Friday, November 29, 2019

పొగరుగల గొర్రెపోతు

నీతి  కథలు (వేదమయీ )

పొగరుగల గొర్రెపోతు

ఒకానొకప్పుడు ఒక అడివిలో బాగా కొమ్ములు తిరిగిన ఒక గొర్రెపోతు చాలా పొగరుగా వుండేది. తన కొమ్ములతో యెవ్వరినైన ఓడించగలనన్న ధైర్యంతో చాలా దురహంకారముగల గొర్రెపోతులా తయ్యారయ్యింది. వచ్చే పొయే ప్రతి చిన్న జీవినీ తన కొమ్ములతో పొడిచి వేధించడం మొదలెట్టింది. ఈ విషయం గమనించిన ఒక నక్క గొర్రెపోతుకు పాఠం చెప్పాలనుకుంది. సమయం చూసుకుని ఆ గొర్రెపోతు దెగ్గిరకు వెళ్ళి ఆ నక్క “ఈ చిన్న ప్రాణులు నీతో పొట్లాడడానికి యోగ్యులు కారు – నీకు తగిన విరోధిని నేను చూపిస్తాను” అంది. ఈ మాట విన్న గొర్రెపోతుకు ఆసక్తి కలిగింది. “ఆ విరొధి యెవరు?” అని నక్కను అడిగింది. “అదుగో ఆ కొండను చూడు – యెంత యెత్తుగా కనిపిస్తొందో! దాన్ని ఓడిస్తే అసలీ అడివిలో నీకన్న బలమైన వాళ్ళు లేరన్న విషయం తెలిసిపోతుంది” అని నక్క తెలివిగా జవాబు చెప్పింది. పొగరుగా గొర్రెపోతు వెళ్ళి తన కొమ్ములతో ఆ కొండను కుమ్మింది. కుమ్మగానే కొంత ఇసక కొండ మీంచి రాలింది. దీనితో మరింత రెచ్చిపొయిన గొర్రెపోతు కొంత దూరం వెనక్కి జరిగి పరిగెత్తుకుంటూ వచ్చి కొండను ఢీకొట్టింది. కొమ్ములు రెండూ విరిగిపొయాయి. గొర్రెపోతు బుధ్ధి తెచ్చుకుని అందరితో వినయంగ మెలగడం నేర్చుకుంది.

ఇందిలో నీతి యేమిటంటే, యెదుటి వారి బలం తెలీయకుండ మనం విర్రవేగిపోకూడదు.


మహిషాసుర మర్ధిని స్తోత్రం

కార్యాలయాల్లో వేధింపులు, బయట ఆకతాయిల వేధింపులు, అదీగాక ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలియని పరిస్థితి. స్త్రీలు ఎదుర్కుంటున్న ఈ సమస్య గురించి గోపురం కార్యక్రమంలో ఒకసారి శ్రీమతి సంధ్యాలక్ష్మీ గారు ప్రస్తావించారు. సమాజంలో మార్పు కలగలాని చెబుతూనే, మనవైపు నుంచి కూడా ఆత్మరక్షణ కొరకు భగవత్ ప్రార్ధన చేయాలని చెప్పారు. అందులో ముఖ్యంగా మహిషాసుర మర్ధని స్తోత్రం అనేది స్త్రీలకు ఎంతో మేలు చేస్తుందని, బయటకు వెళ్ళెముందు స్త్రీలు ఈ స్తోత్రాన్ని పఠించి వెళితే, వారికి దైవికమైన రక్షణ ఉంటుందని పలుమార్లు చెప్పారు. దీని మీద అనవసరమైన కామెంట్‌లు చేయకండి. నమ్మకమున్న వారు చదవచ్చు. 

ఇదిగోండి ఆ మహిషాసుర మర్ధిని స్తోత్రం 

అయి గిరినందిని నందితమేదిని విశ్వ-వినోదిని నందనుతే
గిరివర వింధ్య-శిరోఽధి-నివాసిని విష్ణు-విలాసిని జిష్ణునుతే |
భగవతి హే శితికంఠ-కుటుంబిణి భూరికుటుంబిణి భూరికృతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 1 ||

సురవర-హర్షిణి దుర్ధర-ధర్షిణి దుర్ముఖ-మర్షిణి హర్షరతే
త్రిభువన-పోషిణి శంకర-తోషిణి కల్మష-మోషిణి ఘోషరతే |
దనుజ-నిరోషిణి దితిసుత-రోషిణి దుర్మద-శోషిణి సింధుసుతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 2 ||

అయి జగదంబ మదంబ కదంబవన-ప్రియవాసిని హాసరతే
శిఖరి-శిరోమణి తుఙ-హిమాలయ-శృంగనిజాలయ-మధ్యగతే |
మధుమధురే మధు-కైతభ-గంజిని కైతభ-భంజిని రాసరతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 3 ||

అయి శతఖండ-విఖండిత-రుండ-వితుండిత-శుండ-గజాధిపతే
రిపు-గజ-గండ-విదారణ-చండపరాక్రమ-శౌండ-మృగాధిపతే |
నిజ-భుజదండ-నిపాటిత-చండ-నిపాటిత-ముండ-భటాధిపతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 4 ||

అయి రణదుర్మద-శత్రు-వధోదిత-దుర్ధర-నిర్జర-శక్తి-భృతే
చతుర-విచార-ధురీణ-మహాశయ-దూత-కృత-ప్రమథాధిపతే |
దురిత-దురీహ-దురాశయ-దుర్మతి-దానవ-దూత-కృతాంతమతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 5 ||

అయి నిజ హుంకృతిమాత్ర-నిరాకృత-ధూమ్రవిలోచన-ధూమ్రశతే
సమర-విశోషిత-శోణితబీజ-సముద్భవశోణిత-బీజ-లతే |
శివ-శివ-శుంభనిశుంభ-మహాహవ-తర్పిత-భూతపిశాచ-పతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 6 ||

ధనురనుసంగరణ-క్షణ-సంగ-పరిస్ఫురదంగ-నటత్కటకే
కనక-పిశంగ-పృషత్క-నిషంగ-రసద్భట-శృంగ-హతావటుకే |
కృత-చతురంగ-బలక్షితి-రంగ-ఘటద్-బహురంగ-రటద్-బటుకే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 7 ||

అయి శరణాగత-వైరివధూ-వరవీరవరాభయ-దాయికరే
త్రిభువనమస్తక-శూల-విరోధి-శిరోధి-కృతాఽమల-శూలకరే |
దుమి-దుమి-తామర-దుందుభి-నాద-మహో-ముఖరీకృత-దిఙ్నికరే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 8 ||

సురలలనా-తతథేయి-తథేయి-తథాభినయోదర-నృత్య-రతే
హాసవిలాస-హులాస-మయిప్రణ-తార్తజనేమిత-ప్రేమభరే |
ధిమికిట-ధిక్కట-ధిక్కట-ధిమిధ్వని-ఘోరమృదంగ-నినాదరతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 9 ||

జయ-జయ-జప్య-జయే-జయ-శబ్ద-పరస్తుతి-తత్పర-విశ్వనుతే
ఝణఝణ-ఝింఝిమి-ఝింకృత-నూపుర-శింజిత-మోహితభూతపతే |
నటిత-నటార్ధ-నటీనట-నాయక-నాటకనాటిత-నాట్యరతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 10 ||

అయి సుమనః సుమనః సుమనః సుమనః సుమనోహర కాంతియుతే
శ్రితరజనీరజ-నీరజ-నీరజనీ-రజనీకర-వక్త్రవృతే |
సునయనవిభ్రమ-రభ్ర-మర-భ్రమర-భ్రమ-రభ్రమరాధిపతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 11 ||

మహిత-మహాహవ-మల్లమతల్లిక-మల్లిత-రల్లక-మల్ల-రతే
విరచితవల్లిక-పల్లిక-మల్లిక-ఝిల్లిక-భిల్లిక-వర్గవృతే |
సిత-కృతఫుల్ల-సముల్లసితాఽరుణ-తల్లజ-పల్లవ-సల్లలితే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 12 ||

అవిరళ-గండగళన్-మద-మేదుర-మత్త-మతంగజరాజ-పతే
త్రిభువన-భూషణభూత-కళానిధిరూప-పయోనిధిరాజసుతే |
అయి సుదతీజన-లాలస-మానస-మోహన-మన్మధరాజ-సుతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 13 ||

కమలదళామల-కోమల-కాంతి-కలాకలితాఽమల-భాలతలే
సకల-విలాసకళా-నిలయక్రమ-కేళికలత్-కలహంసకులే |
అలికుల-సంకుల-కువలయమండల-మౌళిమిలద్-వకులాలికులే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 14 ||

కర-మురళీ-రవ-వీజిత-కూజిత-లజ్జిత-కోకిల-మంజురుతే
మిలిత-మిలింద-మనోహర-గుంజిత-రంజిత-శైలనికుంజ-గతే |
నిజగణభూత-మహాశబరీగణ-రంగణ-సంభృత-కేళితతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 15 ||

కటితట-పీత-దుకూల-విచిత్ర-మయూఖ-తిరస్కృత-చంద్రరుచే
ప్రణతసురాసుర-మౌళిమణిస్ఫురద్-అంశులసన్-నఖసాంద్రరుచే |
జిత-కనకాచలమౌళి-మదోర్జిత-నిర్జరకుంజర-కుంభ-కుచే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 16 ||

విజిత-సహస్రకరైక-సహస్రకరైక-సహస్రకరైకనుతే
కృత-సురతారక-సంగర-తారక సంగర-తారకసూను-సుతే |
సురథ-సమాధి-సమాన-సమాధి-సమాధిసమాధి-సుజాత-రతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 17 ||

పదకమలం కరుణానిలయే వరివస్యతి యోఽనుదినం న శివే
అయి కమలే కమలానిలయే కమలానిలయః స కథం న భవేత్ |
తవ పదమేవ పరంపద-మిత్యనుశీలయతో మమ కిం న శివే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 18 ||

కనకలసత్కల-సింధుజలైరనుషింజతి తె గుణరంగభువం
భజతి స కిం ను శచీకుచకుంభత-తటీపరి-రంభ-సుఖానుభవం |
తవ చరణం శరణం కరవాణి నతామరవాణి నివాశి శివం
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 19 ||

తవ విమలేఽందుకలం వదనేందుమలం సకలం నను కూలయతే
కిము పురుహూత-పురీందుముఖీ-సుముఖీభిరసౌ-విముఖీ-క్రియతే |
మమ తు మతం శివనామ-ధనే భవతీ-కృపయా కిముత క్రియతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 20 ||

అయి మయి దీనదయాళుతయా కరుణాపరయా భవితవ్యముమే
అయి జగతో జననీ కృపయాసి యథాసి తథానుమితాసి రమే |
యదుచితమత్ర భవత్యురరీ కురుతా-దురుతాపమపా-కురుతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 21 ||

NIRBHAYA HELPLINE FOR WOMEN 9833312222

Send this *Nirbhaya* number 9833312222 to your wife, daughters, sisters, mothers, friends, and all the ladies you know..ask them to save it.. all the men please share with all the ladies you know....
In case of emergency.Ladies can send blank msg or can give missed call..so that police will find your location and help u 🌹
NIRBHAYA HELPLINE FOR WOMEN 
9833312222

Sunday, November 24, 2019

మన కర్మలకు పద్దెనిమిది మందిసాక్షులు

మన కర్మలకు పద్దెనిమిది మందిసాక్షులు

చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత. కానీ.. ‘నేను ఒక్కడినే కదా ఉన్నాను, నన్ను ఎవరూ గమనించడం లేదు’ అని మనిషి అనుకోవటం చాలా పొరపాటు. మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించేవి మూగసాక్షులు పద్దెనిమిది ఉన్నాయి. అవి నాలుగు వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయ సంధ్యలు, సూర్య చంద్రులు, పగలు, రాత్రి. వీటినే అష్టాదశ మహా పదార్థాలు అంటారు. ఈ మూగసాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి. ఇవి మనలోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పపోవచ్చును గాని, వీటి గమనిక నుండి మనిషి తప్పించుకోవడం సాధ్యపడదు.
 
దీన్ని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడ పదార్థాలేనని, సాక్ష్యం చెప్పడానికి నోరులేనివని మానవుడు భ్రమపడుతుంటాడు. ఈ మహా పదార్థాలు రహస్య యంతాల వంటివి. అవి మనిషి ప్రతి చర్యనూ నమోదు చేస్తాయి. ఆ నివేదికల్ని విధికి చేరవేస్తాయి. అది వాటిని కర్మలుగా మలుస్తుంది. మనిషి చేసే పనులు మంచి అయితే సత్కర్మలుగా, చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది. సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి. అవి ఏవో మరుజన్మకో ఆ తరువాతో ఫలిస్తాయని అనుకోకూడదు, ఈ జన్మలోనే అమలు చేయబడవచ్చు. ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టిపరిణామక్రమం.
 
అంతరాత్మ అనేది ఒకటుందని ప్రతి మనిషికీ తెలుసు. అది మనం చేసే పని మంచిదా? చెడ్డదా? అనే విషయాన్ని ఎప్పటికప్పుడే చెప్పేస్తుంది. కానీ ఆవేశం, కోపంతో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తాడు అది అనర్థాలకు దారితీయటం మనందరికి అనుభవమే. ఒక్కోసారి అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో సిగ్గుతో తలదించుకుంటాం. కానీ దీన్ని మనమెవరితోనూ పంచుకోము. అందువల్ల అంతరాత్మ అనుభవపూర్వకంగా నిజమైనప్పుడు మిగతా పది హేడు కూడా నిజమేనని గ్రహించగలగటం వివేకం.
 
నలుగురికీ తెలిసేలా దానధర్మాలు, క్రతువులు, పూజలు నిర్వహించలన్న కుతూహలం అవివేకం. అష్టాదశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తున్నాయంటే, ఎవరు చూడాలో వాళ్ళు చూస్తున్నట్లేగా అర్థం. ఈ ఎరుక కలిగినప్పుడు ఏ మనిషీ చెడ్డ పనులు చేయటానికి తెగించడు. ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో, తోటి వారికి సాధ్యమయినంత సహాయం చేయాలనే సత్‌సంకల్పంతో జీవితాన్ని గడపడం ఉత్తమం. ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనన్ని మంచిపనులు చేయడానికి పయ్రత్నిస్తూ సుఖశాంతులకు నోచుకుంటాడు

మాయానాణెం - బంగారు నాణెం

(ఒక చిన్న కథ. )మనకోసం.

ఒకతను వున్నంతలో భార్యా పిల్లలతో ఆనందంగా బతుకుతుంటాడు.
ఒకరోజు అతడు బజార్లో నడుస్తూ వుంటే ఒక నాణెం దొరుకుతుంది..
మకిలి పట్టి మధ్యలో చిల్లు వున్న రాగి నాణెం..అది...!!
అతడు దాన్ని రుద్ది చూస్తాడు..ఆశ్చర్యం..!!
ఇంకో రాగి నాణెం వస్తుంది..
మళ్ళీ రుద్దుతాడు..
మరోటి వస్తుంది..
మళ్ళీ రుద్దితే మళ్ళీ ఒకటి..!!
అప్పుడు ఆకాశవాణి వినిపిస్తుంది..
ఓ మనిషీ..! 
ఇది మాయానాణెం..
దీన్ని ఎన్నిసార్లు రుద్దితే అన్ని నాణేలు ఇస్తుందీ..
అయితే మధ్యలో ఒక్కసారి ఆపినా అది మాయమైపొతుందీ...!! 
అని చెప్తుంది.
అంతే ఆ మనిషి తన ఇంటిలో వున్న నేలమాళిగలోకి వెళ్ళి నాణేన్నిరుద్దటం మొదలు పెడతాడు.
తనను తాను మర్చిపోతాడు. కుటుంబాన్ని మర్చిపోతాడు.
పిల్లల్ని మర్చిపోతాడు.
ప్రపంచాన్ని మర్చిపోతాడు.
అలా రుద్దుతునే వుంటాడు..
గుట్టలుగా సంపదను పోగెస్తునే వుంటాడు.
ఒకరోజు అతడికి ఇక చాలనిపిస్తుంది.
రాగినాణేన్ని పక్కన పడేసి..బయటికి వస్తాడు.
అతడిని ఎవ్వరూ గుర్తు పట్టరు.
పిచ్చి వాడిలా ఉంటాడు.
పిల్లలకు పిల్లలు పుట్టి వుంటారు..
కొత్త భవనాలు వెలసి వుంటాయి..
కొత్త సంగీతాలు వినిపిస్తుంటాయి..
స్నేహితులు..
చుట్టాలు..
పుస్తకాలు..
ప్రేమ,పెళ్ళి...
జీవితం ప్రసాదించిన అన్ని సుఖ సంతోషాలను  అనుభవిస్తుంటారు.
ఆ మనిషికి ఏడుపు వస్తుంది.
ఇంతకాలం ఇవన్నీ వదిలేసి నేను చేసింది ఇదా అని కుప్పకూలుతాడు.
ఒక్కోసారి మనం కూడా చేతిలో ఇలాంటి మాయానాణెం పట్టుకొని వున్నామా అనిపిస్తుంది.
డబ్బు సంపాదనలో పడి ..
కీర్తి కాంక్షలో పడి..
లక్ష్య చేధనలో పడి,
బంగారు నాణెం వంటి జీవితాన్ని వదిలి..
మకిలి రాగినాణెం లా మార్చుకుంటున్నామా అనిపిస్తుంది.
డబ్బు అవసరమే...
కాని అంతకన్నా ముఖ్యమైనది
అమ్మ అనురాగం..
భార్య ప్రేమ..
పిల్లల ముద్దు ముచ్చట్లు..
ఆత్మీయుల అభిమానం..
వాటికీ మనం దూరంగా
బతుకు తున్నాం.
ఈ బంగారు నాణేలు మన జేబులో తగినన్ని వుండాలి..
ఈ బంగారు ముచ్చట్లు గుండె అంతా నిండాలి.
మనసంటూ ఉన్నవారందరూ స్పందించే ఉదంతం. 

ఇది
కథ కాదు సుమా యథార్థ జీవిత చిత్రం.

మానవుని జీవితంలో ఉండవలసిన 9 రహస్యాలు - ఆయువు, విత్తము, ఇంటిగుట్టు, మంత్రం, ఔషధం, సంగమం, దానం, మానము, అవమానం

🌹🙏మానవుని జీవితంలో ఉండవలసిన 9 రహస్యాలు 🌹🙏

ఆయువు, విత్తము, ఇంటిగుట్టు, మంత్రం, ఔషధం, సంగమం, దానం, మానము, అవమానం* అనే ఈ తొమ్మిదింటిని నవగోప్యాలు అంటారు. ఇవి రహస్యంగా ఉంచాల్సినవి. భగవంతుడు అన్ని జంతువులకు ఇచ్చినట్లు శరీరం ఇచ్చినప్పటికీ వివేకము బుద్ధి జ్ఞానముఅనే గొప్ప గుణం మనిషికి ఇచ్చాడు. అలాగే నిన్న జరిగిన విషయం గుర్తుకుతెచ్చుకుంటే తప్ప గుర్తుకురాదు. ఇపుడు జరుగుతున్నది ఆలోచిస్తే తప్ప అర్థం కాదు. రేపు జరుగబోయేది ఏం చేసినా తెలియదు. ఈమూడు కారణాలవల్ల మనిషి పిచ్చెక్కకుండా సుఖంగా ఉండగలుగుతున్నాడు. మరుక్షణంలో మనిషి ఛస్తాడని తెలిస్తే ముందు క్షణమే ఆలోచనతో చావడం ఖాయం. ఆలోచన అంత భయంకరంగా ఉంటుంది. నిజంగా నీ ఆయుఃప్రమాణం ఇదీ అని తెలిసినా, నిబ్బరంగా ఉండి, దాన్ని రహస్యంగా ఉంచాలి. లేకుంటే అది బహిరంగ రహస్యమై వాడిని బాధిస్తుంది. కాబట్టి భవిష్యత్తు జ్ఞానంలో ఆయుష్షుది ప్రధాన పాత్ర. అది తెలిసినా గోప్యంగా ఉంచమన్నాడు శాస్తక్రారుడు. ధనం ఎంత ఉన్నా రహస్యంగా ఉంచాలి. 🌹ధనం ఇదం మూలం జగత్🌹 దానివల్లఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఎంత ధనం ఉన్నా మన జీవన విధానం క్రమబద్ధంగా, క్రమశిక్షణతో ఉన్నపుడు మనకు నష్టం జరుగదు. ‘లక్షాధికారైనా లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మ్రింగబోడు’ అన్నట్లు నిరాడంబర జీవనం గడపడానికి అలవాటు చేసుకోవాలి. ధనం ఉప్పులాంటిది. అది ఎక్కువైనా, తక్కువైనా రెండూ కష్టమే. ‘అతి సంచయేచ్ఛ తగదు’ అన్న నీతి  🌙చంద్రిక వాక్యం🌙 ధనం విషయంలో నూటికి నూరుపాళ్ళు నిజం. అయినా మన దగ్గర ఉన్నవిషయం అనవసరంగా బయటకు వెల్లడించడం ప్రమాదకరం. ధనానికి ధర్మం, రాజు, అగ్ని, దొంగ అనే నలుగురు వారసులు. ఇందులో పెద్దవారసుడు ధర్మం. అతడు నలుగురికీ అన్న. తండ్రి ధనంలో పెద్దన్నకు పెద్ద వాటా రావాలి. అంటే ధర్మానికి డబ్బు ఎక్కువ వినియోగించాలి. ధర్మకార్యాలకు ధనం వినియోగించకపోతే పన్నుల మూలకంగా రాజు (ప్రభుత్వం) దాన్ని స్వాధీన పరచుకోవడమో, అగ్ని ప్రమాదాలవల్ల నష్టమో, దొంగలు దోచుకోవడమో జరుగుతుంది. ఇంట్లో ఎన్నో సమస్యలుంటాయి. దాన్ని (ఇంటిగుట్టు) అని పిలుస్తారు. కుటుంబంలో ప్రేమ పూర్వక వాతావరణం నిర్మాణం చేయాలి. అప్పుడప్పుడు ఆ ప్రేమలకు అవరోధం ఏర్పడి కలహాలు సంభవిస్తూంటాయి. వాటిలో రహస్యాలను బహిరంగం చేయాలనుకోవడం తెలివితక్కువ పని. సామరస్యంగా పరిష్కారం కనుక్కోవడం తెలివైన పని. తండ్రి- కొడుకు, భార్య భర్త, అన్నదమ్ములు, అక్కాచెలెళ్ల మధ్య గొడవలు వస్తుంటాయి. వ్యక్తిగత అహంకారాలు, ఒంటరిగా జీవించాలనుకొనే స్వార్థబుద్ధి, మా వరకే మంచిగా వుండాలనే వ్యక్తిత్వం- ఇవన్నీ ఈరోజు మన కుటుంబ వ్యవస్థను ధ్వంసం చేశాయి. ఏది జరిగినా ఇంటి గుట్టును ఈశ్వరునికే తెలిసేటట్లు ఉంచాలిగాని బహిరంగపర్చడం ధర్మంకాదు. అలా చేయడం వల్ల కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి తస్మాత్ జాగ్రత్త🙏

సోమవార వ్రత మహిమ

సోమవార వ్రత మహిమ

2వ అధ్యాయము

శ్లో|| ఓమిత్యేకాక్షరం బ్రహ్మవ్యాహరంతీ త్రయశ్శిఖాః |
తస్మై తారాత్మనే మేధాదక్షిణామూర్తయే నమః ||

జనకా! ఇంతవరకు నీకు కార్తీక మాసము న౦దాచరించవలసిన విధి క్రమము మాత్రమే తెలియజేసితిని. కార్తిక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము గలదు. కాన, సోమవార వ్రత విధానమునూ, దాని మహిమనూ గురించి వివరింతును. సావధానుడవై ఆలకించుము.

కార్తిక మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీగాని, పురుషుడుగాని ఏజాతి వారైనా గాని రోజంతయు వుపవాసము౦డి, నదీ స్నానము చేసి తమశక్తి కొలది దానధర్మములు చేసి నిష్టతో శివదేవునకు బిల్వ పత్రములతో అబిషేకము చేసి, సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజించవలయును.ఈ విధముగా నిష్టతో నుండి ఆరాత్రి యంతయు జాగరణ చేసి పురాణ పఠన మొనరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్లి స్నాన మాచరించి, తిలాదానము చేసి, తమశక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలెను. అటుల చేయ లేనివారు కనీసము ముగ్గురు బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి, తాము భుజించవలయును. ఉండ గలిగిన వారు సోమవారమునాడు రెండుపూటలా భోజనముగాని యే విధమైన ఫలహరముగని తీసుకోనకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తిక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన యెడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి, శివసన్నిధికి చేర్చును. భర్తలేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి, శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు - విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నొందును. దీనికి ఉదాహరణముగ నొక ఇతిహాసము కలదు. దానిని నీకు తెలియబరచెదను శ్రద్దగా వినుము.

కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాస మ౦దుట
(ॐ~🚩వేదమయీ🚩)(ॐ~🚩వేదమయీ🚩)
(vedamayee-వేదమయీ)

పూర్వ కాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృతిని చేపట్టి తన కుటు౦బమును పోషించుకుంటూ ఉండెను. అతనికి చాల దినములుకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు'స్వాతంత్ర నిష్టురి', తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మ యను సద్బ్రాహ్మణ యువకున కిచ్చి పెండ్లి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు, శాస్త్రములు అభ్యసించిన వాడైన౦దున సదాచార పరాయణుడై యుండెను. అతడు భూతదయ గల్గిన వాడు. నిత్య సత్యవాది. నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడును యగుటచే లోకులేల్లరునతనిని 'అపరబ్రహ్మ' అని కూడ చెప్పుకొనుచు౦డేడివారు. ఇటువంటి ఉత్తమపురుషుని భార్యయగు నిష్ఠురి యవ్వన గర్వముతో, కన్ను మిన్ను గానక పెద్దలను దుషించుచు - అత్తమామలను, భర్తను తిట్టుచు, గొట్టుచు, రక్కుచు పరపురుష సా౦గత్యము గలదై, వ్యభిచారిణియై తన ప్రియులు తెచ్చిన తినుబండారములు, బట్టలు పువ్వులు, ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి. కానీ, శాంత స్వరుపుడగు ఆమె భర్తకు మత్రమా మెయ౦దభిమానము పోక, ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి, ఛీ పోమ్మనక, విడువక, ఆమెతోడనే కాపురము చేయుచుండెను. కానీ, చుట్టుప్రక్కల వారా నిష్ఠురి గయ్యాళి తనమును కేవగించుకుని - ఆమెకు 'కర్కశ' అనే ఎగతాళి పేరును పెట్టుటచే- అది మొదలందరూ దానిని 'కర్కశా' అనియే పిలుస్తూ వుండేవారు.

ఇట్లు కొంత కాలము జరిగిన పైన - ఆ కర్కశ, ఒకనాటి రాత్రి తన భర్త గాడా నిద్రలో నున్న సమయము చూచి, మెల్లగా లేచి, తాళి కట్టిన భర్త యన్న విచక్షణ గాని, దయాదాక్షిణ్యాలుగాని లేక, ఒక బండ రాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే యతడు చనిపోయెను. ఆ మృత దేహమును ఎవరి సహాయము అక్కర్లేకనే, అతి రహస్య౦గా దొడ్డి దారిని గొ౦పొయి ఊరి చివరనున్న పాడు నూతిలో బడవైచి పైన చెత్త చెదారములతో నింపి, యేమియు యెరుగని దానివలె ఇంటికి వచ్చెను. ఇక తనకు యే ఆట౦కములు లేవని ఇంక విచ్చల విడిగా సంచరించుచు, తన సౌందర్య౦ చూపి యెందరినో క్రీ గ౦టనే వశపరచుకొని, వారల వ్రతమును పాడుచేసి నానాజాతి పురుషులతోడనూ రమించుచు వర్ణసంకరు రాలయ్యెను. అంతేయే గాక పడుచు కన్యలను, భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను, తమ మాటలతో చేరదీసి, వారి క్కూడా దుర్భుదులు నేర్పి పాడు చేసి, విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగాను.

జనక రాజా! యవ్వన బి౦కము యెంతో కాలము౦డదు గదా! కాలమోక్కరితిగా నడవదు. క్రమక్రముగా ఆమెలోని యవ్వనము నశించినది శరీరమందు మేహ వ్రాణములు బయలుదేరినవి. ఆ వ్రాణములనుండి చీము, రక్తము రాసికారుట ప్రార౦భమయ్యెను. దానికి తోడు శరీరమంతా కుష్ట్టు వ్యాది బయలుదేరి దుర్గంధము వెలువడుచున్నది. దినదినమూ శరీర పటుత్వము కృశించి కురూపియై భయ౦కర రోగములతో బాధపడుచున్నది. ఆమె యవ్వనములో వుండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులుయే ఒక్కరు ఇప్పుడామెను తొ౦గి చూడ రైరి. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన యెడల తమునెటులైననూ పలుకరించునని, ఆ వీధిమొఘమైనను చూడకుండిరి. కర్కశ ఇటుల నరక బాధలనుభవించుచు, పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది. బ్రతికి నన్నాళ్లు ఒక్కనాడైన పురాణ శ్రవణ మైననూ చేయని పాపిష్టురలు గదా! చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను గొ౦పోయి ప్రేత రాజగు యముని సన్నిధిలో నుంచగా, యమధర్మ రాజు, చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యములు జాబితాను చూపించి, "భటులారా! ఈమె పాపచరిత్ర అంతింత కాదు. వెంటనే యీమెను తెసుకువెల్లి ఎర్రగా కాల్చిన యినుప స్త౦భమునకు కట్టబెట్టుడు" అని ఆజ్ఞాపించెను. విటులతో సుఖి౦చిన౦దులకు గాను యమభటులామెను ఎర్రగా కాల్చిన ఇనుప స్త౦భమునూ కౌగలించుకోమని చెప్పిరి. భర్తను బండ రాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యబిచారిణిలుగా చేసినందుకు సలసల కాగిన నూనెలో పడవేసిరి. తల్లితండ్రులకు, అత్తమామలకు యపకీర్తి తేచినందుకు సీసము కరిగెంచి నోటిలోను, చెవిలోను పోసి, ఇనుపకడ్డిలు కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కు౦భీపాకమను నరకములో వేయగా, అందు ఇనుప ముక్కులు గల కాకులు, విషసర్పాలు, తేళ్ళు, జెఱ్ఱులు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు యిటు ఏడు తరాలవాళ్లు అటు ఏడు తరాలవాళ్లు నరకబాధలు పడుచుండిరి.

ఈ ప్రకారముగా నరక భాదల ననుభవించి, కడకు కళింగదేశమున కుక్క జన్మమెత్తి, ఆకలిబాధ పడలేక యిల్లిలు తిరుగుచుండగా, కఱ్ఱలతో కొట్టువారు కొట్టుచు, తిట్టువారు తిట్టుచు, తరుమువారు తరుముచు౦డిరి. ఇట్లుండగా ఒకానొకనాడొక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తిక సోమవార వ్రతమాచరించి ఉపవసము౦డి, సాయ౦త్రము నక్షత్ర దర్శనము చేసి, బలియన్నాము నరుగుపై పెట్టి, కాళ్లు చేతులు కడుగు కొనుటకై లోనికేగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలియన్నమును తినెను. వ్రతనిష్టా గరిష్ఠుడైన ఆ విప్రుని పూజ విధానముచే జరిపించిన బలియన్నమగుట చేతను ఆ రోజు కార్తికమాస సోమవారమగుట వలను, కుక్క ఆ రోజంతాయు ఉపవాసముతో వుండుటవలననూ, శివ పూజ పవిత్ర స్థానమైన ఆ యింట దొరికిన ప్రసాదము తినుట వలననూ, ఆ శునకమునకు జన్మ౦తరజ్ఞాన ముద్భవించెను. వెంటనే ఆ శునకము 'విప్రకులోతమా! నన్ను కాపాడుము' యని మొరపెట్టుకోనేను. ఆ మాటలు బ్రాహ్మణుడాలకించి, బైటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరు లేన౦దున లోనికేగాను. మరల 'రక్షింపుము రంక్షిపుము'యని కేకలు వినబడెను. మరల విప్రుడు బైటకు వచ్చి 'ఎవరు నివు! నీ వృతంతమేమి!' యని ప్రశ్నించగా, యంత నా కుక్క "మహానుభావ! ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మలముందు విప్రకులా౦గనను నేను. వ్యభిచారిణినై అగ్నిసాక్షిగ పెండ్లాడిన భర్తను జ౦పి, వృద్దాప్యములో కుష్టురాలనై తనువు చాలించిన తరువాత, యమ దూతలవల్ల మహానరక మనుభవించి నా పూర్వికుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఈ రోజు మీరు కార్తిక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలియన్నము తినుట వలన నాకీ జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రోత్తమా! నాకు మహోపకారంగా, మీరు చేసిన కార్తిక సోమవార వ్రతఫలమొకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్దించుచున్నాను"యని వేడుకొనగా, కార్తిక సోమవారవ్రతములో చాలా మహాత్మ్యమున్నదని గ్రహించి, ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు ధారబోయగా వెంటనే ఒక పుష్పకవిమానము అక్కడకు వచ్చెను. ఆమె అందరికి వందనము జేసి అక్కడి వారందరూ చూచుచుండగానే యా విమాన మెక్కి శివ సాన్నిధ్యమున కేగెను.

వింటివా జనక మహారాజా! కావున ఈ కార్తిక సోమవార వ్రతమాచరించి, శివ సాన్నిధ్యమును పొందుమని వశిష్ఠునకు హితబోధచేసి, ఇంకను ఇట్లు చెప్పదొడ౦గిరి.

ఇహమే కాదు పరం గురించి కూడా మనం తప్పనిసరిగా ఆలోచించాలి

ఒక సాధువు నడిచి వెళుతూ అలసటగా ఉంటే ఒక చెట్టు కింద కూర్చున్నాడు..

ఎదురుగా వున్న ఇంట్లోని గృహస్థుడు ఆయన్ని చూసి తమ ఇంట్లోకి వచ్చి కొంచెం సేపు విశ్రాంతి తీసుకోమని కోరాడు.
సాధువుకి మంచి భోజనం పెట్టి, చీకటి పడింది కదా ఈ పూటకి ఇక్కడే వుండమని కోరాడు ఆ ఇంటి యజమాని.
మాటల్లో తన కష్టసుఖాలు ముచ్చటిస్తూ, యజమాని,
" ఏమిటో నండీ ! సంసారంలో సుఖం లేదండీ..మీజీవితమే హాయి !! అన్నాడు.

వెంటనే ఆ సాధువు " అయితే నా వెంట రా ! నీకు మోక్ష మార్గం చూపిస్తాను " అన్నాడు.

యజమాని కంగారుపడుతూ.
" అలా ఎలా కుదురుతుంది ??
పిల్లలు చిన్నవాళ్ళు.. వాళ్ళను పెంచి పెద్ద చేయాలి కదా !!" అన్నాడు.

సాధువు మాట్లాడలేదు. కొన్ని సంవత్సరాలు గడిచాయి.
ఆ సాధువు మరల అదే మార్గంలో వస్తూ ఆ ఇంటిని చూ‌సి ఆగాడు. ఆయన్ని చూసి యజమాని సాదరంగా ఆహ్వానించి, అతిథి మర్యాదలు చేశాడు.

మాటలలో సాధువు అన్నాడు, " పిల్లలు పెద్దవాళ్లు అయ్యారు కదా నా వెంట రా! నీకు మోక్ష మార్గం చూపిస్తాను " యజమాని తడబడుతూ " ఇప్పుడే కాదు స్వామీ ! పిల్లలు స్థిరపడాలి...
వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి ....." అన్నాడు.

ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి. సాధువు మళ్లీ అదే.... యజమాని ఆతిథ్యం... సాధువు అదే మాట ..... యజమాని జవాబు కొంచెం విసుగ్గా.." పిల్లలకి డబ్బు విలువ తెలియదు.. అందుకని నేను దాచినంతా ఆ చెట్టు కింద పాతిపెట్టాను..వీలు చూసుకుని చెబుతాను. ఒక పెద్ద ఇల్లు కట్టాలి.. మీలాగా నాకు ఎలా కుదురుతుంది " అన్నాడు..

ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి
సాధువు మళ్లీ అదే మార్గంలో వస్తూ ఆ ఇంటి వంక చూడకుండా వెళ్ళి పోతుండగా ఆ యజమాని కొడుకు గమనించి ఆహ్వానించాడు .
అతను తమ తండ్రి మరణించాడని చెప్పాడు.. సాధువు కి కొంచెం బాధనిపించింది.
ఆతిథ్యం స్వీకరించి బయటికి వచ్చాడు.. చెట్టు కింద ఒక కుక్క కూర్చుని వుంది యజమాని అనుమానంగా దాని వంక చూశాడు..

సందేహంలేదు యజమాని కుక్కగా పుట్టాడు.. సాధువు మంత్రజలం దాని మీద జల్లి ,
" ఏమిటి నీ పిచ్చి మోహం ???!కుక్క గా పుట్టి ఇంటికి కాపలా కాస్తున్నావా ?? నా వెంట రా.. నీకు మోక్ష మార్గం చూపిస్తాను "
అన్నాడు.. యజమాని " ఆ మాట మాత్రం వినలేను..
ఎందుకంటే నేను డబ్బు ఇక్కడ దాచిన సంగతి పిల్లలకి చెప్పలేదు ఎవరూ దోచుకోకుండా చూడాల్సిన బాధ్యత నాదే కదా " అన్నాడు.

మళ్ళీ కొన్నాళ్ళకి సాధువు ఆ దారిన వస్తూ ఆ ఇంటి వైపు చూశాడు . కుక్క కనపడలేదు పక్కవారిని అడిగితే అది పోయిందని చెప్పారు.అయినా సాధువు అనుమానంగా చుట్టూ చూస్తుంటే చెట్టు కింద ఒక పాము కనిపించింది.. పరీక్షగా చూసాడు ఖచ్చితంగా ఆ యజమాని మళ్ళీ  పాము గా...
మంత్రజలం చల్లి, " ఇంకా ఈ ఇంటిని వదిలి వెళ్ళవా ???
అన్నాడు.

ఆ ఒక్క మాట మాత్రం అనకండి. నా సొమ్ము పిల్లలకి కాకుండా ఇతరులకి దక్కనీయకుండా చూడాలి కదా అన్నాడు దీనంగా..

సాధువు వెంటనే అతని ఇంట్లోకి వెళ్లి , అతని కొడుకులతో " మీ నాన్న ఆ చెట్టు కింద దాచిపెట్టాడు. కానీ జాగ్రత్త! అక్కడ పాము ఉంది " అనగానే కొడుకులు ఎగిరి గంతేసి,,

కర్రలు తీసుకుని బయలుదేరారు. తన కొడుకులే తనను కర్రలతో చావగొడుతుంటే అతను దీనంగా సాధువు వంక చూశాడు
కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది

*నీతి*
గృహస్థాశ్రమం లో బాధ్యతలు తప్పవు కాని మోహబంధాలు ఎంత గట్టిగా మనం కట్టేసుకోవాలి అనే వివేకం చాలా అవసరం.

*ఇహమే కాదు పరం గురించి కూడా మనం తప్పనిసరిగా ఆలోచించాలి* .... !!!

విష్ణు సుదర్శన చక్ర మహిమ

విష్ణు సుదర్శన చక్ర మహిమ

28వ అధ్యాయము 

జనక మహారాజా! వింటివా దుర్వాసుని అవస్ధలు! తాను యెంతటి కోపవంతుడైనను, వెనుక ముందు లాలోచింపక ఒక మహాభక్తుని శుద్దిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున, ఎంతటి గొప్ప వారైనాను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకోనవలెను.

అటుల దుర్వాసుడు శ్రీ మన్నారాయణుని కడ సెలవుపొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచూ తిరిగి మళ్లి భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి "అంబరీషా, ధర్మపాలకా! నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము, నీకు నాపై గల అనురాగముతో ద్వాదశీ పారాయణమునకు నన్నాహ్వనించితివి, కాని నిన్ను కష్టములు పాలుజేసి వ్రతభంగము చేయించి నీ పుణ్య ఫలమును నాశనము చేయతల పెట్టితిని. గాని నా దుర్బద్ది నన్నే వెంటాడి నాప్రాణములు తీయుటకే సిద్దమైనది. నేను విష్ణువు కడకేగి యా విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్ధి౦చితిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీవద్ద కేగమని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యము. నేను యెంతటి తపశ్శాలినైనను, యెంత నిష్టగలవాడనైనను నీ నిష్కళంక భక్తి ముందవియేమియు పనిచేయలేదు. నన్నీ విపత్తునుండి కాపాడు"మని అనేక విధాల ప్రార్ధఒచగా, అంబరీషుడు శ్రీ మన్నారాయణుని ధ్యానించి,"ఓ సుదర్శన చక్రమా! నీకివే నా మన:పూర్వక వందనములు. ఈ దూర్వాస మహాముని తెలిసియో, తెలియకయో తొందరపాటుగా యీ కష్టమును కొని తెచ్చుకొనెను. అయినను యీతడు బ్రాహ్మణుడు గాన, ఈతనిని చంపవలదు, ఒక వేళ నీ కర్తవ్యమును నిర్వహింపతలచితివేని, ముందు నన్నుచంపి, తర్వాత ఈ దుర్వాసుని జంపుము. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి, నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు యిలవేల్పు, దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్దములలో , అనేక మంది లోకకంటకులను చంపితివిగాని శరణుగోరువారిని యింత వరకు చంపలేదు. అందువలననే యీ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఈతనిని వెంటాడుచునే యున్నావు గాని చంపుటలేదు. దేవా! సురాసురాది భూతకోటులన్నియు ఒక్కటిగా యేకమైననూ నిన్నేమియు చేయజాలవు, నీ శక్తికి యే విధమైన అడ్డునూలేదు. ఈ విషయము లోకమంతటికి తెలియును. అయినను మునిపుంగవునికి యే అపాయము కలుగకుండ రక్షింపుమని ప్రార్థించుచున్నాను.

నీ యుందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి యిమిడియున్నది. నిన్ను వేడుకోనుచున్న నన్నును, శరణు వేడిన యీ దుర్వాసుని రక్షింపుము" అని అనేక విధముల స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణుచక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి "ఓ భక్తాగ్రేశ్వరా ! అంబరీషా! నీ భక్తిని పరీక్షించుట కిట్లు చేసితినిగాని వేరుగాదు. అత్యంత దుర్మార్గులు, మహాపరాక్రమవంతులైన మధుకైటభులను - దేవతలందరు యెకమైకూడ  - చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుంగుదువు కదా! ఈ లోకములో దుష్టశిక్షణ, శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్దాపించుచుండును. ఇది యెల్లరకు తెలిసిన విషయమే, ముక్కోపియగు దుర్వాసుడు నీపైల్ పగబూని నీవ్రతమును నశింపజేసి, నానా యిక్కట్లు పెట్టవలెనని కన్ను లెఱ్ఱజేసి నీ మీద జూపిన రౌద్రమును నేను తిలకించితిని. నిరపరాధివగు నిన్ను రక్షించి, యీ ముని గర్వమణచవలెనని తరుముచున్నాను.

ఈతడు కూడా సామాన్యుడు గాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు. బ్రహ్మతేజస్సు గలవాడు. మహాతపశ్శాలి. రుద్రతేజము భులోకవాసుల నందరను చంపగలదుగాని, శక్తిలో నా కంటె యెక్కువేమియుగాదు. సృషి కర్తయగు బ్రాహ్మతేజస్సు కంటెను, కైలాసవతియగు మహేశ్వరుని తేజశ్శక్తి కంటెను యెక్కువయైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు గాని , క్షత్రియ తేజస్సుగల నీవు గాని తులతూగరు. నన్నెదుర్కొనజాలరు. తనకన్న యెదుటి వాడు బలవంతుడై యున్నప్పుడు అతనితో సంధి చేసుకోనుట యుత్తమము. ఈ నీతిని ఆచరించువారలు యెటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకోనగలరు.

ఇంత వరకు జరిగినదంతయు విస్మరించి, శరణార్థియై వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపు" మని చక్రాయుధము పలికెను. అంబరీషుడా పలుకులాలకించి, " నేను దేవ గో, బ్రాహ్మణాదులయుందును, స్త్రీలయందును, గౌరవము గలవాడను. నా రాజ్యములో సర్వజనులూ సుఖిముగా నుండవలెననియే నా యభిలాష. కాన, శరణుగోరిన ఈ దుర్వాసుని, నన్నూ కరుణించి రక్షింపుము. వేలకొలది అగ్నిదేవతలు, కోట్ల కొలది సూర్య మండలములు యేక మైననూ నీ శక్తీకి, తేజస్సుకూ సాటి రావు. నీవు అట్టి తేజోరాశివి మహా విష్ణువు లోకనిందితులపై, లోకకంటకులపై, దేవ - గో - బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి, వారిని శిక్షించి, తనకుక్షియుందున్న పధ్నాలుగు లోకములను కంటికి రెప్పవలె కాపాడుచున్నాడు. కాన, నికివే నామన:పూర్వక నమస్కృతులు" అని పలికి చక్రాయుధపు పాదములపై పడెను. అంతట సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాడాలింగన మొనర్చి "అంబరీషా! నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రము మూడు కాలములయుందు నెవరు పఠింతురో, యెవరు దానదర్మములతో పుణ్యఫలమును వృద్ది చేసుకొందురో, యెవరో పరులను హింసించక - పరధనములను ఆశపడక - పరస్త్రీలను చెరబెట్టిక - గోహత్య - బ్రాహ్మణహత్య - శిశుహత్యాది మహాపాతకములు చేయకుందురో అట్టివారి కష్టములు నశించి, యిహమందును పరమందును సర్వసాఖ్యములతో తులతూగుదురు. కాన, నిన్నూ దుర్వాసుని రక్షించుచున్నాను, నీ ద్వాదశీ వ్రత ప్రభావము చాల గొప్పది. నీ పుణ్యఫలము ముందు యీ మునిపుంగవుని తపశ్శక్తి పని చేయలేదు." అని చెప్పి అతని నాశీర్వదించి, అదృశ్యమయ్యెను.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గ్హత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్మ్య మందలి అష్టావింశోధ్యాయము - ఇరవయ్యెనిమిదో రోజు పారాయణము సమాప్తము.

సంధ్యాసమయంలో ప్రతి రోజూ శ్రీ లక్ష్మీ నృసింహ ఋణ విమోచన స్తోత్రం పఠిస్తే, తప్పకుండా ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి, ధనం సంప్రాప్తిస్తుంది. శివునకు మరియు నరసింహ స్వామి వారికి షట్కాల పూజ నిర్వహిస్తాము. షట్ అంటే ఆరు. ఆరు కాలాలు

మన ధర్మంలో ఒక్కో దేవతను ఒక్కో విధంగా పూజిస్తాము. అందులో శివునకు మరియు నరసింహ స్వామి వారికి షట్కాల పూజ నిర్వహిస్తాము. షట్ అంటే ఆరు. ఆరు కాలాలు - ప్రత్యూష కాలము, ఉదయం, మద్యాహ్నము, సాయంకాలము, రాత్రి, అర్ధరాత్రి సమయాల్లో పూజ. శివకేశవులకు బేధం లేదు. అందులోనూ శివుండు మరియు నృసింహుని తత్త్వం ఒక్కటేనని చెబుతారు. ఈ రోజు ప్రదోషమే కాక స్వాతి నక్షత్రం కూడా ఉంది. కనుక ఇలాంటి శుభసమయంలో శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారిని తప్పకుండా పూజించాలి.

లక్ష్మీనృసింహుని ఆరాధన గ్రహదోషాలను ఉపశమింపజేస్తుంది, ఋణబాధలు తొలగిస్తుంది. సంధ్యాసమయంలో ప్రతి రోజూ శ్రీ లక్ష్మీ నృసింహ ఋణ విమోచన స్తోత్రం పఠిస్తే, తప్పకుండా ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి, ధనం సంప్రాప్తిస్తుంది.

ఈ శ్లోకాన్ని ప్రతిరోజు ఉదయాన్నే 19 సార్లు పఠించిన శనిదోషం తొలగిపోవును. శని దోష నివారణకు నేరేడు పండ్లు

శని దోష నివారణకు నేరేడు పండ్లు

శని దోష నివారణకు నేరేడు పండ్లు
చాలా కాలంగా కడుపులో పేరుకుపోయిన మలినాలకు శని కారకుడు కడుపులో పేరుకుపోయిన మలినాలను బయటకు పోవటానికి నేరేడు పండ్లను తినటం మంచిది. పేగుల్లో చుట్టుకుపోయిన వెంట్రుకలకు శని కారకుడు నేరేడు పండ్లు తింటే వెంట్రుకలను కోసేసి బయటికి పంపే శక్తి నేరేడు పళ్ళకు ఉంది. నేరేడు పండ్లు శరీరానికి చలవ చేస్తాయి. ముఖ్యంగా షుగరు రోగులకు నేరేడు చాలా ఉపకరిస్తుంది.దీర్ఘకాల వ్యాదులకు కారకుడైన శని జాతకంలో అనుకూలంగా లేని వారికి రోగ నిరోదక శక్తిని తగ్గించి ప్రతి చిన్న రోగాన్ని దీర్ఘకాలంగా అనుభవించేటట్టు చేస్తాడు.దీని నివారణకు నేరేడు పండ్లను తినటం వలన రోగ నిరోదకశక్తి పెరుగుతుంది. వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది. మూత్ర సంబంధ సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. కానీ గర్భిణీలు ఎటువంటి పరిస్థితులలో తినకూడదు.

దేవునికి నేరేడు పండ్లతో నైవేద్యంగా పెడితే బాగా నీరసం, నిస్సత్తువ తగ్గిపోతుంది. నీరసం, నిస్సత్తువ ఉన్న వారు దేవుడిని నేరేడు పండును దేవునికి నైవేద్యంగా పెట్టి ప్రసాదాన్ని తింటే జబ్బులు దూరమై ఆరోగ్యవంతులుగా తయారవుతారు.
నేరేడు పండును శ్రీ శనైశ్చర స్వామికి నైవేద్యంగా పెట్టి ప్రసాదాన్ని తింటే వెన్నునొప్పి, నడుం నొప్పి, మోకాళ్ల నొప్పులు, నయం అవుతాయి. పూజ చేసిన తర్వాత నేరేడు పండును బ్రాహ్మణునికి దానం చేస్తే రోగ బాధలు కలుగవు.
నేరేడు పండును శనైశ్చర స్వామికి ప్రియమైన నల్ల నవ్వులతో కలిపి దానం చేస్తే శని బాధలు ఉండవు. నేరేడు పండు దేవుని పేరిట పూజించి భిక్షగాళ్లకు దానం చేస్తే దారిద్ర్యం దరిచేరదు.
భోజనంతో పాటు నేరేడు పండును వడ్డిస్తే మీకు ఎప్పుడూ మృష్టాన్న భోజనం లభిస్తుంది. నేరేడు పండును పుణ్యక్షేత్రాల్లో యోగ్య బ్రాహ్మణులకు తాంబూల సమేతంగా దానం చేస్తే భూదానం చేసినంత ఫలితం లభిస్తుంది. నేరేడు పండును రోజుకొకటి చొప్పున తింటే వైద్యుల నుంచి దూరంగా ఉండవచ్చునని పండితులు చెబుతున్నారు.
శనైశ్చర స్వామికి నువ్వులనూనెతో గాని,ఆముదం నూనెతో గాని తెలుపు లేదా నలుపు వత్తులను పడమర దిక్కున ఇనుప గరిటెలో శని దీపాన్ని పెట్టి దానికి నేరేడు పండును నైవేద్యం పెట్టాలి. తరువాత ఈ క్రింది శ్లోకం చదవాలి.

శని బాధా వినాశాయ ఘోర సంతాప హారిణే I
కనకాలయ వాసాయ భూతనాధాయతే నమః II
దారిద్ర్యజాతాన్ రోగాదీన్ బుద్ధిమాంద్యాది సంకటాన్ I
క్షిప్రం నాశయ హే దేవ!శని బాధా వినాశక II
భూత బాధా మహాదుఃఖ మధ్యవర్తిన మీశమాం I
పాలయ త్వం మహాబాహో సర్వదుఃఖ వినాశక II
అవాచ్యాని మహాదుఃఖ న్యమేయాని నిరంతరం I
సంభవంతి దురంతాని తాని నాశయమే ప్రభో II
మాయా మోహన్యానంతాని సర్వాణి కరుణాకర I
దూరి కురు సదాభక్త హృదయానందదాయక II
అనేక జన్మ సంభూతాన్ తాప పాపాన్ గుహేశ్వర I
చూర్ణీకురు కృపాసింధో సింధుజాకాంత నందతే II
ఉన్మాదోధ్భూత సంతాపా గాధకూపాద్మహేశ్వర I
హస్తావలంబం దత్వా మాం రక్షరక్ష శనైశ్చర II
దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహిమే నిత్య యౌవనం I
దేహిమే పరమానందం దేవదేవ జగత్పతే II
ఈ శ్లోకాన్ని ప్రతిరోజు ఉదయాన్నే 19 సార్లు పఠించిన శనిదోషం తొలగిపోవును.

వ్యాధులను నివారించే శీతలాదేవి.

వ్యాధులను నివారించే శీతలాదేవి.

వ్యాధులను నివారించే శీతలాదేవి.
పూర్వం అంటువ్యాధుల భయం విపరీతంగా వుండేది. పేరు ఏదైనా ఒకరి నుంచి ఒకరికి సోకే ఈ వ్యాధుల వలన మరణించేవారి సంఖ్య ఎక్కువగా ఉండేది. 
ఒక్కోసారి ఈ అంటువ్యాధుల కారణంగా గ్రామాలకు ... గ్రామాలు ఖాళీ అవుతూ ఉండేవి. 
దాంతో అంటువ్యాధుల పేరు వినగానే గ్రామస్తులు తీవ్రమైన భయాందోళనలకు లోనయ్యేవారు. 
ఇక తమని అమ్మవారే కాపాడాలని భావించి, అంతాకలిసి 'శీతలాదేవి'ని పూజించేవారు.
శీతలాదేవి అంటే సాక్షాత్తు జగన్మాత అయిన పార్వతీదేవియే. 
ఆ తల్లి అనుగ్రహంతో అంటువ్యాధులు నివారించ బడతాయని గ్రామస్తులు విశ్వసిస్తూ వుంటారు. 
అలా వివిధ రకాల రోగాల నుంచి వ్యాధుల నుంచి విముక్తిని కలిగించే శీతలాదేవిని 'శ్రావణ బహుళ అష్టమి' రోజున పూజిస్తుంటారు. 
శ్రావణ బహుళ అష్టమిని 'కృష్ణాష్టమి'గా జరుపుకుంటూ వుంటారు.
నారాయణుడి సోదరిగా చెప్పబడే అమ్మవారి అనుగ్రహాన్ని కోరుతూ ఆ తల్లికి ప్రత్యేక పూజలందించే ఈ రోజుని 'శీతలాష్టమి' అని కూడా పిలుస్తుంటారు. 
ఈ రోజున చాలామంది కుటుంబసభ్యులతో కలిసి 'శీతలావ్రతం' ఆచరిస్తూ వుంటారు. 
ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలు ఎల్లప్పుడూ తమపై వుండాలని ఆశిస్తూ 'శీతలాష్టకం'పఠిస్తారు. 
అమ్మవారికి ఇష్టమైన పులిహోర ... పాయసం ... పెరుగన్నం నైవేద్యంగా సమర్పిస్తుంటారు.
భక్తిశ్రద్ధల పరంగాను ... ప్రేమానురాగాల పరంగాను అమ్మవారిని సంతోషపెట్టడం వలన ఎలాంటి వ్యాధులు దరిచేరవని అందరూ విశ్వసిస్తూ వుంటారు. 
ఇక ఇదే రోజున అమ్మవారి ప్రీతీ కొరకు కొంతమంది 'చండీహోమం' చేయిస్తుంటారు. 
ఈ చండీహోమం చేయించడం వలన సమస్త దోషాలు ... గ్రహ సంబంధమైన పీడలు తొలగిపోయి శుభాలు చేకూరతాయని చెబుతుంటారు.
జ్వరాది వ్యాధుల్ని పోగొట్టే ’శీతలాదేవి.
విశ్వచక్రంలోనున్న దేవతాశక్తుల్ని దివ్య మంత్ర,, నామ స్తోత్రాదులతో స్పందింపజేసి అభీష్టసిద్ధుల్ని సాధించే ’శబ్దచికిత్సా’ విధానాలను మన ఋషులు ఏర్పాటు చేశారు.
వ్యాధుల్ని నివారింపజేసి, జ్వరాలను తొలగించే శక్తి ఉన్న శీతలాదేవిని ఉత్తరాది, వంగదేశం, ఉత్కళ రాష్ట్రాలలో ఎక్కువగా ఆరాధిస్తారు. 
సుమారు ప్రతి దేవాలయంలో శీతలాదేవికి చిన్న ఆలయముండడమే కాక, ప్రత్యేకించి శీతలా మందిరాలు సైతం కనిపిస్తుంటాయి. 
శీతలా స్తోత్రాలు నిత్యపారాయణాలుగా ఉండడమే కాక, అతి సామాన్యులు సైతం ఈ తల్లిని ఆరాధిస్తుంటారు.
ఒకసారి రామకృష్ణ పరమహంస శిష్యునికి అనారోగ్యం కలిగింది. అప్పుడతను మాత శారదాదేవితో రైల్లో ప్రయాణిస్తున్నాడు. 
అనారోగ్యం కారణంగా ఆ శిష్యుడు మూసిన కళ్లు తెరవలేక పోతున్నాడు.
అది నిద్రో, లేవలేని నిస్సహాయతో గానీ ఆ అస్పష్ట కలత నిద్రలోనే అతనికొక భయంకరమైన ఆకారం ఒకటి కనిపించి 'ఇప్పటికే నేను నిన్ను మృత్యువుకు అప్పచెప్పి ఉండేదాన్ని. కానీ, నీ గురువాజ్ఞ మేరకు వదిలి పెడుతున్నాను. 
అయితే, ఇందుకు కృతజ్ఞతగా నేనుచూపించే ఈ దేవతామూర్తికి నువ్వు బాగా తియ్యగా ఉండే రసగుల్లాలను నైవేద్యం పెట్టాలి' అని ఆదేశించి అదృశ్యమైంది. 
ఆ ఆకారం చూపించిన దేవతా మూర్తి ఎర్రని పట్టు వస్త్రాన్ని ధరించి ఉంది.
ఆ తరువాత చిత్రంగా అతని అనారోగ్యం నయమైంది.
ఎంత తీవ్రమైన జ్వరంగానీ, ఎంతో కాలంనుండి తగ్గకుండా పీడిస్తున్న వ్యాథులు పీడిస్తుంటే ఈ తల్లికి భక్తిశ్రద్ధలతో మొక్కుకుంటే తప్ప కుండా అవి నివారణ మవుతాయని భక్తుల ప్రగాఢవిశ్వాసం.
అనంతశక్తి స్వరూపిణియైన జగదంబ తన అనంత అనుగ్రహాన్ని వివిధ విధాలుగా అందించడానికి అనంత రూపాలను ధరించింది. 
అలాంటి రూపాలలో ఈ శీతలాదేవి ఒకటి, 
జ్వరహరణ శక్తులలో ఒకటి. 
గాడిద వాహనంపై కూర్చుని చేట, చీపురు, కలశంవంటి వాటితో ప్రకాశించే ఈ తల్లిరూపం రోగనాశక శక్తులకు సంకేతం.
జంతువులలో కూడా అనేక రహస్య శక్తులుంటాయి. 
ఆ శక్తుల్ని గమనిస్తే - కొన్ని జంతువుల ఇంద్రియాలలో సూక్ష్మశక్తులున్న విషయం స్పష్టమౌతుంది. 
ఆ ప్రత్యేకతలన్నీ విశ్వశక్తిలోని అంశాలే.
శక్తులకు సూక్ష్మ జగత్తులో ఉన్న ఆకృతులను మంత్రద్రష్టలు దర్శించి, వాటిద్వారా మనం తగిన ప్రయోజనాలను పొందాలని వివిధ స్తోత్రాలనందించారు.
గాడిద, చేట, చీపురు, కలశం - ఈపరికరాలు రోగకారక క్రిమినాశన, జ్వరహరణ శక్తులకు సంకేతాలు.
స్ఫోటకము, ఉష్ణతలు, తీవ్రజ్వరాలు నశించడానికి, పిల్లలకు వచ్చే ఆటలమ్మవంటి ’మారీ’ వేదనలు తొలగడానికి, శీతలాదేవిని తలంచి ఈ స్తోత్రం చదివితే చాలు - తప్పక ఆ వ్యాధులు నివారణ అవుతాయని శాస్త్రోక్తి. "శీతలా" నామస్మరణమే జ్వరతాపాలను పోగొడుతుందని పురాణవచనం.
శీతలా దేవి స్తోత్రం..!!
అస్యశ్రీ శీతలాస్తోత్రస్య మహాదేవ ఋషిః - అనుష్టుప్ ఛన్దః - శీతలా దేవలా దేవతా - లక్ష్మీర్బీజం - భవానీశక్తిః -సర్వ విస్ఫోటక నివృత్తయే జపే వినియోగః
ఈశ్వర ఉవాచ:
వన్దేహం శీతలాం దేవీం రాసభస్థాం దిగమ్బరామ్!
మార్జనీకలశోపేతాం శూర్పాలంకృత మస్తకామ్!!
వన్దేహం శీతలాం దేవీం సర్వరోగ భయాపహామ్!
యామాసాద్య నివర్తేత విస్ఫోటక భయం మహత్!!
శీతలే శీతలే చేతి యో బ్రూయాద్దాహ పీడితః!
విస్ఫోటక భయం ఘోరం క్షిప్రం తస్య ప్రణశ్యతి!!
యస్త్వా ముదకమధ్యేతు ధృత్వా పూజయతే నరః!
విస్ఫోటకం భయం ఘోరం గృహే తస్య న జాయతే!!
శీతలే జ్వర దగ్ధస్య పూతిగంధయుతస్యచ!
ప్రనష్టచక్షుషః పుంస్ః త్వామాహుర్జీవనౌషధమ్!!
శీతలే తనుజాన్రోగాన్ నృణాం హరసి దుస్త్యజాన్!
విస్ఫోటక విదీర్ణానాం త్వమేకామృతవర్షిణీ!!
గలగండగ్రహా రోగా యే చాన్యే దారుణా నృణామ్!
త్వదనుధ్యాన మాత్రేణ శీతలే యాన్తి సంక్షయమ్!!
నమన్త్రోనౌషధం తస్య పాపరోగస్య విద్యతే!
త్వామేకాం శీతలే ధాత్రీం నాన్యాం పశ్యామి దేవతామ్!!
మృణాల తంతు సదృశీం నాభి హృన్మధ్య సంశ్రితామ్!
యస్త్వాం సంచిత యేద్దేవి తస్య మృత్యుర్నజాయతే!!
అష్టకం శీతలాదేవ్యా యోనరః ప్రపఠేత్సదా!
విస్ఫోటక భయం ఘోరం గృహేతస్య నజాయతే!!
శ్రోతవ్యం పఠితవ్యం చ శ్రద్ధాభక్తి సమన్వితైః!
ఉపసర్గ వినాశాయ పరం స్వస్త్యయనం మహత్!!
శీతలే త్వం జగన్మాతా శీతలే త్వం జగత్పితా!
శీతలే త్వం జగద్ధాత్రీ శీతలాయై నమోనమః!!
రాసభో గర్దభశ్చైవ ఖరో వైశాఖనందనః!
శీతలా వాహనశ్చైవ దూర్వాకంద నికృంతనః!!
ఏతాని ఖరనామాని శీతలాగ్రేతు యఃపఠేత్!
తస్యగేహే శిశూనాం చ శీతలా రుజ్ఞజాయతే!!
శీతలాష్టక మేవేదం నదేయం యస్యకస్యచిత్!
దాతవ్యం చ సదా తస్మై శ్రద్ధా భక్తియుతాయవై!!
స్వస్తి..!!
లోకా సమస్తా సుఖినోభవంతు..!!
                          శ్రీ మాత్రే నమః

Thursday, November 21, 2019

షష్టిపూర్తి

*🙏🏻జై శ్రీమన్నారాయణ🙏🏻* 


 *🌺షష్టిపూర్తి🌺* 

*అరవై సంవత్సరాలకు ఒకసారి మానవుడి మనో ధర్మాలతో పాటు, మానవ ధర్మాల విషయంలో మార్పులు సంభవిస్తాయి. మానవుడి బుద్ధి శక్తి కూడా 60ఏళ్లు నిరాటంకంగా పనిచేస్తుంది. అక్కడి నుంచి మానవ శరీరంలో మార్పులు మొదలువుతాయి. క్రమంగా జ్ఞాపకశక్తి క్షీణిస్తూ వస్తుంది. శరీరంలోని కండరాలు కరిగిపోతుంటాయి. అరవై సంవత్సరాలలోపు మృత్యుశక్తి ఒకసారి ప్రభావం చూపుతుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు.* అంటే ఏదో విధమైన ప్రాణాపాయం దగ్గరి వరకూ వచ్చి వెళ్తుందన్నమాట. అరవై సంవత్సరాల నుంచి ప్రతి పదేళ్లకు మృత్యుశక్తి పలకరిస్తూ ఉంటుంది.  🤔 🤔

 *ప్రభవ నామ సంవత్సరంతో ప్రారంభమైన తెలుగు సంవత్సరాలు అక్షయతో ముగుస్తాయి. అంటే మనిషి పుట్టిన సంవత్సరం నుంచి తిరిగి అరవై ఏళ్ల తర్వాత అదే సంవత్సరం మొదలువుతుంది.* అప్పటి నుంచి *మళ్లీ బాల్యావస్థ మొదలవుతుంది. అంటే చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తుంటారు. అకారణంగా అలగడం, అవీ.. ఇవీ తినాలని అడగటం,ఎక్కువసేపు నిద్రపోవటం, చిన్న విషయాలకే ఆనంద పడటం, కోపం తెచ్చుకోవటం, కన్నీళ్లు పెట్టుకోవడం ఇలాంటి బాల్య చేష్టలన్నీ అరవైఏళ్ల నుంచి నెమ్మదిగా ప్రారంభమవుతాయి.* ప్రతి కొడుకూ అరవై సంవత్సరాలు వచ్చిన నాటి నుంచి తన తండ్రిని తన బిడ్డలతో సమానంగా చూసుకోవాలని ధర్మశాస్త్రం చెబుతోంది.  ఆరుపదుల జీవితాన్ని ఎవరైతే ఆనందంగా జీవిస్తారో వారి జీవితం ధన్యం. *ఆ ధన్యజీవితపు జ్ఞాపకార్థమే బిడ్డలు, మనవళ్లు బంధువులు మిత్రులు కలిసి 💐💐షష్టిపూర్తి చేస్తారు* 💐💐

Wednesday, November 20, 2019

మీరు దేవున్ని చూసారా?

ఒక ప్రఖ్యాత శైవ క్షేత్రానికి  ఒక జర్నలిస్ట్  వెళ్ళింది, ఏదైనా సెన్సషనల్ న్యూస్ వేసి మంచిపేరు తీసుకో వాలని ఆమె కోరిక. 
అక్కడే ఉన్న ఒక  భక్తుడిని ఇలా అడిగింది. 
జర్నలిస్ట్ :మీ  వయసు ఎంతుంటుందండి? 
భక్తుడు :85 ఏళ్లు ఉంటాయండి 
జర్నలిస్ట్ :ఎన్నేళ్లుగా గుడికి వస్తుంటారు? 
భక్తుడు : నాకు  బుద్ది వచ్చినప్పటి నుండి 
జర్నలిస్ట్ : మరి దేవున్ని  చూసారా? 

భక్తుడు : లేదండి 
జర్నలిస్ట్ :మరి ఎందుకు అంత నమ్మకంగా ప్రతిసారి గుడికి వెళుతున్నారు? 
భక్తుడు :మీరెక్కడ నుండి వచ్చారు? 
జర్నలిస్ట్ :సిటీ నుండి 
భక్తుడు :అక్కడ ఎక్కువ కుక్కల్ని పెంచుకొంటారట కదా? 
జర్నలిస్ట్ :అవును, చాలా ఇళ్లల్లో పెంచుకొంటారు 
భక్తుడు :మాది  చిన్న పల్లెటూరండి, అక్కడ పంట చేల్లో దొంగలు పడకుండా కొంత మంది మామూలు కుక్కల్ని పెంచుకొంటారు, 
జర్నలిస్ట్ :నేనడిగిన దానికి మీరు చెప్పేదానికి ఏమిటి సంబంధం? 
భక్తుడు :రాతిళ్ళు పంట చేల దగ్గర  ఎవరైనా దొంగ కనిపిస్తే ఒక కుక్క మొరుగుతుంది, అది చూసి చుట్టూ దూరంగా  ఉన్న కుక్కలు కూడా మొరుగుతాయి, కానీ దొంగని చూసింది ఒక కుక్క మాత్రమే, కానీ మిగతా కుక్కలు దాని మీదున్న నమ్మకంతో నే  మొరిగాయి తప్ప అవేవి దొంగని చూడలేదు. 
అలాగే వేల సంవత్సరాలనుండి ఎంతో మంది, ఋషులు, పుణ్యపురుషులు, రాజులు, తపస్సు తో దేవుడి నే చూసివచ్చిన వాళ్ళు ఇలా ఎంతో మంది హిందూ ధర్మం లో పురాణపురుషులు చెప్పారు దేవుడు ఉన్నాడని, అలాంటప్పుడు  యోచనా శక్తి లేని కుక్కలే  ఇంకొక కుక్క మీద నమ్మకంతో మొరిగాయి, అలాంటిది ఆలోచించే శక్తి, ఉన్న మనుషులం మనం మన పూర్వీకుల నే నమ్మలేమా !
తప్పకుండా మంచిమనస్సుతో ఎప్పటికైనా దేవుణ్ణి దర్శించుకొంటాను. 
జర్నలిస్ట్ : క్షమించండి. మీ అనుభవం అంత, నా వయసు లేదు, తప్పు గా  మాట్లాడిన  జీవిత సత్యాన్ని తెలుసుకున్నాను.🕉🕉🙏🙏

అయోధ్య క్షేత్ర వికాస (అభివృద్ధి) పరిషత్తు

🙋‍♂
⛳అయోధ్య అభివృద్ధి కోసం యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభం.
⛳1) ప్రప్రథమంగా అయోధ్య క్షేత్ర  వికాస (అభివృద్ధి) పరిషత్తు ఆవిర్భావం.
⛳2) అయోధ్యలో వంద కోట్ల రూపాయల ఖర్చుతో రైల్వే స్టేషన్ విస్తరి కరణ ప్రారంభం.
⛳3) అయోధ్య నుండి ఫైజాబాద్ మధ్యలో ఐదు కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్ వంతెన నిర్మాణం.
⛳4) అయోధ్యలో సరయూ నదీ తీరాన ప్రపంచంలోనే ఎత్తయిన 251 మీటర్ల  (statue of unity) శ్రీ రామచంద్ర స్వామి వారి  దివ్య మంగళ మూర్తి నిర్మాణం.
⛳5) అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం 2020 ఏప్రిల్ నెలలో శ్రీరామనవమి రోజున మొదటి విమాన ప్రయాణం ప్రారంభం.
⛳6) అయోధ్యలో డిసెంబర్ మాసం నుండి 10 విశాలమైన  విహారస్థలాలు Resorts నిర్మాణం పనులు ప్రారంభం.
⛳7) అయోధ్యలో లో డిసెంబర్ మాసం లో ఐదు నక్షత్రాల హోటల్ నిర్మాణం ప్రారంభం.
⛳8) రెండు వేల మంది 2000 కార్మికులు రోజుకు ఎనిమిది గంటలు పని చేస్తే రెండున్నర సంవత్సరాలలో భవ్యమైన మందిర నిర్మాణం పూర్తవుతుంది. ఇప్పటివరకు 65% రాతి చెక్కడం పనులు శిల్ప నిర్మాణం పనులు పూర్తి అయినది.
⛳9) అయోధ్యలో సరయూ నదిలో విహారానికి క్రూజ్ నడపటానికి పనులు ప్రారంభమైనవి.
⛳10) తిరుపతి క్షేత్రం లాగా అయోధ్య నగర నిర్మాణం కై నాలుగు సంవత్సరాల సమయాన్ని కేటాయించడం జరిగినది.
⛳11) ధర్మక్షేత్రంగా పుణ్యస్థలంగా దేశంలోనే పెద్దదైన దివ్యమైన రామమందిర నిర్మాణం.
⛳12) అయోధ్యలో అంతర్ రాష్ట్రీయ బస్ స్టేషన్ నిర్మాణం.
⛳13) దివ్య మందిర పరిసరాలు ఐదు కిలోమీటర్ల వరకు మరియు మందిర పర్యవేక్షణ బాధ్యత కూడా పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతుంది.
⛳14) భవ్య మందిర సమీపంలో 77 ఎకరాల లో ధార్మిక సంస్థల ఏర్పాటు.
⛳15) అయోధ్య రామమందిరం దగ్గర గోశాల, ధర్మశాల మరియు వేద సంస్థానాల ఏర్పాట్లు.
⛳16) అయోధ్యలో 10 శ్రీరామ ద్వారాలు ఏర్పాటు మొదలు.
⛳17) ఆధ్యాత్మిక నగరం గా విలసిల్లె బోయే అయోధ్య నగరం.
⛳18) పదివేల మంది యాత్రికుల ఆవాస నిర్మాణాల ఏర్పాట్లు ప్రారంభం.
⛳19) శ్రీరామచంద్ర స్వామికి సంబంధించిన 10 నీటి కొలనులు (గుండాలు) పునర్నిర్మాణం పనులు ప్రారంభం.
ధర్మో రక్షిత రక్షితః
శుభం భూయాత్. ఆర్ ఎస్ ఎస్ శాఖ ఎర్రగొండపాలెం అశోక్ కుమార్ పెరుమళ్ల 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐🌹🌹🌹

Tuesday, November 5, 2019

బ్రహ్మ రాత

🌷బ్రహ్మరాతను_సైతం_బ్రహ్మాండమైన_రాతగా_మార్చి_చూపిన_వసంతుడు🌷
🌴🌴🌴🌹🌴🌴🌴
బోధ చేస్తూ ఒక మునిదంపతులు ఉండేవారు. ఆ ముని చాలా ప్రతిభావంతుడు. సకలశాస్త్రాలు, విద్యలు తెలిసినవాడు. ఆ ముని భార్య సాక్షాత్తూ అన్నపూర్ణయే. ఆమె శిష్యులను తన కన్నబిడ్డల్లా చూసుకునేది. ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వారి ఆకలిని తీర్చేది. అలా, ఒకనాడు ఆ ముని దంపతుల వద్దకు వసంతుడు అనే ఒక అనాథ వచ్చి శిష్యుడిగా చేరాడు. అతడు బాగా చురుకైనవాడు, తెలివైనవాడు కావడంతో, అతనికి గురువుగారు నేర్పించే విద్యలన్నీ ఇట్టే అబ్బేవి.
వసంతుడు కొన్నాళ్ళకే తన గురువుకు తెలిసిన విద్యలన్నీ పూర్తిగా నేర్చేసుకున్నాడు. ఇక అతనికి నేర్పడానికి తనవద్ద ఉన్న జ్ఞానం సరిపోకపోవడంతో, తనకు గురువులైన వారి వద్దకు పంపించి మరీ విద్యాభ్యాసం చేయించాడు. ఆ గురువర్యుడు. అయితే కొన్నాళ్ళకే అతనికి నేర్పడానికి తమవద్ద ఉన్న విద్యలన్నీ పూర్తయ్యాయని ఆ పెద్ద గురువులైన వాళ్ళు కూడా చెప్పారు.
ఇదిలావుండగా నిండు చూలాలైన గురుపత్ని ప్రసవించే సమయం రావడంతో, వసంతుడు ఆశ్రమంలో అన్ని పనులు తానే చూసుకుంటూ, తల్లితో సమానురాలైన గురుపత్నిని కాలు క్రింద పెట్టకుండా చూసుకుంటున్నాడు. ఆమెకు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. ఆశ్రమంలోపల ప్రసవం జరుగుతుండగా వసంతుడు గుమ్మం బయటకు వచ్చి కూర్చున్నాడు.
కాసేపట్లో లోపలి నుండి చంటిబిడ్డల ఏడుపులు వినవచ్చాయి. గురుపత్ని కవలపిల్లలకు జన్మనిచ్చింది. ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల. ఇంతలో దివి నుండి భువికి దిగివచ్చిన ఒక దివ్యపురుషుడు వడివడిగా ఆశ్రమంలోకి వెడుతూ, గుమ్మం ముందు కూర్చున్న వసంతుడికి కనిపించాడు. మామూలు మనుషులకైతే అతను కనిపించి వుండేవాడు కాదు. కాని వసంతుడు దేవరహస్యాలు కూడా నేర్చుకున్నాడు కాబట్టి ఆ వచ్చిన అతనెవరో ఇట్టే కనిపెట్టేశాడు వసంతుడు. అతడు ''బ్రహ్మ''. అప్పుడే పుట్టిన పిల్లలకు నొసటి రాత రాయడానికి వచ్చాడని అర్థం చేసుకున్న వసంతుడు ఓపిగ్గా బయట కాచుకుని కూర్చున్నాడు వసంతుడు. బ్రహ్మ బయటకు రాగానే ఆయనకు ప్రణామం చేసి ''స్వామి'' మా గురువుగారి పిల్లల నుదుట ఏమి రాశారో దయచేసి సెలవివ్వగలరు అని వినమ్రపూరితంగా అడిగాడు.
బ్రహ్మ తనను చూడగలిగిన ఈ పిల్లవాడు సామాన్యుడు కాడు అని తెలుసుకొని, వసంతుడు అడిగిన విధానానికి ముచ్చటపడి, ఇతరులకు తెలియజెయ్యరాని రహస్యాన్ని అతనికి చెప్పడానికి నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఇలా చెప్పాడు - నాయనా! ఈ అబ్బాయి నిరక్షర కుక్షి అవుతాడు. ఇతని జీవితకాలమంతా ఇతని వద్ద ఒక మూట బియ్యము, ఒక ఆవు, ఒక పూరిపాక తప్ప మరిక ఏమీ ఉండవు. ఇతడు రోజంతా కష్టపడినా తన రెక్కల కష్టంతో కనాకష్టంగా పెళ్లాన్ని, పిల్లల్ని పోషిస్తాడు అంతే అన్నాడు.
ఇక ఆ అమ్మాయి మాత్రం వేశ్య అవుతుంది. డబ్బుల కోసం రోజుకో పురుషుడితో సంభోగించే వారకాంత అవుతుంది అని చెప్పి అక్కడినుండి వెళ్ళిపోయాడు బ్రహ్మ. అది వినిన వసంతుడు నిశ్చేష్టుడయ్యాడు. సాక్షాత్తూ దైవసమానులైన తన గురుదంపతులకి పుట్టిన పిల్లలకు ఇలాంటి రాత రాసాడేమిటా విధాత అని విచారంగా ఆలోచనలో మునిగిపోయాడు. వెంటనే తన గురువుగారిని బ్రహ్మ రాత మార్చగలమా అని అడిగాడు వసంతుడు. దానికి, ఆయన అది సాధ్యం కాదు నాయనా. అది ఎవ్వరికీ సాధ్యం కాదు అని చెప్పాడు. పిల్లలు పెద్దవాళ్ళయ్యే కొద్దీ వాళ్ళ రాత నిజమవడం వసంతుడికి కనిపించసాగింది.
ఆ ఇద్దరికీ చదువులు వంటపట్టడం లేదు. ఎందరికో విద్యాబుద్ధులు నేర్పిన గురువుగారి పిల్లలు ఇలా అయ్యారేమిటా? అనే దిగులుతో, వసంతుడికి దేనిమీద ఏకాగ్రత కుదరడంలేదు. దానికితోడు ఆ పిల్లలిద్దరు వసంతుడి వెంటపడి అన్నయ్య, అన్నయ్య అని తిరుగుతూ వుంటే, అతడికి దుఃఖం మరింత ఎక్కువ కాసాగింది. ఒకరోజు గురువుగారితో చెప్పి, ఆయన అనుమతి పొంది దేశం చుట్టి రావడానికి బయలుదేరి వెళ్ళాడు. ఎన్నో చోట్లకు వెళ్ళి ఎందరో పండితులను కలిసాడు.
వారందరిని వసంతుడు ప్రశ్నించాడు. బ్రహ్మ రాసిన రాతను మార్చగలమా? దానికి వసంతుడికి అందరు చెప్పిన సమాధానం బ్రహ్మరాత మార్చడం అసాధ్యం. అది ఎవరితరమూ కాదు అని. అలా అక్కడా ఇక్కడా తిరుగుతూ, తన అన్వేషణను కొనసాగిస్తూ ఇరవై సంవత్సరాలకు పైగా గడిపాడు. అప్పటికి గురువుగారి పిల్లలకు పాతికేళ్ళు వచ్చాయి. వసంతుడికి వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలనిపించసాగింది.
ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. అప్పుడు అక్కడి పరిస్థితి గురువుగారి కుమారుడి పేరు శంకరుడు అని, ఆ ఊరిలోనే కూలిపని చేస్తున్నాడని, గురువుగారి కుమార్తె పేరు వసంతసేన అని దగ్గరలోని ఒక పట్టణంలో వ్యభిచార వృత్తిలో ఉందని తెలుసుకున్నాడు. తనకు పుట్టిన పిల్లల దుస్థితి చూసి దిగులుతో మంచం పట్టి, గురు దంపతులు మరణించారని కూడా వసంతుడు తెలుసుకున్నాడు.
వసంతుడు బాగా ఆలోచించాడు. ముందు శంకరుడిని వెతుక్కుంటూ వెళ్ళాడు. వసంతుడిని చూడగానే అన్నయ్యా! అంటూ బావురుమన్నాడు శంకరుడు. చిన్న పూరిపాక, చిరిగిపోయిన దుస్తుల్లో భార్య, ఒక కొడుకు, ఇంట్లో ఎటు చూసినా విలయతాండవం చేస్తున్న కటిక దారిద్య్రం ఇదీ శంకరుడి దుస్థితి. తమ్ముడూ, నువ్వు బాధపడకు. ఇప్పటినుండి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు వసంతుడు. దానికి శంకరుడు, ''సరే అన్నయ్యా! ఇకనుండి నువ్వు ఎలా చెపితే అలానే

చేస్తాను'' అన్నాడు శంకరుడు.
ముందు ఆ ఆవుని తోలుకుని పట్టణానికి వెళదాం పద అన్నాడు వసంతుడు. ఏమి మాట్లాడకుండా ఆవును తోలుకుని వసంతుడిని అనుసరించాడు శంకరుడు. ఇద్దరూ నేరుగా పట్టణంలోని సంత దగ్గరకు వెళ్ళారు. అక్కడ ఒక దళారి దగ్గరకు వెళ్ళి ఈ ఆవుని ఎంతకు కొంటావు అని అడిగాడు వసంతుడు. తరువాత అతను చెప్పిన ధరకు అమ్మేసాడు వసంతుడు. శంకరుడికి ఏమీ అర్థం కాకపోయినా, వసంతుడికి ఎదురు చెప్పలేదు. ఆవును అమ్మగా వచ్చిన డబ్బుతో వంటకు అవసరం అయిన సరుకులను, శంకరుడి భార్యకు, పిల్లలకు కొత్త బట్టలు కొన్నారు. తిరిగి గ్రామానికి బయలుదేరారు. ఇంటికి రాగానే ఆ సరుకులతో వంట చేయించాడు వసంతుడు. శంకరుడి భార్య, పిల్లలు ఆవురావురుమని తిని ఆకలి తీర్చుకున్నారు.
తర్వాత వసంతుడు శంకరుడితో తమ్ముడూ అన్నదానం చేద్దాం. ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వడ్డించు అని చెప్పాడు. శంకరుడు మారు మాట్లాడకుండా అలాగే చేశాడు. కాని శంకరుడు ఆ రోజు రాత్రి వసంతుడితో, అన్నయ్యా! ఇంతవరకు ఆ ఆవు వుంది కదా అన్న ధైర్యం నాకు ఉండేది, ఇప్పుడు ఉన్న ఆ ఒక్క ఆధారం కూడా పోయింది. దాన్ని అమ్మగా వచ్చిన ధనం కూడా అన్నదానానికి ఖర్చయిపోయింది. తెల్లవారితే ఎలా గడపాలో అని భయంగా వుంది అని అన్నాడు. దానికి వసంతుడు తమ్ముడూ, నువ్వు ఏమీ ఆలోచించకుండా సుఖంగా నిద్రపో. ప్రొద్దునకంతా సర్దుకుంటాయి అని ధైర్యం చెప్పాడు.
ప్రొద్దున్నే లేచి తలుపు తెరచి బయటికి వచ్చి చూసిన శంకరుడి ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. శంకరుడి ఇంటిముందు ఒక ఆవు నిలబడి వుంది. శంకరుడి ఆస్తి ఎప్పుడూ ఒక్క ఆవే అని తను రాసిన రాత పొల్లుపోకుండా ఉండడానికి రాత్రికి రాత్రి బ్రహ్మయే స్వయంగా ఒక ఆవుని తీసుకొని వచ్చి అక్కడ కట్టేసాడు.
ఆ రోజు కూడా ఆవును తీసుకెళ్ళి సంతలో అమ్మి, వచ్చిన ఆ డబ్బుతో అన్నదానం చేయించాడు వసంతుడు. తమ్ముడూ, ఇక ఇలాగే ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేస్తూ ఉండు అని చెప్పి వసంతుడు అక్కడి నుండి వసంతసేనను వెతుక్కుంటూ బయలుదేరాడు. అన్ని దానాల్లోకెల్లా గొప్పదైన అన్నదానాన్ని క్రమం తప్పకుండా చేస్తున్నందున శంకరుడు తన జీవితంలో అనంతమైన పుణ్యాన్ని మూట కట్టుకున్నాడు.
వసంతుడు వాళ్ళని, వీళ్ళని అడుగుతూ వెళ్ళి వసంతసేనను కలుసుకున్నాడు. వసంతసేన ఒక అవ్వతో కలసి ఒక ఇంట్లో ఉంటోంది. ఆమె వసంతుడిని చూడగానే భోరుమని ఏడ్చేసింది. అన్నయ్యా! నేను మహాపాపిని. ఈ పాపపంకిలంలో కూరుకుపోయాను. మీలాంటి ఉన్నతుడిని చూడటానికి కూడా నాకు అర్హత లేదు అని బావురు మంది. ఊరుకో చెల్లీ! ఊరుకోమ్మా! ఈ పాపపు పంకిలం నుండి నువ్వు బయటపడే మార్గం చెబుతాను. ఇక ఇవాల్టి నుండి నేను చెప్పినట్లు చెయ్యి అని ఆమెను ఓదార్చాడు వసంతుడు. దానికి సరే అని ఒప్పుకుంది వసంతసేన.
ఆ రాత్రికి విటులు ఎవ్వరు వచ్చినా లక్ష వరహాలు చెల్లిస్తేనే లోపలికి ప్రవేశం అని చెప్పమని అక్కడ వసంతసేనతో ఉన్న అవ్వకు చెప్పాడు వసంతుడు. ఆమె ఆశ్చర్యపడుతూ అయ్యా! ఇది జరిగే వ్యవహారం కాదు అని ఏదో చెప్పబోయింది. వసంతుడు ఆమెను మధ్యలోనే వారించి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లుగా. ఆ రాత్రి ఇద్దరు, ముగ్గురు విటులు వచ్చి లక్ష వరహాలు అనగానే వెనుదిరిగి వెళ్ళిపోయారు. అది వాళ్ళు ఊహించలేని మొత్తం.
కాని అర్ధరాత్రి సమీపిస్తూ ఉంది అనగా ఒక మహాపురుషుడు మాత్రం లక్ష వరహాలతో వచ్చి ఆ రాత్రి వసంతసేనతో గడిపి వెళ్ళాడు. ఆ మరుసటిరోజు రాత్రి కూడా అలాగే జరిగింది. తన రాత తప్పకూడదని, లక్ష వరహాలు ఇచ్చి వసంతసేనతో సంభోగించింది సాక్షాత్తూ ఆ బ్రహ్మే నని వసంతుడికి తెలుసు. అలా బ్రహ్మ సంభోగం వలన అప్పటివరకు ఆమె మూటగట్టుకున్న పాపాలన్నీ పటాపంచలయ్యాయి. ఆమె జన్మ చరితార్థమైంది. అలా వసంతుడు వాళ్ళిద్దరి చేత పుణ్యకర్మలు చేయించి, గురుదంపతుల రుణం తీర్చుకున్నాడు.
ఈ ప్రపంచంలో ప్రతి జీవి నుదుట తలరాత రాసేది బ్రహ్మే అయినా దానిని చక్కగా తీర్చిదిద్దుకునే శక్తిని, అవకాశాన్ని మాత్రం ప్రతి జీవికి ఇచ్చాడు అని గ్రహించాడు, దానిని నిరూపించాడు. అలా బ్రహ్మ రాతను సైతం బ్రహ్మాండమైన రాతగా మార్చి చూపాడు వసంతుడు.                        🌹🌹🌹🌹                       (ఇక నుండి మనవిధిని మనమే నిర్ధారించుకుందాం.)

Friday, November 1, 2019

✡ *శబరిమల యాత్ర కు వెళ్లు అయ్యప్పలకు, భక్తులకు దేవస్థానం వారి విజ్ఞప్తి.....* ✡

✡ *శబరిమల యాత్ర కు వెళ్లు అయ్యప్పలకు, భక్తులకు దేవస్థానం వారి విజ్ఞప్తి.....* ✡

1. ప్రైవేట్ వాహనాలు  "నిలక్కల్"
వరకు మాత్రమే అనుమతి...

2. "నిలక్కళ్" నుండి "పంబ" వరకు .       కేరళ రాష్ట్ర RTC బస్సుల ద్వారా మాత్రమే ప్రయానించవలేను. ఆ బస్ లో కండక్టర్ ఉండరు. కావున కూపన్ కొని బస్ లో ప్రయాణి చవలెను.

3. మీరు పంబ చేరిన తర్వాత 
    త్రివేణి  బ్రిడ్జి  అయ్యప్ప వారధి(కొత్తగా నిర్మించిన) మీదుగా  సర్వీస్ రోడ్డు ద్వారా కన్నిమూల గణపతి ఆలయం చేరుకోవాలి.

4. పంబ నుండి కాలినడక వంతెన మూసివేయబడింది
     (గమనించగలరు).

5. త్రివేణి నుంచి "ఆరాట్టు కడావు" వరకు గల ప్రదేశాలు మట్టి బురద తో నిండి ప్రమాదపూరితం గా
    వున్నాయి కావున ఎవ్వరూ
    క్రిందికి దిగరాదు.

6.  పంబలో భక్తులకు కేటాయించిన ప్రదేశాలలో మాత్రమే స్నానంచేయాలి. మిగిలిన ప్రదేశాలలోస్నానం చేయరాదు.

7. సెక్యూరిటీ సిబ్బంది ఆదేశాలను
    తప్పనసరిగా పాటించాలి. పంబ పోలీసుస్టేషన్ ముందు ప్రదేశం పూర్తిగ దెబ్బతింది.కావున ఆమార్గం గుండా కొండ పై కి
ఎక్కరాదు.

8. పంబ పెట్రోల్ బంక్ నుండి "u"టర్నింగ్ పూర్తిగా దెబ్బతింది.
    కావున ఆ ప్రాంతం పూర్తిగా
    మూసివేయబడింది.

9. పంబ పరిసరాలు, అడవి దారిలో ప్రమాదకరమైన పాములు బాగా సంచరిస్తున్నందువల్ల జాగ్రత్త గా వుండాలి.

10. అనుమతి లేని దారుల ద్వారా కొండ  ఎక్కరాధు.

11. త్రాగు నీటిని వెంట తీసుకెళ్లాలి.

12.ప్లాస్టిక్ వస్తువులను వాడరాదు

13. భోజనం, టిఫిన్స్ స్టాల్ నీలక్కల్లో కలవు.

14. ఇరుముడి లో ప్లాస్టిక్
       కవర్లు,వస్తువులు ఉండరాదు

15. మీకు అవసరమైన కొద్దిపాటి తినుబండారాలను తెచ్చుకోవాలి

16. మంచినీటి కొరత వల్ల నీటిని వృధా చేయరాధు ( నీటి పైపు లు పాడైన కారణంగా).

17. ఇటీవల వరదల కారణంగా
       నీలక్కళ్. పంబ.  సన్నిధాన ప్రాంతాల్లో మరుగుదొడ్లు
       పాడైపోవటం వల్ల నియమిత మరుగుదొడ్ల ను వాడుకోవాలి.

పైన చెప్పినవన్నీ  శబరిమల దేవస్థానం వారి ఉత్తర్వుల ను అందరూ పాటించి స్వామి అయ్యప్ప వారి క్షేత్రం లో క్రమశిక్షణ తో ప్రయాణించి స్వామి అయ్యప్ప వారి కృపా కటాక్షాన్ని పొందగలరు.

|| స్వామియే శరణం అయ్యప్ప ||

శ్రీమద్ మహాభారతం - 652 - కర్ణపర్వం-45* *కౌశికుని కథ* STORY OF KAUSHIK SRIMAD BHAGAVATHAM

*శ్రీమద్ మహాభారతం - 652 - కర్ణపర్వం-45*

*కౌశికుని కథ*

పూర్వము కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఉండే వాడు. వాడికి పెద్దలు చెప్పిన మాటలు వినే అలవాటు లేదు. తాను నమ్మిందే ఆచరిస్తాడు. అతడు ఒకసారి తన ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నాడు. కొంత మంది దొంగలు దారిన పోయే బాటసారులను తరుముకుంటూ వస్తున్నారు. బాటసారులు తమ తమ ధనము ఆభరణముల మూటలతో ఆశ్రమ సమీపములోని పొదలలో దాక్కున్నారు. బాటసారులను వెదుక్కుంటూ వచ్చిన దొంగలు తాము తరుముతూ వస్తున్న బాటసారులు ఎక్కడ ఉన్నారని కౌశికుని అడిగారు. కౌశికుడు ధర్మాధర్మ విచక్షణ లేని వాడు కావడం చేత తనకు అసత్యదోషం చుట్టుకుంటుందని అనుకుని వారు పొదల మాటున దాక్కున్న విషయం చెప్పాడు. దొంగలు బాటసారులను చంపి వారి ధనమును దోచుకున్నారు. మరణానంతరం కౌశికుడు ఘోరనరకానికి పోయారు. కనుక అర్జునా! *హింసకు కారణమయ్యే సత్యము ధర్మం అనిపించుకోదు. సత్యాసత్యం, ధర్మాధర్మం గురించిన విచక్షణ పెద్దల చేత నిర్ణయించ బడాలి కాని ఎవరికి వారు వారికి తోచినట్లు చేయకూడదు. కనుక నీవు నీ అన్న ధర్మరాజును వధించుట ధర్మం కాదు* " అన్నాడు.

*అర్జునుడు శాంతి పొందుట*

అప్పటికి శాంతించిన అర్జునుడు " కృష్ణా ! నన్ను మన్నించు. తల్లీ తండ్రి వలె నాకు హితవు చెప్పి నేను అనుచిత కార్యము చేయకుండా కాపాడావు. లేకున్న ఘోరం జరిగి పోయేది. కాని కృష్ణా ! జనులు నన్ను చేసిన ప్రతిజ్ఞ కాపాడని వాడని నిందించకుండా నాకు , నా అన్న ధర్మజునికి ఆపద వాటిల్లని చక్కని మార్గం సూచించు " అన్నాడు. కృష్ణుడు " అర్జునా ! ధర్మజుడు కర్ణుని వాడి బాణములతో బాధించడమే కాక నీచమైన మాటలతో నిందించాడు కనుక ఆ బాధ భరించ లేక ఏవో మాటలు అన్నాడే కాని నీ మీద ప్రేమ లేక కాదు. నీకు అన్న ప్రభువు. మిమ్ములను తండ్రివలె కాపాడే వాడు. అతడు నిన్ను అనకూడదా! నీవు పడకూడదా! అతడి వంశోద్ధారకులైన నీవు, భీముడు, నకులసహదేవులు అతడి వశంలో ఉంటారు కదా ! మీ మీద కోపం ఎందుకు ఉంటుంది. ఆయనను చంపడానికి నీవు కత్తి ఎత్తావు కదా ! ఆ భావన మనసులో ఉంచుకుని నీ అన్నయ్యలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ నిందించు. కాని ఆ మాటలు మనసులో పెట్టు కోవద్దని వినయముగా నమస్కరించు. ఆ తరువాత నీకు అనృత దోషం పోయి నీ మనస్సు శాంతపడుతుంది. ఆ పై మనం కర్ణుడిని చంపడానికి వెళదాము.

రాగినాణెం STORY OF PRESENT LIFE

(ఒక చిన్న కథ. )మనకోసం.

ఒకతను వున్నంతలో భార్యా పిల్లలతో ఆనందంగా బతుకుతుంటాడు.
ఒకరోజు అతడు బజార్లో నడుస్తూ వుంటే ఒక నాణెం దొరుకుతుంది..
మకిలి పట్టి మధ్యలో చిల్లు వున్న రాగి నాణెం..అది...!!
అతడు దాన్ని రుద్ది చూస్తాడు..ఆశ్చర్యం..!!
ఇంకో రాగి నాణెం వస్తుంది..
మళ్ళీ రుద్దుతాడు..
మరోటి వస్తుంది..
మళ్ళీ రుద్దితే మళ్ళీ ఒకటి..!!
అప్పుడు ఆకాశవాణి వినిపిస్తుంది..
ఓ మనిషీ..!
ఇది మాయానాణెం..
దీన్ని ఎన్నిసార్లు రుద్దితే అన్ని నాణేలు ఇస్తుందీ..
అయితే మధ్యలో ఒక్కసారి ఆపినా అది మాయమైపొతుందీ...!!
అని చెప్తుంది.
అంతే ఆ మనిషి తన ఇంటిలో వున్న నేలమాళిగలోకి వెళ్ళి నాణేన్నిరుద్దటం మొదలు పెడతాడు.
తనను తాను మర్చిపోతాడు. కుటుంబాన్ని మర్చిపోతాడు.
పిల్లల్ని మర్చిపోతాడు.
ప్రపంచాన్ని మర్చిపోతాడు.
అలా రుద్దుతునే వుంటాడు..
గుట్టలుగా సంపదను పోగెస్తునే వుంటాడు.
ఒకరోజు అతడికి ఇక చాలనిపిస్తుంది.
రాగినాణేన్ని పక్కన పడేసి..బయటికి వస్తాడు.
అతడిని ఎవ్వరూ గుర్తు పట్టరు.
పిచ్చి వాడిలా ఉంటాడు.
పిల్లలకు పిల్లలు పుట్టి వుంటారు..
కొత్త భవనాలు వెలసి వుంటాయి..
కొత్త సంగీతాలు వినిపిస్తుంటాయి..
స్నేహితులు..
చుట్టాలు..
పుస్తకాలు..
ప్రేమ,పెళ్ళి...
జీవితం ప్రసాదించిన అన్ని సుఖ సంతోషాలను  అనుభవిస్తుంటారు.
ఆ మనిషికి ఏడుపు వస్తుంది.
ఇంతకాలం ఇవన్నీ వదిలేసి నేను చేసింది ఇదా అని కుప్పకూలుతాడు.
ఒక్కోసారి మనం కూడా చేతిలో ఇలాంటి మాయానాణెం పట్టుకొని వున్నామా అనిపిస్తుంది.
డబ్బు సంపాదనలో పడి ..
కీర్తి కాంక్షలో పడి..
లక్ష్య చేధనలో పడి,
బంగారు నాణెం వంటి జీవితాన్ని వదిలి..
మకిలి రాగినాణెం లా మార్చుకుంటున్నామా అనిపిస్తుంది.
డబ్బు అవసరమే...
కాని అంతకన్నా ముఖ్యమైనది
అమ్మ అనురాగం..
భార్య ప్రేమ..
పిల్లల ముద్దు ముచ్చట్లు..
ఆత్మీయుల అభిమానం..
వాటికీ మనం దూరంగా
బతుకు తున్నాం.
ఈ బంగారు నాణేలు మన జేబులో తగినన్ని వుండాలి..
ఈ బంగారు ముచ్చట్లు గుండె అంతా నిండాలి.
మనసంటూ ఉన్నవారందరూ స్పందించే ఉదంతం.

ఇది
కథ కాదు సుమా యథార్థ జీవిత చిత్రం.

*శ్రీమద్ భాగవతం - ప్రథమ స్కంధము* SRIMADBHAGAVATHAM FIRST SKANDA

*శ్రీమద్ భాగవతం - ప్రథమ స్కంధము*

*కృష్ణ నిర్యాణంబు వినుట*

*1-366-సీ.సీస పద్యము*

పందికై పోరాడ ఫాలాక్షుఁ డెవ్వని;
బలమున నా కిచ్చెఁ బాశుపతము?
నెవ్వని లావున నిమ్మేన దేవేంద్రు;
పీఠార్థమున నుండ బెంపుఁ గంటిఁ?
గాలకేయ నివాత కవచాదిదైత్యులఁ;
జంపితి నెవ్వని సంస్మరించి?
గోగ్రహణము నాఁడు కురుకులాంభోనిధిఁ;
గడచితి నెవ్వని కరుణఁ జేసి?

*1-366.1-ఆ.*

కర్ణ సింధురాజ కౌరవేంద్రాదుల
తలలపాగ లెల్లఁ దడవి తెచ్చి
యే మహాత్ము బలిమి నిచ్చితి విరటుని
పుత్రి యడుగ బొమ్మపొత్తికలకు?

*భావం:*

అన్నా! ఆ నాడు వరాహం కోసం సాగిన సమరంలో ఫాలనేత్రుని వల్ల పాశుపత మహాస్త్రాన్ని ఆయన దయవల్లనే కదా అందుకొన్నాను. త్రిలోకాధిశుడైన దేవేంద్రుని అర్ధసింహాసనాన్ని అయన అనుగ్రహం వల్లనే కదా అధిష్ఠింప గలిగాను. కాలకేయుడు, నివాతకవచుడు మొదలైన రాక్షసులను ఆ మహనీయుని బలం వల్లే కదా పరిమార్చాను. ఉత్తర గోగ్రహణ సందర్భంలో పొంగి వచ్చిన కౌరవ సేవావాహినిని ఆయన కరుణాకటాక్షం వల్లనే కదా దాటగలిగాను. ఆనాడు బొమ్మ పొత్తికలను తెమ్మని ఉత్తర అడిగితే కర్ణ సైంధవ సుయోధనాదుల పట్టుకుచ్చుల తలపాగలు కోసి తెచ్చి ఆమె ముద్దు చెల్లించగలిగింది. ఆ పరమ పురుషుని దయవల్లనే కదా.

Yes, she has gained weight? Defeated without losing a bout.

అవును, ఆమె కొంచెం బరువు పెరిగే వుంటుంది. ఎందుకంటే…. ఆటల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే నిండైన ఆత్మాభిమానాన్ని, విశ్వ వేదికపైనే కాదు వ...