Friday, October 9, 2020

#'మకరతోరణం' అంటే ఏమిటి? దాని విశేషం ఏమి? ఈరోజు తెలుసుకుందాం.

#'మకరతోరణం' అంటే ఏమిటి? దాని విశేషం ఏమి? ఈరోజు తెలుసుకుందాం.

మన దేవాలయాలలో దేవతా/దేవుని
 విగ్రహాల వెనుక అమర్చిన తోరణ మధ్యభాగంలో కనుగుడ్లు ముందుకు చొచ్చుకు వచ్చిన ఒక *రాక్షసముఖం* కనబడుతుంది. దానికే   'మకరతోరణం' అని పేరు. ఈ రాక్షసముఖాన్ని తోరణం మధ్యభాగంలో అమర్చటానికి గల కారణము గురించి *స్కందమహాపురాణం* లో ఒక కథ వుంది....·      పూర్వం *"కీర్తిముఖుడు"* అనే రాక్షసుడు బ్రహ్మను మెప్పించి అనేకవరములను పొంది తద్వారా వచ్చిన బలపరాక్రమాలతో సమస్త భువనములలోని సంపదలను తన సొంతం చేసుకున్నాడు. చివరకు పరమశివుని పత్ని అయిన *'జగన్మాతను'* కూడా పొందాలని ఆశించాడు. అతని దురాశను చూసి కోపించిన మహేశ్వరుడు అతనిని మ్రింగివేయమని అతిభీకరమైన *అగ్నిని* సృష్టించాడు. పరమేశ్వరుని ఆనతి మేరకు ఆ జ్వాలాగ్ని ఆ రాక్షసుణ్ణి తరమసాగింది.·      మరణంలేకుండా వరం పొందినా, శివుని ఆఙ్ఞమేరకు ఆబడబాగ్ని తనను ఎక్కడ దహించివేస్తుందో అని భయంతో పరుగులు తీస్తూ అన్నిలోకాలూ తిరిగి ఆ అగ్ని ప్రతాపానికి తట్టుకోలేక చివరకు పరమశివుని శరణు వేడేడు. భక్తసులభుడైన బోళాశంకరుడు ఆ రాక్షసుణ్ణి రక్షించటంకోసం ఆ అగ్నిని ఉపసంహరించి తన నుదుట *మూడవ కన్ను* గా ధరించాడు.·      ఆ తరువాత *కీర్తిముఖుడు* తనకు విపరీతమైన ఆకలిగా ఉన్నదనీ, తను తినటానికి ఏదైనా పదార్థాన్ని చూపమని మహాదేవుని కోరాడు. యుక్తిగా శివుడు *"నిన్ను నువ్వే తిను"* అని చెప్పాడు. శివుని ఆనతి మేరకు *కీర్తిముఖుడు* *మొసలి రూపం* ధరించి తనను తాను ముందుగా తోకభాగంనుంచి మొదలుపెట్టి కంఠం వరకూ తిన్నాడు. తన తలను తానే ఎలాతినాలో అతనికి తెలియలేదు. అతని ఆకలి ఇంకా తీరలేదు. శివుని ప్రార్థించాడు.·      ఆప్రార్ధన ఆలకించిన పరమశివుడు, ఈనాటినుంచి అన్ని దేవతాలయాలలో దెవతా మూర్తుల వెనుక భాగంలోని తోరణాగ్రభాగాన్ని అలంకరించి, దైవ దర్శనానికి వచ్చే ప్రజలందరిలో ఉండే దురఃహంకారాన్ని, ఆశను, తింటూ ఉండు. నీవు అందరికీ పూజనీయుడవు అవుతావు అని వరమిచ్చాడు.·      ఆనాటినుంచి *కీర్తిముఖుడు* దేవతాలయాలలోని దేవతా విగ్రహాల వెనుక వున్న తోరణామధ్యభాగాన్ని తన రాక్షస మకరముఖంతో అధిష్ఠించి భక్తులలో ఉండే దుష్ట వికారాలను, అహంకారాన్ని,, దురాశను కబళిస్తున్నాడు . ఈకారణంగానే దేవతా మూర్తుల వెనుక మధ్యభాగంలో అమర్చబడిన తోరణానికే *'మకరతోరణం'* అని పేరు వచ్చింది.మనసంసృతి లో ప్రతి దానికీ ఎదో ఒక పురాణంలో ఒక కథ వుంటుంది.

No comments:

Post a Comment

Yes, she has gained weight? Defeated without losing a bout.

అవును, ఆమె కొంచెం బరువు పెరిగే వుంటుంది. ఎందుకంటే…. ఆటల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే నిండైన ఆత్మాభిమానాన్ని, విశ్వ వేదికపైనే కాదు వ...