Thursday, October 31, 2019

మానవుని జీవితంలో ఉండవలసిన 9 రహస్యాల NINE MYSTERIOUS FACTS IN THE LIFE OF MAN

🌹🙏మానవుని జీవితంలో ఉండవలసిన 9 రహస్యాలు 🌹🙏

ఆయువు, విత్తము, ఇంటిగుట్టు, మంత్రం, ఔషధం, సంగమం, దానం, మానము, అవమానం* అనే ఈ తొమ్మిదింటిని నవగోప్యాలు అంటారు. ఇవి రహస్యంగా ఉంచాల్సినవి. భగవంతుడు అన్ని జంతువులకు ఇచ్చినట్లు శరీరం ఇచ్చినప్పటికీ వివేకము బుద్ధి జ్ఞానముఅనే గొప్ప గుణం మనిషికి ఇచ్చాడు. అలాగే నిన్న జరిగిన విషయం గుర్తుకుతెచ్చుకుంటే తప్ప గుర్తుకురాదు. ఇపుడు జరుగుతున్నది ఆలోచిస్తే తప్ప అర్థం కాదు. రేపు జరుగబోయేది ఏం చేసినా తెలియదు. ఈమూడు కారణాలవల్ల మనిషి పిచ్చెక్కకుండా సుఖంగా ఉండగలుగుతున్నాడు. మరుక్షణంలో మనిషి ఛస్తాడని తెలిస్తే ముందు క్షణమే ఆలోచనతో చావడం ఖాయం. ఆలోచన అంత భయంకరంగా ఉంటుంది. నిజంగా నీ ఆయుఃప్రమాణం ఇదీ అని తెలిసినా, నిబ్బరంగా ఉండి, దాన్ని రహస్యంగా ఉంచాలి. లేకుంటే అది బహిరంగ రహస్యమై వాడిని బాధిస్తుంది. కాబట్టి భవిష్యత్తు జ్ఞానంలో ఆయుష్షుది ప్రధాన పాత్ర. అది తెలిసినా గోప్యంగా ఉంచమన్నాడు శాస్తక్రారుడు. ధనం ఎంత ఉన్నా రహస్యంగా ఉంచాలి. 🌹ధనం ఇదం మూలం జగత్🌹 దానివల్లఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఎంత ధనం ఉన్నా మన జీవన విధానం క్రమబద్ధంగా, క్రమశిక్షణతో ఉన్నపుడు మనకు నష్టం జరుగదు. ‘లక్షాధికారైనా లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మ్రింగబోడు’ అన్నట్లు నిరాడంబర జీవనం గడపడానికి అలవాటు చేసుకోవాలి. ధనం ఉప్పులాంటిది. అది ఎక్కువైనా, తక్కువైనా రెండూ కష్టమే. ‘అతి సంచయేచ్ఛ తగదు’ అన్న నీతి  🌙చంద్రిక వాక్యం🌙 ధనం విషయంలో నూటికి నూరుపాళ్ళు నిజం. అయినా మన దగ్గర ఉన్నవిషయం అనవసరంగా బయటకు వెల్లడించడం ప్రమాదకరం. ధనానికి ధర్మం, రాజు, అగ్ని, దొంగ అనే నలుగురు వారసులు. ఇందులో పెద్దవారసుడు ధర్మం. అతడు నలుగురికీ అన్న. తండ్రి ధనంలో పెద్దన్నకు పెద్ద వాటా రావాలి. అంటే ధర్మానికి డబ్బు ఎక్కువ వినియోగించాలి. ధర్మకార్యాలకు ధనం వినియోగించకపోతే పన్నుల మూలకంగా రాజు (ప్రభుత్వం) దాన్ని స్వాధీన పరచుకోవడమో, అగ్ని ప్రమాదాలవల్ల నష్టమో, దొంగలు దోచుకోవడమో జరుగుతుంది. ఇంట్లో ఎన్నో సమస్యలుంటాయి. దాన్ని (ఇంటిగుట్టు) అని పిలుస్తారు. కుటుంబంలో ప్రేమ పూర్వక వాతావరణం నిర్మాణం చేయాలి. అప్పుడప్పుడు ఆ ప్రేమలకు అవరోధం ఏర్పడి కలహాలు సంభవిస్తూంటాయి. వాటిలో రహస్యాలను బహిరంగం చేయాలనుకోవడం తెలివితక్కువ పని. సామరస్యంగా పరిష్కారం కనుక్కోవడం తెలివైన పని. తండ్రి- కొడుకు, భార్య భర్త, అన్నదమ్ములు, అక్కాచెలెళ్ల మధ్య గొడవలు వస్తుంటాయి. వ్యక్తిగత అహంకారాలు, ఒంటరిగా జీవించాలనుకొనే స్వార్థబుద్ధి, మా వరకే మంచిగా వుండాలనే వ్యక్తిత్వం- ఇవన్నీ ఈరోజు మన కుటుంబ వ్యవస్థను ధ్వంసం చేశాయి. ఏది జరిగినా ఇంటి గుట్టును ఈశ్వరునికే తెలిసేటట్లు ఉంచాలిగాని బహిరంగపర్చడం ధర్మంకాదు. అలా చేయడం వల్ల కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి తస్మాత్

No comments:

Post a Comment

Yes, she has gained weight? Defeated without losing a bout.

అవును, ఆమె కొంచెం బరువు పెరిగే వుంటుంది. ఎందుకంటే…. ఆటల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే నిండైన ఆత్మాభిమానాన్ని, విశ్వ వేదికపైనే కాదు వ...