Wednesday, December 2, 2020

జై శ్రీ రామ్🙏🚩,రామాయణంలో ఒక ముఖ్యమైన ఘట్టం 'సీతా స్వయంవరం'. 'స్వయంవరం' అంటే స్వయంవరం నిర్వహించే రాజు యొక్క కూతురు అంటే రాకుమారి, తనకిష్టమైన వ్యక్తిని ఎంచుకొని పెళ్లిచేసుకుంటుంది.

జై శ్రీ రామ్🙏🚩,

రామాయణంలో ఒక ముఖ్యమైన ఘట్టం 'సీతా స్వయంవరం'. 'స్వయంవరం' అంటే స్వయంవరం నిర్వహించే రాజు యొక్క కూతురు అంటే రాకుమారి, తనకిష్టమైన వ్యక్తిని ఎంచుకొని పెళ్లిచేసుకుంటుంది. ఐతే వరుణ్ణి ఎంచుకోవడం ఒక షరతు వల్ల కానీ లేక రాకుమారి వరమాల వేసి కానీ ఎంచుకోవడం జరుగుతుంది. సీత దేవి తన బాల్యంలో శివ ధనుస్సును ఆటలాడుతూ అవలీలగా ఎత్తడం చేత వివాహ యోగ్యత వచ్చిన అనంతరం సీత దేవి తండ్రి జనక మహారాజు, పరశురాముని సలహా మేరకు స్వయంవరంలో ఎవరైతే శివ ధనుస్సును ఎత్తి, వింటిని కట్టి, బాణాన్ని సంధిస్తాడో అతనికే సీతనిచ్చి వివాహం జరుపుతానని ప్రకటించాడు. స్వయంవరానికి భారతవర్షములోని అందరు రాజులు పాల్గొంటారు. కానీ అందరు విఫలమౌతారు. చివరికి శివుని యొక్క పరమభక్తుడు రావణాసురుడు కూడా శివ ధనుస్సును ఎత్తలేక పోతాడు, అవమానంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా సీతాదేవికి వివాహం జరగదు అని సభలో గుసగుసలు మొదలవుతాయి. ఇంతలో రఘుకుల యువకులను వెంటబెట్టుకొని శివ ధనుస్సుని దర్శనం చేసుకొనుటకు వచ్చిన విశ్వామిత్రుడు జనక రాజు అనుమతితో రాముని శివ ధనస్సుపై బాణాన్ని సంధించమని  ఆజ్ఞాపిస్తాడు. గురువు ఆజ్ఞను పాటిస్తూ శ్రీ రాముడు భక్తి పూర్వకంగా శివ ధనస్సుకి మొక్కి, అవలీలగా శివ ధనస్సును ఎత్తుతాడు. స్వయంవర సభలో ఉన్న అందరు ఆశ్చర్యచకితులై ఉండిపోతారు. వింటిని కట్టబోయి శ్రీ రాముడు శివ ధనస్సును వంచుతూ దానిని రెండుగా విరిచేస్తాడు. అందరూ భయబ్రాంతులకు గురై ఏమి తోచని స్థితిలో ఉండగా, విశ్వామిత్రుడు శ్రీ రాముడిని ధనుస్సుని విరిచేందుకు గల కారణం అడుగుతాడు. అప్పుడు శ్రీ రాముడు వినయంగా గురువుగారికి నమస్కరించి  "గురుదేవా, స్వయంవరం యొక్క షరతు ప్రకారం శివ ధనస్సుపై బాణాన్ని సంధించినవాడు సీత దేవిని వరిస్తాడు, కానీ ఈ స్వయంవరం ఒక పోటీగా మారింది. గెలిచినవాడు సీతాదేవి ఇష్టాయిష్టాలకు సంబంధంలేకుండా తనని పెళ్లిచేసుకుంటాడు. సీతాదేవి కేవలం ఒక బహుమతి రూపంలో చూడబడుతుంది కానీ ఒక వ్యక్తిగా కాదు. ఇప్పుడు నియమానుసారం నేను వింటిని కట్టి బాణాన్ని సంధించలేదు అందువలన నన్ను విజేతగా ప్రకటించలేరు. ఇంకా వేరే ఎవ్వరు కూడా వింటిని కట్టి సంధించడానికి శివ ధనస్సులేదు. కాబట్టి సీతాదేవి గౌరవంగా తనకిష్టమైన వాడిని వరించవచ్చు" అని గురువుకు విన్నవించుకున్నాడు. రాముని యొక్క శక్తిని కళ్లారా చూసిన అందరూ శ్రీ రాముని విజేతగా గ్రహించి మరియు శ్రీ రాముని యొక్క గొప్ప వ్యక్తిత్వానికి తలవంచి గౌరవించారు, తమ మూర్ఖత్వానికి సీతాదేవికి శిరస్సు వంచి నమస్కరించారు. అంతకు ముందే పరిచయం కలిగిన శ్రీ రాముని సీతాదేవి అభిమానించేది, ఇప్పుడు అతనిపై ఆ అభిమానం ప్రేమగా మారి, సీత దేవి ఆ వరమాలను రాముని మెడలోవేసి శ్రీ రామున్ని వరించింది. 

స్వయంవర మర్యాదను తీసిపారేయక, సీతా దేవి మనస్సుని ఒక్క మనిషి వలే ఎరిగి, తన గౌరవాన్ని మరియు ఇష్టానికి విలువనిస్తూ శ్రీ రాముడు పురుషోత్తముడిగా అందరి హృదయాలలో నిలిచాడు. శ్రీ రాముని యొక్క ధర్మ నిష్ఠ మరియు వ్యక్తిత్వము చేత శ్రీ రాముడు సనాతన ధర్మానికి ప్రతీకై నిలిచాడు. 

జై శ్రీ రామ్🙏🚩, జై జై శ్రీ రామ్🙏🚩..

No comments:

Post a Comment

Jai Shri Krishna

Excellent information about Bhagwan Shri Krishna: 1) Krishna was born *5252 years ago*  2) Date of *Birth* : *18th July,3228 B.C* 3) Month ...