభూతి. దీనికి వయస్సుతో నిమిత్తం లేదు. ఆటపాటలాడే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అందరిలోను స్నేహ భావం ఉంటుంది. స్నేహానుభూతిని అనుభవిస్తేనే తెలుస్తుంది. ఒక్కోసారి కుటుంబసభ్యులతో కూడా చెప్పుకోలేని సమస్యలను ఈ ఆత్మీయ స్నేహితులతో నిర్మొహమాటంగా చర్చించవచ్చు.
*స్నేహంగా ఉన్నప్పుడు అనుమానం, కోపం, ద్వేషం కూడా దరిదాపులకు రావడానికి జంకుతాయి. స్నేహం అద్భుతమైంది. స్నేహానికి ఎల్లలు లేవు. నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు.
*మంచి స్నేహం… వ్యక్తి వికాసానికి బాటలు వేస్తుంది. మిత్రుడు తోడుంటే ఆయుధం ధరించినంత ధైర్యంగా ఉంటుంది. ప్రతి వ్యక్తి జీవితంలోను విలువైన స్నేహాన్ని జీవితాంతం నిలుపుకునే ప్రయత్నం చేయాలి.
*’స్నేహానికన్న మిన్నా లోకాన లేదురా...’ అన్నట్లు ఆ విలువైన బంధాన్ని అపురూపంగా కాపాడుకోవాలి.✍️```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
`🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏`
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
`*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.*`
➖▪️➖
`ఇలాటి మంచి విషయాలకోసం…`
*“భగవంతుని విషయాలు గ్రూప్“* `లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 8712184465. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏`
No comments:
Post a Comment