Friday, December 25, 2020

*వైకుంఠ ఏకాదశీ మాహాత్మ్యం* *విధి* *విధానాలు*

*వైకుంఠ ఏకాదశీ మాహాత్మ్యం*  *విధి* *విధానాలు* 

🕉️సనక, సనందనాదులు భూలోకంలో మనుష్యులు తరించే ఉపాయం తెలియజేయమని శ్రీ మహావిష్ణువు ని కోరడం.

🕉️శ్రీ మహావిష్ణువుని ఉత్తర ద్వారం వైపు దర్శింపచేసే ఏకైక తిథి.

🕉️ఏకాదశీ వ్రతం కోసం తన సంతానాన్నే త్యాగం చేసిన గొప్ప భక్తుడి గాథ.

🕉️ఏకాదశీ తిథినాడు కటిక ఉపవాసం కూడా దోషం అని స్వయంగా శివుడు చెప్పిన ఒకానొక సందర్భం.

🕉️ఏకాదశీ తిథి ఉన్న రోజు శ్రీ మహాలక్ష్మి ని ఎఱ్ఱని, లేక పసుపు పచ్చని పువ్వులతో పూజించడం వల్ల కటిక దారిద్ర్యం తొలగుతుంది.

🕉️ఏకాదశీ తిథి ఉన్న రోజున ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువుని దర్శించలేని వారు అంతటి ఫలితాన్ని పొందే గొప్ప మార్గం ఆ రోజు గురువులను దర్శించడం వల్ల పొందవచ్చు.

Thursday, December 17, 2020

*శ్రీ గోదా అష్టోత్తర శతనామావళి*_

_*శ్రీ గోదా అష్టోత్తర శతనామావళి*_

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉



01 ఓం శ్రీరంగనాయక్యై నమః
02 ఓం గోదాయై నమః
03 ఓం విష్ణుచిత్తాత్మజాయై నమః
04 ఓం సత్యై నమః
05 ఓం గోపీవేషధరాయై నమః
06 ఓం దేవ్యై నమః
07 ఓం భూసుతాయై నమః
08 ఓం భోగశాలిన్యై నమః
09 ఓం తులసీకాననోద్భుతాయై నమః
10 ఓం శ్రీయై నమః
11 ఓం ధన్విపురవాసిన్యై నమః
12 ఓం భట్టనాధ ప్రియకర్యై నమః
13 ఓం శ్రీకృష్ణ హితభోగిన్యై నమః
14 ఓం అమూక్త మాల్యదాయై నమః
15 ఓం బాలాయై నమః
16 ఓం రంగనాథ ప్రియాయై నమః
17 ఓం పరాయై నమః
18 ఓం విశ్వంభరాయై నమః
19 ఓం కలాలాపాయై నమః
20 ఓం యతిరాజసహోదర్యై నమః
21 ఓం కృష్ణానురక్తాయై నమః
22 ఓం సుభగాయై నమః
23 ఓం సులభశ్రియై నమః
24 ఓం సలక్షణాయై నమః
25 ఓం లక్ష్మీప్రియసఖ్యై నమః
26 ఓం శ్యామాయై నమః
27 ఓం దయాంచిత దృగంచలాయై నమః
28 ఓం ఫల్గున్యావిర్భవాయై నమః
29 ఓం రమ్యాయై నమః
30 ఓం ధనుర్మాసకృత వ్రతాయై నమః
31 ఓం చంపకాశోకపున్నాగమాలతీవిలసత్కచాయై మనః
32 ఓం ఆకారత్రయసంపన్నాయై మనః
33 ఓం నారాయణసమాశ్రితాయై మనః
34 ఓం శ్రీమదష్టాక్షరీమంత్రరాజస్థితమనోరథాయై మనః
35 ఓం మోక్షప్రదాననిపుణాయై మనః
36 ఓం మంత్రరత్నాధిదేవతాయై మనః
37 ఓం బ్రహ్మణ్యాయై మనః
38 ఓం లోకజనన్యై మనః
39 ఓం లీలామానుషరూపిణ్యై మనః
40 ఓం బ్రహ్మజ్ఞాయై మనః
41 ఓం అనుగ్రహాయై నమః
42 ఓం మాయాయై నమః
43 ఓం సచ్చిదానందవిగ్రహాయై నమః
44 ఓం మహాపతివ్రతాయై నమః
45 ఓం విష్ణుగుణకీర్తనలోలుపాయై నమః
46 ఓం ప్రపన్నార్తిహరాయై నమః
47 ఓం నిత్యాయై నమః
48 ఓం వేదసౌధవిహారిణ్యై నమః
49 ఓం శ్రీరంగనాధమాణిక్యమంజర్యై నమః
50 ఓం మంజుభాషిణ్యై నమః
51 ఓం సుగంధార్థ గ్రంధకర్యై నమః
52 ఓం రంగమంగళ దీపికాయై నమః
53 ఓం ధ్వజవజ్రాంకుశాబ్జాంకమృదుపాదతలాంచితాయై నమః
54 ఓం తారకాకారనఖరాయై నమః
55 ఓం ప్రవాళమృదులాంగుళ్యై నమః 
56 ఓం కూర్మోపమేయపాదోర్ధ్వభాగాయై నమః
57 ఓం శోభనపార్షికాయై నమః
58 ఓం వేదార్థభావవిదిత తత్వభోధాంఘ్రి పంకజాయై నమః
59 ఓం ఆనందబుద్భుదాకార సుగుల్భాయై నమః
60 ఓం పరమాయై నమః
61 ఓం అణుకాయై నమః
62 ఓం తేజశ్శ్రియోజ్జ్వలధృతపాదాంగుళి సుభూషితాయై నమః
63 ఓం మీన కేతనతూణీర చారుజంఘావిరాజితాయై నమః
64 ఓం కకుద్వజ్జానుయుగ్మాఢ్యాయై నమః
65 ఓం స్వర్ణ రంభాభ సక్థికాయై నమః
66 ఓం విశాలజఘనాయై నమః 
67 ఓం పీనసుశ్రోణ్యై నమః
68 ఓం మణిమేఖలాయై నమః
69 ఓం ఆనందసాగరావర్త గంభీరాంభోజనాభికాయై నమః
70 ఓం భాస్వద్వళిత్రికాయై నమః
71 ఓం చారుజగత్పూర్ణమహోదర్యై నమః
72 ఓం నవమల్లీరోమరాజ్యై నమః
73 ఓం సుధాకుంభాయితస్తన్యై నమః
74 ఓం కల్పమాలానిభభుజాయై నమః
75 ఓం చంద్రఖండనఖాంచితాయై నమః
76 ఓం సుప్రవాళాహ్నాంగులి న్యస్త మహారత్నాంగుళీయకాయై నమః
77 ఓం నవారుణ ప్రవాళాభపాణిదేశ సమంచితాయై నమః
78 ఓం కంబుకంఠ్యై నమః
79 ఓం సుచుబుకాయై నమః
80 ఓం బింబోష్ఠ్యై నమః
81 ఓం కుందదంతయుజే నమః
82 ఓం కారుణ్యరసనిష్యంది నేత్రద్వయ సుశోభితాయై నమః
83 ఓం ముక్తాశుచిస్మితాయై నమః
84 ఓం చారుచాంపేయనిభనాస్తికాయై నమః
85 ఓం దర్పణాకార విపుల కపోల ద్వితయాంచితాయై నమః
86 ఓం అనంతార్క ప్రకాశోద్యన్మణితాటంకశోభితాయై నమః
87 ఓం కోటి సూర్యాగ్ని సంకాశ నానాభూషణ భూషితాయై నమః
88 ఓం సుగంధ వదనాయై నమః
89 ఓం సుభ్రువే నమః
90 ఓం అర్థచంద్రలలాటికాయై నమః
91 ఓం పూర్ణచంద్రాననాయై నమః
92 ఓం నీలకుటిలాలక శోభితాయై నమః
93 ఓం సౌందర్యసీమాయై నమః
94 ఓం విలసత్కస్తూరీ తిలకోజ్జ్వలాయై నమః
95 ఓం ధగధ్ధగాయమానోద్యన్మణిసీమంత భూషణాయై నమః
96 ఓం జజ్జ్వల్యమానసద్రత్న దివ్యచూడావతంసకాయై నమః
97 ఓం సూర్యార్థచంద్రవిలసద్భూషణాంచిత వేణికాయై నమః
98 ఓం అత్యర్కానలతేజోధిమణికంచుకధారిణ్యై నమః
99 ఓం నిగన్నిగద్రత్నపుంజ ప్రాంతస్వర్ణ నిచోళికాయై నమః
100 ఓం సద్రత్నాంచితవిద్యోతవిద్యుత్కుంజాభ శాటికాయై నమః
101 ఓం నానామణిగణాకీర్ణ హేమాంగద సుభూషితాయై నమః
102 ఓం కుంకుమాగరు కస్తూరీ దివ్యచందన చర్చితాయై నమః
103 ఓం స్వోచితౌజ్జ్వల్య వివిధ విచిత్ర మణిహారిణ్యై నమః
104 ఓం అసంఖ్యేయసుఖస్పర్శ సర్వాతిశయ భూషణాయై నమః
105 ఓం మల్లికాపారిజాతాది దివ్యపుష్పస్రగంచితాయై నమః
106 ఓం శ్రీరంగనిలయాయై నమః
107 ఓం పూజ్యాయై నమః
108 ఓం దివ్యదేశ సుశోభితాయై నమః

ఓం శ్రీరంగనాయక్యై నమః
ఓం శ్రీమహాలక్శ్మై నమః
ఓం శ్రీభూదేవ్యై నమః
ఓం శ్రీనీళాదేవ్యై నమః
ఓం శ్రీగోదాదేవ్యై నమః
ఓం శ్రీఅనంతాయ నమః
ఓం శ్రీగరుడాయ నమః
ఓం శ్రీమతే విష్వక్సేనాయ నమః
ఓం శ్రీపరాంకుశాయ నమః
ఓం శ్రీమతే రామానుజాయ నమః
ఓం శ్రీమద్వరవరమునయే నమః
ఓం స్వాచార్యేభ్యో నమః
ఓం పూర్వాచార్యేభ్యో నమః
ఓం సమస్తపరివార సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః
*_శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి_*



🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉



01 ఓం శ్రీకృష్ణాయ నమః
02 ఓం కమలానాథాయ నమః
03 ఓం వాసుదేవాయ నమః
04 ఓం సనాతనాయ నమః
05 ఓం వసుదేవాత్మజాయ నమః
06 ఓం పుణ్యాయ నమః
07 ఓం లీలామానుషవిగ్రహాయ నమః
08 ఓం శ్రీవత్సకౌస్తుభధరాయ నమః
09 ఓం యశోదావత్సలాయ నమః
10 ఓం హరయే నమః
11 ఓం చతుర్భుజాత్తచక్రాసిగదాశార్ ఙ్గద్యాయుధాయ నమః
12 ఓం దేవకీనందనాయ నమః
13 ఓం శ్రీశాయ నమః
14 ఓం నందగోపప్రియాత్మజాయ నమః
15 ఓం యమునావేగ సంహారిణే నమః
16 ఓం బలభద్రప్రియానుజాయ నమః
17 ఓం పూతనాజీవిత హరాయ నమః
18 ఓం శకటాసురభంజనాయ నమః
19 ఓం నందవ్రజ జనానందినే నమః
10 ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః
21 ఓం నవనీత విలిప్తాంగాయ నమః
22 ఓం నవనీతనటాయ నమః
23 ఓం అనఘాయ నమః
24 ఓం నవనీతనవాహారాయ నమః
25 ఓం ముచికుందప్రసాదకాయ నమః
26 ఓం షోడశస్త్రీసహస్రేశాయ నమః
27 ఓం త్రిభంగినే నమః
28 ఓం మధురాకృతయే నమః
29 ఓం శుకవాగమృతాబ్దీందవే నమః
30 ఓం గోవిందాయ నమః
31 ఓం యోగినాంపతయే నమః
32 ఓం వత్సవాటచరాయ నమః
33 ఓం అనంతాయ నమః
34 ఓం ధేనుకాసురభంజనాయ నమః
35 ఓం తృణీకృతతృణావర్తాయ నమః
36 ఓం యమళార్జునభంజనాయ నమః
37 ఓం ఉత్తాలతాలభేత్రే నమః
38 ఓం తమాలశ్యామలాకృతయే నమః
39 ఓం గోపగోపీశ్వరాయ నమః
40 ఓం యోగినే నమః
41 ఓం కోటీసూర్యసమప్రభాయ నమః
42 ఓం ఇలాపతయే నమః
43 ఓం పరంజ్యోతిషే నమః
44 ఓం యాదవేంద్రాయ నమః
45 ఓం యదూద్వహాయ నమః
46 ఓం వనమాలినే నమః
47 ఓం పీతవాససే నమః
48 ఓం పారిజాతాపహారకాయ నమః
49 ఓం గోవర్దనాచలోద్ధర్త్రే నమః
50 ఓం గోపాలాయ నమః
51 ఓం సర్వపాలకాయ నమః
52 ఓం అజాయ నమః
53 ఓం నిరంజనాయ నమః
54 ఓం కామజనకాయ నమః
55 ఓం కంజలోచనాయ నమః
56 ఓం మధుఘ్నే నమః
57 ఓం మధురానాధాయ నమః
58 ఓం ద్వారకానాయకాయ నమః
59 ఓం బలినే నమః
60 ఓం బృదావనాంత సంచారిణే నమః
61 ఓం తులసీదామభూషణాయ నమః
62 ఓం శమంతకమణేర్హర్త్రే నమః
63 ఓం నరనారాయణాత్మకాయ నమః
64 ఓం కుబ్జాకృష్టాంబరధరాయ నమః
65 ఓం మాయినే నమః
66 ఓం పురమపురుషాయ నమః
67 ఓం ముష్టికాసుర చాణుర మల్ల యుద్ధ విశారదాయ నమః
68 ఓం సంసారవైరిణే నమః
69 ఓం కంసారయే నమః
70 ఓం మురారయే నమః
71 ఓం నరకాంతకాయ నమః
72 ఓం అనాదిబ్రహ్మచారిణే నమః
73 ఓం కృష్ణావ్యసనకర్శకాయ నమః
74 ఓం శిశుపాలశిరశ్ఛేత్రే నమః
75 ఓం దుర్యోధన కులాంతకాయ నమః
76 ఓం విదురాక్రూరవరదాయ నమః
77 ఓం విశ్వరూప ప్రదర్శకాయ నమః
78 ఓం సత్యవాచే నమః
79 ఓం సత్యసంకల్పాయ నమః
80 ఓం సత్యభామారతాయ నమః
81 ఓం జయినే నమః
82 ఓం సుభద్రాపూర్వజాయ నమః
83 ఓం విష్ణవే నమః
84 ఓం భీష్మముక్తిప్రదాయకాయ నమః
85 ఓం జగద్గురవే నమః
86 ఓం జగన్నాథాయ నమః
87 ఓం వేణూనాదవిశారదాయ నమః
88 ఓం వృషభాసుర విధ్వంసినే నమః
89 ఓం బాణాసుర కరాంతకాయ నమః
90 ఓం యుధిష్ఠిర ప్రతిష్ఠాత్రే నమః
91 ఓం బల్హి బర్హావ తంసకాయ నమః
92 ఓం పార్థసారథయే నమః
93 ఓం అవ్యక్తాయ నమః
94 ఓం గీతామృతమహోదధయే నమః
95 ఓం కాళీయ ఫణిమాణిక్య రంజిత శ్రీపదాంబుజాయ నమః
96 ఓం దామోదరాయ నమః
97 ఓం యజ్ఞభోక్త్రే నమః
98 ఓం దానవేంద్రవినాశకాయ నమః
99 ఓం నారాయణాయ నమః
100 ఓం పరస్మై బ్రహ్మణే నమః
101 ఓం పన్నగాశనవాహనాయ నమః
102 ఓం జలక్రీడాసమా సక్తగోపీ వస్త్రాపహారకాయ నమః
103 ఓం పుణ్యశ్లోకాయ నమః
104 ఓం తీర్థపాదాయ నమః
105 ఓం వేదవేద్యాయ నమః
106 ఓం దయానిధయే నమః
107 ఓం సర్వతీర్ధాత్మకాయ నమః
108 ఓం సర్వ గ్రహరూపిణే నమః
109 ఓం పరాత్పరాయ నమః

_*ఉత్పన్న ఏకాదశి*_కార్తీక పూర్ణిమ తర్వాత వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని *ఉత్పన్న ఏకాదశి* అంటారు,

*_నేటివిశేషం_*

           _*ఉత్పన్న ఏకాదశి*_
కార్తీక పూర్ణిమ తర్వాత వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని *ఉత్పన్న ఏకాదశి* అంటారు,

_ఈ ఉత్పన్న ఏకాదశి శ్రీమహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన తిధి అని పురాణ వచనం..._
ఉపవాసములు ఆచరించవలసిన ముఖ్యమైన ఏకాదశి ఈ ఉత్పన్న ఏకాదశి...
 శ్రీమహావిష్ణువు యొక్క శక్తి స్వరూపములను తెలిపే ఏకాదశులలో ఇది చాలా ప్రత్యేకమైనది...
ముర అనబడే రాక్షసుడిని శ్రీమహావిష్ణువు సంహరించే సందర్భంలో ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి రాక్షసుడైన మురను సంహరించింది, అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని నామధేయం చేశాడు. 
సప్తమాతృకలలో ఒక స్వరూపమైన వైష్ణవీదేవి విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి స్వరూపములలో ఒకటి. 
అందువల్ల ఉత్పన్న ఏకాదశి ని ఏకాదశి తిధి యొక్క జయంతిగా భావిస్తారు.

ఈరోజు ఉపవాసం తప్పనిసరిగా చేయవలెను అని చెబుతారు,
 ఉత్పన్న ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారి పాపములు హరించబడతాయని అంటారు,  
ముర అంటే తామసిక , రాజసిక , అరిషడ్వర్గాలకు ప్రతీక...
 ఈ రోజు ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును పూజించిన వారి ఆ మురను జయించి మిగతా 23 ఏకాదశులలో ఉపవాసం చేసిన ఫలితం కలిగి వైకుంఠప్రాప్తి పొందుతారని చెబుతారు...

*ఉత్పన్న ఏకాదశి యొక్క ప్రాముఖ్యత:*
ఉత్పన్న ఏకాదశి యొక్క గొప్పతనాన్ని శ్రీ కృష్ణుడు మరియు యుధిష్ఠిర రాజు మధ్య సంభాషణ రూపంలో *'భవవ్యోత్తర పురాణం'* వంటి వివిధ గ్రంథాలలో వర్ణించారు.
 'సంక్రాంతి' వంటి పవిత్ర రోజులలో విరాళాలు ఇవ్వడం లేదా తీర్థయాత్రలలో పవిత్ర స్నానం చేయడం వంటివి ఉత్పన్న ఏకాదశి యొక్క ప్రాముఖ్యత. 
ఉత్పన్న ఏకాదశి పాపాల నుండి విముక్తి పొంది మరియు చివరికి మోక్షాన్ని పొందుతారని భావిస్తారు. 
మరణం తరువాత 'వైకుంఠం' విష్ణువు నివాసానికి నేరుగా తీసుకువెళతారని నమ్మకం, 1000 ఆవులను దాతృత్వంగా దానం చేయడం కంటే ఉత్పన్న ఏకాదశి మహిమ ఇంకా ఎక్కువ అని నమ్ముతారు,

ఉత్పన్న ఏకాదశిలో  మూడు ప్రధాన దేవతలు బ్రహ్మ , విష్ణు , మరియు మహేశ్వరులకు ఉపవాసానికి సమానం,
 అందువల్ల భక్తులు ఉత్పన్న ఏకాదశి వ్రతాన్ని పూర్తి అంకితభావంతో , ఉత్సాహంగా పాటిస్తారు.

         *_🌹శుభమస్తు🌹_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

🌈కార్తీకపురాణం 26 అధ్యాయం🌈🪔🪔🪔🪔🪔🕉🕉🕉🕉🕉🕉🕉🕉🌹దూర్వాసుడు శ్రీహరిని శరణువేడుట - శ్రీహరి హితబోధ

"

🌈కార్తీకపురాణం 26 అధ్యాయం🌈
🪔🪔🪔🪔🪔

🕉🕉🕉🕉🕉🕉🕉🕉
🌹దూర్వాసుడు శ్రీహరిని శరణువేడుట - శ్రీహరి హితబోధ

ఈ విధముగా అత్రిమహముని అగస్త్యునితో - దూర్వాసుని కోపమువల్ల కలిగిన ప్రమాదమును తెలిసి, మిగిలన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను.

ఆవిధముగా ముక్కోపియైన దూర్వాసుడు భూలోకము, భువర్లోకము, పాతాళలోకము, సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములలోను తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకువెళ్లి "వాసుదేవా! జగన్నాథా! శరణాగతరక్షణ బిరుదాంకితా! రక్షింపుము. నీభక్తుడైన అంబరీషునకు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడను గాను. ముక్కోపినై మహాపరాధము చేసితిని. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగుమహర్షి నీ యురముపై తనిన్నను సహించితివి. అ కాలిగురుతు నేటికినీ నీవక్షస్దలమందున్నది. ప్రశాంతమనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడ రక్షింపుము. శ్రీహరి! నీచక్రాయుధము నన్ను జంపవచ్చుచున్న"దని దూర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరివిధముల ప్రార్దించెను. ఆవిధముగా దూర్వాసుడు అహంకారమును వదలి తనను ప్రార్దుంచుట చూచి - శ్రీ హరి చిరునవ్వు నవ్వి "దూర్వాసా! నీ మాటలు యదార్ధములు. నీవంటి తపోధనులు నాకత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమున బుట్టిన రుద్రడవు. నిన్ను జూచిన వారు మూడు లోకములందు భయపడకుందురా! నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము యెట్టి హింసా కలిగించను. ప్రతియుగమందున గో, దేవ, బ్రాహ్మణ, సాధు జనంబులకు సంభవించే యాపదలను పోగొట్టుటకు ఆయా పరిస్ధితలకు తగిన రూపములు ధరించి దుష్టశిక్షణ శిష్టరక్షణ గావింతును. నీవకారణముగా అంబరీషుని శపించితివి. నేను శత్రువుకైనను మనోవాక్కయములందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచమందుగల ప్రాణి సమూహము నా రూపముగానే జూతును. అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను. కాని, అటువంటి నాభక్తుని నీవు అనేక విధములు దూషించితివి. నీ యెడమ పాదముతో తన్నితివి. అతని యింటికి నీవు అతిథినై వచ్చికూడ, నేను వేళకు రానియెడల ద్వాదశి షుడియలు దాటకుండ భుజింపుమని అంబరీషునకు చెప్పవైతివి. అతడు వ్రతభంగమునుకు భయపడి, నీ రాకకై చూచి జలపానమును మాత్రమే జేసెను. అంతకంటే అతడు అపరాధము యేమిచేసెను! చాతుర్వర్ణములవారికి భోజన నిషిద్ద దినములందు కూడా జలపానము దాహశాంతికిని, పవిత్రతకును చేయదగినదే కదా? జలపాన మొనరించిన మాత్రమున నాభక్తుని దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కాని నిన్నవమానించుటకు చేయాలేదే? నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపచేయ జూచెను. ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణువేడెను. నేనపుడు రాజు హృదయములో ప్రవేశించినాను. నీ శాపఫలము పది జన్మలలో అనుభవించుదునని పలికిన వాడిని నేనే. అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను. కాని, తన దేహము తాను తెలుసుకోనే స్దితిలో లేడు. నీ శాపమును అతడు వినలేదు. అంబరీషుడు నాభక్త కోటిలో శ్రేష్టుడు. నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వానిని అకారణముగా దూషించితివి. అతనిని నిష్కారణముగా శపించితివి. విచారించవలదు. ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవింతును.

అదెటులనిన నీ శాపములోనిది మొదటి జన్మ మత్స్యజన్మ. నేనీ కల్పమును మనువును రక్షించు నిమిత్తము, సోమకుడను రాక్షసుని జంపుటకు మత్స్యరూపమెత్తుదును. మరి కొంత కాలమునకు దేవదానవులు క్షీర సాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు. అ పర్వతమును నీటిలో మునగకుండ కూర్మరూపమున నా వీపున మోయుదును. వరాహజన్మమెత్తి హిరణ్యాక్షుని వధింతును. నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుని జంపి, ప్రహ్లాదుని రక్షింతును. బలిచే స్వర్గమునుండి పారద్రోలబడిన ఇంద్రనకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామనరూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళలోకమునకు త్రొక్కివేతును. భూభారమును తగ్గి౦చుటకు క్షత్రియులను చంపి బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గింతును. లోకకంటకుడయిన రావణుని జంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడనై జన్మింతును. పిదప, యదువంశమున శ్రీకృష్ణునిగను, కలియుగమున బుద్దుడుగను, కలియుగాంతమున విష్ణు చిత్తుడను విప్రునియింట "కల్కి" యను పేరున జన్మించి, అశ్వారూఢు౦డనై పరిభ్రమించుచు బ్రహ్మదేషులనందరను మట్టుబెట్టుదును. నీవు అంబరీషునకు శాపరూపమున నిచ్చిన పదిజన్మలను యీ విధముగా పూర్తిచేయుదును. ఇట్లు నా దశావతారములను సదా స్మరించువారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నోసంగుదును. ఇది ముమ్మాటికి తథ్యము.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తీక మహత్మ్యమందలి షడ్వి౦శోధ్యాయము - ఇరవయ్యారో రోజు పారాయణము సమాప్తము.

         🪔 ఓం నమః శివాయ 🪔

    🌹సర్వేజనా సుఖినోభవంతు🌹

కార్తీకపురాణం 27 వ అధ్యాయం🌈🪔🪔🪔🪔🪔🕉🕉🕉🕉🕉🕉🕉🕉🌹*దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట*

"

🌈కార్తీకపురాణం 27 వ అధ్యాయం🌈
🪔🪔🪔🪔🪔

🕉🕉🕉🕉🕉🕉🕉🕉

🌹*దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట*

మరల అత్రి మహాముని అగస్త్యున కిట్లు వచించెను- కుంభ సంభవా! ఆ శ్రీ హరి దూర్వాసుని యెంతో ప్రేమతో జేరదీసి యింకను ఇట్లు చెప్పెను.

"ఓ దూర్వాసమునీ! నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారము లెత్తుట కష్టము గాదు. నీవు తపశ్శాలివి. నీ మాటలకు విలువ యివ్వవలెను. గాన, అందులకు నేనంగగీకరించితిని. బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని యింట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరీవృతుడై ప్రాయోపవేశమొనర్పనెంచినాడు. ఆ కారణము వలన విష్ణు చక్రము నిన్ను బాధింపబూనెను. ప్రజారక్షణమే రాజధర్మము గాని, ప్రజాపీడనము గాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులగు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపియైన మరొక విప్రుడే దండించ వలెను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్దమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని యెప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు. విప్రుని హింసించువాడును హింసింపచేయువాడును, బ్రాహ్మణ హంతకులకి న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని సిగబట్టిలాగిన వాడును, కాలితో తన్నినవాడును, విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమిన వాడును, విప్ర పరిత్యాగ మొనరించినవాడును బ్రహ్మహ౦తుకులే అగుదురు. కాన, ఓ దూర్వాస మహర్షి! అంబరీషుడు నీ గురించి - తపశ్శాలియు, విప్రోత్తముడును అగు దూర్వాసుడు నా మూలమున ప్రాణసంకటం పొందుచున్నాడు. అయ్యో! నేను బ్రాహ్మణ హంతకుడనయితినే యని పరితాపము పొందుచున్నాడు. కాబట్టి, నీవు వేగమే అంబరీషుని కడకేగుము. అందువలన మీవుభయులకు శాంతి లభించును" అని విష్ణువు దూర్వాసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు బంపెను.

*ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తీక మహత్మ్యమందలి సప్తవి౦శోధ్యాయము - ఇరవయ్యేడవ రోజు పారాయణము సమాప్తము.*

         🪔 ఓం నమః శివాయ 🪔

    🌹సర్వేజనా సుఖినోభవంతు🌹

🌈కార్తీకపురాణం 28 వ అధ్యాయం🌈🪔🪔🪔🪔🪔🕉🕉🕉🕉🕉🕉🕉🕉జనక మహారాజా! వింటివా దుర్వాసుని అవస్ధలు! తాను యెంతటి కోపవంతుడైనను, వెనుక ముందు లాలోచింపక ఒక మహాభక్తుని శుద్దిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున, ఎంతటి గొప్ప వారైనాను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకోనవలెను.

"

🌈కార్తీకపురాణం 28 వ అధ్యాయం🌈
🪔🪔🪔🪔🪔

🕉🕉🕉🕉🕉🕉🕉🕉

జనక మహారాజా! వింటివా దుర్వాసుని అవస్ధలు! తాను యెంతటి కోపవంతుడైనను, వెనుక ముందు లాలోచింపక ఒక మహాభక్తుని శుద్దిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున, ఎంతటి గొప్ప వారైనాను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకోనవలెను.

అటుల దుర్వాసుడు శ్రీ మన్నారాయణుని కడ సెలవుపొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచూ తిరిగి మళ్లి భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి "అంబరీషా, ధర్మపాలకా! నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము, నీకు నాపై గల అనురాగముతో ద్వాదశీ పారాయణమునకు నన్నాహ్వనించితివి, కాని నిన్ను కష్టములు పాలుజేసి వ్రతభంగము చేయించి నీ పుణ్య ఫలమును నాశనము చేయతల పెట్టితిని. గాని నా దుర్బద్ది నన్నే వెంటాడి నాప్రాణములు తీయుటకే సిద్దమైనది. నేను విష్ణువు కడకేగి యా విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్ధి౦చితిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీవద్ద కేగమని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యము. నేను యెంతటి తపశ్శాలినైనను, యెంత నిష్టగలవాడనైనను నీ నిష్కళంక భక్తి ముందవియేమియు పనిచేయలేదు. నన్నీ విపత్తునుండి కాపాడు"మని అనేక విధాల ప్రార్ధఒచగా, అంబరీషుడు శ్రీ మన్నారాయణుని ధ్యానించి,"ఓ సుదర్శన చక్రమా! నీకివే నా మన:పూర్వక వందనములు. ఈ దూర్వాస మహాముని తెలిసియో, తెలియకయో తొందరపాటుగా యీ కష్టమును కొని తెచ్చుకొనెను. అయినను యీతడు బ్రాహ్మణుడు గాన, ఈతనిని చంపవలదు, ఒక వేళ నీ కర్తవ్యమును నిర్వహింపతలచితివేని, ముందు నన్నుచంపి, తర్వాత ఈ దుర్వాసుని జంపుము. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి, నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు యిలవేల్పు, దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్దములలో , అనేక మంది లోకకంటకులను చంపితివిగాని శరణుగోరువారిని యింత వరకు చంపలేదు. అందువలననే యీ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఈతనిని వెంటాడుచునే యున్నావు గాని చంపుటలేదు. దేవా! సురాసురాది భూతకోటులన్నియు ఒక్కటిగా యేకమైననూ నిన్నేమియు చేయజాలవు, నీ శక్తికి యే విధమైన అడ్డునూలేదు. ఈ విషయము లోకమంతటికి తెలియును. అయినను మునిపుంగవునికి యే అపాయము కలుగకుండ రక్షింపుమని ప్రార్థించుచున్నాను.

నీ యుందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి యిమిడియున్నది. నిన్ను వేడుకోనుచున్న నన్నును, శరణు వేడిన యీ దుర్వాసుని రక్షింపుము" అని అనేక విధముల స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణుచక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి "ఓ భక్తాగ్రేశ్వరా ! అంబరీషా! నీ భక్తిని పరీక్షించుట కిట్లు చేసితినిగాని వేరుగాదు. అత్యంత దుర్మార్గులు, మహాపరాక్రమవంతులైన మధుకైటభులను - దేవతలందరు యెకమైకూడ  - చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుంగుదువు కదా! ఈ లోకములో దుష్టశిక్షణ, శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్దాపించుచుండును. ఇది యెల్లరకు తెలిసిన విషయమే, ముక్కోపియగు దుర్వాసుడు నీపైల్ పగబూని నీవ్రతమును నశింపజేసి, నానా యిక్కట్లు పెట్టవలెనని కన్ను లెఱ్ఱజేసి నీ మీద జూపిన రౌద్రమును నేను తిలకించితిని. నిరపరాధివగు నిన్ను రక్షించి, యీ ముని గర్వమణచవలెనని తరుముచున్నాను.

ఈతడు కూడా సామాన్యుడు గాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు. బ్రహ్మతేజస్సు గలవాడు. మహాతపశ్శాలి. రుద్రతేజము భులోకవాసుల నందరను చంపగలదుగాని, శక్తిలో నా కంటె యెక్కువేమియుగాదు. సృషి కర్తయగు బ్రాహ్మతేజస్సు కంటెను, కైలాసవతియగు మహేశ్వరుని తేజశ్శక్తి కంటెను యెక్కువయైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు గాని , క్షత్రియ తేజస్సుగల నీవు గాని తులతూగరు. నన్నెదుర్కొనజాలరు. తనకన్న యెదుటి వాడు బలవంతుడై యున్నప్పుడు అతనితో సంధి చేసుకోనుట యుత్తమము. ఈ నీతిని ఆచరించువారలు యెటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకోనగలరు.

ఇంత వరకు జరిగినదంతయు విస్మరించి, శరణార్థియై వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపు" మని చక్రాయుధము పలికెను. అంబరీషుడా పలుకులాలకించి, " నేను దేవ గో, బ్రాహ్మణాదులయుందును, స్త్రీలయందును, గౌరవము గలవాడను. నా రాజ్యములో సర్వజనులూ సుఖిముగా నుండవలెననియే నా యభిలాష. కాన, శరణుగోరిన ఈ దుర్వాసుని, నన్నూ కరుణించి రక్షింపుము. వేలకొలది అగ్నిదేవతలు, కోట్ల కొలది సూర్య మండలములు యేక మైననూ నీ శక్తీకి, తేజస్సుకూ సాటి రావు. నీవు అట్టి తేజోరాశివి మహా విష్ణువు లోకనిందితులపై, లోకకంటకులపై, దేవ - గో - బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి, వారిని శిక్షించి, తనకుక్షియుందున్న పధ్నాలుగు లోకములను కంటికి రెప్పవలె కాపాడుచున్నాడు. కాన, నికివే నామన:పూర్వక నమస్కృతులు" అని పలికి చక్రాయుధపు పాదములపై పడెను. అంతట సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాడాలింగన మొనర్చి "అంబరీషా! నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రము మూడు కాలములయుందు నెవరు పఠింతురో, యెవరు దానదర్మములతో పుణ్యఫలమును వృద్ది చేసుకొందురో, యెవరో పరులను హింసించక - పరధనములను ఆశపడక - పరస్త్రీలను చెరబెట్టిక - గోహత్య - బ్రాహ్మణహత్య - శిశుహత్యాది మహాపాతకములు చేయకుందురో అట్టివారి కష్టములు నశించి, యిహమందును పరమందును సర్వసాఖ్యములతో తులతూగుదురు. కాన, నిన్నూ దుర్వాసుని రక్షించుచున్నాను, నీ ద్వాదశీ వ్రత ప్రభావము చాల గొప్పది. నీ పుణ్యఫలము ముందు యీ మునిపుంగవుని తపశ్శక్తి పని చేయలేదు." అని చెప్పి అతని నాశీర్వదించి, అదృశ్యమయ్యెను.

*ఇట్లు స్కాంద పురాణా౦తర్గ్హత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్మ్య మందలి అష్టావింశోధ్యాయము - ఇరవయ్యెనిమిదో రోజు పారాయణము సమాప్తము.*

         🪔 ఓం నమః శివాయ 🪔

    🌹సర్వేజనా సుఖినోభవంతు🌹

కార్తీకమాసం చివరికి రాగానే గుర్తుకు వచ్చే కథ ‘పోలిస్వర్గం’. కార్తీక మాసం ముగింపు సందర్భంగా భక్తులు తెల్లవారుజామునే లేచి నదిలో స్నానం చేసి …. నేతిలో ముంచిన వత్తులతో అరటిదొప్పలులో దీపాలను వెలిగించి..నదులలో వదులుతారు. భగవంతుని ముందు ఉసిరికాయలపై దీపాలను వెలిగించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ రోజున మహిళలు ప్రాతఃకాలంలో లేచి స్నానాదులు ముగించి దేవాలయాల్లో పూజలు చేసి అనంతరం కోనేరుల్లో దీపాలను వెలిగించి వదిలిపెడుతారు.

కార్తీకమాసం చివరికి రాగానే గుర్తుకు వచ్చే కథ ‘పోలిస్వర్గం’.   కార్తీక మాసం ముగింపు సందర్భంగా భక్తులు తెల్లవారుజామునే లేచి నదిలో స్నానం చేసి …. నేతిలో ముంచిన వత్తులతో అరటిదొప్పలులో దీపాలను వెలిగించి..నదులలో వదులుతారు. భగవంతుని ముందు ఉసిరికాయలపై దీపాలను వెలిగించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ రోజున మహిళలు ప్రాతఃకాలంలో లేచి స్నానాదులు ముగించి దేవాలయాల్లో పూజలు చేసి అనంతరం కోనేరుల్లో దీపాలను వెలిగించి వదిలిపెడుతారు. బియ్యపుపిండితో చేసిన దీపాలను ఎక్కువగా వాడుతారు. ఎన్ని ఆటంకాలు కల్పించినా నిర్మలమైన భక్తితో శ్రీమహావిష్ణువును ప్రార్థించి పోలి వైకుంఠానికి చేరుకున్న రోజును పోలిస్వర్గంగా పండగ నిర్వహిస్తున్నారు.

ఈ పర్వదినానికి పోలిస్వర్గం అని ఎందుకు వచ్చిందో అని తెలిపేందుకు ఒక కథ వుంది. స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో పోలి స్వర్గం నోము ఒకటి. పురాతనకాలం నుంచి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తోన్న ఈ నోము, ఈ తరం స్త్రీలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తోంది.ఈ నోము జరుపుకోవడానికి కారణమైన కథ, జానపద కథలా అనిపిస్తూ వినడానికి ఆసక్తిగా … ఆచరించడానికి ఇష్టంగా అనిపిస్తూ వుంటుంది. ఇంతకీ ఎవరీ పోలి? ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి? దానిని తల్చుకుంటూ సాగే ఆచారం ఏమిటి? అంటే ఆసక్తికరమైన జవాబులే వినిపిస్తాయి.

పోలిస్వర్గం అచ్చంగా తెలుగువారి కథ. కార్తీక మాసంలోని దీపం ప్రాధాన్యతనే కాదు, ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్నీ సూచించే గాధ. అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్లు ఉండేవారట. వారందరిలోకి చిన్నకోడలైన పోలికి చిన్నప్పటి నుంచే పూజలన్నా, వ్రతాలన్నా మహా ఆసక్తి. కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా ఉండేది. తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం. ఆచారాలని పాటించే హక్కు ఆమెకే ఉందన్నది ఆమె అహంభావం. అందుకే కార్తీకమాసం రాగానే చిన్నకోడలిని కాదని మిగతా కోడళ్లను తీసుకుని నదికి బయల్దేరేది.

అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నదీస్నానం చేసి దీపాలను వెలిగించుకుని వచ్చేది. ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావల్సిన సామాగ్రి ఏదీ ఇంట్లో లేకుండా జాగ్రత్తపడి మరీ బయల్దేరేవారు అత్తగారు.

కార్తీకమాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసే ప్రయత్నాలు సాగనేలేదు. పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకుని దానితో వత్తిని చేసేది పోలి. దానికి కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపాన్ని వెలిగించేంది. ఆ దీపం కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు, దాని మీద బుట్టని బోర్లించేంది. ఇలా కార్తీకమాసమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి.

చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది. కార్తీకమాసం చివరిరోజు కాబట్టి ఆ రోజు కూడా నదీస్నానం చేసి ఘనంగా కార్తీకదీపాలను వదిలేందుకు అత్తగారు బయల్దేరింది. వెళుతూ వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటిపనులన్నీ అప్పగించి మరీ వెళ్లింది. కానీ పోలి ఎప్పటిలాగే ఇంటిపనులను చకచకా ముగించేసుకుని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది.  ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంత కష్టసాధ్యమయినా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చటవేసింది. వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగి వచ్చింది.

అప్పుడే నదీ స్నానం చేసి ఇంటికి చేరుకుంటున్న అత్తగారూ, ఆమె కోడళ్లూ… ఆ విమానాన్ని చూసి, అది తమ కోసమే వచ్చిందనుకుని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి హతాశులయ్యారు. ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకునే ఆత్రంలో పోలి కాళ్లని పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. విమానంలోని దేవదూతలు, పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకి దించేశారు.

ఈ నేపథ్యంలో తెలుగునాట స్త్రీలంతా పోలిని తల్చుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటిదొప్పలలో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. ఈ నగర జీవితంలో మనకు దగ్గరలో చెరువులు, నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి… టబ్బులలో ఈ దీపాలను వదిలేలా ఆచారం రూపాంతరం చెందింది. ఇలా వదిలిన అరటిదీపాలను చూసుకుంటూ పోలిని తల్చుకుంటారు.




ఆశ్వీయుజ అమావాస్య మొదలుకొని కార్తీక అమావాస్య వరకు ప్రాతః కాలమే లేచి నదీ స్నానం చేసి దీపములు వెలిగించలేని వారు , ఈ పోలి స్వర్గం నాడు తెల్లవారఝూమునేలేచి నదిలో స్నానమాచరించి అరటి దొప్పలలో దీపములు వెలిగించి వదిలి పెట్టిన ఎడల కార్తీక మాసం అంతా తెల్లవారుఝామున నదీ స్నానమాచరించిన ఫలితం, దీపములు వెలిగించినంతఫలితం వస్తుందని భక్తుల నమ్మకం. కార్తికమాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా కూడా, ఈ రోజున 30 వత్తులను వెలిగించి నీటిలో వదిలితే…. మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని కూడా చెబుతారు.

వీలైతే ఈ రోజున బ్రహ్మణులకు దీపాన్ని కానీ, స్వయంపాకాన్ని కానీ దానం చేస్తుంటారు. తెలుగువారు ఇటు పోలిని, అటు దీపాన్నీ కూడా శ్రీమహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు. అందుకని చాలామంది ఈ పోలిదీపాలను అమావాస్య రోజున కాకుండా, మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు.  ఇదీ పోలిస్వర్గం వివరం! కార్తికమాసం దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తరువాత మాట. ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు, మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతర్యంగా తోస్తుంది.

భగవంతుని కొలుచుకోవడానికి కావల్సిందే శ్రద్ధే కానీ ఆడంబరం కాదని సూచిస్తుంది. అన్నింటికీ మించి ఆహంకారంతో సాగే పూజలు ఎందుకూ కొరగానివని హెచ్చరిస్తుంది. అత్తాకోడళ్ల మధ్య సఖ్యత ఉండాలన్న నీతినీ బోధిస్తోంది. అందుకే ప్రతి కార్తికమాసంలోనూ, ప్రతి తెలుగు ఇంట్లోనూ… పోలిస్వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది.

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రవచనంతిరుప్పావై పాశురాలు - 1🍁🍁🍁🍁🍁

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రవచనం

తిరుప్పావై పాశురాలు - 1

🍁🍁🍁🍁🍁



మార్గళి త్తింగళ్ మది నిఱైంద నన్నాళాల్
 నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్
 శీర్ మల్గుం ఆయ్ ప్పాడి చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్
 కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్
 ఏరారంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం
 కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం పోల్ ముగత్తాన్
 నారాయణనే నమక్కే పఱైతరువాన్ 
 పారోర్ పుగళప్పడిందేలోర్ ఎమ్బావాయ్   1


      
నారాయణ మంత్ర ఉపదేశంతో వ్రత ప్రారంభం 
  
"మార్గళి త్తింగళ్" మార్గశిర్షం మంచి మాసం, ఫలమును నిచ్చే మాసం. అలాంటి పన్నెండు మాసాలు మనకు ఒక సంవత్సరం అయితే, అది దేవతలకు ఒక రోజు అంటారు. దక్షినాయిణం వారికి రాత్రి అయితే ఉత్తరాయిణం పగలు. సంక్రాంతి రోజు సూర్యుడు దక్షినాయిణం నుండి ఉత్తరాయిణంకు మారుతాడు, అంటే సంక్రాంతికి ఒక నెల ముందుగా వచ్చే మార్గశీర్షం వారికి తెల తెల వారే సమయం. సత్వాన్ని పెంచేకాలం. కాబట్టి ఆచరణ ద్వారా మనం ఈమాసాన్ని వినియోగించుకోవాలి. "మది నిఱైంద నన్నాళాల్" చంద్ర కాంతి మంచిగా ఉండే కాలం, చంద్రుడు పెరిగే కాలం కబట్టి మనం మంచిరోజులుగా భావిస్తాం. "నీరాడ ప్పోదువీర్ పోదుమినో" స్నానం చేయటానికి వెల్దాం! ఎలాంటి స్నానం అది అంటే భగవంతుని కళ్యాణ గుణాలతో మన పాపాలను కడిగివేసుకొనే స్నానం. "నేరిళైయీర్" భగవంతుని గురించి తెలుసుకోవాలనే జ్ఞానం మాత్రం చాలు ఈ వ్రతం చేయటానికి యోగ్యులమే.

"శీర్ మల్గుం ఆయ్ ప్పాడి" పంటలు బాగా పండే ఆ నందగోకులంలోని "చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్" సంపన్నులైన గోప పిల్లల్లా,  మనమూ అవ్వాలి శ్రీకృష్ణ ప్రేమ కోసం.
 


ఏ భయమూ అవసరం లేదు. "కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్" పరమ సాత్వికుడైన నందగోపుని కుమారుడిగా మన వద్దకు వచ్చాడు కదా పరమాత్మ, ఏ అసురుల భారినుండి శ్రీకృష్ణునికి ముప్పు రాకుండా తాను కత్తి ఎల్లప్పుడు పట్టుకొని కాపాడుతూ ఉన్నాడు ఒక ఆచార్యునివలె. మరి నందగోపుడు మనవాడే కదా! 



"ఏరారంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం" మరి ఆయనేమో తన చేష్టలతో యశోదమ్మ కళ్ళు అనందంచే పెద్దగా అయ్యేట్టు చేస్తూ ఆమె ఒడిలో చిన్న సింహంపిల్లలా పెరుగుతున్నాడు. "కార్మేని" నల్లని మేఘంలాంటి దివ్య కాంతులతో అంతం లేని గుణాలు కల్గి, "చ్చెంగణ్ " వాత్సల్యం కల్గినవాడు. "కదిర్మదియం పోల్ ముగత్తాన్" చంద్ర సూర్యుల వంటి ముఖం కల్గి నవాడు. మిత్రులతో ప్రేమగా శత్రువులతో కోపం కల్గినవాడు. 


"నారాయణనే నమక్కే పఱైతరువాన్" నారాయణ అనే మత్రం ఉపదేశం చేస్తూ మనకు సర్వస్వం ప్రసన్నం చేస్తుంది గోదా "పారోర్ పుగళప్పడింద్" ఫలం సాక్షాత్తు పరమాత్మే, ఈ లోకంలోని వారందరికీ అందజేస్తుంది అమ్మ గోదా.

నారాయణ మంత్రం

ఈ వ్రతంలో మనం భగవంతున్ని ఎట్లాచూస్తామో వివరిస్తుంది. భగవంతుడు ప్రాదేశికుడై అల్ప ఫలాన్ని ఇచ్చేవాడైతే మనం స్వీకరించం. భగవంతునికి ఎన్నెన్నో రూపాలు ఉంటాయి ఆకాశానికి అంతం లేనట్టుగా, సాగరంలో జలానికి అంతంలేనట్టుగా, మన జన్మలకీ కర్మలకీ అంతం లేనట్టుగా భగవంతుని కళ్యాణ గుణాలకు కూడా అంతం లేదు. కేవలం ఆయనగుణాలకేకాదు ఆయన స్వరూపానికి కూదా అంతం లేదు కాబట్టే ఆయనను సర్వవ్యాపి అంటారు.  ఇందుగలడని అందులేడని సందేహము వలదు అని ప్రహ్లాదుడు చెప్పినట్లుగా, అంతటా వ్యాపించి ఉండటం భగవంతుని గొప్పతనం.

ఆ వ్యాపనశీలాన్ని చెప్పే మంత్రాలే గొప్ప మంత్రాలుగా చెప్పబడి ఉన్నాయి. భగవంతుని వ్యాప్తిని చెప్పేవి కేవలం మూడే అవి "విష్ణు", "వాసుదేవ" మరియూ "నారాయణ". విష్ణు అంటే వ్యాపించిన వాడని అర్థం. వాసుదేవ అంటే అంతటా వసిస్తాడు-ప్రకాశిస్తాడు అని అర్థం. ఈ రెందు మంత్రాల్లో కేవలం వ్యాపించి ఉంటాడనే చెబుతాయి కాని ఎలావ్యాపించి ఉంటాడు, ఎందుకు వ్యాపించి ఉంటాడు అనే ప్రశ్నలకు సమాధానం లభించదు కనక ఆ మంత్రాలకు కొంచెం లోపం ఉంది అంటారు. కాని నారాయణ మంత్రం మాత్రం వ్యాప్తిని చెబుతుంది, వ్యాప్తి ఫలాన్ని చెబుతుంది,  ఎందుకు వ్యాపించి ఉంటాదని వివరిస్తుంది. ఎందెందులో వ్యాపించి ఉంటాదని తెలియజేస్తుంది, ఆ వ్యాపించి ఉండే వాటితో సంబంధం గురించి తెలియజేస్తుంది.

నారాయణ అంటే ఒక అద్బుతమైన మంత్రం, నారములు అంటే సకల చరాచర వస్తువులు అని అర్థం. అయణం అంటే ఆధారం అని అర్థం.  సూర్యుడు మనకు ఉత్తరం నుండి ఆధారమైన కాలాన్ని మనం ఉత్తరాయణం, విడ దీస్తే ఉత్తర-అయణం అంటాం. నారాయణ శబ్దం లోని అయణ అనే పదాని అర్థం ఆధారం.  ఈ సకల చరాచర వస్తుజాతానికి ఆధారమైన వాన్ని నారాయణ అంటారు. మరి చరాచర వస్తువులలో ఎట్లావ్యాపించి ఉంటాడు, లోపల-బయట వ్యాపించి ఉంటాదని తెలియజేసేది నారాయణ మంత్రం. ఈ నారాయణ అనే శబ్దాన్ని రెండు సమాసాలు వివరిస్తాయి. ఒకటి తత్పురుష రెండవది బహువ్రిహి సమాసాలు. తత్పురుష అనేది నారములన్నిటికి తాను ఆధారమైన వాడు, ఆధారమై తనలోపల పెట్టుకున్నవాడు అని చెబుతుంది. మరి బహువ్రిహి సమాసం తానీ నారములన్నిటికి తాను లోపల ఉండి రక్షిస్తాడని చెబుతుంది. అర్థాత్ ఆయన లోపన మరియూ బయట వ్యాపించి ఉంటాడని. అయణ అనే శబ్దంచే ఆయన అన్ని గుణములు కల్గి, చేయిచాస్తే చాలు అందేట్టు ఉంటాడు కాబట్టి ఆయనకు సౌలబ్యాది

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రవచనం నుండి.... తిరుప్పావై పాశురము- 2

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రవచనం నుండి....

 తిరుప్పావై పాశురము- 2



 వైయత్తు వాళ్ వీర్గాళ్! నాముం నం పావైక్కు
 శెయ్యుం కిరిశైగళ్ కేళీరో పాఱ్కడలుళ్* 
 పైయత్తుయిన్ఱ పరమనడి పాడి
 నెయ్యుణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి
 మైయిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోమ్
 శెయ్యాదన శెయ్యోం తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్
 ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి
 ఉయ్యుమాఱెణ్ణి ఉగందేలోర్ ఎమ్బావాయ్…..|| 2||


మనిషి బాగుపడటానికి ఎన్నో మార్గాలు,  శాస్త్రాలలో  ఆవి కర్మయోగమని, జ్ఞానయోగమని, భక్తి యోగమని ఇలా ఎన్నో చెప్పబడి ఉన్నాయి. భగవంతుడే ఒక మార్గమని తీసుకుంటే వారు మర్గశీర్షంలో పయనిస్తున్నారు అని అంటారు. అలాంటి మార్గంలో లక్ష్యం చేరటంలో ఇబ్బందులు ఉండవు. తల్లి అండలో ఉన్న శిశువు మాదిరిగా మనల్ని తరింపచేస్తాడు పరమాత్మ, కాని అలా జరగటానికి మన అంగీకారం కావాలి. మనలోని జ్ఞానం ద్వారా మనం నీవాడను నేను అని ఆయనకు చెప్పాలి.  మరి అలాంటి మార్గంలో  పయనించటానికి మనం ఎలా ఉండాలో మన ఆండాళ్ తల్లి తెలియజేసింది ఈ ధనుర్మాస వ్రతంలో.  ఏమి చేయాలో ఏమి అవసరం లేదో చెబుతోంది ఈ పాటలో.

భగవంతుణ్ణి భగవన్మయుడని, పరమాత్మ అని, గోవింద అని ఇలా ఎన్నో పేర్లతో చెబుతారు. మనకు కనిపించే వివిద రూపాల్లో ఉంటాడు కాబట్టి భగవన్మయుడని అంటారు. "అణు:" అతి చిన్నరూపం నుండి "బృహత్:" అతి పెద్ద స్వరూపంగా ఉంటాడు కాబట్టి పరమాత్మనే అని అంటారు. "శబ్ద సహ" అతి సామన్యుడు పిలిస్తే అందుతాడు, "శబ్దాతిగ" చతుర్ముఖ బ్రహ్మకూడా కీర్తించ చేతకానివాడు, అందుకే ఆయనను గోవింద అని అంటారు.  మరి జగత్తు మొత్తం పరమాత్మ శరీరం కదా! మరి ఇక్కడ తగినవి- తగనివి అంటూ ఉంటాయా!!

ప్రకృతి స్వభావాన్ని బట్టి, ఆయా గుణాలను బట్టి సత్వం,రజస్సు మరియూ తమస్సు అనే గుణాలు ఉంటాయని గమనించాలి. సత్వం  జ్ఞానాన్ని, రజస్సు కోపాన్ని, తమస్సు అజ్ఞానాన్ని,బద్దకాన్ని ఇస్తాయి. మరి శరీరం ఈ పంచబూతాలతో తయారైనదే కదా, కాబట్టి ప్రకృతిలో ఉండే ఈ గుణాలు మనలో కూడా ఉంటాయి. కాని ఏదో ఒక గుణం పైన ఉండి నడిపిస్తుంది. సత్వం పెరిగితే మంచిది. ఇలా చెప్పటానికి మన చేతిలోని చూపుడు వేలును మనతో  పోలుస్తారు, బ్రోటన వేలును పరమాత్మతో పోలుస్తారు. ఇక తమస్సు,రజస్సు, సత్వ గుణాలను మిగతామూడు వెల్లతోపోల్చుతారు. ఈ మూడు గుణాలతో కలిసి ఉన్న చూపుడు వేలుని బ్రోటనవేలి తో కలిపే దాన్ని జ్ఞాన ముద్ర అంటారు. చిటికెన వేలు సత్వం కొద్దిగానే ఉంటుంది, రజస్సు-తమస్సు ఎక్కువగా ఉంటాయి. మరి బాగు పడటానికి సత్వం కావాలి, కొన్ని నియమాల్ని పాటించాలి.  నియమాలు మరి ప్రకృతిలోని గుణాలకోసమే కాక, మనల్ని ఆదర్షంగా తీసుకొనేవారు బాగు పడటానికి కూడా మనం పాటించాల్సి వస్తుంది. ఈ కృత్యా- అకృత్య వియోచనాలను మన ఆండాళ్ తల్లి ఈ పాటలో తెలియజేస్తుంది.

"వైయత్తు వాళ్ వీర్గాళ్!"  ఈ భుమి మీద ఉండి సుఖించాలని కోరిక ఉంటే చాలు రండి అని చెబుతుంది. ఈ భూమి తామస గుణమిచ్చేది, ఇక్కడ ఉండగా సాత్వికగుణం కలగటం కుంపెటలో తామరపువ్వు పూసినట్లు అంటారు. చివరికి పరమాత్మకు కూడా తామస గుణ ప్రభావం తప్పలేదు అని సీతాదేవి హనుమంతునితో చెప్పుతుంది ఈ విషయం రామాయణంలో. రావణ వధ అనంతరం సీతను తీసుకుపోవటానికి వచ్చిన హనుమ సీతాదేవితో, నివ్వు ఆజ్ఞ యివ్వు నిన్ను పీడించే ఈ రాక్షసమూకను ఒక్కసారి పని పడతాని అంటాడు, దానికి సీత ఇది వారి తప్పు కాదయా, వారు రావణుని అండలో ఉన్నారు, ఈ భూమిమీద ఉండగా తప్పు చేయడం సహజమేకదా, చివరికి చూసిరమ్మని చెబితే కాల్చివెల్లలేదా నీవు. దానికి హనుమ మరి నేనంటే ఏమో, కాని శ్రీరామ చందృడు కూడా తప్పు చేసినాడా అమ్మ అని అడిగాడు. సూర్పణక వచ్చినప్పుడు ఆమెతో రాముడి ప్రవర్తన మరి తప్పేగా, నేను ఏక పత్నివ్రతుడను అనిమాత్రం చెప్పక, తన తమ్ముడికేసి ఎందుకు చూపించాడు. ఇవ్వన్నీ కదా ఇన్ని అపచారాలకు దారి తీసింది అని హనుమంతుడితో చెప్పుతుంది.

"నాముం నం పావైక్కు" ఒకరిని కష్టపెట్టే వ్రతం కాదు, లోకుల వ్రతాలు వారి వారి సుఖాలకోసం చేస్తే ఈ వ్రతం లోకం అందరికోసం చేసేది. "శెయ్యుం కిరిశైగళ్ కేళీరో" మరి ఏం చేద్దాం ఈ వ్రతంలో వినండి, " పాఱ్కడలుళ్ పైయత్తుయిన్ఱ పరమనడి పాడి"  పాల కడలిలోని సుకుమారం గా పవళించి ఉన్న వైకుఠనాథుని పాదాలను పాడదాం. ఆయనను మించినవారు ఇంకెవరూలేరు కాబట్టి "పరమన్" అని అంటారు.   ఎందుకంటే  మనల్ని కాపాడటానికి తాను మొదటగా పాదం వేసినది పాల్కడలిలోనేకదా! ఆయన పాదాలలో శంఖ, రథాంగ, కల్పక, ద్వజా, అరవింద, వజ్రా, అంకుష ఇత్యాదులు గుర్తులుగా  చేసుకొని ఉన్న ఆపాదాన్ని పాడుదాం. ఎలాగైతే శిశువు తల్లి స్తన్యాన్ని గుర్తిస్తాడో, భక్తుడు భగవంతుని పాదాలను గుర్తించగలిగి ఉండాలి. సుకుమారమైన నిద్ర అంటే లోక రక్షణకోసం తానుచేసే సాత్విక-యోగనిద్ర.  మనకోసం ఇంకా ఎమి చేస్తె బాగుపడతాం అని ఏర్పాటు చేసుకొన్న స్థానం పాల్కడలి. 

వ్యుహం-పాల్కడలి

నిన్నటి నాడు నారాయణ అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఇన్ని గుణాలు కల్గి ఉన్న నారాయణ తత్వాన్ని అర్థం చేసుకోవటం కష్టమే. మరి ఆ తత్వం మనల్ని ఎలా కాపాడుతుందో తెలుసుకోవటం అవసరం. మనం

*పంచభూతాలు మన అరచేతిలోనే ఉన్నాయా!తెలుసుకుందాం 🙏🙏 *మీరు ఎప్పుడైనా పండితులు, పురోహితులు ఆరాధన చేస్తుండగా చూసారా. వివిధ ఆలయాల్లో అర్చకులు దేముడికి హారతి ఇచ్చేటప్పుడు, నైవేధ్యం పెట్టేతాప్పుడు గమనించారా. ఆ సమయంలో వాళ్ళు అరచేతిని తిప్పుతూ వేళ్ళతో కొన్ని ముద్రలు పెడుతూ ఉంటారు. అలాగే భరతనాట్యం, కూచిపూడి మొదలైన నాట్యాలలో కూడా చేతి ముద్రలకి ఎంతో విశిష్ఠ స్థానం ఉంది. యోగా చేసేటప్పుడు, ధ్యానంలో ఉన్నప్పుడు కూడా ఎంతో మంది చేతులతో వివిధ రకాలైన ముద్రలు వెయ్యటం మనం చూస్తూ ఉంటాం.*

*పంచభూతాలు మన అరచేతిలోనే ఉన్నాయా!తెలుసుకుందాం 🙏🙏

 *మీరు ఎప్పుడైనా పండితులు, పురోహితులు ఆరాధన చేస్తుండగా చూసారా. వివిధ ఆలయాల్లో అర్చకులు దేముడికి హారతి ఇచ్చేటప్పుడు, నైవేధ్యం పెట్టేతాప్పుడు గమనించారా. ఆ సమయంలో వాళ్ళు అరచేతిని తిప్పుతూ వేళ్ళతో కొన్ని ముద్రలు పెడుతూ ఉంటారు. అలాగే భరతనాట్యం, కూచిపూడి మొదలైన నాట్యాలలో కూడా చేతి ముద్రలకి ఎంతో విశిష్ఠ స్థానం ఉంది. యోగా చేసేటప్పుడు, ధ్యానంలో ఉన్నప్పుడు కూడా ఎంతో మంది చేతులతో వివిధ రకాలైన ముద్రలు వెయ్యటం మనం చూస్తూ ఉంటాం.* 

 మన పురాతన వైదిక సాంప్రదాయాన్ని ఒకసారి గమనించినట్లయితే మనకు ఎంతో సులువుగా అర్ధమయ్యేది ఏంటో తెలుసా? మన చేతి వేళ్ళల్లోనే పంచభూతాలు నిక్షిప్తమై ఉన్నాయి అని. మనకే తెలియని శక్తి మన చేతి వేళ్ళలో దాగి ఉంది. బొటను వేలిలో అగ్ని, చూపుడు వేలిలో గాలి, మధ్య వేలిలో ఆకాశం, ఉంగరం వేలిలో భూమి, చిటికిన వేలిలో నీరు ఉంటాయట. మన చేతిలో ఉన్న శక్తి మనకి తెలియట్లేదు. చేతి వేళ్ళలో ఉన్న శక్తి నరాల ద్వారా మెదడు వరకు* *వ్యాపిస్తుంది. అలాగే మేడగు నుంచి నరాల ద్వారా వేళ్ళల్లోకి ప్రసరిస్తుంది. అందుకే ఆశీర్వచనానికి కూడా మనం పెద్ద పీట వేశాం. పెద్దవాళ్ళు పిల్లల్ని ఆశీర్వదించటం ద్వారా వారి చేతిలో ఉన్న శక్తి  కలిపిన అక్షింతలకు అంటి మన తల మీద పడేసరికి మనకి ఏదో తెలియని బలం వచ్చినట్టు అనిపిస్తుంది.* 

 అలా పంచభూతాలు మన అరచేతిలోనే  ఉండటం వల్ల  మనం వేసే ఒక్కొక్క ముద్రకి ఒక్కొక్క శక్తి ఆవహించి ఉండి దాని పని అది చేసుకుని పోతుంది. చేతితో అన్నం తినటం కూడా మన పెద్దవాళ్ళు మంచిదని ఊరికే చెప్పలేదు.

అన్నాన్ని ముందుగా నీటితో శుద్ధి చేసుకుని చేత్తో తినటం వల్ల చేతిలో ఉన్న శక్తి తరంగాలు అన్నం జీర్ణం అయ్యేలా చేస్తాయి. మనం తినే అన్నంలో ఏవైనా దోషాలు ఉన్నా అవి తగ్గుతాయి కూడా. 

మన  శక్తి మనకి తెలియక పాశ్చాత్య ధోరణులకి ఆకర్షించబడి మనం స్పూన్స్ తో తినటం అలవాటు చేసుకుంటున్నాం. అందుకే తినే పదార్థాలు శుద్ధి కాక మనకి ఇన్ని అనారోగ్యాలు* 
 
 అంతేకాదు మన చేతి వేళ్ళల్లో ఇలా శక్తి తరంగాలు, పంచభూతాలు నిక్షిప్తమై ఉండటం వల్ల మనం చేతితో ఎక్కువసేపు పట్టుకునే వస్తువుల ప్రభావం కూడా మనపై ఎంతో ఉంటుంది. జపం చేసేవాళ్ళు మానసిక ప్రశాంతత కోరుకుంటారు కాబట్టి వాళ్ళు తులసి పూసలు చేత్తో తిప్పుతూ జపం చేస్తారు. అలాగే మనం నిశితంగా పరిశీలిస్తే చేత్తో ఎక్కువసేపు పెన్ను పట్టుకుంటే*

 కాసేపయ్యేసరికి పేపర్ కనిపిస్తే ఏదో ఒకటి రాయాలని లేదా ముగ్గులు వెయ్యాలని అనిపిస్తూ ఉంటుంది. అలాగే కర్ర కాసేపు పట్టుకుని ఉంటే దానితో దేనినైనా కొట్టాలని అనిపిస్తుంది. అలాగే కత్తి చేత్తో పుచ్చుకుంటే కాసేపయ్యేసరికి దేని మీదైనా విసిరి అది విరిగేలా చెయ్యాలనిపిస్తుంది లేదా దేనినైనా పొడవాలనిపించి ఆఖరికి కూరగాయలని అటు ఇటు గాట్లు పెడతాం. ఇలా మనం చేత్తో ఏ వస్తువు పట్టుకుంటే ఆ వస్తువు సహజ గుణాన్ని మన చేతులు గ్రహించి వాటితో చేసే పనులు మనం స్వయంగా చేసేలా చేస్తాయి.* 

 ఆఖరికి మన జీవితం ఎలా ఉంటుందో కూడా మన అరచేతిలోనే ఉంటుంది. అందుకే హస్తసాముద్రికంలో మన చేతిలోని రేఖలని చూసి మన జాతకం చెపుతారు.

ఇంకా మనకి తెలియని ఎన్నో విద్యలలో కూడా చేతి వేళ్ళను ఉపయోగించి చికిత్స చేసే విధానం కూడా ఉంది. అంత శక్తి ఉన్న చేతులు మనకి ఉన్నాయని గుర్తించకపోవటం మన తప్పే. ఇలా*

 పంచాభూతలనే మన చేతిలో పెట్టిన దేముడికి ఎన్నిసార్లయినా చేతులెత్తి మొక్కచ్చు.

అమ్మ అందరిని చల్లగా చూడమ్మా 🙏

*తిరుపావై ప్రశ్నావళి-జవాబులతో**శుభ ధనుర్మాసం.* తిరుప్పావై గురించి ప్రాధమిక అవగాహన ఆధారంగా తయారు చేసిన 108 ప్రశ్నలు-జవాబుల గోష్టియే ఈ తిరుప్పావై ప్రశ్నావళి. *ఇది ఎవరి జ్ఞానాన్ని పరీక్షించడానికో లేదా ఏ కొందరినో విజేతలుగా ప్రకటించడానికో సంకలనం చేసిన ప్రశ్నావళి కాదు.*

*తిరుపావై ప్రశ్నావళి-జవాబులతో*

*శుభ ధనుర్మాసం.* తిరుప్పావై గురించి ప్రాధమిక అవగాహన ఆధారంగా తయారు చేసిన 108 ప్రశ్నలు-జవాబుల గోష్టియే ఈ తిరుప్పావై ప్రశ్నావళి. *ఇది ఎవరి జ్ఞానాన్ని పరీక్షించడానికో లేదా ఏ కొందరినో విజేతలుగా ప్రకటించడానికో సంకలనం చేసిన ప్రశ్నావళి కాదు.*

 *శ్రీకృష్ణుడు అందరినీ కలిసి రమ్మన్నాడు, లౌకిక సుఖాలు ఎవరికి వారు అనుభవించేవి, కాని భగవత్ అనుభవం అందరితో కలిసి చేసేవి, దాన్నే "గోష్టి " అంటారు... *•••••••••••••••••••
🕉️📚📚📚📚🕉️

*1.* ఆండాళ్ అని ఎవరికి పేరు?
=గోదాదేవి.

*2.* తిరుమల ఆలయంలో ధనుర్మాసంలో దేని బదులుగా తిరుప్పావై గానం చేస్తారు?
= సుప్రభాతం బదులుగా.

*3.* ఏది అసలైన మంచిరోజని గోదాదేవి చెప్పినది?
=భగవంతుని పొందాలి అని మన మనసులో పడిన రోజే మంచిరోజు.

*4.* గోదాదేవి తులసివనంలో లభించగా పెంచిన తండ్రి ఎవరు?
=శ్రీ విష్ణు చిత్తులు.

*5.* ఆళ్వారులు ఎంతమంది?
=12మంది.

*6.* గోదాదేవి ఎవరి అంశగా అవతరించింది?
=భూదేవి.

*7.* గోదాదేవి తిరుప్పావైను ఏ భాషలో గానం చేసింది?
=తమిళ భాష.

*8.* తిరుప్పావై ఏ దివ్య ప్రబంధములోని భాగము?
=నాలాయిర్ దివ్యప్రబంధము.

*9.* శ్రీ వైష్ణవ దివ్యదేశాలు ఎన్ని?
=108.

*10.* గోదాదేవి అవతరించిన దివ్యదేశం పేరు ఏమిటి?
=శ్రీవిల్లిపుత్తూరు.

*11.* దామోదరుడు అని శ్రీకృష్ణుని ఎందుకు పిలుస్తారు?
=దామము (త్రాడు) ఉదరము నందు కలవాడు కనుక.

*12.* శ్రీవిల్లిపుత్తూరు గోపురం ఎత్తు ఎంత?
=196 అడుగులు.

*13.* ‘లోకాఃసమస్తాఃసుఖినో భవంతు’ అనే భావన తిరుప్పావై ఎన్నవ పాశురంలో చెప్పబడినది?
=మూడవ పాశురం.

*14.* శ్రీవిల్లిపుత్తూర్ లోని రంగనాథ ఆలయంలో రాత్రి పూట స్వామికి చేసే ఆరగింపుకు ఏమని పేరు?
=తిరుసాదము.

*15.* శ్రీవిష్ణుచిత్తులు వారు తానకు తులసివనంలో లభించిన ఆండాళ్ కు మొదట పెట్టిన పేరు ఏమిటి?
=కోదై (గోదా)

*16.* పెరియాళ్వారుని (శ్రీవిష్ణుచిత్తులు) భగవంతుడి ఏ అంశగా భావిస్తారు?
=గరుడాంశము.

*17.* తిరుప్పావైను సంస్కృతంలో ఏమంటారు?
=శ్రీవ్రతము.

*18.* మేఘాన్ని ఎలా గర్జించమని గోదాదేవి చెబుతుంది?
=పరమాత్మ చేతిలోని శంఖమువలే.

*19.* శ్రీవేంకటేశ్వరుని చేరుటకై గోదాదేవి ఎవరిని వేడుకొన్నది?
=మన్మధుని

*20.* తల్లివద్ద కృష్ణుడు ఎలా ఉంటాడని గోదాదేవి చెప్పినది?
=సింహం పిల్లవలె.

*21.* తిరుప్పావై వ్రతమును ఆచరించుటకు అర్హత యేమిటి?
=ధృడమైన కోరిక, పట్టుదల.

*22.* కాలం కలసి రాకుండా దిక్కుతోచని స్థితి ఉన్నపుడు తిరుప్పావై ఎన్నవ పాశురాన్ని ప్రతిరోజు 11 సార్లు పారాయణం చేయాలని చెబుతారు?
=మొదటి పాశురం.

*23.* శ్రీకృష్ణుడు యశోదగర్భాన జన్మించాడని గోదాదేవి ఎందుకు కీర్తిస్తుంది?
=దేవకీపుత్రుడని కీర్తిస్తే కంసుడికి తెలిసి పోతుందేమోనని. (భావనా పరాకాష్ఠ)

*24.* ధనుర్మాస వ్రతం పాటించేటపుడు చేయవలసిన పనులేవో, చేయకూడని పనులేవో తిరుప్పావై ఎన్నో పాశురంలో చెప్పబడినది?
=రెండవ పాశురం.

*25.* తిరుప్పావై మూడవ పాశురంలో దశావతారాలలోని ఏ అవతారం గానం చేయబడినది?
=వామన అవతారం.

*26.* ఆళ్వార్లకు మరో పేరేమిటి?
=వైష్ణవ భక్తాగ్రేసరులు. దైవభక్తిలో మునిగి లోతు తెలుసుకున్నవారు, కాపాడువారు అని అర్థము.

*27.* నెలకు ఎన్ని వర్షాలు కురవాలని గోదాదేవి చెప్పినది?
=మూడు.

*28.* మేఘాన్ని ఏ విధంగా మెరవుమని గోదాదేవి శాసిస్తుంది?
=పద్మనాభుడి చేతిలోని సుదర్శన చక్రం వలె.

*29.* శ్రీకృష్ణుడు ఎక్కడ జన్మించాడో చెప్పడానికి గోదాదేవి చెప్పిన పేరు ఏమటి?
=ఉత్తర మధుర. (మధుర మీనాక్షి అని అనుకోకుండా వుండడానికి).

*30.* ‘పెరునీర్’ అంటే ‘పెద్ద మనస్సున్న నది’ అని గోదాదేవి ఏ నదిని కీర్తిస్తుంది?
=యమునా నది.

*31.* మనందరం పాటించవలసిన ఏ గుణాన్ని గోదాదేవి నాల్గవ పాశురంలో చెబుతుంది?
=దానగుణం.

*32.* లోకాన్ని సుఖపెట్టే లక్షణం ఉండాలని గోదాదేవి ఎవరికి చెబుతుంది?
=వర్షానికి.

*33.* పరమాత్మవద్దకు వచ్చేటపుడు ఎలా రావాలని గోదాదేవి చెబుతుంది?
=పరిశుద్ధులమై (త్రికరణ శుద్ధిగా) రావాలి.

*34.* విగ్రహరూపంలో వున్న పరమాత్మపై మనకు మంచి విశ్వాసం కలగాలంటే తిరుప్పావై ఎన్నవ పాశురం పారాయణ చేసుకోవాలి?
=ఐదవ పాశురం.

*35.* విష్వక్సేన అంశగా గల ఆళ్వారు పేరేమిటి?
=నమ్మళ్వారు.

*36.* తిరుప్పావై ఆరవ పాశురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది?
=బుద్ధివ్రతం.

*37.* గోదాదేవి మొదటగా మేల్కొనే గోపికను ఏమని పిలుస్తుంది?
=పిళ్ళాయ్ (పిల్లా).

*38.* తిరుప్పావై ఆరునుండి పదిహేను వరకు గోదాదేవిచే లేపబడు గోపికలను ఎవరితో పోల్చి చెబుతారు?
=ఆళ్వార్లతో.

*39.* గద (కౌమోదకీ) అంశ గా గల ఆళ్వారు ఎవరు?
=పూదత్తాళ్వారు.

*40.* తిరుప్పావైలోని ఏడవ పాశురం ఏ దివ్యదేశంలో రెండుసార్లు పాడుతారు?
=శ్రీపెరుంబుదూరులో ఆదికేశవ పెరుమాళ్ సన్నిధిలో.

*41.* కీచుకీచుమని అరిచే *ఏ* పక్షులు తిరుప్పావైలో ప్రస్తావించబడ్డాయి?
=భరద్వాజ (చాతక) పక్షులు.

*42.* తిరుప్పావై ఏడవ పాశురంలో స్మరింపబడిన ఆళ్వారు ఎవరు?
=కులశేఖరాళ్వార్.

*43.


='బహుధా విజాయతే' (అనేక విధములుగా పుట్టుచున్నాడు)

*94.* సముద్రాన్ని దాటించేది ఓడ అయితే సంసారమును దాటించే ఓడ ఏది?
=విష్ణుపోతము

(విష్ణువనే ఓడ)

*95.* పరమాత్మ గొప్పా? ఆయన దాసులు గొప్పా?
=ఆయన దాసులే గొప్ప.

*96.* ఏడేడు జన్మలనగా ఎన్ని జన్మలని అర్ధము?
=ఎన్ని జన్మలకైనా అని అర్థము.

*97.* ఇరవై తొమ్మిదవ పాశురములో గోదాదేవి ఏ దివ్యదేశమును కీర్తించెను?
=అయోధ్య.

*98.* వజ్గం అంటే ఏమిటి?
=ఓడ.

*99.* ధన్వంతరి అవతారంలో శ్రీమహావిష్ణువు చేతిలో ఏమి కలిగి వుంటాడు?
=అమృత కలశం.

*100.* ముప్ఫయ్యవ పాశురంలో పరమాత్మను ఏమని వర్ణించెను?
=తిజ్గళ్ తిరుముగత్తు- అనగా చంద్రుని పోలిన దివ్యతిరుముఖ మండలం గలవాడా.

*101.* గోపికల దివ్యాభరణములేవి?
=కృష్ణుని ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించుటయే.

*102.* శ్రీ విల్లిపుత్తూరు ఎటువంటిదని గోదాదేవి కీర్తించెను?
=అణి పుదువై- ఈ జగత్తుకే మణివంటిది.

*103.* శ్రీవిష్ణుచిత్తుల వారు తమ మెడలో ఏ మాల ధరించెను?
=పైమ్ కమల తణ్తెరియల్ - నల్లని చల్లని తామర పూసల మాల.

*104.* గోదాదేవి ముఫ్పైవ పాశురంలో తాను ఎవరి కూతురునని చెప్పెను?
= పట్టర్ పిరాన్ కోదై (శ్రీవిష్ణుచిత్తుల వారి గోదాదేవిని).
 
*105.* తిరుప్పావై ఎటువంటి మాల?
=ముఫ్ఫై తమిళ పాశురములనే పూసలతో చేయబడ్డ మాల.

*106.* శ్రీకృష్ణదేవరాయలు రచించిన తెలుగు ప్రబంధం ‘ఆముక్తమాల్యద’ ఎవరి పేరు?
= గోదాదేవి.

*107.* శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యదలో ఎవరి కల్యాణం వర్ణింపబడినది?
=గోదాదేవి మరియు శ్రీరంగేశుల కల్యాణం.

*108.* భగవానుడి వనమాల అంశగా గల ఆళ్వారు పేరేమిటి?
=తొండరపడిప్పొడి
యాళ్వార్.
జై శ్రీమన్నారాయణ ఆణ్డాళ్ తిరువడిగళే  శరణమ్

*శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రవచనం* తిరుప్పావై --- 3వ పాశురము

*శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్  స్వామివారి ప్రవచనం* 

 తిరుప్పావై --- 3వ పాశురము

 ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి 
 నాంగళ్ నం పావైక్కు చ్చాత్తి నీర్ ఆడినాల్ 
 తీంగిన్ఱి నాడేల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు
 ఓంగు పెఱుం జెన్నెలూడు కయల్ ఉగళ
 పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప* 
 తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి
 వాంగ క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్
 నీంగాద శెల్వం నిఱైందేలోర్ ఎమ్బావాయ్ 


విభవం(అవతారములు)

ఈ రోజు ఆండాళ్ తల్లి అవతారముగా వచ్చిన వామనమూర్తిని కొలిచింది. పాల్కడలిలోకి దిగివచ్చిన నారాయణ తత్వం మనకోసం ఒక సారి చేప లాగా, ఒకసారి తాబేలు లాగా, ఒక సారి వరాహమ్లాగ, మరోకసారి ఇటు మనిషి కాని అటు మృగము కాని వాడిలా, ఒక సారి మనిషిలా ఇలా ఎన్నో రకాలుగా ఆయా అవసరాలను బట్టి ఒక రూపం స్వీకరించి మనవద్దకు వస్తాడు.
 
 
"ఓంగి" పెరిగెను "ఉలగళంద" కొలిచెను "ఉత్తమన్ పేర్ పాడి" పరమాత్మ నామాన్నే పాడుదాం. నామమే చాలా గొప్పది, భగవంతుడు ముద్ద బంగారం అయితే ఆయన నామం ఆభరణం లాంటిది. అయన నామం కు ఒంగి ఉంటాడు. ఎవరి నామాన్ని పాడితే ప్రాచీన పాప రాశి అంతా కొట్టుకు పోతుందో, మంచి నడవడిక ఏర్పడుతుందో, నాలుక ఉన్నందుకు సార్తకత ఏర్పడుతుందో ఆయన నామాన్ని పాడుదాం. సౌదర్యం, సౌశీల్యం, సౌలభ్యం అన్ని గుణాలు కల్గిన వామన మూర్తిని అమ్మ ఊహించింది.


ఒక్కసారిగా పెరిగి ఆయన లోకాలను కొలిచాడు, ఆపెరగటం కూడా భలి చక్రవర్తి ఒకపాదాన్ని కడిగిన నీరు, బ్రహ్మలోకంలో బ్రహ్మ కడిగిన రెండో పాదం నీరు ఒకే సారి భూమిని చేరాయట. మరీ ఇంత త్వరగా ఎలా పెరగాడు! ఆయన పెరగలేదు ఆయన అంతటా వ్యాపించి ఉంటాడుకదా ఒక్కసారిగా ఆయన వ్యాప్తిని చూపించాడు.   పెరగటం తరగటం మనం చేసేవి మన కర్మల వల్ల, మన సంస్కారాల వల్ల. మరి జన్మ కర్మలు లేనివాడు ఆయన, ఇది మన కోసం చేస్తాడు. ఇవన్నీ ఆయన ప్రేమ కోసం చేస్తాడు.  మూడో కాలు భలి తలపై పెట్టాడు, బలి అహం కాస్తా దాసోహంగా మారింది. రసాతలం భలికి ఇచ్చినాడు. 


మొదటి రోజు ఆండాళ్ తల్లి మనకు నారాయణ తత్వం గురించి చెప్పింది, రెండో రోజు ఆ తత్వం మనల్ని రక్షించేందుకు ఆయన పాల్కడలిలో ఎలా ఉంటాడో చెప్పింది, ఈరోజు ఆయన మనల్ని ఉద్దరించేందుకు ఎలా అవతారంగా వచ్చాడో తెలుపుతుంది.

వ్రత ఫలితములు

ఈరోజు చాలా ప్రధానమైన రోజు, ఆండాళ్ తల్లి ఈవ్రతం చేస్తే వచ్చే ఫలితం గురించి చెప్పినరోజు.  పెద్దలు మనల్ని అశిర్వదించాలంటే ఈ పాటను పాడి మనల్ని ఆశీర్వదిస్తారు. మనషికి మంచి భవనాలు ఉంటే సుఖమా! లేక  యంత్రాలు,వాహనాలు  ఉంటే సుఖమా! లేక  సమాజంలోని వ్యక్తులందరికి అవసరమయ్యే కనీస అవసరాలు ఉంటే  సుఖమా! మనిషికి ఉండటానికి నీడ అవసరం -అది ప్రశాంతం గా ఉండాలి, తినడానికి ఆహారం అవసరం అది పుష్టిగా ఉండాలి, త్రాగటానికి జలం అవసరం- అది ఆరోగ్యకరంగా ఉండాలి. ఈ కనీస అవసరాలు అందించే వ్యవస్త కావాలి. ఈతి బాధలు ఉండకూడదు, దోంగలూ ఉండకూడదు, రోగాలు ఉండకూడదు.

మనం చేసే కార్యాలు ఎలా ఉండాలంటే దృష్ట-అదృష్ట రెండూ ప్రయోజనాలను కల్గించేలా ఉండాలి. మనం చేసే చిన్న చిన్న యజ్ఞాలకే స్వర్గాది ఫలాలు వస్తాయి అంటారే అది అదృష్ట ఫలం, దృష్ట ఫలం గా ఇక్కడ ఉన్నప్పుడు అనుభవించే డబ్బు, మంచి సంతానం, భవనాలు, దీర్ఘ ఆయిస్సు, మంచి ఆరోగ్యం ఇవన్నీ లభిస్తాయి అంటారు.  మరి మనం చేసే ధనుర్మాస వ్రతం దేవాది దేవుడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమత్మకోసం చేసేది కావటంచే మనకు లభించేది తిరిగి మనం ఈ కర్మకూపంలోకి చేరక్కరలేకుండా తరించే వీలయ్యే ఉత్తమ స్థానం మనకు తప్పక లభిస్తుంది. ఒక్కసారి ధనుర్మాస వ్రతం చేస్తే మనకు ఆయన దగ్గర స్థానం లభించక మానదు.  అక్కడికి వెల్లేముందు మనకు లభించే ఫలితాలు ఈరోజు ఆండాళ్ తల్లి వివరిస్తుంది.

ఈ వ్రత గొప్పతనం అలాంటిది, ఈ వ్రత ఫలితం ఇచ్చే శ్రీకృష్ణుడి గొప్పతనం అలాంటిది,ఈ వ్రతంలో మనం వాడే మంత్రం ప్రభావం అలాంటిది,  ఈ వ్రతం ఆచరించిన గోపికల గొప్పతనం అలాంటిది, ఆ వ్రతాన్ని మనకు పాడి ఇచ్చిన ఆండళ్ అమ్మ తల్లి వైభవం అట్లాంటిది. మనకు కావల్సింది కేవలం పరిపూర్ణమైన విశ్వాసం ఒకటి ఏర్పడాలి. సకల దేవతలు శ్రీకృష్ణపరమాత్మ రూపంలో ఒదిగి ఉంటారు కదా! ఆయన అనుగ్రహిస్తే అందరూ అనుగ్రహించినట్లే కదా! ఆయనను తెలిపే నారాయణ మంత్రం ఒక్కటి అనుష్టిస్తే మిగతా మంత్రాలన్నీ అనుష్టిస్తే వచ్చే ఫలం లభించదా!.

ఇక్కడ మనం మహాభారతంలో ఒక సన్నివేషం గుర్తుచేసుకుందాం, అజ్ఞాతవసంలో పాండవుల గుట్టు రట్టు చేయటానికి ధుర్యోధనుడు తన గూడాచారులను పంపాడు, వారికి ఎక్కడ కనబడలేదు. ఇంత పరాక్రమమైన వాల్లు దాగి ఉండటం చాల వింతయే కదా! దానికి భీష్మ పితామహుడు వారితో పాండవులను వెతకటం అట్లాకాదయా, వారు ఒక్కొక్కరూ నారాయణ మహామత్రం ఉపాసన చేసిన మహనీయులు కనక వారు ఉన్నదగ్గర వానలు బాగా కురుస్తాయి, పంటలు బాగా పండుతాయి, రోగాలు ఉండవు, దొంగల భాద ఉండదు, ఇప్పుడు వెతకండి అని రహస్యాన్ని చెప్పాడు. అప్పుడు వారికి విరాట్ నగరం సిరిసంపదలతో కనబడింది, అందుకే ఉత్తరగోగ్రహణం చేసారు. తరువాత కథ మనకు తెలుసు, ఇక్కడ మనకు కథ కాదు ప్రధానం. మనం నారాయణ మహామంత్ర గొప్పతనం

Tuesday, December 8, 2020

*కార్తీక పురాణం - 22 వ అధ్యాయము*_

_*కార్తీక పురాణం - 22 వ అధ్యాయము*_

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


 *పురంజయుడు కార్తీక పౌర్ణమీ వ్రతము చేయుట*

☘☘☘☘☘☘☘☘☘

మరల అత్రి మహాముని అగస్త్యునకిట్లు చెప్పదొడగెను.
పురంజయుడు వశిష్టుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచియై దేవాలయమునకు వెళ్లి శ్రీమన్నారాయణుని షోడశోపచారములతో పూజించి , శ్రీహరిని గానముచేసి , సాష్టాంగ నమస్కారము చేసి , సూర్యోదయముకాగానే నదికిపోయి , స్నానమాచరించి తన గృహమున కెగెను. అట్టి సమయములో విష్ణుభక్తుడగు ఒక వృద్ద బ్రాహ్మణుడు - మెడ నిండా తులసి మాలలు ధరించి పురంజయుని సమిపించి *"రాజా ! విచారింపకుము నీవు వెంటనే చెల్లాచెదురైయున్న నీ సైన్యమును కూడాదీసుకొని , యుద్ద సన్నద్ధుడై శత్రురాజులతో పోరు సల్పుము , నీ రాజ్యము నీకు దక్కును"*, అని దీవించి అదృశ్యుడయ్యెను. *"ఈతడెవరో మహానుభావునివలె ఉన్నారు అని , ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధసన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను. దెబ్బతిని క్రోథముతో నున్న పురంజయుని సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యములు నిలువలేకపోయినవి. అదియును గాక , శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడెను. అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే గదా !*

ఆ యుద్దములో కాంభోజాది భూపాలురు ఓడిపోయి *"పురంజయా రక్షింపుము రక్షింపు"* మని కేకలు వేయుచు పారిపోయిరి. పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను. శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులయిన వారికి శత్రుభయము కలుగుతుందా ! విషం త్రాగినను అమృతమే యగును. ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని యివ్వగా *'శ్రీ హరి'* అని ప్రార్ధించి త్రాగగా అమృతమైనది గదా ! శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు వున్నంత వరకును ధృవుడు చిరంజీవియే గదా !

హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును. అధర్మము ధర్మముగా మారును. దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును. త్రాడు పామై కరచును. కార్తీకమాసమంతయు నదీ స్నానమొనరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారధన చేసినచో సర్వవిపత్తులు పటాపంచలగును. అన్ని సౌఖ్యములు సమకూరును. విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమాచరించు వారికి యే జాతి వారికైనా పుణ్యము సమానమే. బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకులముతో సమానమగును. వేదాధ్యయన మొనరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠానతత్పరుడైన వైష్ణవోత్తముని హృదయపద్మమున భగవంతుడుండును. సంసారసాగరం ఉద్దరించుటకు దైవభక్తియే సాధనము. జాతి భేదముతో నిమిత్తము లేదు. విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము. వ్యాసుడు , అంబరీషుడు , శౌనకాది మహాఋషులు - మరెందరో రాజాధిరాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తినొందిరి. శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలె కాపాడుచుండును. ఎవరికైనను శక్తి లేని యెడల వారు తమ ద్రవ్యమును వెచ్చించియైనను మరి యొకరి చేత దానధర్మములు వ్రతములు చేయించవచ్చును. శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోకపోషకుడు , భక్త రక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదాసంపదలనొసంగి కాపాడుచుండును.

శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి , వెయ్యి సూర్యభగవానుల తేజస్సు గలవాడు , నిరాకారుడు , నిర్వికల్పుడు , నిత్యానందుడు , నీరజాక్షుడు , పద్నాలుగు లోకములను తన కుక్షియందిడుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీమహావిష్ణువునకు అతిప్రియమైన కార్తీక మాసవ్రతమును భక్తి శ్రద్దలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీమహావిష్ణువు లక్ష్మి సమేతుడై వెలయగలడు. ఆ ఇల్లు సిరిసంపదలతో కలకలలాడును. కార్తీకమాసములో శుచియై పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు. వారి వంశమంతయు తరించును. ఇది ముమ్మాటికి నిజము.

కార్తీకపురాణం 23 అధ్యాయం🌈🪔🪔🪔🪔🪔

🌈కార్తీకపురాణం 23 అధ్యాయం🌈
🪔🪔🪔🪔🪔

🕉🕉🕉🕉🕉🕉🕉🕉

🌹*శ్రీ రంగక్షేత్రమున పురంజయుడు ముక్తినొందుట*

అగస్త్యుడు మరల అత్రిమహర్షిని గాంచి "ఓ మునిపుంగవా! విజయమందిన పురంజయుడు యేమిచేసెనో వివరింపు"మని యడుగగా అత్రిమహాముని యిట్లు చెప్పిరి - కు౦భసంభవా! పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము, శత్రుశేషము వుండకూడదని తెలిసి, తన శత్రురాజుల నందరినీ ఓడించి నిరాటకంముగా తన రాజ్యమును యేలుచుండెను. తన యొక్క విష్ణుభక్తి ప్రభావమువలన గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్యదీక్షాతత్పరుడు, నిత్యాన్నదాత, భక్తప్రియవాది, తేజోవంతుడు, వేదవేదా౦గవేత్తయై యుండను. మరియు అనేక శత్రువులను జయించి దశదిశలా తన యఖ౦డ కీర్తిని ప్రసరింపచేసెను. శత్రువులకు సింహస్వప్నమై, విష్ణు సేవాధురంధరుడై, కార్తీకవ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్వర్గములను కుడా జయించినవాడై యుండెను. ఇన్ని యేల? అతడిప్పుడు విష్ణుభక్తాగ్రేసరుడు, సదాచారసత్పురుషులలో వుత్తముడై రాణించుచుండెను. అయినను తనకు తృప్తిలేదు. ఏ దేశమున, యే కాలమున, యే క్షేత్రమున యే విధముగా శ్రీ హరిని పూజించిన కృతార్దుడనగుదునా? యని విచారించుచుండగా  ఒకానొకనాడు అశరీరవాణి "పురంజయా! కావేరీతీరమున శ్రీరంగ క్షేత్రమున్నది. దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు. నీవచటకేగి శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము. నీవీ సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి నొందుదువు" అని పలికెను.

అంతట పురంజయుడు ఆ యశిరీరవాణి వాక్యములు విని, రాజ్యభారమును మంత్రులకు అప్పగించి, సపరివారముగా బయలుదేరి మార్గమధ్యముననున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు, ఆయా దేవతలను సేవించుచు, పుణ్యనదులలో స్నానము చేయుచు, శ్రీరంగమును జేరుకొనెను. అక్కడ కావేరీనది రెండుపాయలై ప్రవహించుచుండగా మధ్యనున్నశ్రీరంగనాథాలయమున శేషశయ్యపై పవళించియున్న శ్రీరంగనాథుని గాంచి పరవశమొంది, చేతులు జోడించి, "దామోదరా! గోవిందా! గోపాలా! హరే! కృష్ణా! వాసుదేవా! అనంతా! అచ్యుతా! ముకుందా! పురాణపురుషా! హృషికేశా! ద్రౌపదీమాన సంరక్షకా! దీనజన భక్తపోషా! ప్రహ్లాదవరదా! గరుడధ్వజా ! కరివరదా! పాహిమాం! పాహమాం! రక్షమాం రక్షమాం! దాసోహం పరమాత్మ దాసోహం" యని విష్ణు సోత్త్రమును పఠించి, కార్తీక మాసమంతయు శ్రీ రంగమునందే గడిపి తదుపరి సపరి వారముగా అయోధ్యకు బయలుదేరును. పురంజయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల, మహిమవలన అతని రాజ్యమందలి జనులందరూ సిరిసంపదలతో, పాడిపంటలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యములతో నుండిరి.

అయోధ్యానగరము దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహాగోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను. అయోధ్యా నగరమందలి వీరులు యుద్దనేర్పరులై, రాజనీతి గలవారై, వైరిగర్భ నిర్బేదకులై, నిరంతరము విజయశశీలురై, అప్రమత్తులై యుండిరి. ఆ నగర మందలి అంగనామణులు హంసగజగామినులూ, పద్మ పత్రాయత లోచనులూనై విపుల శోణీత్వము, విశాల కటిత్వము, సూక్ష్మ మద్యత్వము; సింహకుచపీనత్వము కలిగి రూపవతులనియు, శీలవతులనియు, గుణవతులనియు ఖ్యాతికలిగి యుండిరి.

ఆ నగర మందలి వెలయాండ్రు నృత్యగీత సంగీతాది కళావిశారదలై, ప్రౌఢలై, వయోగుణ రూప లావణ్య సంపన్నలై, సదా మోహన హాసాలంకృత ముఖిశోభితలై యుండిరి. ఆ పట్టణకులాంగనలు పతిశుశ్రూషా పారాయణలై సద్గుణాలంకార భూషితలై చిద్విలాస హసోల్లాస పులకాంకిత శరీరలై యుండిరి.

పురంజయుడు శ్రీరంగక్షేత్రమున కార్తీకమాస వ్రతమాచరించి సతీసమేతుడై యింటికి సుఖముగా జేరెను. పురంజయుని రాక విని పౌరజనాదులు మంగళవాద్యతూర్య ధ్వనులతో యెదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంత:పురమును ప్రవేశపెట్టిరి. అతడు ధర్మాభిలాషియై దైవభక్తి పరాయుణుడై రాజ్యపాలన మొనర్చుచు, కొంతకాలము గడిపి వృద్దాప్యము వచ్చుటచే ఐహిక వాంఛలను వాదులుకొని, తన కుమారునికి రాజ్యభారమువప్పిగించి పట్టాభిషిక్తుని చేసి తాను వాన ప్రస్థాశ్రమము స్వీకరించి అరణ్యమునకేగెను. అతడా వానప్రస్థాశ్రమమందు కూడా యేటేటా విధివిధానముగ కార్తీక వ్రతమాచరించుచు క్రమక్రమముగా శరీరముడుగుటచే మరణించి వైకుంఠమునుకు పోయెను. కావున, ఓ యగస్త్యా! కార్తీకవ్రతము అత్యంత ఫలప్రదమైన మహాత్మ్యము కలది. దానిని ప్రతివారును ఆచరించవలెను. ఈ కథ చదివిన వారికి, చదివినపుడు వినువారికి కూడా వైకుంఠప్రాప్తి కలుగును.

*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీకమహత్మ్య మందలి త్రయోవింశోధ్యాయము - ఇరవైమూడో రోజు పారాయణము సమాప్తము.*

         🪔 ఓం నమః శివాయ 🪔

    🌹సర్వేజనా సుఖినోభవంతు🌹

అరుణగిరి ప్రదక్షిణ గురించి రమణ మహర్షి ఇలా సెలవిచ్చారు ....

🌺ఓం నమో భగవతే శ్రీ రమణాయ🌸

          అరుణగిరి ప్రదక్షిణ గురించి 
                  రమణ మహర్షి ఇలా సెలవిచ్చారు ....

1 .    నిజానికి ఈ గిరిప్రదక్షిణ వలన కలిగే ఆహ్లాదం ,
         సుఖం ఇంత అని చెప్పడానికి శక్యం కాదు .

2 .   శరీరం అలసిపోయి ఇంద్రియ చేష్టలకు బలం
        తగ్గి సర్వ వృత్తులూ అంతర్గతం కాగలవు .

3 .   నడుస్తూనే ఉండడం వలన శరీరం తానుగానే
       ఆసన పద్దతిన అమరిపోతుంది . అందువలన
       శరీరానికి ఆరోగ్యం ఏర్పడుతుంది . అలాగే
       మైమరచి ధ్యాన మగ్నతను పొందవచ్చును .

4 .   ఇది ఔషధుల కొండ  . ఈ ఔషధుల మీదుగా
       వచ్చే గాలి  శ్వాసకోసాలకు  చాలా  మంచిది .

5 .   గిరి ప్రదక్షిణ వలన శరీరం తేలికపడి తానుగానే
       నడచి పోతుంది . మనం నడుస్తున్నామన్న
       తలపే ఉండదు .

6 .   కూర్చుంటే కుదరని ధ్యానం ప్రదక్షిణానికి వెళితే
       కుదురుతుంది . ఆ ప్రదేశము గాలి అటువంటిది.

7 .   ఎంత నడవలేని వారు అయినా  ఒకసారి 
        వెళ్లివచ్చారంటే  మళ్ళీ వెళ్లాలనే    
        బుద్ధిపుడుతుంది .

8 .    వెళ్లినకొద్దీ సరదా ఎక్కువ అవుతుందేకాని
        తగ్గదు .

9 .    గిరి పదక్షిణకు అలవాటుపడితే ఇక
         విడువలేరు .

10 .  ఈ గిరి ప్రదక్షిణ " సంచార సమాధిని "
         ప్రసాదిస్తుంది .

11 .  ఈ గిరి " స్వయంభూలింగము " .

12 .  భక్తుల పాద ధూళియే ఈ పర్వతము .

13 .  ఈ గిరి ప్రదక్షిణ పరమ పవిత్రమైనది . 
         పాపాలు నశిస్తాయి .

14 .  గిరి ప్రదక్షిణ అనే ఔషధం శరీర మాలిన్యాలను ,
         మనో మాలిన్యాలను పోగొడుతుంది .

 15 . సాధకులు , రోజుకు ఒక్కసారి అయినా గిరి
        ప్రదక్షిణ  చేయాలి . దీని వలన మనసు
        తమస్సును వదలి సత్వ గుణాన్ని
        పొందుతుంది .

16 . సాధకులు గిరి ప్రదక్షిణ అనే ఔషదాన్ని
        సేవించాలి .

Wednesday, December 2, 2020

జై శ్రీ రామ్🙏🚩,రామాయణంలో ఒక ముఖ్యమైన ఘట్టం 'సీతా స్వయంవరం'. 'స్వయంవరం' అంటే స్వయంవరం నిర్వహించే రాజు యొక్క కూతురు అంటే రాకుమారి, తనకిష్టమైన వ్యక్తిని ఎంచుకొని పెళ్లిచేసుకుంటుంది.

జై శ్రీ రామ్🙏🚩,

రామాయణంలో ఒక ముఖ్యమైన ఘట్టం 'సీతా స్వయంవరం'. 'స్వయంవరం' అంటే స్వయంవరం నిర్వహించే రాజు యొక్క కూతురు అంటే రాకుమారి, తనకిష్టమైన వ్యక్తిని ఎంచుకొని పెళ్లిచేసుకుంటుంది. ఐతే వరుణ్ణి ఎంచుకోవడం ఒక షరతు వల్ల కానీ లేక రాకుమారి వరమాల వేసి కానీ ఎంచుకోవడం జరుగుతుంది. సీత దేవి తన బాల్యంలో శివ ధనుస్సును ఆటలాడుతూ అవలీలగా ఎత్తడం చేత వివాహ యోగ్యత వచ్చిన అనంతరం సీత దేవి తండ్రి జనక మహారాజు, పరశురాముని సలహా మేరకు స్వయంవరంలో ఎవరైతే శివ ధనుస్సును ఎత్తి, వింటిని కట్టి, బాణాన్ని సంధిస్తాడో అతనికే సీతనిచ్చి వివాహం జరుపుతానని ప్రకటించాడు. స్వయంవరానికి భారతవర్షములోని అందరు రాజులు పాల్గొంటారు. కానీ అందరు విఫలమౌతారు. చివరికి శివుని యొక్క పరమభక్తుడు రావణాసురుడు కూడా శివ ధనుస్సును ఎత్తలేక పోతాడు, అవమానంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా సీతాదేవికి వివాహం జరగదు అని సభలో గుసగుసలు మొదలవుతాయి. ఇంతలో రఘుకుల యువకులను వెంటబెట్టుకొని శివ ధనుస్సుని దర్శనం చేసుకొనుటకు వచ్చిన విశ్వామిత్రుడు జనక రాజు అనుమతితో రాముని శివ ధనస్సుపై బాణాన్ని సంధించమని  ఆజ్ఞాపిస్తాడు. గురువు ఆజ్ఞను పాటిస్తూ శ్రీ రాముడు భక్తి పూర్వకంగా శివ ధనస్సుకి మొక్కి, అవలీలగా శివ ధనస్సును ఎత్తుతాడు. స్వయంవర సభలో ఉన్న అందరు ఆశ్చర్యచకితులై ఉండిపోతారు. వింటిని కట్టబోయి శ్రీ రాముడు శివ ధనస్సును వంచుతూ దానిని రెండుగా విరిచేస్తాడు. అందరూ భయబ్రాంతులకు గురై ఏమి తోచని స్థితిలో ఉండగా, విశ్వామిత్రుడు శ్రీ రాముడిని ధనుస్సుని విరిచేందుకు గల కారణం అడుగుతాడు. అప్పుడు శ్రీ రాముడు వినయంగా గురువుగారికి నమస్కరించి  "గురుదేవా, స్వయంవరం యొక్క షరతు ప్రకారం శివ ధనస్సుపై బాణాన్ని సంధించినవాడు సీత దేవిని వరిస్తాడు, కానీ ఈ స్వయంవరం ఒక పోటీగా మారింది. గెలిచినవాడు సీతాదేవి ఇష్టాయిష్టాలకు సంబంధంలేకుండా తనని పెళ్లిచేసుకుంటాడు. సీతాదేవి కేవలం ఒక బహుమతి రూపంలో చూడబడుతుంది కానీ ఒక వ్యక్తిగా కాదు. ఇప్పుడు నియమానుసారం నేను వింటిని కట్టి బాణాన్ని సంధించలేదు అందువలన నన్ను విజేతగా ప్రకటించలేరు. ఇంకా వేరే ఎవ్వరు కూడా వింటిని కట్టి సంధించడానికి శివ ధనస్సులేదు. కాబట్టి సీతాదేవి గౌరవంగా తనకిష్టమైన వాడిని వరించవచ్చు" అని గురువుకు విన్నవించుకున్నాడు. రాముని యొక్క శక్తిని కళ్లారా చూసిన అందరూ శ్రీ రాముని విజేతగా గ్రహించి మరియు శ్రీ రాముని యొక్క గొప్ప వ్యక్తిత్వానికి తలవంచి గౌరవించారు, తమ మూర్ఖత్వానికి సీతాదేవికి శిరస్సు వంచి నమస్కరించారు. అంతకు ముందే పరిచయం కలిగిన శ్రీ రాముని సీతాదేవి అభిమానించేది, ఇప్పుడు అతనిపై ఆ అభిమానం ప్రేమగా మారి, సీత దేవి ఆ వరమాలను రాముని మెడలోవేసి శ్రీ రామున్ని వరించింది. 

స్వయంవర మర్యాదను తీసిపారేయక, సీతా దేవి మనస్సుని ఒక్క మనిషి వలే ఎరిగి, తన గౌరవాన్ని మరియు ఇష్టానికి విలువనిస్తూ శ్రీ రాముడు పురుషోత్తముడిగా అందరి హృదయాలలో నిలిచాడు. శ్రీ రాముని యొక్క ధర్మ నిష్ఠ మరియు వ్యక్తిత్వము చేత శ్రీ రాముడు సనాతన ధర్మానికి ప్రతీకై నిలిచాడు. 

జై శ్రీ రామ్🙏🚩, జై జై శ్రీ రామ్🙏🚩..

Yes, she has gained weight? Defeated without losing a bout.

అవును, ఆమె కొంచెం బరువు పెరిగే వుంటుంది. ఎందుకంటే…. ఆటల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే నిండైన ఆత్మాభిమానాన్ని, విశ్వ వేదికపైనే కాదు వ...