Sunday, March 31, 2019

నా గొప్పతనం చూడండి.. మిమ్మల్ని చూడకుండానే పెళ్ళిచేసుకున్నాను.

*ఈరోజు ప్రత్యేకం*

భార్య:
నా గొప్పతనం చూడండి.. మిమ్మల్ని చూడకుండానే పెళ్ళిచేసుకున్నాను.

భర్త:
నాది నీకంటే ఇంకా గొప్పతనం...! నిన్ను చూసినతర్వాత కూడా పెళ్లి చేసుకున్నాను !!

          😄😁😄😃

భార్య :

ఏమిటి ఫోన్ లో ఎవరితో చాలా లోగొంతుకతో మాట్లాడుతున్నారు ?

భర్త :

చెల్లెలితో మాట్లాడుతున్నా.

భార్య :

చెల్లెలితో ఐతే మెల్లగా ఎందుకు మాట్లాడటం ?

భర్త  (అసలు విషయం బయటపెడుతూ) :

నేను మాట్లాడేది *నీచెల్లెలితో*.

           😁😆😁😆😁

భార్య :

ఇదిగో ఆఖరిసారిగా చెప్తున్నా. మీతలమీద వెంట్రుకలు ఇప్పటికే చాలా రాలిపోయాయి. ఇదేఇంకా కొనసాగితే మిమ్మల్ని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోతా.

భర్త :

జుట్టు రాలిపోతోందని ఇన్నాళ్లూ అనవసరంగా బాధపడ్డాను. ఈసంగతి ముందే తెలిసుంటే జుట్టు రాలిపోవటం గురించి అసలు పట్టించుకుని ఉండేవాణ్ణికాదు.

            😁😄😁😄😁

భార్య :

ప్రపంచం మొత్తంలో ఎంతవెతికినా నాలాంటిభార్య మీకు దొరకనేదొరకదు.

భర్త :

పిచ్చిదానా... ఒకవేళ నేను వెతకవలసివస్తే మళ్ళీకోరికోరి నీలాంటిదానికోసమే ఎందుకు వెతుకుతాను ? మరీ టూమచ్ గా మాట్లాడకు.

           🙂😄😋🙂😁

టాక్సీ డ్రైవర్ :

సార్..... బ్రేకులుపని చేయటంలేదు. ఏం చేయమంటారు ?

పాసింజర్ :

ముందు మీటర్ ఆపేయ్ రా... దరిద్రుడా !

              😄😁😆😁😄

భయంకరమైన తుఫాను లో తడిచిపోతూ ఒకడు పిజ్జా కొనుక్కోవటానికి షాపుకు వచ్చాడు.

షాపువాడు :
మీకు పెళ్ళి అయిందా ?

కొనేవాడు :
ఓరి వెధవా... ఇటువంటి భీభత్సమైన గాలివానలో పిజ్జా తీసుకురమ్మని *పెళ్ళాం కాక* కన్నతల్లి పంపిస్తుందా ?

             😁😆😆😆😁

*ప్రతిభకూ, దేవుడు ప్రసాదించిన వరానికీ మధ్య వ్యత్యాసం* :-

ఎవడైనా ఒకవిషయంమీద అనర్గళంగా మాట్లాడగలిగితే దాన్ని...

*ప్రతిభ* అంటారు.

కానీ...

అసలు విషయమేలేకుండా గుక్కతిప్పుకోకుండా ఏ ఆడదైనా మాట్లాడుతూంటే....
అది *దేవుడిచ్చిన వరం* అవుతుంది.

             😄😁🙂😇😄

అడుక్కుతినే సాధువు
(కారులో కూర్చుని ఉన్న మహిళతో) :

మేడమ్..! ఓపదిరూపాయలివ్వండి.

ఆవిడ పదిరూపాయలు ఇస్తూ అన్నది :

ఏంటి స్వామీ..? నన్నేమీ దీవించరా ?

సాధువు :

ఇంకా ఏంకావాలి నీకు ? కారులో ఊరేగుతున్నావు చాలదా ? ఇక రాకెట్ లో కూర్చొని ఎగరాలనిఉందా ?

               😁🙃😁🙃😁

టీవీ రిపోర్టర్ ఒకడు బాంబు పేలిన ప్రమాదంలో గాయపడినవాడిని ఇలా పరామర్శించాడు...

*"బాంబు చాలా తీవ్రంగా పేలిందా?"*

గాయపడిన వాడికి అరికాలిమంట నెత్తికెక్కి..

*అబ్బేలేదు. బాంబు సీతాకోకచిలుక లాగా మెల్లగా ఎగురుకుంటూ వచ్చి నాచెవిదగ్గర గుసగుసలాడుతూ అన్నది..తుస్* !!!

         ⚡💥🔥😆😁😆

ఒకడు మెడికల్ షాప్ కు విషం కొనుక్కోవటానికి వెళ్ళాడు.

షాపువాడు :

నువ్వు ప్రిస్క్రిప్షన్ తెచ్చావా ?

కొనేవాడు తనజేబులోంచి పెళ్లి సర్టిఫికేట్ బయటకుతీసి చూపించాడు.

షాపువాడు : ఇక ఆపరాబాబు ! నిన్ను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఎన్ని బాటిల్స్ కావాలి ? ఒకటా..రెండా..

No comments:

Post a Comment

Jamalapuram Sri Venkateswara Swamy Temple జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం Telangana Tirupati, Khammam District

The road access to the temple is very good, and you can easily reach it in your own vehicle. Parking is not a concern as you can park comfor...