Wednesday, January 20, 2021

*నుదుటన..బొట్టు పెట్టుకోకపోతేఏమవుతుందో..తెలుసుకోండి..* 🕉️🌞🌎🏵️🌼🚩

*నుదుటన..బొట్టు పెట్టుకోకపోతేఏమవుతుందో..తెలుసుకోండి..* 
🕉️🌞🌎🏵️🌼🚩

 *మన హైందవ ధర్మంలో ముఖాన బొట్టుకి విశేషమైనటు వంటి ప్రాధాన్యత ఉంది.* 

బొట్టులేని ముఖము,..ముగ్గులేని ఇల్లు.
అంటే బొట్టు ఎవరైతే పెట్టుకోరో వారి యొక్క ముఖము,
ఇంటి ముందు ఎవరైతే ముగ్గు వేయరో ఆ ఇల్లు..
రెండూ కూడా స్మశానంతో సమానం..
అని పెద్దలు చెబుతూ ఉంటారు.

కాబట్టి ఇంటిముందు ముగ్గు లేకపోతే 
దరిద్ర దేవత ఏ విధంగా ఇంట్లో తాండవం చేస్తుందో 
అదే విధంగా ముఖాన బొట్టు పెట్టుకోకపోతే ఆ ముఖంలో శనిదేవుడు,..దరిద్రదేవత తాండవం చేస్తాయి...అని 
పెద్దలు చెబుతూ ఉంటారు.

ఎందుకంటే శనీశ్వరుడు మరియు దరిద్రదేవతగా పిలువబడే జ్యేష్టదేవి ఇద్దరూ భార్యా భర్తలే.
కాబట్టి ఒకరు ఉంటే రెండోవారు కూడా ఖచ్చితంగా ఉంటారు.

అదేవిధంగా లక్ష్మీదేవి ఉంటే నారాయణుడు ఉంటాడు.
వారిద్దరూ ఐశ్వర్యాన్ని కలిగిస్తారు.

కాబట్టి ముఖానికి బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి 
అని పెద్దలు చెబుతూ ఉంటారు.

ఎవరైనా మన ముఖాన్ని చూసినప్పుడు వారి యొక్క కంటి నుండి వచ్చేటటువంటి నకారాత్మక శక్తి అంటే నెగెటివ్ఎనర్జీ అంటారు..అది మనపై పడుతుంది..

నరుడు కంటి చూపుకి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని అంటూ ఉంటారు పెద్దలు, 
అలాగే ఎదురుగా ఉండేటటువంటి వారు..మన ముఖాన్ని చూస్తే వారి యొక్క చూపులో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ మన యొక్క కనుబొమ్మల రెండింటికీ మధ్యలో ఉండేటటువంటి స్థానంలో కేంద్రీకృతమవుతుంది.

మన శరీరంలో ఉండేటటువంటి నాడులలో కొన్ని సున్నితమైనటువంటి నాడులు రెండు కనుబొమ్మలకు మధ్యభాగంలో ఉంటాయి.

ఎప్పుడైతే దృష్టి మనమీద పడిందో.. అటువంటి సున్నితమైనటువంటి నాడులు ఒత్తిడికి గురవుతూ ఉంటాయి.

ఆ నాడులు ఒత్తిడికి లోనవటం వలన..💐
ఆ నాడులు మెదడుకు అనుసంధానమై ఉంటాయి.
అంటే మెదడుకు సంభందించినటు వంటి నాడులు 
మన ముఖములో కనబడుతాయి.
కాబట్టి ఆ మెదడు దెబ్బ తింటుంది.
మెదడు దెబ్బ తినడం అంటే మెదడు మీద ఒత్తిడి పెరుగుతుంది.
తద్వారా మనకు తలనొప్పి వస్తుంది.
మనఃశాంతి పోతుంది.
చిరాకు వస్తుంది.
ఏ విషయం పైన సరిగా దృష్టి పెట్టలేము.
కాబట్టి ఎదుటి వారి యొక్క కంటిచూపు నుండే
మన యొక్క మేధాశక్తిని కాపాడుకోవాలంటే..
మెదడును కాపాడుకోవాలంటే..
మనకు ఉన్నటువంటి పాజిటివ్ఎనర్జీని కాపాడుకోవాలంటే ఖచ్చితముగా వారి చూపులకు మన కనుబొమ్మల మధ్య భాగానికి మధ్య ఏదైనా అడ్డంగా పెట్టాలి.
అంటే బొట్టు పెడితే చాలు.
మనం బొట్టు పెట్టుకున్నామంటే ఎదురుగా ఉండేటటువంటి వారి యొక్క చూపు 
మన యొక్క నుదుట మీద పడినా కూడా మన సున్నితమైనటువంటి నాడులకు ప్రమాదం లేకుండా బొట్టు అడ్డుకుంటుంది.
తద్వారా మన యొక్క శక్తి మన దగ్గరే ఉంటుంది.

జ్ఞాపకశక్తి, మేధాశక్తి అన్నీ రకాలయినటువంటి విశేషమైనటువంటి శక్తులు మన దగ్గరే ఉంటాయి.
ఎటువంటి ఒత్తిడికి లోనూ కావు.
మనల్ని కాపాడుతూ ఉంటాయి.
మన యొక్క అభివృద్ధికి తోడ్పడతాయి.
అందుకని బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి.

సైంటిఫిక్ గా కూడా తప్పనిసరిగా సైన్సు ప్రకారం కూడా ఇది నిరూపించడం జరిగింది.

అందుకని ఎప్పుడైనా సరే చక్కగా బొట్టు పెట్టుకోండి.

ఋణ బాధలు ఉన్నటువంటివారు నాగసింధూరాన్ని
బొట్టుగా ధరించండి.
ఆ బొట్టు పెట్టుకోవడం వలన ఋణబాధలు అన్నీ 
కూడా తొలగిపోతాయి.

అదే విధంగా సర్పదోషాలు, నాగదోషాలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి.

ఎక్కువగా మనఃశాంతి లేక ఇంట్లో గొడవలు ఎక్కువగా అవుతున్నాయి అంటే ఆరావళి కుంకుమను బొట్టు పెట్టుకోండి.

పుణ్యస్త్రీలు మాత్రమే కాకుండా..
సౌభాగ్యవతులే కాకుండా..
మగవారే కాకుండా..
వైథవ్యం పొందినటువంటి స్త్రీలు కూడా..
కుంకుమను ధరించవచ్చు 
దానినే గంగసింధూరము అంటారు.
ఆంజనేయస్వామి వారి యొక్క బొట్టు అని కూడా అంటారు. 

ఆ బొట్టును వైదవ్యం పొందినటువంటి స్త్రీలు కూడా పెట్టుకోవచ్చు.
ఎటువంటి తప్పూ లేదు.
అందువల్ల చక్కగా కుంకుమను ధరించండి.

మన హైందవ ధర్మానికి పట్టుకొమ్మలు మన  ఆచారాలే.
ఆ ఆచారాలను కనుక మనం అనుసరిస్తే హైందవ ధర్మం యొక్క రక్షణను మనం పొందగలుగుతాము
దానితో పాటుగా మన యొక్క రక్షణను కూడా మనం పొందగలుగుతాము.

ఇవన్నీ కూడా పెద్దవారు మనకు ఏర్పాటు చేసినటువంటి బంగారుబాటలు.
అందుకని చక్కగా కుంకుమను ధరించండి.
 *మీ ఉన్నతిని కాపాడుకోండి..!* 
 *ఓం నమః శివాయ..!!🙏* 

 *సర్వేజనా..సుఖినోభవంతు..💐* 

    *💐శ్రీ మాత్రే నమః💐🚩*

No comments:

Post a Comment

Jamalapuram Sri Venkateswara Swamy Temple జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం Telangana Tirupati, Khammam District

The road access to the temple is very good, and you can easily reach it in your own vehicle. Parking is not a concern as you can park comfor...