సిరులిచ్చే లక్ష్మీకుబేర యంత్రము
ఈ భూమిపై మానవుడు ఆటంకాలను జయిస్తూ, ఆనందంగా బతకాలి. అయితే మానవుడు బతకాలంటే ధన సముపార్జన తప్పని సరి. ధర్మచింతనతో నలుగురికి సాయపడాలన్నా ధనవంతుడై ఉండాలి. పూర్వం ధనం లేక పోయినా అనేక మార్గాల్లో మానవుడు అనుకున్నది నెరవేర్చుకునే అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు అన్నిటికీ ధనం కావాలి. అయితే డబ్బును సంపాదించడానికి మానవుడు పడేపాట్లు అంతాఇంత కాదు. డబ్బు ఆర్జించడం కోసం చేయని ఉద్యోగం లేదు, వేసిన ఉపాయం లేదు. అందుకే మానవ జీవితంలో ధనం నిత్యవసరంగా మారింది.
ఐశ్వర్యాభివృద్ధి కోసం కుబేర పూజను చేస్తే ఐశ్వర్యం, అభివృద్ధి ఒకేసారి దక్కుతుంది. లక్ష్మి ధనకనకాధులు, అదృష్టం, సౌందర్యాలనిచ్చే దేవత. లక్ష్మి కృపాకటాక్షం లేకుండా ఏది చేసినా అది అంతకంతే. ధనానికి మరో అధిపతి కుబేరుడు. ఉత్తరం దిక్కు వైపు ప్రతినిధి అయిన కుబేరుడు భూ మండలంలోని ఆగర్భంలో ఉన్న సమస్త నిధి నిక్షేపాలకూ యజమానుడు. పురాణ చరిత్రలలో తెలిపినట్టు అతి శ్రీమంతుడు అనిపించుకున్న వెంకటేశ్వరస్వామి కూడా కుబేరుని వద్ద తీసుకొన్న అప్పుకు వడ్డీ మాత్రమే చెల్లిస్తూ ఉన్నాడు.
అయితే లక్ష్మిదేవి పూజను దేశమంతటా వివిధ రకాలుగా ఆచరిస్తున్నారు. లక్ష్మి కుబేర పూజను ఒకేసారి కలిపి నెరవేర్చినపుడు వారిరువురి నుంచి దొరికే ఆశీర్వాదం, శ్రేయస్సు, ద్విముఖమై పేదరికం, దారిద్య్రాలు దూరం అవుతాయి.
లక్ష్మి కుబేరుల ఆరాధనను సులభంగా ఆచరించడానికి సామాన్య మంత్రాలను ఈ కింద ఇవ్వడమైంది. కుబేర, లక్ష్మీ మంత్రాలు వేరు వేరుగా దొరుకుతాయి. వాటిని పూజా గదిలో దేవుని ముందు ఎర్ర రంగులోని వస్త్రంపై ఉంచి దీప-ధూపాలతో పూజించాలి. ఓపికను బట్టి సాధ్యమైతే నిత్య నైవేద్యం కోసం ఏదైనా తీపి లేదా, తేనె, లేదా నెయ్యి చక్కెరను సమర్పించవచ్చు. శంఖం దొరికితే దాన్ని దేవుని పీఠం ముందు ఉంచి షోడ షోపచారాలతో పూజించడంవల్ల అష్టై శ్వర్యాలు సిద్ధించును.
లక్ష్మీ మంత్రం:
ఓం శ్రీ హ్రీం క్రీం లక్ష్మీ దేవ్యై నమ:
కుబేర మంత్రం:
యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనాధిపతయే ధనధాన్య“సమృద్ధియే మేహి దాపయ స్వాహా
పై రెండు మంత్రాలనూ రోజుకు కనీసం 1008 సార్లు చొప్పున 9 నెలలు జపిస్తే సిరుల పంట పండుతుంది.
మూల మంత్రం :
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరదవరద సర్వజనమే వశమానాయ స్వాహాః
శ్రీ లక్ష్మీ గణేశ యంత్రంను అర్చించు వారు యంత్రమును రాగి రేకుపై రాసి యథా శక్తిగా ఉదయాస్తమయములందు షోడశోపచార పూజలు చేయుచున్న అన్ని విఘ్నములు తొలగి విజయము ఐశ్వర్య వృద్ధి సంతతి గౌరవమును కూడా పొందగలరు.
నిత్యం ఆచమ్య, ప్రాణామాయ, గోత్ర దేశ కాలమాన సంకీర్తణాధికముగా త్రిన్యాస పూర్వకముగా, పంచ పూజలొనర్చిన విశేష ఫలము కలుగును. మూల మంత్ర జపముతో పాటు క్రింది తత్ గాయిత్రిని కూడా జపదశాంశము గావించిన మహోత్కృష్ట ఫలితములు తప్పక కలుగును.
ధ్యానం, మూల మంత్రం, ఏ తత్ గాయిత్రి ఈ మూడింటిని అనునిత్యం అనుసరించు సాధకుడు పొందలేని ఫలితమే లేదు. అనగా తలచినంతనే సాధకుని కృషి యత్నములను అనుసరించి మంత్ర యంత్రములు పని సాధనలందు అనంత ఫల సాధకములగును. సాధన గురు పరంపరలో ఉండాలి......
No comments:
Post a Comment