*శ్రీ సూక్తులు*
అందరూ మనవాళ్ళే అనుకోవడం తప్పుకాదు కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారే అనుకోవడం తప్పు ఉక్కును తుప్పు నాశనం చేస్తుంది మనలోని అహం మనల్ని ధ్వంసం చేస్తుంది మనం చేసే పని ఎంతమంది చూసారన్నది ముఖ్యం కాదు అది ఎంతమందికి ఉపయోగ పడిందన్నది ముఖ్యం మంచి పని చేసేటప్పడు మనం కనబడాల్సిన అవసరం లేదు మంచితనం కనబడితే చాలు మనలోని చెడు మనకు మాత్రమే తెలియాలి మనలోని మంచి ప్రపంచమంతా వెలగాలి మనలోని లోపాలు మనలోనే దాగాలి మనలోని ప్రతిభ జగమంతా ఎగరాలి మనసు... మేఘం రెండూ ఒకటే మేఘం తనలోని బరువును మోయలేక వర్షం రూపంలో వదిలేస్తుంది మనసు తనలోని బరువును మోయలేక కన్నీటి రూపంలో వదిలేస్తుంది మాట్లాడాలి అనుకునే వారికి "సమయం" దొరుకుతుంది , వద్దు అనుకునే వారికి "సాకు" దొరుకుతుంది కోరికలను జయించాలి .. లేదా అదుపు చేసుకోవాలి అప్పుడే మనస్సుకు ప్రశాంతత లభ్యం అవుతుంది కోరికల వెంబడి పరిగెత్తినంత కాలం అశాంతి మాత్రమే దొరుకుతుంది మనిషి మనసు ఎంత ప్రశాంతంగా ఉంచుకుంటే అంత ధృడంగా తయారవుతారు ఇదే జీవిత సత్యం సర్వే జనా సుఖినోభవంతు
*శుభోదయం
No comments:
Post a Comment