అయోధ్యవిడిచి వెడతాను :
రాముడు కైకమందిరాన్ని చేరుకొని, తండ్రికి నమస్కరించి 'పిలుపుకు
కారణమేమని ' అడిగాడు. అందుకు కైకేయి; రామా ! మీ తండ్రిగారు నిన్ను
పధ్నాలుగేళ్లు అరణ్యవాసం చేయమనీ, భరతుడికి పట్టాభిషేకం
జరపాలని - ఆజ్ఞాపించారు. వారి ఆజ్ఞ పాటిస్తే, వారికి
మనశ్శాంతి కలుగుతుంది. లేకపోతే మన వంశానికే
అపఖ్యాతి వస్తుంది” అన్నది. వెంటనే రాముడు “తండ్రి
ఆజ్జ్ఞననుసరించడమే కొడుకుల ధర్మం, కాబట్టి తండ్రి
ఆజ్ఞను శిరసావహించదలచాను. నేను ఈ రోజే
అయోధ్యను విడిచి అరణ్యానికి వెడతాను.
భరతుణ్ణి పిలిపించి పట్టాభిషేకం జరిపించండి.
అని తండ్రికి కైకేయికి నమస్కరించి, సెలవు
తీసుకున్నాడు. దశరథుడు కుమారుణ్ణి విడవళి
మారు మాట్లాడలేక ఊరుకున్నాడు.
No comments:
Post a Comment