Friday, April 2, 2021

జైగురు దత్త శ్రీగురుదత్త జైశ్రీహనుమాన్*


జైగురు దత్త శ్రీగురుదత్త
 జైశ్రీహనుమాన్*

మనది కర్మభూమి. జీవుడు ఎన్నో జన్మలలో చేసిన కర్మలే భవ బంధాలై మనల్ని సంసార చక్రంలో పడేసి గిరగిర తిప్పుతుంటాయి. దీనినే బ్రహ్మరాత అంటాం. అంత మాత్రం చేత మన చేతిలో ఏమీ లేదనుకోవడం తప్పు. 

ప్రతీ కార్యానికీ దైవం, పౌరుషం ఉంటాయి. దైవానుగ్రహం మొదటిదైతే, పురుష ప్రయత్నం రెండవది. ఇక్కడ పురుష అంటే లింగభేదం లేని జీవుడని (స్త్రీ, పురుషులు) అర్థం. పురుష ప్రయత్నం బాగానే ఉన్నా దైవం అనుకూలించక శ్రీరామ పట్టాభిషేకం ఆగిపోయింది. అలాగే మన జీవితాలలో ఎన్నో జరుగుతుంటాయి.

ఒక కార్యం జరిగినపుడు అంతా నా ప్రయత్న ఫలమే అనుకోవడం చేయకూడదు. దైవానుగ్రహం ఉంటేనే ఏ సత్కార్యమైనా సానుకూలం అవుతుంది. అయితే దైవానుగ్రహం సంపాదించడం ఎలా? మానవత్వం, దైవత్వం రెండూ వేరు కావని మనం గ్రహించాలి. 

మానవత్వం పెంపొందించుకోగలిగితే, దైవం మనకు దగ్గర అవుతుంది. మనం ఏ కర్మ అయినా ధర్మానికి అనుగుణంగా చేయగలిగి ఉండాలి. ఇలా చేసినప్పుడు దైవానుగ్రహం వల్ల మన సంచిత (పూర్వ) కర్మలు నిప్పులో పడిన దూదిలాగ దగ్ధం అవుతాయి. ఆగామి (రాబోయే) కర్మలు తామరాకు మీద నీటి బొట్టులా మనకు అంటకుండా పోతాయి.

ఈ జన్మలో ప్రారబ్ధ కర్మను అనుభవిస్తూ సత్కర్మలను చేస్తూ దైవ ప్రార్థనలతో గడిపితే దైవానుగ్రహం లభించి, ఇహపరాలను పొందగలము.

*శుభంభూయాత్*

No comments:

Post a Comment

Jai Shri Krishna

Excellent information about Bhagwan Shri Krishna: 1) Krishna was born *5252 years ago*  2) Date of *Birth* : *18th July,3228 B.C* 3) Month ...