2017లో కాశ్మీర్ లోయను రక్తపుటేరుగా మార్చిన పుల్వామా ఉగ్రదాడి.
ఆ శబ్దాలు, ఆ మోతలు, ఆ పొగలోనుంచి బయటకు వచ్చిన ఒక వీరుని గాథ ఇది.
నమ్మశక్యం కాని సత్యం.
అతని హెల్మెట్‌లోకి దూసుకెళ్లిన మొదటి బుల్లెట్.
ముక్కును చీల్చింది రెండవ బుల్లెట్.
దవడను ఛిద్రం చేసిన మూడవ బుల్లెట్.
అంతా అయిపోయిందనుకున్న క్షణంలో.....
అతను మాత్రం కుప్ప కూలిపోలేదు గాయాలతో రక్తం కారుతున్నా, స్పృహ కోల్పోకుండా శత్రువుపై ఎదురుదాడి చేశాడు.
దాదాపు 30 కి.మీ దూరంలో ఉన్న సైనిక ఆసుపత్రికి చేరుకునే వరకు అతను కళ్లు మూయలేదు, ఛిద్రం అయిన అతని ముఖాన్ని చూసి భయపడిన వైద్యులకు బొటనవేలితో సంకేతం ఇచ్చాడు “నేను బాగున్నాను” మీ పని మీరు చెయ్యండని.
తనని చూసేందుకు వచ్చిన బంధు,మిత్రుల ఆందోళనను చూసి చేతితో సైగ చేసాడు “నేను తిరిగి వస్తాను” కంగారు పడకండి అని.
ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ గారు అతన్ని కలిసినప్పుడు ఒక్క మాట అన్నారు, నా జీవితంలో నేను చూసిన అత్యంత నిర్భయమైన వ్యక్తి ఇతను,
28 శస్త్రచికిత్సలు చేశారు అయినా ముఖాన్ని సరి చేయ లేకపోయారు.
అంత ప్రమాదం జరిగిన తర్వాత ఎవరైనా విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు, కానీ ఆ వీరుడు విశ్రాంతి తీసుకోవాలని అనుకోలేదు.
అతని ముఖంపై ముసుగు వేసుకున్నాడు.
తిరిగి ఆయుధాలు ఎత్తుకున్నాడు. మళ్లీ సరిహద్దుల వద్ద నిలబడ్డాడు.
భారత దేశ చరిత్రలో అత్యంత ఫియర్ లెస్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న అతని పేరు
*లెఫ్టినెంట్ కల్నల్ రిషి రాజలక్ష్మి* కేరళ, అలప్పుజ రాజలక్ష్మి కుమారుడు.
ఇంజనీరింగ్ డిగ్రీని వదిలి మాతృభూమి కోసం యుద్ధ భూమిని ఎంచుకున్న ఓ యోధుడు ఇతను.
ఇది ఒక సినిమా కథలా అనిపించొచ్చు కానీ నిజం.
బుల్లెట్లు తట్టుకుని, అనేక శస్త్రచికిత్సలు చేయించుకుని ముఖాన్ని ముసుగుతో దాచుకుని తన సంకల్పంతో బయానికే ఎదురు నిలిచాడు.
తనను చూసి ప్రతి సైనికుడు గర్వపడేలా, ప్రతి భారతీయుడి గౌరవంతో ఉప్పొంగిపోయేలా విధికి నిలిచాడు.
అతనిని చూసి ఒక్క మాటే చెబుతారు: *“వందే భారత్”*
No comments:
Post a Comment