తక్షణ ఫలితం
_**ఒక వ్యక్తి ఒక ఆశ్రమానికి వెళ్ళి గురువు గారిని కలిసి తాను అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నాను, నాకు పరిష్కార మార్గాలను తెలపండి అని గురువు గారితో మొరపెట్టుకున్నాడు. ఆయన అతనికి ఒక మూల మంత్రాన్ని ఇచ్చి, నాయనా ఈ మంత్రాన్ని నియమనిష్టలతో జపం చేసుకో మంచి ఫలితాలు వస్తాయి అన్నాడు.*_
_**కొన్ని రోజుల తర్వాత ఆ శిష్యుడు గురువు గారి వద్దకు వచ్చి “గురువుగారూ, నేనింక ఈ మంత్రం జపం చేయలేను.” అన్నాడు. గురువు గారు “ఏమైంది నాయనా? ” అని అడిగారు, శిష్యుడు.. గురువు గారు మీరిచ్చిన మంత్రాన్ని నేను "ప్రతి రోజూ క్రమం తప్పకుండా జపం చేస్తున్నాను. ఇంతవరకూ ఎలాంటి ఫలితం దొరకలేదు. ” అన్నాడు. అందుకు గురువు--నీవు సాధన “ప్రారంభించి ఎంత కాలమైంది? ” అని అడిగాడు. శిష్యుడు--సుమారుగా నెల రోజులైంది.*_
_**కానీ గురువు గారు మీరు అంటూంటారు కదా "భగవన్నామం ఒక్కసారి స్మరిస్తే చాలు పాపాలన్నీ పోతాయని ".. మరి నేను నెల రోజులు జపించినా నాకు రవంత ప్రశాంతతైనా దొరకదేంటి? మీరిచ్చిన మంత్రం బలమైనదేనా ? ఒకవేళ మంత్రంలో బలం ఉంటే పని చేయాలి కదా ! కనీసం కాస్తైనా నా లోపలి బరువు తగ్గి ప్రశాంతత చేకూరాలి కదా! ” అని అన్నాడు. గురువు-- “ఓర్పు పట్టాలి నాయనా. తప్పక ఫలితం కలుగుతుంది. ఇట్టివి నెమ్మదిగా పని చేస్తాయి, కానీ తప్పక పని చేస్తాయి.*_
_**అందునా నీకిచ్చినది గొప్పదైన "మహామంత్రం.” మరి నీవు నియమాలను పాటిస్తున్నావా ?. శిష్యుడు-- “అవునండి, నేను రోజూ శుచిగా ముప్పూటలా స్నానాలు చేస్తాను, సమస్త నియమాలు పాటిస్తూ, ఏకభుక్తం చేస్తూ, మౌనవ్రతం కూడా అవలంబిస్తూన్నాను. పగలు పడుకోను. చాప మీద పడుకుంటాను. ఎక్కువ మాట్లాడను. అరిషడ్వర్గాలకు లోనవ్వటం లేదు. ఇంద్రియాల తృప్తికోసం జీవించటం మానేశాను.” అన్నాడు.*_
_**గురువు-- “నాకు తెలుసు నాయనా. నీలో చాలా మార్పు ఉంది. ఇతరత్రా భూమిక సిద్ధమవుతున్న సూచన స్పష్టంగానే కనిపిస్తున్నది. ఫలితం గురించి ఇప్పుడే చూడకు. నీకు కనిపించని స్థితిలో అది పని చేస్తున్నది.” శిష్యుడు-- “లేదండి. నాకు మీరిచ్చిన మంత్రం పైన పూర్తిగా నమ్మకం పోయింది. నేను ఈ మంత్రాన్ని వదిలేస్తాను.*_
_**గురవు..కానీ మహామంత్రన్ని వదిలేయడం అంత సులువు కాదు, నియమాలు పాటించాలి. శిష్యుడు.. వదలాలంటే ఏంచేయాలో చెప్పండి. గోవు చెవులో ఊదటమో ఏదో పద్ధతులుంటాయి కదా!”. గురువు-- “సరే తప్పక చెప్తాను కానీ ముందు నువ్వొక పని చేయ్యాలి, ఇదిగో ఈ మామిడి టెంకను మన ఆశ్రమం పెరట్లో నాటి, వెళ్లి రేపు వచ్చి నాకు కనిపించు.” శిష్యుడు-- “అట్లాగేనండి.”*_
_**మామిడి టెంక నాటి వెళ్ళిపోయాడు. మరునాడు వచ్చాడు. వస్తూనే శిష్యుడు--నాకు “మంత్రం విడిచే మార్గం చెప్పండి.” గురువు--సరేకానీ “నువ్వు నిన్న నాటిన టెంక నాటుకుందా, నువ్వు చూశావా? ” శిష్యుడు-- “లేదండి, నిన్ననే కదా భూమిలో నాటింది.” గురువు--మరి నీవు దానిని “సరిగ్గా నాటావా, లోతుగా తవ్వావా, మట్టి పూర్తిగా కప్పావా? ” శిష్యుడు-- “ఆఁ.. అన్నీ సరిగ్గానే చేశానండి. సూర్యరశ్మి తగిలే చోటే నాటాను. వేరే చెట్టు నీడలో కాకుండా ఎండపడెచోటే నాటాను. తగినంత నీరూ కూడా పోశాను. ఇవాళ లోపలకు వస్తూ కూడా నీళ్ళు పోశాను."*_
_**మామిడి టెంక నాటి వెళ్ళిపోయాడు. మరునాడు వచ్చాడు. వస్తూనే శిష్యుడు--నాకు “మంత్రం విడిచే మార్గం చెప్పండి.” గురువు--సరేకానీ “నువ్వు నిన్న నాటిన టెంక నాటుకుందా, నువ్వు చూశావా? ” శిష్యుడు-- “లేదండి, నిన్ననే కదా భూమిలో నాటింది.” గురువు--మరి నీవు దానిని “సరిగ్గా నాటావా, లోతుగా తవ్వావా, మట్టి పూర్తిగా కప్పావా? ” శిష్యుడు-- “ఆఁ.. అన్నీ సరిగ్గానే చేశానండి. సూర్యరశ్మి తగిలే చోటే నాటాను. వేరే చెట్టు నీడలో కాకుండా ఎండపడెచోటే నాటాను. తగినంత నీరూ కూడా పోశాను. ఇవాళ లోపలకు వస్తూ కూడా నీళ్ళు పోశాను."*_
_**గురువు--అవునా “అయితే పండ్లు రాలేదా? ” శిష్యుడు-- “అదేంటండి, టెంక నాటుకోవాలంటే చాలా సమయం పడుతుంది కదా. అప్పుడే పండ్లు ఎలా వస్తాయి, ముందు అది మొక్కై, చెట్టై, పూత పూసి అది కాస్తే కదా పండ్లొచ్చేది?” గురువు-- “నిజమే కానీ నీవు నాటిన టెంకలో అంత బలం లేదేమో..! లేకపోతే ఈ పాటికి కనీసం చిన్న పిలకైనా బయటకు వచ్చి కనిపించాలి కదా.” శిష్యుడు-- “లేదండి. అది మట్టిలో మొదట ఇమడాలి. దానిలో ఉన్న నాటుకునే శక్తి చైతన్యవంతం కావాలి. ఇదంతా జరగాలంటే చాలా సమయం పడుతుంది.”*_
_**గురువు-- “అవన్నీ నిజమే. కానీ ఇన్ని గంటలైంది కదయ్యా అది కొంచెమైనా బయటకు రావాలి కదా, నాకు ఆ టెంక పైన నమ్మకం పోయింది. అదిక నాటుకోదేమో.” అది విన్న శిష్యుడు ఏదో అర్థమైనట్టు తలవంచుకుంటాడు. గురువు--“దాన్ని తవ్వి తీసి పెరికి అవతలపారేసేయి.. నేనింక నిరీక్షించలేను. వెంటనే పోయి పీకేయమన్నాడు.”*_
**శిష్యుడు--“నాకు మీ సమాధానం అర్థమైందండి. ఇంకెప్పుడూ మంత్రాన్ని జపం చేయనని, వదిలేస్తానని అనను. నన్ను క్షమించండి " గురువు గారు అని ఆయన వద్ద శెలవు తీసుకుని సాధన చేయడం కోసం బయలుదేరాడు.*
**ఫలితాలనేవి ఏవీ చిటికెలో రావు, ప్రతి ఫలితానికి కొంత సమయం పడుతుంది. అందుకు ఓపికతో సాధన చేయడమే మనం చేయవలసింది.**
No comments:
Post a Comment