శివం : సోమవారం శివునికి పూజ చేయడం వల్ల కలిగే ఫలితాలు తెలుసా...?
హిందూ పురాణాల ప్రకారం శివునికి అనేక పేర్లు ఉన్నాయి. భక్తులు ఈశ్వరుడిని భోళా శంకరుడు, విశ్వేశ్వరుడు, పరమేశ్వరుడు, మల్లిఖార్జున స్వామి, మంజునాథ స్వామి.. మరెన్నో పేర్లతో కొలుస్తారు. శివున్ని పూజించే భక్తులంతా ఎక్కువగా సోమవారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సోముడు అంటే చంద్రుడు అని అర్థం. చంద్రుని ధరించినవాడు శివుడు. సోమ అనే శబ్దాన్ని విడగొడితే ఉమాసహితుడు అనే అర్థం వస్తుంది.
ఉమాసహితుడు అంటే శివుడే కాబట్టి సోమవారం శివునికి ప్రత్యేక దినంగా భావించి భక్తులు పూజలు చేస్తారు. సోమవారం శివున్ని పూజించి దద్దోజనం నైవేద్యంగా సమర్పిస్తే అప్పుల బాధలు ఉండవు. మూడు ఆకులు గల బిల్వ పత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది
స్వామికి వెలగపండు సమర్పించడం వల్ల శుభం చేకూరుతుంది. శివున్ని పూజించేవారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి.
సోమవారం రోజు ఇంట్లోనే చిన్న పరిమాణంలో గల శివలింగాన్ని ఏర్పాటు చేసుకుని పూజాభిషేకాలు చేయడం మంచిది. శివుడిని చిత్తశుద్ధి, అంకితభావంతో పూజించడం ద్వారా కార్యసిద్ధి చేకూరుతుంది. సోమవారం శివున్ని పూజిస్తే సమస్త పాపాలు పటాపంచలై పోవడమే కాకుండా భోగభాగ్యాలు, సంపదలు చేకూరుతాయి. ఆది దేవుడికి సంతోషాన్ని కలిగిస్తే ఆ ఇంట ఎప్పటికీ లేమి అనే మాట వినిపించదని పండితులు చెబుతున్నారు
No comments:
Post a Comment