Tuesday, March 19, 2019

ధర్మంగా జీవించు ధర్మబద్దంగా ముందుకు నడువు నీవు సాధించే విజయం నిన్ను చూసి గర్వపడుతుంది.

🗣

1. జీవితంలో ఎప్పుడైనా

       ఎవరి నైనా పనికి రాని వారిగా

         పరిగణించవద్దు ఎందుకంటే

           చెడిపోయిన గడియారం

             కూడ రోజుకు రెండు సార్లు

               సరైన సమయం

                  సూచిస్తుంది.

🗣

2.  పేదరికం ధరిచేరినప్పుడు

      ఆప్తమిత్రులు కూడ

        దూరమైతారు అదే

          ధనవంతులైనప్పుడు

            తెలియని వారు కూడ

               మిత్రులవుతారు

🗣

3. ఒక్క సారి నవ్వుతూ చూడు

      ప్రపంచంలో ఉండే అందాలన్ని

        నీ సొంతమవ్వుతాయి కానీ

          తడిసిన కనురెప్పలతో

             చుస్తే అద్దంకూడ మసక

                బారి పోతుంది

🗣

4. తొందరగా దొరికేది ఏదైనా

       ఎక్కువకాలం మన్నికరాదు

         ఎక్కువకాలం మన్నిక

           వచ్చేది అంతతొందరగా

              దొరకదు

5. జీవితంలో వచ్చే చెడు రోజులు

      కూడా మన మంచి కొరకే

        అనుకోవాలి అప్పుడే

          తెలుస్తుంది నిజమైన

            స్నేహితులు ఎవరనేది

🗣

6. మనిషికి రోగాలు కుందేలు లాగా

      వస్తాయి తాబేలు లాగా

        వెళ్లుతాయి కానీ డబ్బులు

          తాబేలు లాగ వస్తాయి

             కుందేలు లాగా

                వెళ్లుతాయి

🗣

7. చిన్న చిన్న మాటల్లో ఆనందాన్ని

       వెతకటం అలవాటు

         చేసుకోవాలి ఎందుకంటే

           పెద్ద పెద్ద మాటలు

             జీవితంలో చాలా

                అరుదుగా చోటు

                   చేసుకుంటాయి

🗣

8.దేవుడిని ప్రార్ధించినప్పుడు

      నాకు ఏమి ఇవ్వలేదని

        బాధపడకు ఎందుకంటే

          నీకు అక్కడ ఇవ్వక

            పోయినా నీకు నచ్చిన

              చోట నీకు దేవుడు

                నచ్చినవిధంగా ఇస్తాడు

🗣

9. నిత్యము ఎదురయ్యే

        అపజయాలను చూసి

          నిరాశ చెందకు కానీ

            ఒక్కోసారి తాళంచెవి

              గుచ్చంలో ఉండే ఆఖరి

                తాళంచెవి కూడ తాళం

                   తెరుస్తుందని

                      గమనించు

🗣

10. ఈ సమాజంలో నేను ఒక్కడిని

         ఎంచేయగలననీ ప్రతి మనిషి

           నిరాశ చెందుతుంటాడు

             కానీ ఒక్క సారి తలపైకెత్తి

               చూడు ప్రపంచానికి

                వెలుగునిచ్చే సూర్యుడు

                   కూడ ఒక్కడేనని 

🗣

11. బంధవులు ఎంత చెడ్డ వారైనా

         సరే వదులుకోవద్దు

           ఎందుకంటే మురికి నీరు

             దప్పిక తీర్చలేక పోయిన

               కనీసం అగ్గి మంటలు

                 ఆర్పటానికి పనికి

                    వస్తాయి

🗣

12. మనకు మాటలు రాక ముందు

       మనము ఏంచెప్పబోతున్నామో

         అమ్మకు అర్థమయ్యేది కాని

           మనము మాటలు అన్ని

             నేర్చిన తరువాత ఇప్పుడు

                మాటమాటకు ప్రతిసారి

                   అమ్మా నీకు అర్థం

                      కాదులే అంటాం

🗣

13. కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రులు

          దూరమైనారని బాధపడకు

            ఎందుకంటే నీవు ఒక్కనివే

               జయించగలవని వారు

                 నమ్మినందుకు నీవు

                     సంతోషించు

🗣

14. జీవితంలో హెచ్చుతగ్గులు

         రావటంకూడ మనమంచి

           కోసమే అనుకోవాలి

             ఎందుకంటే ECG లొ

               వచ్చే సరళరేఖా కూడ

                  మృత్యువును

                     సూచిస్తుంది

🗣

15. ఈ రోజుల్లో సంబంధాలు

         రొట్టె తొ సమానమైనవి

           ఎందుకంటే కొద్దిగా మంట

             ఎక్కవైందొలెదో రొట్టె

         మాడిమసి కావటం ఖాయం

🗣

16. జీవితంలో మంచి వారి కోసం

         అన్వేషించ వద్దు ముందు

            నీవు మంచిగా మారు

              బహుశా నిన్ను కలిసిన

                వ్యక్తికి మంచి మనిషి

                   అన్వేషణ పూర్తి

                      కావచ్చు నేమో

🗣

ధర్మంగా జీవించు ధర్మబద్దంగా  ముందుకు నడువు నీవు సాధించే విజయం నిన్ను చూసి గర్వపడుతుంది.🙏🏻🙏🏻🙏🏻

No comments:

Post a Comment

Jamalapuram Sri Venkateswara Swamy Temple జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం Telangana Tirupati, Khammam District

The road access to the temple is very good, and you can easily reach it in your own vehicle. Parking is not a concern as you can park comfor...