Thursday, July 23, 2020

హనుమ నవావతారములు:

హనుమ నవావతారములు:

హనుమంతుడి రూపవర్ణనలలో 20విశేషములతో చెప్తూ 20 చేతుల ఆంజనేయస్వామివారిని మొదలుకొని 9హనుమన్మంత్రమూర్తులని శాస్త్రం చెప్తున్నది. నిజానికి ఇవి నవ ఆంజనేయ రూపములు. నవనారసింహ రూపాలు అంటాం కదా! అలాగే ఇవి. నవాంజనేయ రూపములు ప్రస్తావన చేసినట్లైతే 
ఆద్యః ప్రసన్న హనుమాన్ ద్వితీయో వీరమారుతిః
తృతీయో వింశతి భుజః చతుర్థః పంచవక్త్రకః
పంచమో అష్టాదశ భుజః శరణ్యః సర్వదేహినాం
సువర్చలా పతిఃషష్ఠః సప్తమస్తు చతుర్భుజః
అష్టమః కథితశ్శ్రీమాన్ ద్వాత్రింశత్ భుజమండలః
నవమో వానరాకారః ఇత్యేవ నవరూప ధృత్
నవావతార హనూమాన్ పాతుమాం సర్వదస్సదా!!
మొత్తం తొమ్మిది నామాలు ఇక్కడ వస్తాయి. వాటిని గుర్తుపెట్టుకొని నిత్యం పఠించుకోమని చెప్తున్నారు. మొదటి వాడు ప్రసన్నాంజనేయుడు రెండవ వాడు వీరాంజనేయుడు. మూడవది ఇరవై చేతుల వాడు. నాలుగవది అయిదుముఖాల వాడు. ఆరవ నామం సువర్చలాపతి. ఏడవది నాలుగు చేతుల ఆంజనేయ స్వామి వారు. ముప్ఫైరెండు భుజాలతో ఉన్న హనుమన్మంత్రమూర్తి ఎనిమిదవది. తొమ్మిదవది వానరాకారము.
ఈ తొమ్మిది రూపములు ఏమిటంటే వివిధ ఉపాసనలకు దర్శనమిచ్చిన రూపములు. తొమ్మిదిమంది ఉపాసకులకి తొమ్మిది రూపాలతో దర్శనమిచ్చాడట స్వామి. అలా దర్శనమిచ్చిన తొమ్మిది నామములు ఒక దగ్గర పెట్టుకొని ఎవరైతే మననం చేసుకుంటారో వారిని ఈ నవావతరణ స్మరణ ఎల్లవేళలా రక్షిస్తుంది. అవతారం అంటే తనను తాను ప్రకటించుకోవడం. వివిధ ఉపాసకులు ధ్యానం చేసినప్పుడు ఉపాసనా ఫలంగా ప్రకటింపబడిన రూపములే ఈ నవావతార హనుమద్రూపములు.

No comments:

Post a Comment

ఇందిరా గాంధీ ద్రోహం: అమెరికా ఒత్తిడికి లొంగి పాకిస్తాన్ అణు బాంబును ఆపలేకపోయిన కథ

ఇందిరా గాంధీ ద్రోహం: అమెరికా ఒత్తిడికి లొంగి పాకిస్తాన్ అణు బాంబును ఆపలేకపోయిన కథ 1980ల మధ్యకాలంలో పాకిస్తాన్ రహస్యంగా అణుకేంద్రం నిర్మిస్తు...