*🌹 శివ లింగములు - వాటి లోని రకములు - వివిధ ఫలితములు 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*ఆకాశమే లింగం. భూమి దాని పీఠం. అది సమస్త దేవతలకు నిలయం. ఇందే అంతా లయం చెందుతుంది. అందుేక దీనిని లింగం అని అన్నారు. ‘లిం’ అంటే మన కంటికి కనిపించకుండా లీనమై ఉన్నదానిని, ‘గం’ అంటే ఒక గుర్తు రూపంలో తెలియజేస్తుంటుంది. అందుేక అది లింగమైంది. ఈ సృష్టి సమస్తం శివమయం. ఈ సమస్తం ఆయనచే సృష్టించబడింది. సృష్టికి పూర్వం ఈ సమస్త విశ్వమంతా నీటితో నిండి నిభిడృకృతమై అంతులేని మహాసముద్రం వలె ఉండేది. ఆ మహాజలం నుంచి ఓ మహా తేజస్సు ఉత్పన్నమైంది. ఆ తేజఃపుంజమే క్రమంగా ఒక రూపాన్ని సంతరించుకుంది. ఆ తేజోమయరూపమే పరబ్రహ్మం. ఆయనే లింగరూపాన్ని ధరించిన శివుడు.*
*సామాన్యంగా లింగశబ్దానికి చిహ్నంలేక లక్షనం లనే అర్థాలు న్నాయి. ప్రకృతి, వికృతులు రెండూ లింగమనే సౌంఖ్యద ర్శనం చెప్పింది. విగ్రహాన్ని మూర్తి అని అంటారు. మూర్తి ధ్యానా న్నిబట్టి ఆకారాలు ఉంటాయి. కానీ, లింగములో ఆకారంగానీ, రూపంగానీ, చెప్పవీలుబడదు. అదొక చిహ్నం మిత్రమే. లయనా ల్లింగముచ్యతే అని అన్నారు. అంటే, లయం ప్రళయంగావడం వల్ల లింగమని చెప్పబడుతోంది. ప్రళయాగ్నిలో సర్వమూ భస్మమై శివలింగంలో చేరుతుంది. లింగార్చనతో సర్వదేవతల పూజ జరుగునని లింగపురాణం చెబుతుంది.స్వామి సర్వవ్యాపి కనుక ఆయనకు ఆకారం ఉండదు. తాను ఇత రులకు దర్శనమివ్వాలి అనుకున్నప్పుడు అంబతో కలిసి (సాంబ) దర్శనమిస్తుంటాడు. ఆ స్వామి రూపంలేని స్థితి నుంచి సాంబ మూర్తిగా దర్శనమివ్వడానికి మధ్యలో మరొక రూపం ఉంది. దానినే అరూపమని అంటారు.అదే శివలింగం.*
*శివలింగాలు ఐదు రకాలుగా మనకు గోచరిస్తుంటాయి. తనంతట తానుగా అవతరిచినది స్వయంభూలింగం. ధ్యానపూర్వకమైనది బిందు లింగం. మంత్రపూర్వకమైనది ప్రతిష్ఠాలింగం. నాలుగవది చర లింగం. ఐదవది శివుని విగ్రహమైన గురులింగం.*
*ఈ పవిత్రభార తావనిలో కొన్నివేల శివలింగాలను దర్శించుకోవచ్చు.* *మరికొన్ని గ్రంథాలు శివలింగం యొక్క రంగు, ఆకారం, కొలతలననుసరిం చి శివలింగాలను నాలుగు విధాలుగా పేర్కొన్నాయ. అవి: ఆఢ్యం, సురేఢ్యం, అనాఢ్యం, సర్వసమం. 1001 ముఖాలతో కనబడే శివలింగం ఆఢ్యం. 108 ముఖాలతో కనబడే శివలింగం సురే ఢ్యం. ప్రస్తుతం ఉన్నవి, లేనివి అన్ని శివలింగరూపాలను అనా ఢ్యం అంటున్నారు. ఒకటి నుంచి ఐదు ముఖాలుగల శివలిం గాలు సర్వసమం.*
*ముఖలింగాలను మనం అరుదుగానే చూస్తుంటాం. ఏకముఖలిం గం, ద్విముఖలింగం, త్రిముఖలింగం, చతుర్ముఖలింగం, పంచ ముఖలింగం, షణ్ముఖలింగం అంటూ ముఖలింగాలను చూడ వచ్చు. అయితే ఆరుముఖాలు గల షణ్ముaఖలింగాన్ని పూజించే పద్ధతి ప్రస్తుతం లేదు. ఈ ముఖలింగాలను పూజించడం వల్ల ఇహంలో అష్టైశ్వర్యాలు, పరంలో శివసాయుజ్యం లభిస్తుందని పురాణవచనం.*
*స్వామి సర్వవ్యాపి కనుక ఆయనకు ఆకా రం ఉండదు. తాను ఇతరులకు దర్శనమివ్వాలనుకున్నప్పుడు అంబతో కలిసి (సాంబ) దర్శనమిస్తుంటాడు. ఆ స్వామి రూపం లేని స్థితి నుంచి సాంబ మూర్తిగా దర్శనమివ్వడా నికి మధ్యలో మరొక రూపం ఉంది. దానినే అరూపమని అంటారు. అదే శివలింగం. శివలిం గాలు ఐదు రకాలుగా మనకు గోచరిస్తుంటాయి. తనంతట తానుగా అవతరిచినది స్వయంభూలింగం. ధ్యానపూర్వకమైనది బిందు లింగం. మంత్రపూర్వకమైనది ప్రతిష్ఠాలింగం. నాలుగవది చర లింగం. ఐదవది శివుని విగ్రహమైన గురులింగం.*
*ముఖలింగాలను మనం అరుదుగానే చూస్తుంటాం. ఏకముఖలిం గం, ద్విముఖలింగం, త్రిముఖలింగం, చతుర్ముఖలింగం, పంచ ముఖలింగం, షణ్ముఖలింగం అంటూ ముఖలింగాలను చూడ వచ్చు. అయితే ఆరుముఖాలు గల షణ్ముఖలింగాన్ని పూజించే పద్ధతి ప్రస్తుతం లేదు. ఈ ముఖలింగాలను పూజించడం వల్ల ఇహంలో అష్టైశ్వర్యాలు, పరంలో శివసాయుజ్యం లభిస్తుందని పురాణవచనం.*
*🌻. ఏకముఖ లింగం:*
*ఈ లింగంలో శివుని యొక్క తత్పురుష రూపాన్ని దర్శించుకుం టాం. తూర్పుముఖంగా ఉండే ఏకముఖలింగం ఎరుపురంగులో పరమ శాంతంగా గోచరిస్తుంటుంది. సాధారణంగా ఈ లింగాలు శివ ఆలయాలలో నెైరుతిదిక్కులో ఉంటాయి. పదోన్నతి, అష్టైశ్వర్యాలను కోరుకునే భక్తులు, ఈ తత్పురుష లింగపూజలను గర్భాలయంలో ప్రతిష్ఠించుకుని పూజించే పద్ధతి లేదు. అలాగే ఈ ఏకముఖ లింగాలకు ఏక ముఖ రుద్రాక్షలతో 11-121 సంఖ్యలో మాలలను తయారుచేసి, లింగమూర్తికి అలంకరించి బిల్వదళాలతో పూజిస్తే మానసికశాంతి.*
*🌻. ద్విముఖలింగం:*
*శివలింగానికి తూర్పు- పడమరల లో ముఖా లు కలిగి ఉండటం ద్విముఖలింగ లక్షణం. తూర్పుముఖం తుత్పురుష, పడమటి ముఖం సద్యోజాతం. వీరశెైవులు ఈ లింగాన్ని పూజిస్తుంటారు. ద్విముఖలింగ సన్నిధికి తూర్పు పడమర దిక్కులలో ద్వారాలను ఏరర్రచాలన్నది నియమం. ఈ లింగాన్ని ద్విముఖ రుద్రాక్షలతో పూజించాలి. ఈ లింగాలను ఆలయాలలో చూడలేము.*
*🌻. త్రిముఖ లింగం:*
*ఈ శివలింగం తూర్పు, ఉత్తర, దక్షిణముఖాలను కలిగి ఉంటుంది. తూర్పున ఉన్న తత్పురుష ముఖం చిరునగవుతో, దక్షిణవెైపుగానున్న అఘోరముఖం కోపంతో, ఉత్తరం వెైపునున్న వామదేవముఖం మందహాసంతో గోచరిస్తుంటాయి. ఈ త్రిముఖలింగం సృష్టి, స్థితి, లయకారకులెైన త్రిమూర్తులను సూచిస్తోందని కొందరి భావన, మంత్రార్చనతో, త్రిముఖ రుద్రాక్షమాలను స్వామికి సమర్చించుకుని, మూడు దళాల బిల్వ పత్రాలతో అర్చిస్తే సకల సంపదలు సమకూరుతాయి.*
*🌻 చతుర్ముఖ లింగం:*
*నాలుగు ముఖాల ఈ లింగానికి తూర్పున తత్పురుషం, పడమట సద్యోజాతం, ఉత్తరాన వామదేవం, దక్షిణాన అఘోర ముఖాలున్నాయి. ఈ నాలుగుముఖాలను నాలుగు వేదమంత్రాలతో పూజిస్తుంటారు. ఈ లింగాన్ని చతుర్ముఖ రుద్రాక్షలతో అలంకరించి బిల్వపత్ర పూజ చేస్తే, అలా పూజించిన వారి మేధస్సు పెరుగుతుందనేది ఐతిహ్యం.*
*🌻. పంచముఖలింగం:*
*ఈ పంచముఖ లింగాలు చాలా అరుదుగా కనిపిస్తుం టాయి. నాలుగు దిక్కులలో నాలుగు ముఖాలతో, తూర్పువెై పున ఐదవముఖంతో స్వామి దర్శనమిస్తుంటాడు. ప్రస్తుతం నిర్మిస్తున్న శివాలయాలలో చాలా మంది పంచముఖ శివ లింగాలను ప్రతిష్ఠించుకుంటున్నారు. పంచముఖ రుద్రాక్ష మాలను స్వామికి అలంకరించి, పంచగవ్యంతో అభిషేకిం చి, బిల్వ పత్రాలతో అర్చించి, ఐదు విధాలెైన ఉపచారాలను చేసి, పంచ నెైవేద్యాలను నివేధించాలి. ఈ ఐదు ముఖాల నుంచి ఆగమాలు వెలువడినందువల్ల దీనిని ‘శివాగమ లింగం’ అని కూడా పిలుస్తారు.*
*పంచముఖ లింగాలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. నాలుగు దిక్కుల లో నాలుగు ముఖాలతో, తూర్పువెై పున ఐదవ ము ఖంతో స్వామి దర్శనమిస్తుంటాడు. ప్రస్తు తం నిర్మిస్తున్న శివాలయాలలో చాలా మంది పంచముఖ శివ లింగాలను ప్రతిష్ఠించుకుంటు న్నారు. పంచముఖ రుద్రాక్ష మాలను స్వామికి అలంకరించి, పంచగవ్యంతో అభిషేకిం చి, బిల్వ పత్రాలతో అర్చించి, ఐదు విధాలెైన ఉపచారాల ను చేసి, పంచ నెైవేద్యాలను నివేధించాలి.*
*షణ్ముఖ లింగం:*
*ఈ లింగంలో నాలుగు ముఖాలు నాలుగు దిక్కులను చూస్తుండగా, ఐదవ ముఖం ఆకాశాన్నీ, ఆరవముఖం పాతా ళాన్ని చూస్తుంటాయి. ఈ ఆరు ముఖాల నుంచి వెలువడిన తేజఃపుంజాలతో శివుడు సుబ్రహ్మణ్య స్వామిని సృజించా డని పురాణకథనం. అలాగే పాలసముద్రాన్ని మధించినప్పు డు వెలువడిన హాలాహలాన్ని శివపరమాత్మ అథోముఖంతో స్వీకరించాడట అయితే ప్రస్తుతం ఎక్కడా మనం షణ్ముఖలిం గాన్ని దర్శించుకోలేము.ఇక, ఎవరెవరు ఏయే లింగాన్ని పూజిస్తే ఫలితం ఉంటుం దున్న విషయాన్ని కూడా మన పురాణాలు పేర్కొన్నాయి. బ్రహ్మవేత్తలు రసలింగాన్ని, క్షత్రియులు బాణలింగాన్ని, వ్యాపారస్తులు స్వర్ణలింగాన్ని, ఇతరులు శిలా లింగాన్ని పూజించాలి. వితంతువులు స్ఫటికలింగాన్ని లేక రసలిం గాన్ని అర్చిస్తే మంచిది. ఈ స్ఫటికలింగాన్ని అందరూ పూజించవచ్చు. ఏ లింగాన్ని పూజించడం వల్ల ఫలితమన్న విషయాన్ని లింగపురాణం వివరించింది.*
*1. గంధలింగం: రెండు భాగాలు కస్తూరి, నాలుగు భాగాలు గంధం, మూడు భాగాలు కుంకుమను కలిపి ఈ లింగాన్ని తయారు చేస్తారు. దీనిని పూజిస్తే శివసాయుజ్యం లభిస్తుంది.*
*2. పుష్పలింగం: నానావిధ సుగంధ పుష్పాలతో దీనిని నిర్మిస్తారు. దీనిని పూజిస్తే రాజ్యాధిపత్యం కలుగుతుంది.*
*3. గోమయలింగం: కపిలగోవు పేడతో ఈ లింగాన్ని తయారుచేస్తారు. దీనిని పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. భూమిపెై పడి మట్టి కలసిన పేడ పనికిరాదు.*
*4. రజోమయలింగం: పుప్పాడితో నిర్మించిన ఈ లింగాన్ని పూజించడం వల్ల విద్యాధరత్వం సిద్ధిస్తుంది. శివసాయుజ్యాన్ని పొందగలం.*
*5. ధాన్యలింగం: యవుల, గోధుమలు, వరిబియ్యపు పిండితో ఈ లింగాన్ని నిర్మిస్తారు. దీనిని పూజించడం వల్ల సంపదల వృద్ధి, సంతానం కలుగుతుంది.*
*6. తిలపిష్టోత్థలింగం: నూగుపిండితో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే ఇష్టసిద్ధి కలుగుతుంది.*
*7. లవణజలింగం: హరిదళం, త్రికటుకం, ఉప్పు కలిపి చేసిన ఈ లింగాన్ని పూజిస్తే వశీకరణ శక్తి.*
*8. తుషోత్థలింగం: మారణక్రియకు పూజిస్తారు.*
*9. భస్మమయలింగం: భస్మంతో తయారు చేస్తారు. సర్వ సిద్ధులను కలుగుజేస్తుంది.*
*10. శర్కరామయలింగం: సుఖప్రదం.*
*11. సద్యోత్థలింగం: ప్రీతిని కలిగిస్తుంది.*
*12. వంశాకురమయ లింగం: వంశవృద్ధిని కలిగిస్తుంది. దీనిని వెదురు మొలకలతో తయారు చేస్తారు.*
*13. కేశాస్థిలింగం: వెంట్రుకలు, ఎముకలతో తయారు చేస్తారు. ఇది శత్రునాశనం చేస్తుంది.*
*14. పిష్టమయలింగం: ఇది పిండితో తయారు చేయబడుతుంది. ఇది విద్యలను ప్రసాదిస్తుంది.*
*15. దధిదుగ్థలింగం: కీర్తిప్రతిష్టలను కలిగిస్తుంది.*
*16. ఫలోత్థలింగం: ఫలప్రదమైనది.*
*17. ధాత్రిఫలజాతలింగం: ముక్తిప్రదం.*
*18. నవనీతలింగం: వెన్నతో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయి.*
*19. దుర్వాకాండజలింగం: గరికతో తయారు చేసిన ఈ లింగం అపమృత్యుభయాన్ని తొలగిస్తుంది.*
*20. కర్పూరజ లింగం: ముక్తిప్రదమైనది.*
*21. ముక్తాలింగం: ముత్యంతో తయారుచేయబడిన లింగం ఇష్టసిద్ధిని కలిగిస్తుంది.*
*22. సువర్ణనిర్మిత లింగం: బంగారంతో చేసిన ఈ లింగం ముక్తిని కలిగిస్తుంది.*
*23. రజత లింగం: సంపదలను కలిగిస్తుంది.*
*24. ఇత్తడి-కంచులింగం: ముక్తిని ప్రసాదిస్తుంది.*
*25. ఇనుము-సీసపులింగం: శత్రునాశనం చేస్తుంది.*
*26. అష్టథాతులింగం: చర్మరోగాలను నివారిస్తుంది. సర్వసిద్ధిప్రదం.*
*27. వెైఢూర్యలింగం: శత్రునాశనం. దృష్టిదోషహరం.*
*28. స్ఫటికలింగం: సర్వసిద్ధికరం, అనుకున్న కార్యాలను సఫలీకృతం చేస్తుంది.*
*29. సితాఖండలింగం: పటికబెల్లంతో తయారు చేసింది. ఆరోగ్యసిద్ధి కలుగుతుంది.*
*ఇక శివలింగాలు లక్షణ శాస్త్ర గ్రంథాన్ని అనుసరించి రెండు విధాలుగా ఉన్నాయి.*
*1. శుద్ధలింగమూర్తులు, 2. లింగోద్భవమూర్తులు*
*శుద్ధలింగాలు స్థావర లింగాలు, జంగమలింగాలని రెండు విధాలుగా ఉన్నాయి.*
*మానుషమూర్తులు 1. అనుగ్రహమూర్తులు, 2. సంహార మూర్తులు, 3. నృత్యమూర్తులు, 4. ఉమాసహిత మూర్తులు, 5. ఇతర మూర్తులని ఐదు రకాలుగా ఉన్నాయి.*
*స్థావరలింగాలు 1. స్వాయంభువలింగాలు, 2. పూర్వపురాణ లింగాలు, 3. దెైవతలింగాలు, 4. గాణపత్యలింగాలు, 5. అసురలింగాలు, 6. సురలింగాలు, 7. ఆర్షలింగాలు, 8. మానుషలింగాలు, 9. బాణలింగాలని తొమ్మిది విధాలుగా ఉన్నాయి.*
*కామికాగమంలో శివలింగాలు నాలుగు రకాలుగా చెప్పబడ్డాయి. 1. స్వయంభులింగాలు, 2. దెైవత, గాణపత్య లింగాలు, 3. అసుర, సుర, ఆర్షలింగాలు, 4. మానుషలింగాలు.*
*శివలింగంలో శివశక్తుల సమ్మేళనం జరగడం వలన ప్రచంఢమైన ఊర్జస్సు ఉద్భవిస్తుంది. దాని ప్రతికూల ఫలితాలు మనపెై పడకుండా ఉండేందకు శివలింగంపెై జలధారను పోస్తుండాలి. ఆ దార నుంచి సూక్ష్మమైన ఓంకారం ఉద్భవిస్తుంది. ఇదే నిర్గుణబ్రహ్మ. ఇలా జీవుడు మంత్రపూర్వక ధారాభిషేకం ద్వారా నిర్గుణ బ్రహ్మను తెలుసుకుంటాడు.*
*ఓం నమో పరమాత్మయే నమః*
🌹 🌹 🌹 🌹 🌹