Friday, April 2, 2021

హర హర మహాదేవ శంభోశంకర్ మహాదేవఓం నమః శివాయ*

                          
*హర హర మహాదేవ శంభోశంకర్ మహాదేవ
ఓం నమః శివాయ*

*సాష్టాంగ నమస్కార పద్ధతి, దాని అంతర్యం*
ఎనిమిది అంగాలతో నమస్కారం చెయ్యడమే సాష్టాంగ నమస్కారమంటే. 

రెండు కాళ్ళు, రెండు చేతులు, తల, మనస్సు, బుద్ధి, ఆత్మ - ఇవే ఎనిమిది అంగములు. బోర్లా పడుకుని రెండు చేతులు ముందుకు చాచి, జోడించి, రెండు కాళ్ళూ వెనక్కు చాచి జోడించి, తల నేలపై మోపి, మనస్సు బుద్ధి, ఆత్మలను తదేకంగా నిలిపి వినయంతో భగవంతుడికి, గురువుకి సాష్టాంగ దండ ప్రణామం చెయ్యాలి.

దీనినే ప్రణిపాతం అంటారు. నేలపై పడుకుంటే మట్టి అంటుకుంటుందనే సంకోచం లేకుండా ఒక కర్రలా ముందుకు పడి దేవుని పాదాలకు సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. 

అయితే దేవాలయ గర్భగుడిలో, ముఖ మండపంలో సాష్టాంగ పడకూడదని చెప్తారు. ఎందుకంటే అలా చేసినప్పుడు మన కాళ్ళు వెనుక వేరే ఉపాలయం వైపు కానీ, భక్తుల వైపు కానీ తిరిగితే అపచారం అవుతుందని.

కాగా సాష్టాంగ నమస్కారంలో అంతర్యం ఏమిటంటే, *ఓ మహానుభావా! మీకు మనసా, వాచా, కర్మణా త్రికరణ శుద్ధిగా నేను దాసుడిని. మీరే నాకు సర్వాత్మనా ఉపకారకులు* అని తెలియజేయడమే.

ముఖ్య విషయం;- పురుషులు మాత్రమే సాష్టాంగ ప్రణామం చేయాలి. స్త్రీలు సాష్టాంగ ప్రణామం చేయరాదు. మోకాళ్ళ మీద కూర్చుని మాత్రమే నమస్కారం చేయాలి.

*శుభంభూయాత్*

No comments:

Post a Comment

Jai Shri Krishna

Excellent information about Bhagwan Shri Krishna: 1) Krishna was born *5252 years ago*  2) Date of *Birth* : *18th July,3228 B.C* 3) Month ...