Thursday, December 17, 2020

*తిరుపావై ప్రశ్నావళి-జవాబులతో**శుభ ధనుర్మాసం.* తిరుప్పావై గురించి ప్రాధమిక అవగాహన ఆధారంగా తయారు చేసిన 108 ప్రశ్నలు-జవాబుల గోష్టియే ఈ తిరుప్పావై ప్రశ్నావళి. *ఇది ఎవరి జ్ఞానాన్ని పరీక్షించడానికో లేదా ఏ కొందరినో విజేతలుగా ప్రకటించడానికో సంకలనం చేసిన ప్రశ్నావళి కాదు.*

*తిరుపావై ప్రశ్నావళి-జవాబులతో*

*శుభ ధనుర్మాసం.* తిరుప్పావై గురించి ప్రాధమిక అవగాహన ఆధారంగా తయారు చేసిన 108 ప్రశ్నలు-జవాబుల గోష్టియే ఈ తిరుప్పావై ప్రశ్నావళి. *ఇది ఎవరి జ్ఞానాన్ని పరీక్షించడానికో లేదా ఏ కొందరినో విజేతలుగా ప్రకటించడానికో సంకలనం చేసిన ప్రశ్నావళి కాదు.*

 *శ్రీకృష్ణుడు అందరినీ కలిసి రమ్మన్నాడు, లౌకిక సుఖాలు ఎవరికి వారు అనుభవించేవి, కాని భగవత్ అనుభవం అందరితో కలిసి చేసేవి, దాన్నే "గోష్టి " అంటారు... *•••••••••••••••••••
🕉️📚📚📚📚🕉️

*1.* ఆండాళ్ అని ఎవరికి పేరు?
=గోదాదేవి.

*2.* తిరుమల ఆలయంలో ధనుర్మాసంలో దేని బదులుగా తిరుప్పావై గానం చేస్తారు?
= సుప్రభాతం బదులుగా.

*3.* ఏది అసలైన మంచిరోజని గోదాదేవి చెప్పినది?
=భగవంతుని పొందాలి అని మన మనసులో పడిన రోజే మంచిరోజు.

*4.* గోదాదేవి తులసివనంలో లభించగా పెంచిన తండ్రి ఎవరు?
=శ్రీ విష్ణు చిత్తులు.

*5.* ఆళ్వారులు ఎంతమంది?
=12మంది.

*6.* గోదాదేవి ఎవరి అంశగా అవతరించింది?
=భూదేవి.

*7.* గోదాదేవి తిరుప్పావైను ఏ భాషలో గానం చేసింది?
=తమిళ భాష.

*8.* తిరుప్పావై ఏ దివ్య ప్రబంధములోని భాగము?
=నాలాయిర్ దివ్యప్రబంధము.

*9.* శ్రీ వైష్ణవ దివ్యదేశాలు ఎన్ని?
=108.

*10.* గోదాదేవి అవతరించిన దివ్యదేశం పేరు ఏమిటి?
=శ్రీవిల్లిపుత్తూరు.

*11.* దామోదరుడు అని శ్రీకృష్ణుని ఎందుకు పిలుస్తారు?
=దామము (త్రాడు) ఉదరము నందు కలవాడు కనుక.

*12.* శ్రీవిల్లిపుత్తూరు గోపురం ఎత్తు ఎంత?
=196 అడుగులు.

*13.* ‘లోకాఃసమస్తాఃసుఖినో భవంతు’ అనే భావన తిరుప్పావై ఎన్నవ పాశురంలో చెప్పబడినది?
=మూడవ పాశురం.

*14.* శ్రీవిల్లిపుత్తూర్ లోని రంగనాథ ఆలయంలో రాత్రి పూట స్వామికి చేసే ఆరగింపుకు ఏమని పేరు?
=తిరుసాదము.

*15.* శ్రీవిష్ణుచిత్తులు వారు తానకు తులసివనంలో లభించిన ఆండాళ్ కు మొదట పెట్టిన పేరు ఏమిటి?
=కోదై (గోదా)

*16.* పెరియాళ్వారుని (శ్రీవిష్ణుచిత్తులు) భగవంతుడి ఏ అంశగా భావిస్తారు?
=గరుడాంశము.

*17.* తిరుప్పావైను సంస్కృతంలో ఏమంటారు?
=శ్రీవ్రతము.

*18.* మేఘాన్ని ఎలా గర్జించమని గోదాదేవి చెబుతుంది?
=పరమాత్మ చేతిలోని శంఖమువలే.

*19.* శ్రీవేంకటేశ్వరుని చేరుటకై గోదాదేవి ఎవరిని వేడుకొన్నది?
=మన్మధుని

*20.* తల్లివద్ద కృష్ణుడు ఎలా ఉంటాడని గోదాదేవి చెప్పినది?
=సింహం పిల్లవలె.

*21.* తిరుప్పావై వ్రతమును ఆచరించుటకు అర్హత యేమిటి?
=ధృడమైన కోరిక, పట్టుదల.

*22.* కాలం కలసి రాకుండా దిక్కుతోచని స్థితి ఉన్నపుడు తిరుప్పావై ఎన్నవ పాశురాన్ని ప్రతిరోజు 11 సార్లు పారాయణం చేయాలని చెబుతారు?
=మొదటి పాశురం.

*23.* శ్రీకృష్ణుడు యశోదగర్భాన జన్మించాడని గోదాదేవి ఎందుకు కీర్తిస్తుంది?
=దేవకీపుత్రుడని కీర్తిస్తే కంసుడికి తెలిసి పోతుందేమోనని. (భావనా పరాకాష్ఠ)

*24.* ధనుర్మాస వ్రతం పాటించేటపుడు చేయవలసిన పనులేవో, చేయకూడని పనులేవో తిరుప్పావై ఎన్నో పాశురంలో చెప్పబడినది?
=రెండవ పాశురం.

*25.* తిరుప్పావై మూడవ పాశురంలో దశావతారాలలోని ఏ అవతారం గానం చేయబడినది?
=వామన అవతారం.

*26.* ఆళ్వార్లకు మరో పేరేమిటి?
=వైష్ణవ భక్తాగ్రేసరులు. దైవభక్తిలో మునిగి లోతు తెలుసుకున్నవారు, కాపాడువారు అని అర్థము.

*27.* నెలకు ఎన్ని వర్షాలు కురవాలని గోదాదేవి చెప్పినది?
=మూడు.

*28.* మేఘాన్ని ఏ విధంగా మెరవుమని గోదాదేవి శాసిస్తుంది?
=పద్మనాభుడి చేతిలోని సుదర్శన చక్రం వలె.

*29.* శ్రీకృష్ణుడు ఎక్కడ జన్మించాడో చెప్పడానికి గోదాదేవి చెప్పిన పేరు ఏమటి?
=ఉత్తర మధుర. (మధుర మీనాక్షి అని అనుకోకుండా వుండడానికి).

*30.* ‘పెరునీర్’ అంటే ‘పెద్ద మనస్సున్న నది’ అని గోదాదేవి ఏ నదిని కీర్తిస్తుంది?
=యమునా నది.

*31.* మనందరం పాటించవలసిన ఏ గుణాన్ని గోదాదేవి నాల్గవ పాశురంలో చెబుతుంది?
=దానగుణం.

*32.* లోకాన్ని సుఖపెట్టే లక్షణం ఉండాలని గోదాదేవి ఎవరికి చెబుతుంది?
=వర్షానికి.

*33.* పరమాత్మవద్దకు వచ్చేటపుడు ఎలా రావాలని గోదాదేవి చెబుతుంది?
=పరిశుద్ధులమై (త్రికరణ శుద్ధిగా) రావాలి.

*34.* విగ్రహరూపంలో వున్న పరమాత్మపై మనకు మంచి విశ్వాసం కలగాలంటే తిరుప్పావై ఎన్నవ పాశురం పారాయణ చేసుకోవాలి?
=ఐదవ పాశురం.

*35.* విష్వక్సేన అంశగా గల ఆళ్వారు పేరేమిటి?
=నమ్మళ్వారు.

*36.* తిరుప్పావై ఆరవ పాశురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది?
=బుద్ధివ్రతం.

*37.* గోదాదేవి మొదటగా మేల్కొనే గోపికను ఏమని పిలుస్తుంది?
=పిళ్ళాయ్ (పిల్లా).

*38.* తిరుప్పావై ఆరునుండి పదిహేను వరకు గోదాదేవిచే లేపబడు గోపికలను ఎవరితో పోల్చి చెబుతారు?
=ఆళ్వార్లతో.

*39.* గద (కౌమోదకీ) అంశ గా గల ఆళ్వారు ఎవరు?
=పూదత్తాళ్వారు.

*40.* తిరుప్పావైలోని ఏడవ పాశురం ఏ దివ్యదేశంలో రెండుసార్లు పాడుతారు?
=శ్రీపెరుంబుదూరులో ఆదికేశవ పెరుమాళ్ సన్నిధిలో.

*41.* కీచుకీచుమని అరిచే *ఏ* పక్షులు తిరుప్పావైలో ప్రస్తావించబడ్డాయి?
=భరద్వాజ (చాతక) పక్షులు.

*42.* తిరుప్పావై ఏడవ పాశురంలో స్మరింపబడిన ఆళ్వారు ఎవరు?
=కులశేఖరాళ్వార్.

*43.


='బహుధా విజాయతే' (అనేక విధములుగా పుట్టుచున్నాడు)

*94.* సముద్రాన్ని దాటించేది ఓడ అయితే సంసారమును దాటించే ఓడ ఏది?
=విష్ణుపోతము

(విష్ణువనే ఓడ)

*95.* పరమాత్మ గొప్పా? ఆయన దాసులు గొప్పా?
=ఆయన దాసులే గొప్ప.

*96.* ఏడేడు జన్మలనగా ఎన్ని జన్మలని అర్ధము?
=ఎన్ని జన్మలకైనా అని అర్థము.

*97.* ఇరవై తొమ్మిదవ పాశురములో గోదాదేవి ఏ దివ్యదేశమును కీర్తించెను?
=అయోధ్య.

*98.* వజ్గం అంటే ఏమిటి?
=ఓడ.

*99.* ధన్వంతరి అవతారంలో శ్రీమహావిష్ణువు చేతిలో ఏమి కలిగి వుంటాడు?
=అమృత కలశం.

*100.* ముప్ఫయ్యవ పాశురంలో పరమాత్మను ఏమని వర్ణించెను?
=తిజ్గళ్ తిరుముగత్తు- అనగా చంద్రుని పోలిన దివ్యతిరుముఖ మండలం గలవాడా.

*101.* గోపికల దివ్యాభరణములేవి?
=కృష్ణుని ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించుటయే.

*102.* శ్రీ విల్లిపుత్తూరు ఎటువంటిదని గోదాదేవి కీర్తించెను?
=అణి పుదువై- ఈ జగత్తుకే మణివంటిది.

*103.* శ్రీవిష్ణుచిత్తుల వారు తమ మెడలో ఏ మాల ధరించెను?
=పైమ్ కమల తణ్తెరియల్ - నల్లని చల్లని తామర పూసల మాల.

*104.* గోదాదేవి ముఫ్పైవ పాశురంలో తాను ఎవరి కూతురునని చెప్పెను?
= పట్టర్ పిరాన్ కోదై (శ్రీవిష్ణుచిత్తుల వారి గోదాదేవిని).
 
*105.* తిరుప్పావై ఎటువంటి మాల?
=ముఫ్ఫై తమిళ పాశురములనే పూసలతో చేయబడ్డ మాల.

*106.* శ్రీకృష్ణదేవరాయలు రచించిన తెలుగు ప్రబంధం ‘ఆముక్తమాల్యద’ ఎవరి పేరు?
= గోదాదేవి.

*107.* శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యదలో ఎవరి కల్యాణం వర్ణింపబడినది?
=గోదాదేవి మరియు శ్రీరంగేశుల కల్యాణం.

*108.* భగవానుడి వనమాల అంశగా గల ఆళ్వారు పేరేమిటి?
=తొండరపడిప్పొడి
యాళ్వార్.
జై శ్రీమన్నారాయణ ఆణ్డాళ్ తిరువడిగళే  శరణమ్

No comments:

Post a Comment

Jamalapuram Sri Venkateswara Swamy Temple జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం Telangana Tirupati, Khammam District

The road access to the temple is very good, and you can easily reach it in your own vehicle. Parking is not a concern as you can park comfor...