Tuesday, October 22, 2019

OLDEN DAYS - THE GOLDEN DAYS

One minute....

  ఇది కధ ( మని(షు)ల కధ )
---------------------------------------------------
ఒక ఇంట్లో 80 సంవత్సరాలు వయసున్న తండ్రి, 45 సంవత్సరాల వయసున్న కొడుకు ఉన్నారు. ఒక రోజు ఇద్దరూ సోఫాలో కూర్చొని ఉండగా ఒక కాకి వచ్చి వాళ్ళ ఇంటి కిటికీ మీద వాలింది.
అది ఏమిటి? అని తండ్రి, కొడుకుని అడిగాడు.
కాకి అని చెప్పేడు కొడుకు.
మళ్ళీ కొన్ని నిమిషాల తరవాత అది ఏమిటి? అని అడిగాడు తండ్రి
ఇప్పుడే కదా కాకి అని చెప్పేను అన్నాడు కొడుకు.
మళ్ళీ కొన్ని నిమిషాల తరవాత అది ఏమిటి? అని అడిగాడు తండ్రి.
కొడుకు మొహం చిట్లించుకుని అసహనంతో " అది కాకి, కాకి " అని గట్టిగా చెప్పేడు.
మళ్ళీ కొన్ని నిమిషాల తరవాత అది ఏమిటి? అని అడిగాడు తండ్రి.
కొడుకు గట్టిగా అరుస్తూ ఇలా అన్నాడు" ఎందుకు నాన్నా ఒకటే ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడుగుతావు. అది కాకి అని 4సార్లు చెప్పేను, అర్థంకావట్లేదా"
కొంచంసేపటి తరవాత తండ్రి గదిలోకి వెళ్ళి ఒక డైరీ తెచ్చాడు. కొడుకు చిన్నప్పటి విషయాలు అన్నీ అందులో ఉన్నాయి. ఒక పేజి తీసి చదవమని కొడుకు చేతికి ఇచ్చ్హాడు.అందులో ఈ విధంగా రాసి ఉంది.
"ఇవాళ నా మూడేళ్ళ కొడుకు నాతోపాటు సోఫాలో కూర్చున్నాడు. ఒక కాకి వచ్చి కిటికీ మీద వాలింది. అది ఏమిటి నాన్నా? అని వాడు 23సార్లు అడిగాడు.ప్రతిసారీ నేను ప్రేమతో వాడిని దగ్గరికి తీసుకుని కాకి అని చెప్పేను. వాడు అన్నిసార్లు అడిగినా నాకు కోపం రాలేదు, పైగా వాడి అమాయకత్వానికి నవ్వు వచ్చింది.".....ఇది తండ్రి మనస్సు
కొడుకు చిన్నప్పుడు ఎన్నిసార్లు అడిగినా తండ్రి ఓపికగా అర్థమయ్యేలా చెప్పేడు. ఇవాళ అదే తండ్రి ముసలివాడు అవ్వడంవల్ల 4సార్లు అడిగితే కొడుకు విసుక్కుంటున్నాడు.......
తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని పెంచి పెద్దచేస్తారు. వాళు ముసలివాళ్ళు అయ్యాక విసుక్కోవడం, చులకనగా చూడడం చెయ్యకూడదు. వాళ్ళు పంచిన ప్రేమని, వాళ్ళు పడిన కష్టాన్ని గుర్తుపెట్టుకుని వాళ్ళ పట్ల కృతజ్ఞతగా ఉండడం పిల్లల బాధ్యత.... పిల్లలే శాశ్వతమని ఆశలు పెట్టుకుంటారు ప్రతి తండ్రి.....బిడ్డ ఎదుగుతుంటే ...పట్టరాని సంతోషం పడతాడు తండ్రి ...ఆ ప్రేమను వెలకట్టలేము ఇది నిజం... కాదంటారా.
1960 - 1990 మధ్యలో
మీరు పుట్టినవారే అయితే

ఇది
మనకోసం..

వీధుల్లో ఆటలాడి, నేర్చుకున్నది
మనదే చివరి తరం.

పోలీస్ వాళ్ళని
నిక్కర్లలో చూసిన
తరమూ మనదే.

స్కూల్ కి నడుచుకుంటూ, మధ్యలో స్నేహితులని
కలుపుకొని, వారితో నడుస్తూ వెళ్ళిన వాళ్ళం కూడా మనమే

చాలా దూరం అయితే
సైకిళ్ళ మీద వచ్చేవాళ్ళు

స్కూళ్ళలో టీకాలు ఇప్పించుకున్న తరమూ మనదే.

మనమే మొదటగా వీడియో గేములు ఆడటం.
కార్టూన్స్ ని రంగులలో చూడటం.

అమ్యూజ్ మెంట్ పార్కులకి
వెళ్లటం.

రేడియోలలో వచ్చే పాటలని టేప్ క్యాసెట్లలో రికార్డింగ్
చేసినవాళ్ళం.

అలాగే
వాక్ మ్యాన్ తగిలించుకొని
పాటలు వినేవాళ్ళం.

VCR ని ఎలా వాడాలో తెలుసుకొని
వాడిన తరం మనదే..

అలాగే
కార్లో సీట్ బెల్ట్స్ పెట్టుకోకుండా ప్రయాణించిన
తరం కూడా మనదే.

అలాగే ఎయిర్ బ్యాగ్స్ లేకుండా ప్రయాణించిన తరం కూడా మనదే.

సెల్ ఫోన్స్ లేకుండా మామూలు ఫోన్స్ తో రోజులని వెళ్ళదీశాం..

సైకిల్లకి బ్రేకులు లేకుండా
రోడ్డు మీద ప్రయాణించిన
ఆ రోజులు మనవే.

మన వద్ద ఫోన్స్ లేకున్నా అందరితో టచ్ లో ఉండేవాళ్ళం.

స్కూల్ కి
కాళ్ళకి చెప్పులు లేకుండా, స్కూల్ బ్యాగ్ లేకుండా,
జుట్టు కూడా దువ్వుకోకుండా
మామూలు బట్టలతో వెళ్ళాం

ఇప్పటి తరం
అలా ఎన్నడూ వెళ్ళలేదు

స్కూల్ లో బెత్తం తో దెబ్బలు తినేవాళ్ళం.

స్నేహితుల మధ్య
" కాకి ఎంగిలి " చేసుకొని, ఎన్నో తినుబండారాలు పంచుకోనేవాళ్ళం.

ఎవరూ
ఆస్తులు, అంతస్థులు చూడకుండా
స్కూల్ కి వెళ్ళేవాళ్ళం,

చెరువు గట్ల వెంట,
కాలవల్లో స్నానాలు చేసేవాళ్ళం.

జాతరలలో దుమ్ము దుమ్ము ఉన్నా అన్నీ తినేవాళ్ళం.

సాయంత్రం వేల ఉప్పుడు బేరలు, అష్ట చెమ్మ. వెన్నెల
కుప్పలు ఆడిన తరము మనదే.

శుక్రవారం సాయంత్రం
" చిత్రల హరి" కోసం
ముందు గానే స్నానం చేసి వచ్చి కూర్చున్న తరమూ మనదే

ఆదివారం ఉదయం
9 కి పనులు
తప్పించుకుని
"మహాభారతము"
" రామాయణం"
" శ్రీకృష్ణ" చూసిన
తరమూ మనదే...

ఉషశ్రీ గారి
భారత రామాయణ ఇతిహాసాలు
రేడియోలో విన్నది మనమే,

అమ్మ ఇచ్చిన పదిపపైసల్ని అపురూపంగా
చూసుకున్న ఘనతా మనదే ..

ఆదివారం ఒక గంట
అద్దె సైకిల్ కోసం
రెండు గంటలు వేచి ఉన్నది మనమే...

పలకలని వాడిన
ఆఖరు తరం కూడా మనదే.

రుపయికు
థియేటర్ లో సినిమా చూడడానికి
రెండు కిలోమీటర్ లు
నడిచిన కాలం..

గొడుగులు లేక సంచులని కప్పుకుని బడికి పోయిన
కాలం..
మనమే.. మనమే
అమ్మ 5 పైసలు ఇస్తే
బఠానీలు తిన్నదీ మనమే..

గోర్లపైన కొంగ గోరు గుర్తులు
చువ్వాట..
సిర్రగోనే ఆట..
కోతి కొమ్మ...
అష్ట చెమ్మ...
ఆడిన
తరము మనదే.

క్యాలిక్యులెటర్స్ వాడకుండా లెక్కలనీ,
కనీసం 20 ఫోన్
నంబర్స్ ని గుర్తుంచుకొన్న తరమూ మనదే.

ఉత్తరాలని వ్రాసుకొని, అందుకున్న తరమూ మనదే..

మన వద్ద అప్పుడు ప్లే స్టేషన్, 200+ ఛానల్స్ టీవీ,
ఫ్లాట్ స్క్రీన్స్,
సరౌండ్ సౌండ్స్,
MP3, ఐ ప్యాడ్స్,
కంప్యూటర్స్,
బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్...
లేకున్నా
అంతులేని ఆనందాన్ని పొందాం.

మన పిల్లలకు అవి తెలియదు
మన పెద్దలకు ఇవి తెలియదు
కానీ
మనం అవి ఇవి చూశాం

ఆ ఆనందం మరెన్నడూ తిరిగిరాదు.
🍓🍑🍐🍌🍍🍉🍊🍏🥝🥔🍆🥥🍅🍇🍈🍉🍊🥥🍋🍏😆

,  
,

No comments:

Post a Comment

Yes, she has gained weight? Defeated without losing a bout.

అవును, ఆమె కొంచెం బరువు పెరిగే వుంటుంది. ఎందుకంటే…. ఆటల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే నిండైన ఆత్మాభిమానాన్ని, విశ్వ వేదికపైనే కాదు వ...