*మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి .*
*శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పుట్టినరోజు.*
*ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి.*
*పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఎన్నో ప్రదేశాల్లో ఆశ్రమ శాఖలు నిర్మించి, భక్త కోటిని అనుగ్రహించారు. వాటిలో సుబ్రహ్మణ్య స్వామి ప్రధాన దేవతగా ప్రతిష్ఠ చేసిన క్షేత్రాల్లో మనకు దగ్గరలో గల క్షేత్రం బాదంపూడి . ఆంద్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం కు దగ్గరలో గల మహా మహిమాన్విత క్షేత్రం అని చెప్పవచ్చు.*
*ఇక్కడ ఒక సర్పం కూడా దేవాలయ ప్రాంగణంలో అప్పుడప్పుడు దర్శనం ఇస్తుంది.*
*పూజ్య శ్రీ అప్పాజీ వారు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారిని బాల రూపంలో ప్రతిష్ఠ చేసారు . ఆనాటి నుండి ఆ బాల సుబ్రహ్మణ్య స్వామి వారు నమ్మి కొలిచిన భక్తులకు ఎన్నో వరాలను అనుగ్రహిస్తున్నాడు.*
*సంతానము, ఆరోగ్యము, వివాహము, ఋణ సంబంధ విషయాలలో ఇబ్బందులు పడుతున్నవారు ఇక్కడ స్వామి వారిని దర్శించి పూజలు చేయడం వల్ల వారికి ఇబ్బందులు తొలగి మంచి జరుగుతుంది . ఎంతో మంది కి సంతానాన్ని అనుగ్రహించాడు ఆ బాల సుబ్రహ్మణ్య స్వామి వారు.*
*ప్రవచన చక్రవర్తి శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి అబ్బాయికి ఈ క్షేత్రం లో స్వామిని దర్శించి, మొక్కుకున్న తరువాతనే సంతానం కలిగిందని స్వయంగా చాగంటి వారే అందరికీ చెప్పి ఈ క్షేత్రములో స్వామి వారికి మొక్కులు తీర్చుకున్నారు.*
*సుబ్రహ్మణ్య స్వామి వారి సన్నిధిలో షష్ఠి రోజున కావడి సేవ, అంటే స్వామి వారి అభిషేకంలో వాడే ద్రవ్యాలను కావడితో భుజంపై ధరించి, దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి, సుబ్రహ్మణ్య స్వామికి సమర్పించాలి.*
*ఆ తరువాత జరిగే ఏకాదశ రుద్రాభిషేకం లో స్వామి వారిని దర్శించి, సుబ్రహ్మణ్య హోమంలో పాల్గొని దేవాలయం లో ఉన్నంత సేపు సుబ్రహ్మణ్య స్వామి వారి నామాన్ని జపిస్తూ ఉండాలి.*
*ఈ విధంగా సుబ్రహ్మణ్య షష్ఠి పూజలో పాల్గొని స్వామిని సేవించిన భక్తుల కష్టాలను తొలగించి శుభాలను అనుగ్రహిస్తారు శ్రీ బాదంపూడి బాల సుబ్రహ్మణ్య స్వామి వారు.*
*కాబట్టి అవకాశం కుదిరిన వారు రేపు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు బాదంపూడి శ్రీ బాల సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించండి .*
*ఇంకో విశేషం ఏమిటంటే ఈ సంవత్సరం స్వామి వారికి ఇష్టమైన మంగళవారం రోజునే సుబ్రహ్మణ్య షష్ఠి కలిసి రావడం.*