Saturday, August 3, 2024
అమెరికా వెళ్లాలనే పిచ్చి
. 🔍అమెరికా వెళ్లాలనే పిచ్చి🔍 నేను అమెరికా వచ్చి ఈ రోజుకి 35 రోజులు అయ్యింది.ఈ రోజుల్లో నాకు అర్ధం అయ్యింది ఒక్కటే,ఇక్కడ ఒక్క గాలి తప్ప ప్రతీది డబ్బులు పెట్టి కొనుక్కోవాలి.అలాగే ప్రతిదీ మన రూపాయి విలువతో లెక్క గడితే మన దగ్గర కన్నా నాలుగు లేక ఐదు రేట్లు ఎక్కువ.(ప్రస్తుతం ఒక్క డాలరు విలువ 83 రూపాయిలు)ఇక్కడ బ్రతకడానికి ఎన్నో రకాల పనులు,ఎన్నో అవకాశాలు.ఒకటేమిటి ఇల్లు కట్టిన,కొనుక్కున్న దగ్గర నుండి ముందు గడ్డి పెంచుకోవడం,దాన్ని పెంచడానికి మందులు వగైరా కొట్టే వాళ్ళు,15 రోజులకొక సారి ఆ పెరిగిన గడ్డిని కట్ చేసే వాళ్ళు,ఇల్లు శుభ్రపరిచే వాళ్ళు,తడి, పొడి చెత్త తీసుకెళ్లే వాళ్ళు,గ్యాస్ స్టేషన్లు,పెట్రోల్ పంపులు,షాపింగ్ మాల్స్,ఇండియన్ రెస్టారెంట్ లు,సౌత్ రెస్టారెంట్ లు,మాంసాహార తయారీ షాప్స్,శాఖాహారం అందించే హోటల్స్,వయసుతో సంబంధం లేకుండా 15 ఏళ్ల నుండి 75 ఏళ్ల వయస్సు వరకు ఉన్న వాళ్ళు అందరూ డిగ్నిటీ లేకుండా పనిచేసే వారే.అందుకే మన దేశం నుండి,మరీ మన రాష్ట్రం నుండి ఎక్కువ మంది అమెరికా రావడానికి పడుతున్న కష్టాలు చూస్తే నిజం గా ఆశ్చర్యం వేస్తున్నది. . ఇక్కడ కొన్ని లెక్కల ప్రకారం పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి H1 వీసా ఉన్న వాళ్ళు లక్షమంది పైగా ఉద్యోగాలు లేక,దొరకక ఇండియా రాలేక ఇక్కడ పైన చెప్పిన పనుల్లో ఏదో ఒకటి చేసి కాలం గడుపుతున్నారు. . అయితే ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ ఉన్నది అదే చేసే పనికి గంటకు ఇంత(తక్కువలో తక్కువ 30 నుండి 50 డాలర్లు,మన రూపాయల్లో దాదాపు నాలుగు వేలకు పైమాటే)అని ఇస్తారు,చేసే గంటలకు వచ్చే డబ్బు ఎక్కువ కూడాను.కానీ తినడానికి,ఉండటానికి,రోజువారి పచారి సరకులు,గ్యాస్, కరెంట్,నీళ్లు,ఇంటర్నెట్, టివి లకు భారీగానే చెల్లించాలి. . అలాగే ఏ వీసా మీద ఇక్కడ వున్నా రోగాలు వస్తే,ఇన్సూరెన్స్ లేకపోతే ఆస్తులు మొత్తం అమ్మాలి ఇక్కడ వైద్యం చేయించుకోవాలి అంటే.అలాగే ప్రసూతి & సిజేరియన్ లాంటి వాటికి లక్షల్లో ఖర్చుపెట్టాలి. ఒక మాదిరి జీతం తెచ్చుకోనే వాళ్ళు బ్రతకడం చాలా కష్టం.ఇక్క అమెరికన్స్ కన్నా ఇతర దేశాల జనాభా ఎక్కువ. కారోనా తరువాత ప్రతి వస్తువు,ప్రతి విషయంలో అన్ని ధరలు ఐదు రేట్లు పెరిగినాయి.2019 కి ముందు ఒక రైస్ బ్యాగ్ 4 డాలర్ల లోపు ఉంటే ఇప్పుడు 15 నుండి 28 డాలర్లు దాకా ఉన్నాయి) . ఇక్కడ నేను గమనించిన ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే ఇక్కడికి వచ్చి చదువుకొని సరిఅయిన ఉద్యోగం లేని వాళ్ళు సగానికి పైన వున్నారు,అటువంటి వాళ్ళు ఇండియా రాలేక ఏదో ఒక పని చేసుకొంటూ కాలం గడుపుతుంది పచ్చి నిజం.ఇక్కడ మంచిగా బ్రతకాలి అంటే బాగా కష్టపడే తత్వం,డిగ్నిటీ ఫీల్ అవ్వకుండా పనిచేసే మెంటాలిటీ ఉండాలి లేదా భార్య,భర్త ఇద్దరు మంచి ప్యాకేజి తో ఉద్యోగం చేసే వాళ్లు అయితేనే నాలుగు డబ్బులు దాచుకోగలరు. నోట్:-కష్టపడి పనిచేసే వాళ్లకు ఎన్నో అవకాశాలు ఇక్కడ ఉన్నాయి(డిగ్నిటీ ప్రక్కన బెట్టి పనిచేయగలిగే వాళ్ళు)కానీ గాలి తప్ప ప్రతీది కొనుక్కోవాలి అనేది పచ్చి నిజం.
Subscribe to:
Post Comments (Atom)
ఇందిరా గాంధీ ద్రోహం: అమెరికా ఒత్తిడికి లొంగి పాకిస్తాన్ అణు బాంబును ఆపలేకపోయిన కథ
ఇందిరా గాంధీ ద్రోహం: అమెరికా ఒత్తిడికి లొంగి పాకిస్తాన్ అణు బాంబును ఆపలేకపోయిన కథ 1980ల మధ్యకాలంలో పాకిస్తాన్ రహస్యంగా అణుకేంద్రం నిర్మిస్తు...
-
Dear friends, Hyderabad people We are a group of farmers producing different types of vegetables in and around siddipet district. As the w...
-
The Times Now - CNX study has proclaimed that TRS will return to control in the territory of Telangana. According to this study, the fol...
No comments:
Post a Comment