Monday, March 4, 2019

తక్షణ ఫలితం

🌷తక్షణ ఫలితం🌷

🌴🌴🌴🌴🌴🌴
         _**ఒక వ్యక్తి ఒక ఆశ్రమానికి వెళ్ళి గురువు గారిని కలిసి తాను అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నాను, నాకు పరిష్కార మార్గాలను తెలపండి అని గురువు గారితో మొరపెట్టుకున్నాడు. ఆయన అతనికి ఒక మూల మంత్రాన్ని ఇచ్చి, నాయనా ఈ మంత్రాన్ని నియమనిష్టలతో జపం చేసుకో మంచి ఫలితాలు వస్తాయి అన్నాడు.*_

       _**కొన్ని రోజుల తర్వాత ఆ శిష్యుడు గురువు గారి వద్దకు వచ్చి “గురువుగారూ, నేనింక ఈ మంత్రం జపం చేయలేను.” అన్నాడు. గురువు గారు “ఏమైంది నాయనా? ” అని అడిగారు, శిష్యుడు.. గురువు గారు మీరిచ్చిన మంత్రాన్ని నేను "ప్రతి రోజూ క్రమం తప్పకుండా జపం చేస్తున్నాను. ఇంతవరకూ ఎలాంటి ఫలితం దొరకలేదు. ” అన్నాడు. అందుకు గురువు--నీవు సాధన “ప్రారంభించి ఎంత కాలమైంది? ” అని అడిగాడు. శిష్యుడు--సుమారుగా నెల రోజులైంది.*_

      _**కానీ గురువు గారు మీరు అంటూంటారు కదా  "భగవన్నామం ఒక్కసారి స్మరిస్తే చాలు పాపాలన్నీ పోతాయని ".. మరి నేను నెల రోజులు జపించినా నాకు రవంత ప్రశాంతతైనా దొరకదేంటి? మీరిచ్చిన మంత్రం బలమైనదేనా ? ఒకవేళ మంత్రంలో బలం ఉంటే పని చేయాలి కదా ! కనీసం కాస్తైనా నా లోపలి బరువు తగ్గి ప్రశాంతత చేకూరాలి కదా! ” అని అన్నాడు. గురువు-- “ఓర్పు పట్టాలి నాయనా. తప్పక ఫలితం కలుగుతుంది. ఇట్టివి నెమ్మదిగా పని చేస్తాయి, కానీ తప్పక పని చేస్తాయి.*_

      _**అందునా నీకిచ్చినది గొప్పదైన "మహామంత్రం.” మరి నీవు నియమాలను పాటిస్తున్నావా ?. శిష్యుడు-- “అవునండి, నేను రోజూ శుచిగా ముప్పూటలా స్నానాలు చేస్తాను, సమస్త నియమాలు పాటిస్తూ, ఏకభుక్తం చేస్తూ, మౌనవ్రతం కూడా అవలంబిస్తూన్నాను. పగలు పడుకోను. చాప మీద పడుకుంటాను. ఎక్కువ మాట్లాడను. అరిషడ్వర్గాలకు లోనవ్వటం లేదు. ఇంద్రియాల తృప్తికోసం జీవించటం మానేశాను.” అన్నాడు.*_

       _**గురువు-- “నాకు తెలుసు నాయనా. నీలో చాలా మార్పు ఉంది. ఇతరత్రా భూమిక సిద్ధమవుతున్న సూచన స్పష్టంగానే కనిపిస్తున్నది. ఫలితం గురించి ఇప్పుడే చూడకు. నీకు కనిపించని స్థితిలో అది పని చేస్తున్నది.” శిష్యుడు-- “లేదండి. నాకు మీరిచ్చిన మంత్రం పైన పూర్తిగా నమ్మకం పోయింది. నేను ఈ మంత్రాన్ని వదిలేస్తాను.*_

      _**గురవు..కానీ మహామంత్రన్ని వదిలేయడం అంత సులువు కాదు, నియమాలు పాటించాలి. శిష్యుడు.. వదలాలంటే ఏంచేయాలో చెప్పండి. గోవు చెవులో ఊదటమో ఏదో పద్ధతులుంటాయి కదా!”. గురువు-- “సరే తప్పక చెప్తాను కానీ ముందు నువ్వొక పని చేయ్యాలి, ఇదిగో ఈ మామిడి టెంకను మన ఆశ్రమం పెరట్లో నాటి, వెళ్లి రేపు వచ్చి నాకు కనిపించు.” శిష్యుడు-- “అట్లాగేనండి.”*_
    
       _**మామిడి టెంక నాటి వెళ్ళిపోయాడు. మరునాడు వచ్చాడు. వస్తూనే శిష్యుడు--నాకు “మంత్రం విడిచే మార్గం చెప్పండి.” గురువు--సరేకానీ “నువ్వు నిన్న నాటిన టెంక నాటుకుందా, నువ్వు చూశావా? ” శిష్యుడు-- “లేదండి, నిన్ననే కదా భూమిలో నాటింది.” గురువు--మరి నీవు దానిని “సరిగ్గా నాటావా, లోతుగా తవ్వావా, మట్టి పూర్తిగా కప్పావా? ” శిష్యుడు-- “ఆఁ.. అన్నీ సరిగ్గానే చేశానండి. సూర్యరశ్మి తగిలే చోటే నాటాను. వేరే చెట్టు నీడలో కాకుండా ఎండపడెచోటే నాటాను. తగినంత నీరూ కూడా పోశాను. ఇవాళ లోపలకు వస్తూ కూడా నీళ్ళు పోశాను."*_

      _**గురువు--అవునా “అయితే పండ్లు రాలేదా? ” శిష్యుడు-- “అదేంటండి, టెంక నాటుకోవాలంటే చాలా సమయం పడుతుంది కదా. అప్పుడే పండ్లు ఎలా వస్తాయి, ముందు అది మొక్కై, చెట్టై, పూత పూసి అది కాస్తే కదా పండ్లొచ్చేది?” గురువు-- “నిజమే కానీ నీవు నాటిన టెంకలో అంత బలం లేదేమో..! లేకపోతే ఈ పాటికి కనీసం చిన్న పిలకైనా బయటకు వచ్చి కనిపించాలి కదా.” శిష్యుడు-- “లేదండి. అది మట్టిలో మొదట ఇమడాలి. దానిలో ఉన్న నాటుకునే శక్తి చైతన్యవంతం కావాలి. ఇదంతా జరగాలంటే చాలా సమయం పడుతుంది.”*_

        _**గురువు-- “అవన్నీ నిజమే. కానీ ఇన్ని గంటలైంది కదయ్యా అది కొంచెమైనా బయటకు రావాలి కదా, నాకు ఆ టెంక పైన నమ్మకం పోయింది. అదిక నాటుకోదేమో.” అది విన్న శిష్యుడు ఏదో అర్థమైనట్టు తలవంచుకుంటాడు. గురువు--“దాన్ని తవ్వి తీసి పెరికి అవతలపారేసేయి.. నేనింక నిరీక్షించలేను. వెంటనే పోయి పీకేయమన్నాడు.”*_

     _**శిష్యుడు--“నాకు మీ సమాధానం అర్థమైందండి. ఇంకెప్పుడూ మంత్రాన్ని జపం చేయనని, వదిలేస్తానని అనను. నన్ను క్షమించండి " గురువు గారు అని ఆయన వద్ద శెలవు తీసుకుని సాధన చేయడం కోసం బయలుదేరాడు.*_

        _**ఫలితాలనేవి ఏవీ చిటికెలో రావు, ప్రతి ఫలితానికి కొంత సమయం పడుతుంది. అందుకు ఓపికతో సాధన చేయడమే మనం చేయవలసింది.**_

     🌹🌹సహజ🌹🌹

No comments:

Post a Comment

Jamalapuram Sri Venkateswara Swamy Temple జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం Telangana Tirupati, Khammam District

The road access to the temple is very good, and you can easily reach it in your own vehicle. Parking is not a concern as you can park comfor...