🌺ఓం నమో భగవతే శ్రీ రమణాయ🌸
అరుణగిరి ప్రదక్షిణ గురించి
రమణ మహర్షి ఇలా సెలవిచ్చారు ....
1 . నిజానికి ఈ గిరిప్రదక్షిణ వలన కలిగే ఆహ్లాదం ,
సుఖం ఇంత అని చెప్పడానికి శక్యం కాదు .
2 . శరీరం అలసిపోయి ఇంద్రియ చేష్టలకు బలం
తగ్గి సర్వ వృత్తులూ అంతర్గతం కాగలవు .
3 . నడుస్తూనే ఉండడం వలన శరీరం తానుగానే
ఆసన పద్దతిన అమరిపోతుంది . అందువలన
శరీరానికి ఆరోగ్యం ఏర్పడుతుంది . అలాగే
మైమరచి ధ్యాన మగ్నతను పొందవచ్చును .
4 . ఇది ఔషధుల కొండ . ఈ ఔషధుల మీదుగా
వచ్చే గాలి శ్వాసకోసాలకు చాలా మంచిది .
5 . గిరి ప్రదక్షిణ వలన శరీరం తేలికపడి తానుగానే
నడచి పోతుంది . మనం నడుస్తున్నామన్న
తలపే ఉండదు .
6 . కూర్చుంటే కుదరని ధ్యానం ప్రదక్షిణానికి వెళితే
కుదురుతుంది . ఆ ప్రదేశము గాలి అటువంటిది.
7 . ఎంత నడవలేని వారు అయినా ఒకసారి
వెళ్లివచ్చారంటే మళ్ళీ వెళ్లాలనే
బుద్ధిపుడుతుంది .
8 . వెళ్లినకొద్దీ సరదా ఎక్కువ అవుతుందేకాని
తగ్గదు .
9 . గిరి పదక్షిణకు అలవాటుపడితే ఇక
విడువలేరు .
10 . ఈ గిరి ప్రదక్షిణ " సంచార సమాధిని "
ప్రసాదిస్తుంది .
11 . ఈ గిరి " స్వయంభూలింగము " .
12 . భక్తుల పాద ధూళియే ఈ పర్వతము .
13 . ఈ గిరి ప్రదక్షిణ పరమ పవిత్రమైనది .
పాపాలు నశిస్తాయి .
14 . గిరి ప్రదక్షిణ అనే ఔషధం శరీర మాలిన్యాలను ,
మనో మాలిన్యాలను పోగొడుతుంది .
15 . సాధకులు , రోజుకు ఒక్కసారి అయినా గిరి
ప్రదక్షిణ చేయాలి . దీని వలన మనసు
తమస్సును వదలి సత్వ గుణాన్ని
పొందుతుంది .
16 . సాధకులు గిరి ప్రదక్షిణ అనే ఔషదాన్ని
సేవించాలి .
No comments:
Post a Comment