Wednesday, January 25, 2023

సంక్రాంతి అంటే మారడం, చేరడం అని అర్థం. 'త మేషాదిషు ద్వాదశ రాశిషు క్రమేణ సంచరతః సూర్యస్య పూర్వ స్మాద్రాశే ఉత్తరరాశా సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః' సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు సంచరిస్తూ క్రమంగా పూర్వరాశి నుండి ఉత్తరాభిముఖంగా ప్రవేశించినప్పుడు సంక్రాంతి అవుతుంది.

🚩🚩🚩🚩🚩🚩🚩🙏🏻

*పుణ్యకాలం ప్రారంభం*

సంక్రాంతి అంటే మారడం, చేరడం అని అర్థం. 'త మేషాదిషు ద్వాదశ రాశిషు క్రమేణ సంచరతః సూర్యస్య పూర్వ స్మాద్రాశే ఉత్తరరాశా సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః' సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు సంచరిస్తూ క్రమంగా పూర్వరాశి నుండి ఉత్తరాభిముఖంగా ప్రవేశించినప్పుడు సంక్రాంతి అవుతుంది.

కర్కాటకం నుండి మకర సంక్రాంతి వరకు సూర్యుడు దక్షిణాభిముఖంగా సంచరించడం వల్ల ఈ కాలాన్ని 'దక్షిణా యనమ'ని అంటారు. మకర సంక్రాంతి నుండి కర్కాటక సంక్రాంతి వరకు సూర్యుడు ఉత్తరాభిముఖుడై సంచరించడం వల్ల ఈ కాలాన్ని 'ఉత్తరాయణమ'ని అంటారు.

దేవతలకు ఉత్తరాయణం ఉత్తమకాలమనీ, దక్షిణాయనం పితృదేవతలకు ముఖ్యకాలమనీ భావిస్తారు. ఉత్తరాయణంలో మరణిస్తే మోక్షప్రాప్తి కలుగుతుందని అంటారు. అందుకే అంపశయ్యపై భీష్మాచార్యుడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు వేచి ఉన్నాడని మహాభారతం చెబుతోంది.

1. సంక్రమణం నాడు ఇంటి ముంగిట అలికి, రంగు రంగుల పిండితో ముగ్గులు పెట్టి, గోమయంతో గొబ్బిళ్ళు చేసి, వాటిలో రంగు రంగుల పూలనూ, నూలు బియ్యాన్నీ, రేగుపండ్లను పెట్టి ఇళ్ళను అలంకరించుకుంటారు.

2. సంక్రాంతి పండుగనాడు నానావిధాలైన కూర అన్నింటిని కలిపి వండుతారు. ఆ రోజు బ్రాహ్మణులకు కూర గాయలనూ, ధాన్యాన్నీ, దక్షిణనూ ఇస్తారు.

3. నిత్యకృత్యాలు పూర్తి చేసుకుని, సూర్యుడికి అర్ఘ్య ప్రదానం చేసి, పుష్పాలు సమర్పించి, అంజలి ఘటించి, గాయత్రీ మంత్రం జపిస్తూ, సద్బుద్ధి, జ్ఞానం, ఉత్సాహభరితమైన, ఆరోగ్యవంతమైన జీవితం ప్రసాదించాల్సిందిగా ప్రార్థించాలి.

4. పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. పూర్వజుల మొక్కు బడులూ, ఆశయాలూ, ఆశలూ, ప్రతిజ్ఞలూ తీర్చాలి.

5. నువ్వుపప్పు, బెల్లం కలిపి, 'లడ్డూ'లు తయారు చేసి, బంధుమిత్రులకు పంచిపెట్టాలి. అలా చేయడం వల్ల సంకుచిత మైన భావాలు పోయి, అందరితో సత్సంబంధాలు ఏర్పడతాయి.

6. సంక్రాంతి శీతకాలంలో వస్తుంది. కాబట్టి ఈనాడు ఉష్ణాన్నిచ్చే నువ్వులు, నెయ్యి, కంబళ్ళు పేదలకు దానం చేయడం పుణ్యదాయకం.

No comments:

Post a Comment

Jai Shri Krishna

Excellent information about Bhagwan Shri Krishna: 1) Krishna was born *5252 years ago*  2) Date of *Birth* : *18th July,3228 B.C* 3) Month ...