Sunday, October 25, 2020

జమ్మిచెట్టుకి ఎందుకంత ప్రాధాన్యత?*విశేషం 🌳🌳🌳🌳🌳

జమ్మిచెట్టుకి ఎందుకంత ప్రాధాన్యత?*విశేషం
            🌳🌳🌳🌳🌳
దసరా సంబరాలు చివరిరోజుకి చేరుకోగానే అందరికీ గుర్తుకువచ్చేది జమ్మిచెట్టు. దసరా సాయంత్రం వేళ జమ్మికొట్టి, ఆ చెట్టు ఆకులను బంగారంగా భావిస్తూ పెద్దల చేతిలో పెట్టి ఆశీస్సులు తీసుకుంటారు. చెట్లని దైవంగా పూజించి కొలుచుకోవడం హైందవ సంస్కృతిలో తరచూ కనిపించేదే! కానీ ఈ దసరా రోజుకీ జమ్మి చెట్టుకీ మధ్య అనుబంధం ఏమిటి అన్న ప్రశ్నకు చాలా సమాధానాలే కనిపిస్తాయి.
కాస్త జమ్మి గురించి...
జమ్మి భారతీయులకు కొత్తేమీ కాదు. ఇంకా చెప్పాలంటే భారత ఉపఖండంలోనే ఈ వృక్షం ఉద్భవించిందన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం. అందుకనే రుగ్వేదకాలం నుంచే జమ్మి ప్రస్తావన కనిపిస్తుంది. అప్పట్లో ఈ చెట్టుని అగ్నిని పుట్టించే సాధనంగా వాడేవారు. మనం పురాణాలలోనూ, వేదాలలోనూ తరచూ వినే ‘అరణి’ని ఈ జమ్మితోనే రూపొందించేవారు. జమ్మి ఎలాంటి ప్రాంతాలలో అయినా త్వరత్వరగా పెరిగేస్తుంది. నీటి లభ్యత పెద్దగా లేకున్నా కూడా సుదీర్ఘకాలం బతికేస్తుంది. అందుకే ఎడారి ప్రాంతమైన రాజస్థాన్ మొదలుకొని వర్షపాతం తక్కువగా ఉండే తెలంగాణ వరకు పొడి ప్రాంతాలలోని ప్రజలకు జమ్మి జీవనాధారంగా నిలుస్తోంది.

పట్నం వాసులకు జమ్మి ప్రయోజనాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ రైతులకు, గ్రామీణ ప్రాంతాలవారికీ జమ్మి అంటే ప్రాణం. దీని కొమ్మలు, ఆకులు పశువులకు మేతగా ఉపయోగపడతాయి; దీని వేళ్లు భూసారాన్ని పట్టి ఉంచుతాయి; ఈ చెట్టులోని ప్రతిభాగాన్నీ నాటువైద్యంలో ఔషధాలుగా వాడతారు. ఈ చెట్టు నుంచి వచ్చే గాలిని పీల్చినా, దీని చుట్టూ ప్రదక్షిణాలు చేసినా ఆరోగ్యం సమకూరుతుందని పెద్దల నమ్మకం. అందుకే వినాయక చవినినాడు పూజించే ఏకవింశతి పత్రాలలో శమీపత్రాన్ని కూడా చేర్చారు.
దసరా- జమ్మిచెట్టు
ఏడాదిపాటు అజ్ఞానవాసానికి బయల్దేరిన పాండవులు విజయదశమి రోజునే తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీద దాచి వెళ్లారట. తిరిగి అదే విజయదశమినాడు వారు జమ్మిచెట్టు రూపంలో ఉన్న అపరాజితా దేవిని పూజించి, తమ ఆయుధాలను తీసుకున్నారు. అలా పాండవులకు అపరాజితా దేవి ఆశీస్సులు ఉండబట్టే, వారు యుద్ధంలో గెలిచారని నమ్ముతారు. కేవలం పాండవులే కాదు, రామునికి సైతం జమ్మిచెట్టు ప్రీతికరమైనది చెబుతారు (రామస్య ప్రియదర్శనీ). పైగా జమ్మిచెట్టుని స్త్రీస్వరూపంగా (శక్తిగా) భావిస్తారు. ఆ శక్తి అనుగ్రహం కూడా రాములవారికి లభించబట్టే, ఆయన రావణునితో జరిగిన సంగ్రామంలో గెలుపొందారట.

జమ్మి చెట్టుకి మన పురాణాలలోనూ, జీవితాలలోనూ ఇంతటి సంబంధం ఉండబట్టే దసరానాడున జమ్మిచెట్టుకి పూజలు చేస్తారు. శమీవృక్షానికి ప్రదక్షిణలు చేస్తూ ఈ క్రింది శ్లోకాలను చదువకుంటారు-
‘‘శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ,
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియవాదినీ.’’
‘’శమీ శమయతే పాపం శమీలోహిత కంటకా,
ధారిణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదినీ,
కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖంమయా,
తత్ర నిర్విఘ్న కర్త్రీత్వం భవ శ్రీరామపూజితే.''
జమ్మి బంగారం
పూజ ముగిసిన తరువాత జమ్మి ఆకులను తుంచుకుని వాటిని బంగారంలా భద్రంగా ఇళ్లకు తీసుకువెళ్తారు. ఆ ఆకులను తమ పెద్దల చేతిలో ఉంచి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. జమ్మి ఆకులకు ఉన్నా ఆధ్మాత్మిక ప్రాధాన్యత రీత్యా అవి బంగారంతో సమానం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. పైగా కుబేరుడు ఒకనాడు రఘమహారాజుకి భయపడి జమ్మిచెట్లున్న తావున బంగారాన్ని కురిపించాడనే గాథ ఎలాగూ ప్రచారంలో ఉంది. అలాంటి జమ్మి ఆకులను శుభంగా భావించి, జమ్మి కొట్టేందుకు రాలేకపోయిన పెద్దల చేతిలో ఉంచుతారు. జమ్మిని పూజించడం అంటే జీవితంలో సకల విజయాలనూ సాధించాలని కోరుకోవడమే. పిల్లల మనసులోని ఈ విజయకాంక్షను గ్రహించిన పెద్దలు, వారి మనోకామన నెరవేరాలని తమ దీవెనలను కూడా జతచేస్తారు.
పాలపిట్ట
దసరా రోజున పాలపిట్టను కూడా చూడాలన్న నియమం ఒకటి ఉంది. పాండవులు తమ ఆయుధాలను జమ్మిచెట్టు మీద నుంచి తీసుకుని తిరిగి తమ రాజ్యానికి చేరుకుంటుండగా, వారికి పాలపిట్ట కనిపించిందనీ... అప్పటి నుంచీ వారికి సకల విజయాలూ సిద్ధించాయని ఒక నమ్మకం. అందుకనే విజయానికి శుభసూచకంగా పాలపిట్టను దర్శించే ఆనవాయితీ బయల్దేరింది.
కొసమెరుపు
జమ్మిచెట్టుకి ఉన్న ప్రాముఖ్యతను గుర్తిస్తూ ‘యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్’ (UAE) భూసారాన్ని పెంచేందుకు ప్రతి ఇంట్లోనూ ఒక జమ్మిచెట్టుని నాటమని సూచిస్తోంది. కానీ మనదగ్గర మాత్రం ఉన్న కాసిని జమ్మి చెట్లూ నాశనం అయిపోతున్నాయి. ఇప్పటి పిల్లలైతే జమ్మి చెట్టుని గుర్తిస్తారో లేదో కూడా అనుమానమే! ఇక పాలపిట్ట సంగతి చెప్పనే అక్కర్లేదు. విజయదశమినాడు పంజరాల్లో పాలపిట్టలను తీసుకుని వచ్చి దర్శనం చేయిస్తున్నారంటే... ఇవి అంతరించిపోయేందుకు ఎంతటి సమీపంలో ఉన్నాయో తెలిసిపోతుంది. జమ్మిచెట్టు, పాలపిట్ట తిరిగి మన జీవితాలలో భాగమైనప్పుడే అసలైన విజయదశమి!

🙏🙏🙏🙏🙏🙏

Saturday, October 24, 2020

*"దసరా" అంటే?*

*"దసరా" అంటే?* 
************************
దసరా *దశహరా* నుండి రూపాంతరం చెందింది.
దశ అనగా పది.
పది తలలు గల రావణుడిని హరించిన రోజే *దశహరా.!* 
ఇది భౌతికమైన విషయం.
ఆద్యాత్మికంగా ఆలోచించినట్లైతే?
మనిషిలోని పది దుర్గుణాలను లేదా పాపాలను హరించవలసిన రోజు.!
అదే నిజమైన *దసరా.!* 
ఏమిటా *దుర్గుణాలు*? 
అవి
*శారీరకంగా చేసే పాపాలు 3.* 
1.అపాత్రదానం.(చేయవలసిన వారికి దానం చేయకపోవడం లేదా మనం చేసిన దానం వృధా కావడం)
2.శాస్త్రం అంగీకరించని హింస చేయడం.
3.పర స్త్రీ ని లేదా పురుషుని పొందు కోరడం.,సంగమించడం.
*నోటి ద్వారా చేసే పాపాలు 4.* 
1.పరుషంగా మాట్లాడుట.
2.అసత్యాలు చెప్పడం.
3.వ్యర్థ ప్రలాపాలు చేయడం.
4.అసభ్యంగా మాట్లాడుట.
*మనసు ద్వారా చేసే పాపాలు 3.* 
1.పరుర సొమ్ము ను దొంగిలించాలనే బుద్ధి ఉండటం.
2.ఇతరులకు బాధ కలిగించే పనులు చేయడం.
3.అహంకారం కల్గి ఉండటం.
ఇవి పది పాపాలు!
ఈ పాపాలను హరించుకుందామనీ.,ఆ హరించే శక్తి అమ్మ దుర్గామాత మనందరికీ ఇవ్వాలని ఆశిద్దాం.
జై దుర్గామాతా.

Friday, October 23, 2020

శ్రీ మహిషాసుర మర్దినీ స్తోత్రమ్

శ్రీ మహిషాసుర మర్దినీ స్తోత్రమ్

అయి గిరినందిని నందితమేదిని విశ్వ-వినోదిని నందనుతే
గిరివర వింధ్య-శిరోఽధి-నివాసిని విష్ణు-విలాసిని జిష్ణునుతే |
భగవతి హే శితికంఠ-కుటుంబిణి భూరికుటుంబిణి భూరికృతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ‖ 1 ‖

సురవర-హర్షిణి దుర్ధర-ధర్షిణి దుర్ముఖ-మర్షిణి హర్షరతే
త్రిభువన-పోషిణి శంకర-తోషిణి కల్మష-మోషిణి ఘోషరతే |
దనుజ-నిరోషిణి దితిసుత-రోషిణి దుర్మద-శోషిణి సింధుసుతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ‖ 2 ‖

అయి జగదంబ మదంబ కదంబవన-ప్రియవాసిని హాసరతే
శిఖరి-శిరోమణి తుఙ-హిమాలయ-శృంగనిజాలయ-మధ్యగతే |
మధుమధురే మధు-కైతభ-గంజిని కైతభ-భంజిని రాసరతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ‖ 3 ‖

అయి శతఖండ-విఖండిత-రుండ-వితుండిత-శుండ-గజాధిపతే
రిపు-గజ-గండ-విదారణ-చండపరాక్రమ-శౌండ-మృగాధిపతే |
నిజ-భుజదండ-నిపాటిత-చండ-నిపాటిత-ముండ-భటాధిపతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ‖ 4 ‖

అయి రణదుర్మద-శత్రు-వధోదిత-దుర్ధర-నిర్జర-శక్తి-భృతే
చతుర-విచార-ధురీణ-మహాశయ-దూత-కృత-ప్రమథాధిపతే |
దురిత-దురీహ-దురాశయ-దుర్మతి-దానవ-దూత-కృతాంతమతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ‖ 5 ‖

అయి నిజ హుంకృతిమాత్ర-నిరాకృత-ధూమ్రవిలోచన-ధూమ్రశతే
సమర-విశోషిత-శోణితబీజ-సముద్భవశోణిత-బీజ-లతే |
శివ-శివ-శుంభనిశుంభ-మహాహవ-తర్పిత-భూతపిశాచ-పతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ‖ 6 ‖

ధనురనుసంగరణ-క్షణ-సంగ-పరిస్ఫురదంగ-నటత్కటకే
కనక-పిశంగ-పృషత్క-నిషంగ-రసద్భట-శృంగ-హతావటుకే |
కృత-చతురంగ-బలక్షితి-రంగ-ఘటద్-బహురంగ-రటద్-బటుకే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ‖ 7 ‖

అయి శరణాగత-వైరివధూ-వరవీరవరాభయ-దాయికరే
త్రిభువనమస్తక-శూల-విరోధి-శిరోధి-కృతాఽమల-శూలకరే |
దుమి-దుమి-తామర-దుందుభి-నాద-మహో-ముఖరీకృత-దిఙ్నికరే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ‖ 8 ‖

సురలలనా-తతథేయి-తథేయి-తథాభినయోదర-నృత్య-రతే
హాసవిలాస-హులాస-మయిప్రణ-తార్తజనేమిత-ప్రేమభరే |
ధిమికిట-ధిక్కట-ధిక్కట-ధిమిధ్వని-ఘోరమృదంగ-నినాదరతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ‖ 9 ‖

జయ-జయ-జప్య-జయే-జయ-శబ్ద-పరస్తుతి-తత్పర-విశ్వనుతే
ఝణఝణ-ఝింఝిమి-ఝింకృత-నూపుర-శింజిత-మోహితభూతపతే |
నటిత-నటార్ధ-నటీనట-నాయక-నాటకనాటిత-నాట్యరతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ‖ 10 ‖

అయి సుమనః సుమనః సుమనః సుమనః సుమనోహర కాంతియుతే
శ్రితరజనీరజ-నీరజ-నీరజనీ-రజనీకర-వక్త్రవృతే |
సునయనవిభ్రమ-రభ్ర-మర-భ్రమర-భ్రమ-రభ్రమరాధిపతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ‖ 11 ‖

మహిత-మహాహవ-మల్లమతల్లిక-మల్లిత-రల్లక-మల్ల-రతే
విరచితవల్లిక-పల్లిక-మల్లిక-ఝిల్లిక-భిల్లిక-వర్గవృతే |
సిత-కృతఫుల్ల-సముల్లసితాఽరుణ-తల్లజ-పల్లవ-సల్లలితే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ‖ 12 ‖

అవిరళ-గండగళన్-మద-మేదుర-మత్త-మతంగజరాజ-పతే
త్రిభువన-భూషణభూత-కళానిధిరూప-పయోనిధిరాజసుతే |
అయి సుదతీజన-లాలస-మానస-మోహన-మన్మధరాజ-సుతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ‖ 13 ‖

కమలదళామల-కోమల-కాంతి-కలాకలితాఽమల-భాలతలే
సకల-విలాసకళా-నిలయక్రమ-కేళికలత్-కలహంసకులే |
అలికుల-సంకుల-కువలయమండల-మౌళిమిలద్-వకులాలికులే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ‖ 14 ‖

కర-మురళీ-రవ-వీజిత-కూజిత-లజ్జిత-కోకిల-మంజురుతే
మిలిత-మిలింద-మనోహర-గుంజిత-రంజిత-శైలనికుంజ-గతే |
నిజగణభూత-మహాశబరీగణ-రంగణ-సంభృత-కేళితతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ‖ 15 ‖

కటితట-పీత-దుకూల-విచిత్ర-మయూఖ-తిరస్కృత-చంద్రరుచే
ప్రణతసురాసుర-మౌళిమణిస్ఫురద్-అంశులసన్-నఖసాంద్రరుచే |
జిత-కనకాచలమౌళి-మదోర్జిత-నిర్జరకుంజర-కుంభ-కుచే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ‖ 16 ‖

విజిత-సహస్రకరైక-సహస్రకరైక-సహస్రకరైకనుతే
కృత-సురతారక-సంగర-తారక సంగర-తారకసూను-సుతే |
సురథ-సమాధి-సమాన-సమాధి-సమాధిసమాధి-సుజాత-రతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ‖ 17 ‖

పదకమలం కరుణానిలయే వరివస్యతి యోఽనుదినం న శివే
అయి కమలే కమలానిలయే కమలానిలయః స కథం న భవేత్ |
తవ పదమేవ పరంపద-మిత్యనుశీలయతో మమ కిం న శివే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ‖ 18 ‖

కనకలసత్కల-సింధుజలైరనుషింజతి తె గుణరంగభువం
భజతి స కిం ను శచీకుచకుంభత-తటీపరి-రంభ-సుఖానుభవం |
తవ చరణం శరణం కరవాణి నతామరవాణి నివాశి శివం
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ‖ 19 ‖

తవ విమలేఽందుకలం వదనేందుమలం సకలం నను కూలయతే
కిము పురుహూత-పురీందుముఖీ-సుముఖీభిరసౌ-విముఖీ-క్రియతే |
మమ తు మతం శివనామ-ధనే భవతీ-కృపయా కిముత క్రియతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ‖ 20 ‖

అయి మయి దీనదయాళుతయా కరుణాపరయా భవితవ్యముమే
అయి జగతో జననీ కృపయాసి యథాసి తథానుమితాసి రమే |
యదుచితమత్ర భవత్యురరీ కురుతా-దురుతాపమపా-కురుతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ‖ 21 ‖

Thursday, October 22, 2020

కనకదుర్గ గుడి, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశంలో ఒక ప్రసిద్ధమైన దేవస్థానం. ఇది విజయవాడ నగరంలో కృష్ణా నది ఒడ్దున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయం.

కనకదుర్గ గుడి, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశంలో ఒక ప్రసిద్ధమైన దేవస్థానం. ఇది విజయవాడ నగరంలో కృష్ణా నది ఒడ్దున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయం. విజయవాడ పేరు చెప్పగానే కనక దుర్గ ఆలయం గుర్తుకు వస్తుంది. హిందూ పురాణాలలో అమ్మవారి గురించి ప్రస్తావన ఉంది.ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది. మిరిమిట్లు గొలిపే ఆభరణాలు, పూలతో అలంకరించబడి ఉంటుంది. మూర్తికి ఎనిమిది చేతులు ఉన్నాయి. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది. త్రిశూలంతో మహిషాసురుని గుండెలో పొడుస్తున్న భంగిమలో ఉంటుంది.

పేరువెనుక చరిత్ర :
కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మావారుని గురించి తపస్సు చేసి, ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయస్థానంలో నిలిచి ఉండమని కోరాడు. అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తరువాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురుచూస్తూ ఉన్నాడు. అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడకు తరచూ రావడం వలన కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది. ఇక్కడ వెలసిన మహిషాసురమర్ధిని ఆమె కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనక దుర్గ అయింది. ఇక్కడ అర్జునుడు శివుడి కొరకు తపస్సు చేసి శివుడి నుండి పాశుపతాస్త్రాన్ని పొందాడు. కనుక ఈ ప్రాంతం విజయవాడ అయింది.

క్షేత్ర పురాణం సవరించు
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్ధానం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది. ఇక్కడ దుర్గా దేవి స్వయంభువుగా (తనకు తానుగా) వెలసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది. ఆది శంకరాచార్యులవారు తమ పర్యటనలలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేసారని ప్రతీతి. ప్రతి సంవత్సరం కొన్ని లక్షలమంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొంటారు.


కనకదుర్గ అమ్మవారి విగ్రహము
రాక్షసుల బాధ భరించ లేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసముండి రాక్షసులను సంహరించమని ప్రార్థించగా, ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రి (ఇంద్రకీలుడి కొండ) పై కొలువుతీరింది. అర్జునుడు ఈ కొండ పై శివుని గురించి తపస్సు చేసాడని కూడా ప్రతీతి. ఈ ఆలయానికి హిందూ పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. శివలీలలు, శక్తి మహిమలు మొదలైనవి ఆలయంలోని ఆవరణలో అక్కడక్కడా గమనించవచ్చు

నవరాత్రి ఉత్సవాలు సవరించు
ఈ దుర్గాదేవి అమ్మవారికి ప్రతి సంవత్సరము దసర నవరోత్సవాలు జరుగుతాయి. ఈ దసర నవరోత్సవల లో ప్రతి రోజు ఒక అవతారముతో దర్శనము ఇస్తారు. ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతో దర్శనము ఇస్తారు.

మొదతి రోజు స్వర్ణ కవచాలంకార దుర్గ దేవి
రెండొవ రోజు బాల త్రిపురసుందరి దేవి
ముడొవ రోజు గాయత్రి దేవి
నాలుగోవ రోజు అన్నపూర్ణా దేవి.
ఐదవ రోజు లలితా త్రిపురసుందరి దేవి
ఆరొవ రోజు సరస్వతి దేవి
ఎడొవ రోజు దుర్గాదేవి
ఎనిమిదొవ రోజు మహాలక్ష్మిదేవి
తొమ్మిదొవ రోజు మహిషాసురమర్దినిదేవి
పదోవ రోజు రాజరాజేశ్వారిదేవి
ఈ ఐదొవ రోజున జరిగే సరస్వతి అమ్మవారి అలంకరణ రోజు అమ్మవరి జన్మనక్షత్రంగా అనగా ములానక్షత్రం గా భావిస్తారు. ఆ రోజున వేలాది మంది భక్తులు, విద్యార్థులు తరలివస్తారు. ఈ దేవాలయంలో వినాయక స్వామి, ఈశ్వరుడు, శ్రీ రాము ల వారు కొలువుతీరి ఉన్నారు. ఈ దేవాలయాన్ని దర్సించుటకు అనేక మంది భక్తులు అనేక ప్రదేశాల నుండి వస్తారు.

దసరా పండుగ సంబరాలు-2020 సవరించు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న కనకదుర్గమ్మ వారు ఈ క్రింది తెలిపిన విధంగా వివిధ అలంకారాల్లో దసరా పది రోజుల్లో దర్శనమివ్వనున్నారు.

తేదీ వారపు రోజు తిథి అలంకరణ
17-10-2020 శనివారము ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి శ్రీ బాల త్రిపురసుందరి దేవి
18-10-2020 ఆదివారము ఆశ్వీయుజ శుద్ధ విదియ శ్రీ గాయత్రి దేవి
19-10-2020 సోమవారము ఆశ్వీయుజ శుద్ధ తదియ శ్రీ అన్నపూర్ణా దేవి
20-10-2020 మంగళవారము ఆశ్వీయుజ శుద్ధ చవితి శ్రీ లలితా త్రిపురసుందరి దేవి
21-10-2020 బుధవారము ఆశ్వీయుజ శుద్ధ పంచమి శ్రీ సరస్వతి దేవి
22-10-2020 గురువారము ఆశ్వీయుజ శుద్ధ షష్ఠి శ్రీ దుర్గాదేవి
23-10-2020 శుక్రవారము ఆశ్వీయుజ శుద్ధ సప్తమి శ్రీ మహాలక్ష్మిదేవి
24-10-2020 శనివారము ఆశ్వీయుజ శుద్ధ అష్టమి శ్రీ మహిషాసురమర్దిని దేవి
25-10-2020 ఆదివారము ఆశ్వీయుజ శుద్ధ నవమి, దశమి (దసరా) శ్రీ రాజరాజేశ్వరీ దేవి

Wednesday, October 21, 2020

శ్రీ సరస్వతీ అష్టోత్తర శతనామావళి

శ్రీ సరస్వతీ అష్టోత్తర శతనామావళి 
ఓం సరస్వత్యై నమః
ఓం మహాభద్రాయై నమః
ఓం మహా మయాయై నమః
ఓం వరప్రదాయై నమః
ఓం శ్రీ ప్రదాయై నమః
ఓం శ్రీ పద్మానిలయాయై నమః
ఓం పద్మాక్ష్యై నమః
ఓం పద్మ వక్త్రాయై నమః
ఓం శ్రీ శివానుజాయై నమః
ఓం జ్ఞానముద్రాయై నమః
ఓం రమాయై నమః
ఓం పరాయై నమః
ఓం కామరూపాయై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం మహా పాతక నాశిన్యై నమః
ఓం మహాశ్రయాయై నమః
ఓం మాలిన్యై నమః
ఓం మహాభాగాయై  నమః
ఓం మహాభుజాయై నమః
ఓం మహాభాగ్యాయై నమః
ఓం మహోత్సాహాయై నమః
ఓం దివ్యామ్గాయై నమః
ఓం సురవందితాయై నమః
ఓం మహాకాల్యై నమః
ఓం మహాపాశాయై నమః
ఓం మహాకారాయై నమః
ఓం మహాంకుశాయై నమః
ఓం సీతాయై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వాయై నమః
ఓం విద్యున్మాలాయై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం చంద్రికాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రలేఖావిభూషితాయై నమః
ఓం సావిత్ర్యై నమః
ఓం సురాపాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం దివ్యాలంకారభూషితాయై నమః
ఓం వాగ్దేవ్యై నమః
ఓం వసుధాయై నమః
ఓం తీవ్రాయై నమః
ఓం మహాభద్రాయై నమః
ఓం మహాబలాయై నమః
ఓం భోగదాయై నమః
ఓం భారత్యై నమః
ఓం భామాయై నమః
ఓం గోవిందాయై నమః
ఓం గోమాత్యై నమః
ఓం శివాయై నమః
ఓం జటిలాయై నమః
ఓం వింధ్యవాసాయై నమః
ఓం వింధ్యాచల విరాజితాయై నమః
ఓం చండికాయై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం బ్రాహ్మ్యై నమః
ఓం బ్రహ్మజ్ఞానైక సాధనాయై నమః
ఓం సౌదామన్యై నమః
ఓం సుదాముర్త్యై నమః
ఓం సుభద్రాయై నమః
ఓం సురపూజితాయై నమః
ఓం సువాసిన్యై నమః
ఓం సువాసాయై నమః
ఓం వినిద్రాయై నమః
ఓం పద్మలోచనాయై నమః
ఓం విద్యారూపాయై నమః
ఓం విశాలాక్ష్యై నమః
ఓం బ్రహ్మజాయాయై నమః
ఓం మహాబలాయై నమః
ఓం త్రయీమూర్హ్యై నమః
ఓం త్రికాలజ్ఞాయై నమః
ఓం త్రిగుణాయై నమః
ఓం శాస్త్రరూపిన్యై నమః
ఓం శుంభాసురప్రమదిన్యై నమః
ఓం శుభదాయై నమః
ఓం సర్వాత్మికాయై నమః
ఓం రక్తబీజ నిహంత్ర్యై నమః
ఓం చాముండాయై నమః
ఓం వీణాపాణినే నమః
ఓం అంబికాయై నమః
ఓం చండకాయ ప్రహరణాయై నమః
ఓం ధూమ్రలోచనమర్ధనాయై నమః
ఓం సర్వదేవస్తుతాయై నమః
ఓం సౌమ్యాయై నమః
ఓం సురాసుర నమస్కృతాయై నమః
ఓం కాళరాత్ర్యై నమః
ఓం కలాధారాయై నమః
ఓం రూపసౌభాగ్య దాయిన్యై నమః
ఓం వాగ్దేవ్యై నమః
ఓం వరారోహాయై నమః
ఓం వరాహ్యై నమః
ఓం వారిజాసనాయై నమః
ఓం చిత్రాంబరాయై
ఓం చిత్రగంధాయై నమః
ఓం చిత్రమాల్య విభూషితాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామప్రదాయై నమః
ఓం వంద్యాయై నమః
ఓం విద్యాధరసుపూజితాయై నమః
ఓం శ్వేతాసనాయై నమః
ఓం నీలభుజాయై నమః
ఓం చతుర్వర్గ ఫలప్రదాయై నమః
ఓం చతురాసన సామ్రాజ్యై నమః
ఓం రక్త మద్యాయై నమః
ఓం నిరంజనాయై నమః
ఓం హింసాశనాయై నమః
ఓం నీలజంఘాయై నమః
ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః
ఇతి శ్రీ సరస్వతీ దేవీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

Tuesday, October 20, 2020

# భక్తి అంటే ?

# భక్తి అంటే ? 

1) తెల్లవారుజామున 4 నుండి 4.30 గంటలకు మేల్కొనడం
2) మంచం నుండి నిద్ర మేల్కొన్న తర్వాత,3 సార్లు  - శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి అని చెప్పడం
3) భూమిని తాకడం & నమస్కారం చేయడం
4) ఉదయం 5 గంటలకు ముందే స్నానం పూర్తి చేయడం 
5) సూర్యోదయానికి ముందు ప్రతి రోజు పూజను పూర్తి చేయడం 
6) పూజ చేసేటప్పుడు ధోతి (పంచ) ధరిoచడం
7) 24 గంటలు మంచి ప్రవర్తనను కొనసాగించడం 
8) మర్యాదగా మాట్లాడం
9) సొంత భార్యను ప్రేమించడం & మిగతా ఆడవారిలో అమ్మవారిని చూడటం
10) తల్లిదండ్రులను గౌరవించడం & వారిని జాగ్రత్తగా చూసుకోవడం
11) క్రమం తప్పకుండా ధర్మసాధన చేయడం & ధర్మాన్ని రక్షించడం
12) పేదవారికి సహాయం చేయడం
13) ఇతరులను బాధించకుండా ఉండడం
14) ఇతరులను మోసం చేయకుండా ఉండడం
15) సాంప్రదాయ దుస్తులను ధరించి ఆలయాన్ని సందర్శించడం
16) చొక్కా లేకుండా ,ధోతి ధరించి శివ అభిషేకం చేయడం 
17) టీవీ చూడకుండా & ప్రశాంతంగా అల్పాహారం / భోజనం  తీసుకోవడం 
18) పడుకునేటప్పుడు -  11 సార్లు శివ నామం చెప్పడం
19) మన కష్టాలు ఏమైనా, దేవునిపై విశ్వాసం కలిగి ఉండడం
20) ఇతరులకు బోధించే ముందు, ముందుగా మనం అనుసరించాలి

Monday, October 19, 2020

భక్తులు ఎంతో నిష్ట, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకునే రోజులలో దేవీశరన్నవరాత్రులలో అమ్మవారు మనకు ఏ ఏ రూపంలో దర్షణం ఇస్తారు, అమ్మ కొరకు ఏ రోజు ఏ ఏ ప్రసాదములు చేస్తారు, వాటిని తయారు చేసే విధానం గురించి తెలుసుకుందాం.

భక్తులు ఎంతో నిష్ట, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకునే రోజులలో దేవీశరన్నవరాత్రులలో అమ్మవారు మనకు ఏ ఏ రూపంలో దర్షణం ఇస్తారు, అమ్మ కొరకు ఏ రోజు ఏ ఏ ప్రసాదములు చేస్తారు, వాటిని తయారు చేసే విధానం గురించి తెలుసుకుందాం.


1. శ్రీ బాల త్రిపుర సుందరి దేవి. మొదటి రోజు పొంగల్
కావలసినవి :-

పెసరపప్పు 150 గ్రాములు, కొత్త బియ్యం 100 గ్రాములు,

మిరియాలు 15 ,

పచ్చి మిరప కాయలు 6,

పచ్చి కొబ్బెర, 1 కప్పు కాచిన నెయ్యి ,1/4 కప్పు

జీడిపప్పు 15

, జీలకర్ర 1/2 టేబల్ స్పూన్,

ఆవాలు 1/4 టేబల్ స్పూన్

,ఎండుమిర్చి 3

,మినపప్పు , శనగపప్పు 2 టేబల్ స్పూన్స్

,కోత్తమిర , కరేపాకు, తగినంత

ఉప్పు రుచిని బట్టి ,

ఇంగువ 2 చిటికెళ్ళు.

చేయవలసిన విధానము:-

దళసరి పాత్రలో కాస్త నెయ్యి వేడి చేసి

పెసర పప్పుని దోరగా వేయించండి .బియ్యం కడిగి నీళ్ళన్నీ తీసేసిన తర్వాత బియ్యం కూడా బాగా వేయించండి తెలుపు రంగు పోకూడదు సుమారు 5 నిమిషాలు

వేపితే చాలు పెసరపప్పు కూడ కలర్ మార కూడదు,

అదే మూకుడులో మరి కాస్త నెయ్యి వేసి

జీడిపప్పులను వేయించి పెట్టడి.సన్నగా తరిగిన పచ్చి మిర్చి,పచ్చికొబ్బెర తురిమి , జీలకర, మిరియాలు, వేయించిన బియ్యం,

పెసరపప్పు ఇవన్నీ నాలుగు కప్పుల నీళ్ళతో

కుక్కర్లో వుంచి మూడు విజిల్స్ వచ్చాక ష్టవ్ కట్టివేయండి.

చల్లారాక అందులో ఆవాలు , మినపప్పు ,

శనగపప్పు ,జీలకర్ర , ఎండుమిర్చి ,ఇంగువ, కర్వేపాక్ వేసి తాలింపు పెట్టి మిగిలిన నెయ్యి అంతా పొంగలిలో వేసి వేడి వేడి ప్రసాదము తల్లి త్రిపుర సుందరీ దేవికి నైవేద్యంపెట్టి

భక్తిగా పూజించి ఈ శరన్నవరాత్రులలో రోజులు మాకు శక్తినిచ్చి నీకు సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు తల్లీ అని ప్రార్ధించాలి .
.గాయత్రి దేవి-రెండవ రోజు పులిహోర
కావలసినవి :- బియ్యం 150 గ్రాముల

చింతపండు, 50 గ్రాముల

పసుపు1/2 స్పూన్

,ఎండుమిర్చి 5

,ఆవాలు 1/2 స్పూన్

, మినపప్పు 1 స్పూన్,

శనగ పప్పు 2 స్పూన్స్,

వేరు శనగ పప్పు 1/2 కప్పు

,కరివేపాకు 2 రెబ్బలు

, ఇంగువ చిటికెడు ,నూనె 1/4 కప్పు

,ఉప్పు తగినంత

,బెల్లం కొద్దిగా

!! చేయవలసిన విధానం !!

అన్నం వండి చల్లార్చి పసుపు , ఉప్పు , కలిపి పెట్టాలి .చింతపండును అరకప్పు నీళ్ళు పోసి

నాన పెట్టి ,చిక్కటి గుజ్జు తీసి పెట్టండి, మూకుడులో కాస్త నూనె వేసి అందులో ఆవాలు ఎండుమిర్చి వేసి ఈ చింతపండు గుజ్జు వేసి కాస్త బెల్లం వేసి బాగా ఉడికించండి (కావాలంటే పచ్చి మిర్చి వేసుకోవచ్చు గుజ్జులో )

ఉడికిన గుజ్జు అన్నంలో కలిపండి .

బాణిలో నూనె వేడి చేసి ముందుగా ఆవాలు ,మినపప్పు , శనగ పప్పు , ఇంగువ , ఎండుమిర్చి వేసి ఆ వాలు చిటపట అన్న తరువాత వేరుశనగ గుళ్ళు వేసి అన్నీ బాగా వేగాక కర్వేపాక్ వేసి అన్నంలో కలపడమే కమ్మటి పులిహోర రెడీవ్వగానే శ్రీ జగదీశ్వరీ మాతైన ఆ గాయిత్రి దేవికి నైవేద్యం పెట్టి ఆ తల్లి ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకొందాము
అన్నపూర్ణా దేవి. మూడవ రోజు కొబ్బెరన్నం.
కావలసినవి:- బియ్యం 1/2 కిలో

,తురిమిన పచ్చికొబ్బెర, 1 కప్పు

పచ్చిమిర్చి, 5

కర్వేపాక్ , కొత్తిమీర , ఉప్పు ,పోపు సామాగ్రి ఎండు మిర్చి , ఇంగువ ,

జీడి పప్పు 10,

నూనె 1/4 కప్పు,నెయ్యి 1 టెబుల్ స్పూన్.

చేయవలసిన పద్ధతి అన్నం పోడి పోడిగా వండుకొని పచ్చి కొబ్బెర కాస్త నేతిలో వేయించి ఈ వేగిన కొబ్బెర అన్నంలో కలపండి అదే మూకుడులో నూనె వేసి పోపు సామాగ్రి వేసి ఎండుమిర్చి , ఇంగువ , వేసి ఆవాలు చిటపట అనగానే పొడవుగా తరిగిన పచ్చి మిరప కాయలు , కర్వేపాక్ , కొత్తిమీర అందులో వేసి తీసేయండి ఈ వేగనిచ్చినదంతా అన్నంలో కలిపి ఉప్పు జీడిపప్పు కూడ వేసి పైన కాస్త కోత్తిమీర చల్లండి కమ్మటి కొబ్బెరన్నం రెడి .

శ్రీ అన్నపూర్ణా దేవికి నైవేద్యం పెట్టి మనస్సు పూర్తిగా ప్రార్థించి అమ్మ కృపకు పాత్రులగుదాం.
కాత్యాయనీ దేవి. నాల్గవ రోజు అల్లం గారెలు.
కావలసినవి :-

మినపప్పు 2 కప్స్,

అల్లం చిన్న ముక్క

,పచ్చిమిరప కాయలు 6 సన్నగా తరిగినవి

, జీలకర్ర 1/4 స్పూన్,

ఉప్పు రుచికి తగినంత,

కర్వేపాక్ , కొత్తిమీర, తగినంత

నూనె గారెలు వేయించేందుకు

.

చేసే విధానం :- మినపప్పు బాగా కడిగి 4 , 5 , గంటలు నానపెట్టి ( లేకుంటే ముందు రోజు రాత్రి నానపెట్టుకొండి ) .

నానిన మినపప్పును గ్రైండర్లో వేసి , ఉప్పు , కాస్త తినే సోడ వేసి బాగా గ్రైడ్ చేసుకోండి . ఆ పిండిలో అల్లం,పచ్చిమిరప కాయలు కరివేపాకు, కొత్తిమీర సన్నగా తరిగి వేసి కాగిన నూనెలో ఈ మినపిండిని చేతిలో తీసుకొని రౌడుగా అదిమి నూనెలో విడచాలి .

దోరగా వేగిన వడలను , సహస్ర నామాలతో శ్రీ లలితాదేవికి ఆరాధించి నైవేద్యం పెట్టి

ఆశీర్వాదం పొందుదాం.

కాత్యాయనీ దేవి. నాల్గవ రోజు అల్లం గారెలు.
కావలసినవి :-

మినపప్పు 2 కప్స్,

అల్లం చిన్న ముక్క

,పచ్చిమిరప కాయలు 6 సన్నగా తరిగినవి

, జీలకర్ర 1/4 స్పూన్,

ఉప్పు రుచికి తగినంత,

కర్వేపాక్ , కొత్తిమీర, తగినంత

నూనె గారెలు వేయించేందుకు

.

చేసే విధానం :- మినపప్పు బాగా కడిగి 4 , 5 , గంటలు నానపెట్టి ( లేకుంటే ముందు రోజు రాత్రి నానపెట్టుకొండి ) .

నానిన మినపప్పును గ్రైండర్లో వేసి , ఉప్పు , కాస్త తినే సోడ వేసి బాగా గ్రైడ్ చేసుకోండి . ఆ పిండిలో అల్లం,పచ్చిమిరప కాయలు కరివేపాకు, కొత్తిమీర సన్నగా తరిగి వేసి కాగిన నూనెలో ఈ మినపిండిని చేతిలో తీసుకొని రౌడుగా అదిమి నూనెలో విడచాలి .

దోరగా వేగిన వడలను , సహస్ర నామాలతో శ్రీ లలితాదేవికి ఆరాధించి నైవేద్యం పెట్టి

ఆశీర్వాదం పొందుదాం.

. లలితా దేవి. ఐదవ రోజు దద్ధోజనం ( పెరుగన్నం )
కావలసినవి :-

బియ్యం 1/4 కిలో,పాలు 1/2 లీటర్

చిక్కటి పెరుగు, 1/2 లీటర్

నూనె, 1/2 కప్పు

నెయ్యి, 1 స్పూన్

కొత్తమిర , కర్వేపాకు,

చిన్న అల్లం ముక్క

, పచ్చిమిర్చి

, పోపు సామాగ్రి

, జీడిపప్పు 20

,ఉప్పు , ఇంగువ, ఎండుమిర్చి

.

చేసే విధానం :- ముందు బియ్యం కడిగి అన్నం వండి , కాస్త చల్లారాక కాచిన పాలు , పెరుగు , ఉప్పు , వేసి బాగా కలిపి వుంచండి,

శ్రీ మహాలక్ష్మిదేవి ఆరవ రోజు రవ్వ కేసరి.
కావలసినవి :- రవ్వ 1 కప్పు,చక్కర 3/4 కప్పు, నెయ్యి 2 టెబుల్ స్పూన్స్, కేసరి కలర్ చిటికెడు.

యాలకులు 4

,ఎండు ద్రాక్షా 6,

జీడిపప్పు 10,

పాలు 1 కప్పు ( మిల్క్ మేడ్ 1 )

వాటర్ 1/2 కప్పు.

చేసే విధానం :-

ముందు మూకుడులో కాస్త నెయ్యి వేసి రవ్వ దోరగా వేయించి తీసి ప్లేట్ లో వేసివుంచండి .

మూకుడులో కాస్త నెయ్యి వేసి జీడిపప్పు , ఎండు ద్రాక్షవేయించి తీసివుంచండి .నీళ్ళూ ,పాలూ ,కలిపి బాగా మరగనివ్వాలి.అందులో

కేసరి కలర్ ,చెక్కర , రవ్వ వేసి నెయ్యి వేస్తూ బాగా కలిపి అందులో ద్రాక్షా ,జీడిపప్పు ,మిగిలిన నెయ్యి అంతా వేసి బాగా కలిపి వేడి వేడి గా ఘుమ ఘుమగా నేతితో ఆ మహాలక్ష్మికి నైవేద్యంగా పెట్టి సౌభాగ్యం ఇవ్వమని ప్రార్ధించి నైవేద్యం పెట్టండి

. మహా సరస్వతి దేవి. కదంబం ప్రసాదం ఏడవ రోజు
కావలసినవి:-

కందిపప్పు 1/2 కప్పు

,బియ్యం 1/2 కప్పు ( కొత్తబియ్యం అయితే మరీ రుచిగా వుంటుంది )

,1 వంకాయ,

1/4 సొర్రకాయ

,1 దోసకాయ

,బీన్స్ తగినన్ని,

1 ఆలుగడ్డ,

పల్లిలు 2 పిడికిళ్ళు,

2 మొక్క జొన్నలు

,1/2 క్యారెట్,

2 టోమాటో,

తగినంత కర్వేపాకు

, కొత్తిమీర

,తురిమిన పచ్చి కొబ్బెర 1 చిప్ప

,4 పచ్చి మిర్చి

, నూనె తగినంత

, నెయ్యి చిన్న కప్పు,

చింతపండు గుజ్జు తగినంత

,కాస్త బెల్లం,ఉప్పు , పసుపు తగినంత

,3 చెంచాలు సాంబర్ పౌడర్,

పోపు గింజలు ,ఎండుమిర్చి, ఇంగువ .

చేయవలసిన విధానము :-

ముందుగ కాయగూరలన్ని మీకు కావలసిన సైజులో తరుక్కోని వుంచుకోండి

కుక్కర్లో కందిపప్పు ,బియ్యం ,పల్లీలు ,టోమాటో తప్ప అన్నీ కూరగాయలు వేసి

పసుపు , ఉప్పు ,నీళ్ళు 5 పావులు వేసి రెండు విజిల్ వచ్చాక స్టవ్ కట్ చేయండి .

మూకుడులో కొద్దిగ నూనె వేసి వేడి చేసాక అందులో కొద్దిగ ఆవాలు వేసి అవి చిట్లిన తరువాత పచ్చిమిర్చి ,కర్వేపాకు ,టొమాటో ,చింతపండు గుజ్జు ,సాంబర్ పౌడర్ వేసి బాగా వుడికిన తర్వాత ఆ గ్రేవి అంతా ఉడికిన బియ్యంలోవేసి కోత్తమీర ,కర్వేపాక్ ,నెయ్యి వేసి మరోసారి ఉడికించండి అంతా బాగా ఉడికిన తరువాత ,ఎండుమిర్చి ,ఇంగువతో తాలింపు పెట్టికొబ్బరి కలిపి దించండి వేడి వేడిగా దుర్గాదేవికి నెయ్యివేసి నైవేద్యం పెట్టి ఆ తల్లి దీవెనలు పొందండి

. మహిషాసుర మర్ధిని. ఎనిమిదవ రోజు బెల్లం అన్నం.
కావలసినవి :- బియ్యం 100 గ్రాములు,

బెల్లం 150 గ్రాములు,

యాలకులు 5,

నెయ్యి 50 గ్రాములు,

జీడిపప్పు 10

.

చేసే విధానం:- ముందుగా బియ్యం కడిగి అరగంట నాననివ్వండి .తర్వాత మెత్తగా ఉడికించాలి .

అందులో తరిగిన బెల్లం వేసి మొత్తం కరిగె వరకు ఉడికించాలి .జీడిపప్పులు నేతిలో దోరగా వేయించి ,యాలకుల పొడి మిగితా నెయ్యి మొత్తం అన్నంలో కలిపి దించేయడమే .

తియ్యని కమ్మని నైవేద్యం సమర్పించుకుని అమ్మ కృపకు పాత్రులవుదాం.
రాజరాజేశ్వరి దేవి. తొమ్మిదవ రోజు పరమాన్నం.
కావలసినవి :- చిక్కటి పాలు 6 కప్స్,1 టిన్ మిల్క్ మేడ్ , బియ్యం 1 కప్పు,

చక్కర 1,1/2 కప్స్

, ద్రాక్షా , జీడిపప్పు 1/4 కప్పు, ఇలాచి పౌడర్ 1/2 స్పూన్

నెయ్యి 5 టేబల్ స్పూన్స్

.

చేసే విధానం :-ముందు గట్టి వెడల్పాటి పెద్ద గిన్నెలో కాస్త నెయ్యి వేసి అందులో బియ్యం పోసి పచ్చి వాసన పోయెంత వరకు వేయించండి

. ఆ తర్వాత పాలు , ఇలాచి పౌడర్ వేసి కుక్కర్`లో 2 విజిల్ వచ్చెంత వరకు ఉంచండి.అది పక్కన పెట్టి చిన్న మూకుడు ష్టవ్ పై వుంచి అందులో కాస్త నెయ్యి వేసి ఈ ఎండు ద్రాక్షా , జీడిపప్పు దోరగా వేయించి వుంచండి. చల్లారిన కుక్కర్ మూత ఓపన్ చేసి ఉడికిన అన్నానికి చెక్కరవేసి

ఒక్క 5 నిముషాలు మళ్ళీ ఉడికించి అలా ఉడికి నప్పుడు బియ్యం పాలు చక్కర కలుసుకొని చిక్కగా కావాలి అందులో వేయించిన జీడిపప్పు వేసి బాగా కలిపి కాస్త నెయ్యి వేసి వేడి వేడిగా రాజ రాజేశ్వరి దేవికి నైవేద్యం పెట్టండి

.

10. ప్రధాన దేవతను సర్ణాభరణములతో అలంకరణ. పదవ రోజు ఈ తొమ్మిది రోజులూ చేసిన అన్ని ప్రసాదములను నైవేద్యముగా నివేదన చేయాలి.

Friday, October 16, 2020

దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు.

దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. పదవరోజు పార్వేట ఉంటుంది.

దసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. తెలంగాణాలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. తెలంగాణా పల్లెల్లో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పీతాంబరాలు ధరించడం ఆనవాయితీ. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం రివాజు. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు, అదే విజయదశమి. దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశములో హెచ్చుగా ఉంటుంది.
దైత్యవంశానికి ఆశాదీపంలా జన్మించిన ‘మహిషాసురుడు’ తన ఆంతరంగిక మిత్రులతో, సచివులతో సమాలోచన చేసి, మరణంలేని జీవనం కోసం మేరుపర్వతశిఖరం చేరి బ్రహ్మదేవుని గూర్చి ఘోరతపస్సు ప్రారంభించాడు. కాలం కదలికలో అనేక వేల సంవత్సరాలు కదిలి వెళ్లిపోయాయి. మహిషాసురుని అచంచల తపస్సుకు సంతసించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ‘మహిషాసురా.., ఇంక తపస్సు చాలించి ఏ వరం కావాలో కోరుకో’ అన్నాడు.‘పితామహా.,నేను అమరుణ్ణి కావాలి. నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు’ అని కోరాడు మహిషాసురుడు. అప్పుడు బ్రహ్మదేవుడు ‘మహిషాసురా..పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు.., గిట్టిన ప్రాణి మరల పుట్టక తప్పదు. జననమరణాలు సకలప్రాణికోటికి సహజ ధర్మాలు. మహాసముద్రాలకూ, మహాపర్వతాలకూ కూడా ఏదో ఒక సమయంలో వినాశం తప్పదు. ప్రకృతివిరుద్ధమైన నీ కోరిక తీర్చుట అసంభవం. కనుక,నీ మరణానికి మృత్యువుకు ఒక మార్గం విడిచిపెట్టి, మరే వరమైనా కోరుకో’ అన్నాడు. అప్పుడు మహిషాసురుడు ‘విధాతా..అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడడు. సరే.. ఆడది నా దృష్టిలో అబల..ఆమెవల్ల నాకే ప్రమాదమూ రాదు. కనుక.,పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించు’ అని కోరాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురునికి అనుగ్రహించి అంతర్థానమయ్యాడు. బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతల్తో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీరూపమై జన్మించింది.

శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణ దేవుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలము హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు సల్పింది. మహిషాసురుని తరఫున పోరు సల్పుతున్న ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడినది. ఈ యుద్ధములో ఆదేవి వాహనమైన సింహమూ శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషిరూపము, సింహరూపము, మానవరూపముతో భీకరముగా పోరి చివరకు తిరిగి మహిషిరూపములో దేవిచేతిలో హతుడైనాడు.ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దినము దసరా పర్వదినంగా ప్రజలచే కొనియబడింది.

ఈ రోజులలో వివిధ దేవుళ్ళ వేషధారణ చేసి ఇంటింటికి తిరిగి గృహస్తులు ఇచ్చినది పుచ్చుకోవడం కొందరు వృత్తిగా ఆచరిస్తారు. వీటికి దసరా వేషాలు లేదా పగటి వేషాలు అంటారు. ప్రాథమిక పాఠశాల ఉపాద్యాయులు విద్యార్థులను వెంట పెట్టుకొని విద్యార్థుల అందరి ఇళ్ళకు వెళ్ళి మామూలు పుచ్చుకోవడం మామూలే. ఈ సమయంలో వెదురు కర్రతో చేసి రంగు కాగితాలతో అలంకరించిన బాణాలు విద్యార్థులు పట్టుకుని అయ్యవారి వెంట వస్తారు. విద్యార్థులు ఏదయా మీ దయా మామీద లేదు, ఇంత సేపుంచుటా ఇది మీకు తగునా .. అయ్యవారికి చాలు అయుదు వరహాలు, పిల్ల వాళ్ళకు చాలు పప్పు బెల్లాలు అంటూ రాగయుక్తంగా పాడుకుంటూ అయ్యవారి వెంట వస్తారు. గృహస్తులు అయ్యవారికి ధనరూపంలోనూ, పిల్ల వాళ్ళకు పప్పు బెల్లం రూపంలోనూ కానుకలు ఇస్తారు. సంవత్సర కాలంలో సేవలందిచిన వారు గృహస్తును మామూళ్ళు అడగటం వారు కొంత ఇచ్చుకోవడమూ అలవాటే. దీనిని దసరా మామూలు అంటారు. కొత్తగా వివాహం జరిగిన ఆడపడచుని భర్తతో సహా ఇంటికి ఆహ్వానించి అల్లుడికీ కూతురికీ తలంటి తలకు పోసి నూతనవస్త్రాలు కానుకలు ఇచ్చి సత్కరించడం కూడా అలవాటే.
వివిధ ప్రదేశాలలో దసరా సవరించు
దసరా ఉత్సవాలను దేశమంతా వివిధ రూపాలలో జరపుకుంటారు. మైసూరు, కలకత్తా, ఒడిషా, తెలంగాణా, విజయవాడ, ఖానాపూర్లలో ఒక్కో చోట ఒక్కో విధంగా జరుపుకుంటారు. ఇవే కాక ఊరి ఊరికీ కొన్ని ప్రత్యేక ఉత్సవాలు జరుపుకుంటారు. ఖానాపూర్, ఒంగోలులో కళారాలు రూపంలో అమ్మవారిని ఆరాధించి చివరి రోజున ఉత్సవంగా అమ్మవారు వెళ్ళి రాక్షససంహారం చేసే ఘట్టాన్ని ప్రదర్శిస్తారు.
మైసూరు మహారాజు పాలన కాలం నుండి వైభవంగా దసరా ఉత్సవాలను జరపటం ఆనవాయితీ. మహారాజు వారి కులదైవం అయిన చాముండేశ్వరీ దేవిని ఆరాధించి ఏనుగులపై ఊరేగింపుగా రావడం అలవాటు. ఆ సమయంలో వీధులలో కోలాహలంగా చేసే అనేక కళా ప్రదర్శనలు చూడటానికి దేశం నలుమూలల నుండి ప్రజలు వస్తుంటారు. ఆసమయంలో రాజభవనం ప్రత్యేకంగా అలంకరించ బడుతుంది. ఆ సమయంలో ఫ్లోటింగ్ కారు ఉత్సవాలు ప్రాధాన్యత సంతరించుకున్నవే. ఏనుగుల అలంకరణా ప్రత్యేకమే. రాజుగారి ఆయుధ పూజ వైభవంగా జరుగుతుంది.

కలకత్తా సవరించు
దసరాను దుర్గాపూజ పర్వదినంగా బెంగాలీయులు జరుపుకుంటారు. సప్తమి, అష్టమి, నవమి తిధులలో దుర్గామాతకు పూజ చేసి తొమ్మిదవ రోజున కాళికామాతను దర్శిస్తారు. ఆ రోజు కాళీమాతను లక్షలమందిని దర్శించడం విశేషం. తొమ్మిది రోజులూ రాష్ట్రమంతా హరికథలు, పురాణ శ్రవణం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. చివరి రోజున దుర్గామాతను హుగ్లీ నదిలో నిమజ్జనం చేస్తారు. ఆరోజున నదీతీరంలో కుమారీ పూజలు చేయడం బెంగాలీల ప్రత్యేకత.

ఒడిషా సవరించు
ఒడిషా పౌరులు దసరా సమయంలో దుర్గామాతను ఆరాధిస్తారు. కటక్ కళాకారులు రూపొందించిన దుర్గామాత విగ్రహాలను వీధివీధిలో ప్రతిష్ఠిస్తారు. స్త్రీలు మానికలో వడ్లు నింపి లక్ష్మీ దేవిగా భావించి పూజలు నిర్వహిస్తారు.మార్గశిర మాసంలో కూడా ఈ చిహ్నంతో వారు లక్ష్మీదేవి ఆరాధించడం అలవాటు. దీనిని వారు మాన బాన అంటారు. ఒడిషా ప్రజలు విజయదశమి నాడు విజయదుర్గను ఆరాధిస్తే అన్నిటా విజయం సిద్ధిస్తుందని ప్రజల ప్రగాఢ విశ్వాసం. చివరి రోజున 15 అడుగుల రావణ విగ్రహాన్ని బాణసంచాతో తయారు చేసి మైదానంలో కాలుస్తారు. ఈ రావణ కాష్టం చూడటానికి ప్రజల తండోపతండాలుగా వస్తారు
తెలంగాణా ప్రజలు దసరాసమయంలో బతుకమ్మ ఉత్సవాలు చేస్తారు. బతుకమ్మ పండుగ' తెలంగాణా రాష్ట్రములో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరి) పండగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. నవరాత్రి మొదట రోజున బతుకమ్మను పూలతో అలంకరించి తొమ్మిది రోజులు ఒక చోట స్త్రీలంతా చేరి ఆటపాటలు పాడి ఆనందిస్తారు. చివరి రోజున బతుకమ్మను నిమజ్జనం చేసిన తరువాత పండుగ చేసుకుంటారు. ఇది తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ. ఈ రోజుల్లో ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకుంటారు. ఈ వారం రోజులలో వీరు రోజూ చిన్న బతుకమ్మలు చేసి, ప్రతీ సాయంత్రం దాని చుట్టూ తిరుగుతూ ఆడుతారు. ఆ తరువాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు.

అయితే చివరి రోజు అత్యంత మనోహరంగా ఉంటుంది. ఆ రోజు మగవారంతా పచ్చిక బయళ్ళలోనికి పోయి తంగేడి, గునుక పూలను భారీగా ఏరుకుని వస్తారు. ఆ తరువాత ఇంటిల్లపాదీ కూర్చుని ఆ గునగ పూలు, తంగేడు, కలువ, ఇతర రకాల పూలతో బతుకమ్మని తయారు చేస్తారు. ఇందులో గునగ పూలు, తంగెడు పూలు ముఖ్య భూమికను పోషిస్తాయి. ఈ పూలని జాగ్రత్తగా ఒక రాగి పళ్ళెం (తాంబలం) లో వలయాకారంగా, రంగులు మార్చుకుంటూ పేరుస్తారు. ముందుగా తంగేడు ఆకులు, పూలు పళ్లెంలో లేదా తాంబోలంలో పేర్చుతారు, ఆపై తంగేడు పూలతో కట్టలుగా కట్టిన కట్టలను చివరలు కోసి రంగులతో అద్దిన వాటిని పేర్చుతారు. మధ్య మధ్యలో ఇతర రకాల పూలను ఉపయోగిస్తారు. పేర్చడం అయ్యాక పైన పసుపుతో చేసిన గౌరి మాతను పెట్టి చుట్టు దీపాలతో అలంకరిస్తారు. దీనిని గృహంలో దైవ స్థానంలో అమర్చి పూజిస్తారు. ఇలా తయారు చేసిన బతకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరి దేవిని కీర్తిస్తూ ఆడవారు పాడుతారు. ఆడవారు వారికి ఉన్న అన్ని రకాల ఆభరణాలను ధరించి కొత్త బట్టలు కట్టుకుంటారు. ఇలా చాలాసేపు ఆడాక మగవారు వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆపై ఆ పళ్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయినమమ్మా వాయినం అంటూ వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు. ఆపై ఇంటి నుండి తీసుకువచ్చిన పెరుగన్నం, సత్తుపిండి ( మొక్కజొన్నలు, లేదా వేరుశనగ లేదా పెసర విత్తనాలను దోరగ వేయించి వాటిని పిండి చేసి వాటితో చక్కెర పిండి లేదా బెల్లం, నెయ్యి తగినంత కలిపి తయారు చేస్తారు) లను ఇచ్చి పుచ్చుకొని తింటారు

కరీంనగర్ సవరించు
దసరా సమయంలో కరీంనగర్ వాసులు అకాడా గా నిర్వహిస్తారు. ఇక్కడ గనిలో పనిచేసే కార్మికులు ఈ పండుగను గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా చేసుకుంటారు. క్షత్రియుల ఆయుధ విన్యాసాలు పోలిన విన్యాసాలను ప్రదర్శించడం ఇక్కడి అలవాటు. ఇక్కడి నెహ్రూ స్టేడియంలో నరకాసుర వధ ఘట్టాన్ని ప్రదర్శించడంతో పండుగ మొదలౌతుంది. హనుమాన్ అకాడా, దుర్గా అకాడా' ల లాంటి దేవతల రూపాలతో ఇనుప బెల్టు, త్రిశూలం మొదలైన ఆయుధాలను పట్టుకొని విన్యాసాలు చేస్తూ ఊరంతా తిరుగుతూ ప్రజలను ఆనందింప చేస్తారు. కర్రసాము ఈ ప్రదర్శనలో భాగమే. జమ్మి ఆకులను ఒకరికొకరు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పుకుంటారు. కనుల విందుగ దుర్గమాత (వమస్థలిపురము) ]]

గుజరాత్ సవరించు
దసరా సమయంలో గుజరాతీయులు పార్వతిదేవి ఆరాధన చేస్తారు. ఇంటింటా శక్తి పూజ చేయడం గుజరాతీయుల ఆచారం.ఇంటి గోడల మీద శ్రీ చక్రాన్ని, త్రిశూలాన్ని, శక్తి ఆయుధాన్ని పసుపుతో చిత్రించి పూజిస్తారు.ఆ గుర్తుల సమీపంలో పొలం నుండి తీసుకు వచ్చిన మట్టితో వేదిక తయారు చేసి దానిపై బార్లీ, గోధుమ విత్తనాలను చల్లి దానిపై మట్టి ఉండ పెట్టి దానిని నీటితో నింపి పోకచెక్క వెండి లేక రాగి నాణెం వేస్తారు. ఆ మట్టికుండను వారు దేవిగా భావిస్తారు. దానిని వారు కుంభీ ప్రతిష్ట అంటారు. అష్టమి రోజున యజ్ఞం నిర్వహించి దశమి రోజున నిమజ్జనం చేస్తారు. అమ్మవారి వద్ద పెట్టిన ప్రమిదను గుడిలో సమర్పిసారు. తరువాత పౌర్ణమి వరకూ జరిగే గర్భా అనే ఉత్సవాలలో స్త్రీలు ఉత్సాహంగా పాల్గొంటారు.

విజయవాడ భేతాళ నృత్యం సవరించు
విజయవాడలోని ప్రధాన ఆలయాలలో బెజవాడ కనక దుర్గమ్మ ఒకటి. ఇది ఆంధ్ర రాష్ట్రం అంతటా ప్రాముఖ్యం ఉన్న ఆలయం. నవరాత్రి తొమ్మిది రోజులు వైభవంగా ఉత్సవాలు నిర్వహించి విజయదశమి నాటికి కృష్ణా నదిలో తెప్పోత్సవం చేస్తారు. ఈ ఉత్సవంలో అమ్మవారు తెప్పపై మూడు సార్లు ఊరేగి భక్తులకు దర్శనమిస్తుంది. తర్వాత విజయవాడ నగర పోలీసులు అమ్మవారిని పాతబస్తీలో ఉరేగిస్తారు. 1వ టౌన్ పోలీసు స్టేషను వద్దకు రావడంతో ఊరేగింపు ముగిస్తుంది. దసరా సందర్భంలో చివరి రోజు ప్రభలు ఊరేగింపుగా వస్తాయి. ఈ ప్రభలలో భేతాళ నృత్యం ప్రదర్శిస్తారు. ఈ భేతాళ నృత్య ప్రదర్శన విజయవాడ ప్రత్యేకత.

వీరవాసరం ఏనుగుల సంరంభం సవరించు
పశ్చిమ గోదావరి జిల్లా వీర వాసరంలో దసరా సమయంలో సుమారు వంద సంవత్సరాల నుండి ఏనుగు సంబరాలు జరపడం అలవాటు. దసరా మొదటి రోజున ఏనుగుగుడి లో భేతాళుడిని నిలబెడతారు. భేతాళుడంటే వయసైన బ్రహ్మచారి. తొమ్మిది రోజులు భేతాళుడు అమ్మవారి పూజలు నిర్వహిస్తాడు. ఈ తొమ్మిది రోజులు భేతాళుడు నియమ నిష్టలను ఆచరిస్తాడు. మొదటి రోజునుండి నూరు సంవత్సరాల క్రితం వెదురు కర్రలు గడ్డి కొబ్బరిపీచుతో చేసిన ఏనుగును నూతనంగా అంబారీతో అలంకరిస్తారు. తెల్లని వస్త్రానికి రంగుల లతలు, కాగితంపూలు, తగరంతో అలంకరణలు చేసి అంబారీ చేస్తారు. అలాగే నూతనంగా చిన్న ఏనుగును తయారు చేసి అలంకరించి చివరి రోజున బోయీలచే ఊరేగింపుగా తీసుకు వెళతారు. ఈ ఊరేగింపులో పిల్లలను ఏనుగు కింద నుండి దాటిస్తారు. అలాదాటిస్తే పిల్లలు రోగ విముక్తులై ఆరోగ్యంగా ఉంటారని విశ్వసిస్తారు. రాత్రి ఆరు గంటలకు ప్రారంభించి తెల్లవారి ఆరుగంటల వరకూ సాగి తూపు చెరువు కట్టకు చేరుకొని ఈ ఉత్సవాన్ని ముగిస్తారు.

విజయనగరం సిరిమాను సవరించు
విజయనగరంలో దసరా సమయంలో గజపతుల ఆడపడుచైన పైడి తల్లి'కి పూజలు చేస్తారు'. ఈ దేవికి దసరా వెళ్ళిన తరువాత మొదటి మంగళవారం నాడు జాతర జరుపుతారు. ఈ ఉత్సవంలో భాగంగా పూజారిని సిరిమాను ఎక్కించి అమ్మవారి గుడి ఉన్న మూడు లాంతర్ల సెంటర్ నుండి కోట వరకు మూడు సార్లు ఊరేగిస్తారు. ఈ ఉత్సవం చూసేందుకు చుట్టు పక్కల పల్లేలనుండి ప్రజలు ఎడ్లబండిలో మూడురోజుల ముందుగా వచ్చి రోడ్డు ప్రక్కన గుడారాలు వేసుకుని ఉత్సవం చూసి ఆనందిస్తారు. అడవిలో నుండి ఒక నిటారైన చెట్టును నరికి తీసుకు వచ్చీ మొదలు భాగాన్ని లాగుడు బండికి కట్టి చివరి భాగంలో ఊయలకట్టి అందులో పూజారిని కూర్చో పెట్టి ఊరేగింపుగా కోటకు తీసుకు వస్తారు . అక్కడ గజపతులు అమ్మవారికి లాంఛనాలు ఇచ్చి పూజిస్తారు.

వీపన గండ్లలో రాళ్ళయుద్దం సవరించు
కర్నూలు జిల్లాలోని వీపనగండ్లలో దసరాసమయంలో రాళ్ళయుద్ధం చేసుకుంటారు. దసరా రోజున సాయం వేళలో ప్రజలు కాలువ ఒడ్డున కాలువకు అటూఇటూ చేర కంకర రాళ్ళను గుట్టగా పోసుకుని ఒకవైపు రామసేన ఒకవైపు రావణ సేనగా ఊహించి రాళ్ళను విసురుతూ యుద్ధం చేసుకుంటారు. ఇది అధర్మంపై ధర్మం యుద్దంచే విజయం చేసినట్లు భావిస్తారు. దీనిని వాళ్ళు వాళ్ళు రామ రావణ యుద్ధంగా అభివర్ణిస్తారు. ఎంత ఎక్కువగా దెబ్బలు జరిగితే అంత ఎక్కుగా ఉత్సవం జరిగినట్లు విశ్వసిస్తారు. ఇదే సమయంలో ఇదే జిల్లాలోని దేవరగట్టు గ్రామంలో కూడా బన్ని ఉత్సవం జరుగుతుంది. మాలమల్లేశ్వరస్వామి విగ్రహాన్ని తమ గ్రామానికి తీసుకువెళ్లేందుకు దాదాపు 18 గ్రామాల ప్రజలు, దేవరగట్టు నెలవై ఉన్న రెండుగ్రామాల పరిధిలోని ప్రజలతో కొట్లాడతారు. స్వామిని తీసుకువెళ్లేందుకు ఓ వర్గం, తమ గ్రామంలోనే ఉండేలా చూసుకునేందుకు మరో వర్గం ఎదురుపడి ఇనుప తొడుగులు తొడిగిన వెదురుకర్రలతో విపరీతంగా కొట్టుకుంటారు. ఎంత గాయాలైనా పట్టించుకోరు. అనాదిగా జరుగుతున్న ఈ రక్తపాతానికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు, ప్రభుత్వం ఎంతగా ప్రయత్నించినా సఫలం కాలేకపోతున్నారు.

సంగారెడ్డిలో రావణ దహనం సవరించు
మెదక్ జిల్లా సంగారెడ్డిలో దసరా సందర్భంలో తొమ్మిది రోజులు దేవిని ఆరాధించి చివరి రోజున రావణ కుంభకర్ణ బొమ్మలను దగ్ధం చేస్తారు. ఈ బొమ్మలను వారు బాణసంచాతో తయారు చేసి అగ్ని బాణాలతో దగ్ధం చేస్తారు.రామ లక్ష్మణ వేషదారులు బాణాలను సంధిస్తారు. ఈ ఉత్సవం మునిసిపల్ గ్రౌండులో నిర్వహిస్తారు. చుట్టుపక్కల గ్రామాల నుండి వేలకొలది భకులు హాజరై ఉత్సవానికి వన్నె తీసుకు వస్తారు.

బందరు శక్తి పటాలు సవరించు
కృష్ణా జిల్లాలో ఉన్న రేవుపట్టణం బందరులో దసరా సందర్భంలో శక్తి పటాల ఊరేగింపు నిర్వహిస్తారు. దాదాపు నూరు సంవత్సరాల క్రితం కలకత్తా నుండి బొందిలీలకు చెందిన సైనికుడు మచిలీపట్నం ఈడేపల్లిలో కాళీమాత ప్రతిష్ట చేసాడు.అప్పటి నుండి దసరా సమయంలో శక్తి ఆలయం నుండి శక్తి పటాన్ని పట్టుకుని పురవీధులలో ఊరేగింపుగా తీకుసుకు రావడం ప్రారంభం అయింది.ఊరేగింపు సమయంలో పట్టాన్ని విపుకు కట్టుకుని ముఖానికి అమ్మవారి భయంకర ముఖాకృతిని తగిలించుకుని నాట్యమాడుతూ వీధులలో తిరుగుతారు. తొమ్మిది రోజులు ప్రభలలో ఇలా ఆన్ని వీధులలోని ఇంటింటికీ తిరుగుతారు. వారి వారి ఇంటికి వచ్చినపుడు వారి మొక్కుబడులు తీర్చుకుంటారు. పటం ధరించిన వారు డప్పు శబ్ధానికి అనుగుణంగా వీరనృత్యం చేస్తూ భయంకరాకృతిలో ఉన్న రాక్షసుని సంహరిస్తున్నట్లు అభినయిస్తారు. చివరిరోజున మచిలీ పట్నం కోనేరు సెంటరుకు తీసుకు వచ్చి జమ్మి కొట్టడంతో ఉత్సవం ముగుస్తుంది.

ఒంగోలు కళారాలు సవరించు
దసరా సమయంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉత్సవాలలో భాగంగా కళారాలను ఊరేగిస్తారు.ఈ కళారాలను దసరా సమయానికి చక్కగా అలంకరించి సిద్ధం చేస్తారు. కళారాలంటే బృహత్తర ముఖాకృతి. ఇక్కడ కాళికాదేవికి, మహిషాసుర మర్ధినికి, నరసింహ స్వామికి కళారాలున్నాయి. వీటికి ఈ తొమ్మిది రోజులు విశేషంగా పూజలు చేసి తొమ్మిది పది రోజులలో ఒక్కోరోజు కొన్ని కళారాలకు ఊరేగింపు చేస్తారు.కళారాన్ని బండి మీద ఎక్కించి ఆటూఇటూ పట్టుకోవడానికి అనివిగా కొయ్యలను అమర్చి వాటి సాయంతో కళారాన్ని అటూ ఇటూ ఊపుతూ డప్పుల మోతలతో ఊరేగింపు నిర్వహిస్తారు. కళారం వెనుక భాగంలో ఒకరు అమ్మవారి ప్రతి రూపంగా చీరను ధరించి వీరనృత్యం చేస్తూ కళారాన్ని ఊగ్రంగా ఊపుతూ ఉంటాడు. ఉగ్రరూపంలో ఉన్న కళారం భీతిని కలిగిస్తుందని గర్భిణీ స్త్రీలకు ఈ ఉత్సవ దర్శనం మంచిది కాదని పెద్దలు సూచిస్తారు. ఇలా కళారాన్ని ఊరి నడిమధ్యకు తీసుకు వచ్చి అక్కడ రాక్షస సంహారం ఘట్టాన్ని ప్రదర్శిస్తారు రవిందర్

ఉస్మానియ యూనివర్సిటి

ఇక్కడ దసర రోజు మహిషాసురుని వర్దంతిని దళిత-బహుజనులు ఘనంగా జరుపుతారు మూలవాసులను చంపిన ఆర్యుల కుట్రలను బయటి ప్రపంచానికి తెలియజెస్తారు.దుర్గాదేవి, రాముడు, క్రుష్ణుడు అసురులను వధించి వారిని రాక్షసులుగా చిత్రీకరించారు మూలవాసుల చరిత్ర ఎల వక్రికరించబడ్డది. దానికి బ్రాహ్మణీయ సమాజం రచయితలు చేసిన కుట్రలు ఏమిటి అనే అంశాలపై వక్తలు మాట్లాడుతారు. ముగ్గురు దేవుళ్ళు కలసి ఒక వ్యక్తిని ఎదుర్కొన లేక ఒక స్త్రీ సహాయముతో వంచనతో, మోసంతో, కుట్రతో మహిషాసురుని అంతమొందిచ్చారని దళితులు, శూద్రులు నమ్ముతున్నారు. అయ్యవార్ల అడుక్కోవడానికి, చందాలకు, దందాలకు, ఆడపిల్లల తల్లిదండ్రులను అల్లుళ్ళు వేధించడం వంటి సామాజిక రుగ్మతలకు విజయదశమి వేదిక కావడాన్ని మేధావులు, హేతువాదులు ప్రశ్నిస్తున్నారు. మానవతా వాదులు అసహ్యించుకొంటున్నారు.
నవరాత్రులు సవరించు
ఆశ్వయుజ శుక్ల పాడ్యమి మొదలుకొని నవమి వఱకు కల తొమ్మిది రాత్రులను నవరాత్రులు అయిన వ్యవహరిస్తారు. కృతయుగమున సుకేతనుడు అనే రాజు తన జ్ఞాతులచే రాజ్యభ్రష్టుడై భార్యతోకూడ అడవులు తిరుగుచు కష్టాలను అనుభవించుచుండగా అంగీరసుడు అనే ఋషి అతనికి నవరాత్రి పూజావిధులను ఉపదేశించాడు. అతడు మహర్షి చెప్పిన విధంగా పూజ చేసి మరల తన ఐశ్వర్యమును పొందెనని ఐతిహాసిక కథ ఉంది. ఈ కథను బట్టి ప్రజలు దుర్గ లక్ష్మి సరస్వతి వీరిలో ఒక్కొక్కదేవిని మూడేసి దినములు పూజింతురు. ఈ తొమ్మిది రాత్రులయందును ఆ దేవతలను పూజించుటకు వీలుకానిచో చివరి రోజైన నవమి నాడు విద్యాపీఠమున పుస్తకములను పెట్టి దేవీత్రయమును కల్పవిధిప్రకారము పూజింతురు. అట్లు పూజించుటచే ఆ దినము మహానవమి అనియు సరస్వతీదేవిని పూజించుటచే సరస్వతి పూజాదినము అని, ఆయుధములను పెట్టి పూజంచుటచే ఆయుధపూజాదినము అనియు చెప్పబడును. మఱునాటి దశమి తిథికి విజయదశమి అని పేరు.

నవరాత్రి ఉతవాలలో ఆలయాలలో పార్వతీదేవికి రోజుకు ఒక అలంకరణ చేస్తారు ఇలా ఒక్కోప్రాంతంలో ఒక్కోలా నామాలు ఉంటాయి. కొన్ని ,ప్రాంతాలలో మొదటి రోజు శైల పుత్రి, రెండవ రోజున బ్రహ్మచారిణి, మూడవ నాడు చంద్రఘంటాదేవి, నాల్గవ రోజున కూష్మాండాదేవి, అయిదవ రోజున స్కందమాత, ఆరవ రోజున కాత్యాయినీ, ఏడవరోజున కాళరాత్రి, ఎనిమిదవ రోజున మహాగౌరి, తొమ్మిదవ రోజున సిద్ధిధాత్రిదేవిగా పూజిస్తారు. కొన్ని ప్రదేశాలలో పార్వతీ దేవిని కనక దుర్గగా, మహా లక్ష్మిగా, అన్నపూర్ణగా, గాయత్రిగా, బాలాత్రిపురసుందరిగా, రాజరాజేశ్వరిగా, మహిషాసుర మర్ధినిగా ఆరాధిస్తారు.

Tuesday, October 13, 2020

# భారతదేశం అంటే ఏమిటి?

# భారతదేశం అంటే ఏమిటి? 

భారతదేశం అంటే - 

1) వేద భూమి & కర్మ భూమి
2) సంస్కృతి 
3) సనాతన ధర్మం
4) దాన ధర్మం
5) ఆవులు 
6) యజ్ఞాలు & యాగాలు 
7) దేవాలయాలు & పుణ్య క్షేత్రాలు 
8) వేద పాఠశాలలు 
9) సాధువులు & గురువులు 
10) గంగా నది 
11) శివ అభిషేకం  
12) ప్రపంచానికి పూజ గది 
13) శాంతి 
14) వైవిధ్యంలో ఐక్యత 
15) వాక్ వైభవం
16) పుష్కరాలు & కుంభమేలలు 
17) జ్యోతిషశాస్త్రం / వాస్తుశాస్త్రం
18) ఆయుర్వేదం 
19) ఆదిశంకర ఆచార్య
20) శాస్త్రీయ నృత్యం /శాస్త్రీయ సంగీతం
21) రామాయణ, భారత, భాగవతాలు
22) దేవుని భజనలు & కీర్తనలు
23) ఉపవాసాలు 
24) సేవా భావన
25) అష్టాదశ శక్తి పీఠాలు
26) ద్వాదశ జ్యోతిర్లింగాలు
27) 108 వైష్ణవ దివ్యదేశాలు
28) భగవద్గీత
29) కుటుంబ వ్యవస్థ
30) ప్రేమ & ఆప్యాయతలు

భారతదేశం నా మాతృభూమి & మేరా భారత్ మహాన్.

Monday, October 12, 2020

# ముక్కంటి vs 3వ కన్ను

# ముక్కంటి vs 3వ కన్ను 

ముక్కంటి - శివుడు 
3వ కన్ను -  మన స్వంత 2 కళ్ళు కాకుండా 3వ కన్ను

 1) మనం 3వ కన్ను చూడకుండా  ఏదైనా చేయగలం 
 2) కానీ ముక్కంటి పర్యవేక్షణ లేకుండా మనం ఏమీ చేయలేము
 3) అతను ఎల్లప్పుడూ 24 * 7 & 365 రోజులు చూస్తూ ఉంటాడు. 
 4) మనం శివుడి నుండి ఎలా తప్పించుకోగలం? 
 5) శివుడి పర్యవేక్షణ లేకుండా మనం ఎక్కడికి వెళ్ళగలం? 
 6) ఈ రోజు మనం ఒక పొరపాటు చేసాము & రేపు ఉదయం పూజ గదిలోకి ప్రవేశించి మన ముఖం ఎలా చూపించగలం? 
 7) శివుడు మనల్ని అడుగుతాడు మీరు నిన్న పొరపాటు చేశారని నాకు తెలుసు & నన్ను ఆరాధించడానికి ఈ రోజు వచ్చారు. 
 8) ఇప్పుడు మనల్ని క్షమించమని శివుడిని అడగాలి. 
 9) మనం ఎన్ని రోజులు తప్పులు చేసి, శివుడిని క్షమించమని అడుగుతాము? 
 10) కాబట్టి శివుడు మనల్ని చూస్తున్నాడని మనం విశ్వసిస్తే, అప్పుడు మనం తప్పులను తగ్గించడానికి ప్రయత్నిస్తాము. 
 11) నెమ్మదిగా మనం ఏ తప్పు చేయము.

Friday, October 9, 2020

#'మకరతోరణం' అంటే ఏమిటి? దాని విశేషం ఏమి? ఈరోజు తెలుసుకుందాం.

#'మకరతోరణం' అంటే ఏమిటి? దాని విశేషం ఏమి? ఈరోజు తెలుసుకుందాం.

మన దేవాలయాలలో దేవతా/దేవుని
 విగ్రహాల వెనుక అమర్చిన తోరణ మధ్యభాగంలో కనుగుడ్లు ముందుకు చొచ్చుకు వచ్చిన ఒక *రాక్షసముఖం* కనబడుతుంది. దానికే   'మకరతోరణం' అని పేరు. ఈ రాక్షసముఖాన్ని తోరణం మధ్యభాగంలో అమర్చటానికి గల కారణము గురించి *స్కందమహాపురాణం* లో ఒక కథ వుంది....·      పూర్వం *"కీర్తిముఖుడు"* అనే రాక్షసుడు బ్రహ్మను మెప్పించి అనేకవరములను పొంది తద్వారా వచ్చిన బలపరాక్రమాలతో సమస్త భువనములలోని సంపదలను తన సొంతం చేసుకున్నాడు. చివరకు పరమశివుని పత్ని అయిన *'జగన్మాతను'* కూడా పొందాలని ఆశించాడు. అతని దురాశను చూసి కోపించిన మహేశ్వరుడు అతనిని మ్రింగివేయమని అతిభీకరమైన *అగ్నిని* సృష్టించాడు. పరమేశ్వరుని ఆనతి మేరకు ఆ జ్వాలాగ్ని ఆ రాక్షసుణ్ణి తరమసాగింది.·      మరణంలేకుండా వరం పొందినా, శివుని ఆఙ్ఞమేరకు ఆబడబాగ్ని తనను ఎక్కడ దహించివేస్తుందో అని భయంతో పరుగులు తీస్తూ అన్నిలోకాలూ తిరిగి ఆ అగ్ని ప్రతాపానికి తట్టుకోలేక చివరకు పరమశివుని శరణు వేడేడు. భక్తసులభుడైన బోళాశంకరుడు ఆ రాక్షసుణ్ణి రక్షించటంకోసం ఆ అగ్నిని ఉపసంహరించి తన నుదుట *మూడవ కన్ను* గా ధరించాడు.·      ఆ తరువాత *కీర్తిముఖుడు* తనకు విపరీతమైన ఆకలిగా ఉన్నదనీ, తను తినటానికి ఏదైనా పదార్థాన్ని చూపమని మహాదేవుని కోరాడు. యుక్తిగా శివుడు *"నిన్ను నువ్వే తిను"* అని చెప్పాడు. శివుని ఆనతి మేరకు *కీర్తిముఖుడు* *మొసలి రూపం* ధరించి తనను తాను ముందుగా తోకభాగంనుంచి మొదలుపెట్టి కంఠం వరకూ తిన్నాడు. తన తలను తానే ఎలాతినాలో అతనికి తెలియలేదు. అతని ఆకలి ఇంకా తీరలేదు. శివుని ప్రార్థించాడు.·      ఆప్రార్ధన ఆలకించిన పరమశివుడు, ఈనాటినుంచి అన్ని దేవతాలయాలలో దెవతా మూర్తుల వెనుక భాగంలోని తోరణాగ్రభాగాన్ని అలంకరించి, దైవ దర్శనానికి వచ్చే ప్రజలందరిలో ఉండే దురఃహంకారాన్ని, ఆశను, తింటూ ఉండు. నీవు అందరికీ పూజనీయుడవు అవుతావు అని వరమిచ్చాడు.·      ఆనాటినుంచి *కీర్తిముఖుడు* దేవతాలయాలలోని దేవతా విగ్రహాల వెనుక వున్న తోరణామధ్యభాగాన్ని తన రాక్షస మకరముఖంతో అధిష్ఠించి భక్తులలో ఉండే దుష్ట వికారాలను, అహంకారాన్ని,, దురాశను కబళిస్తున్నాడు . ఈకారణంగానే దేవతా మూర్తుల వెనుక మధ్యభాగంలో అమర్చబడిన తోరణానికే *'మకరతోరణం'* అని పేరు వచ్చింది.మనసంసృతి లో ప్రతి దానికీ ఎదో ఒక పురాణంలో ఒక కథ వుంటుంది.

Sunday, October 4, 2020

అమృతం తాగిన దేవతలు కూడా ఒకనాడు కాలం చేయవలసినదే, కానీ విషాన్ని మింగిన శివుడు మృత్యుంజయుడు.

🙏అమృతం తాగిన దేవతలు కూడా ఒకనాడు కాలం చేయవలసినదే, కానీ విషాన్ని మింగిన శివుడు మృత్యుంజయుడు. ఆ తల్లి మాంగళ్యాన్ని ఎవ్వరు స్మరించినా గండాలు ఆపదలు తొలగిపోతుంది. మాంగళ్యాన్ని భావన చేసి నమస్కారం చేసుకోవాలి.

🌹సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాథకే,
శరణ్యే త్రంబకే దేవి నారాయణి నమోస్తుతే.

🙏​​​​తాత్పర్యం:
 ఓం = ఓంకారము
సర్వ = సమస్తములైన
మంగళ = శుభములకును
మాంగళ్య = శుభ కరమగు దానా !
శివే = శివుని అర్ధాంగి అయిన
సర్వ = సమస్తములైన
అర్ధ = ప్రయోజనములను
సాధికే = నెర వేర్చెడి శక్తి గలదానా
శరణ్యే = భక్తులకు పెద్ద దిక్కు అయినదానా !
త్ర్యంబకే = ముక్కంటి అర్ధాంగి
నారాయణి = విష్ణుమూర్తి సోదరికి
గౌరీ = ఓ పార్వతి మాతా !
తే = నీకు
నమః = నా యీ వందనము
అస్తు = చెందును గాక !

🌹భావం: 
      సకల శుభములకు మూలమైన పార్వతీ! కోరికలన్నీ తీర్చు తల్లీ ! అందరికీ శరణము నిచ్చు,  మూడు కన్నుల కల శివుని అర్ధాంగి అయిన గౌరీ ! నారాయణుని సోదరీ ! నీకు నమస్కరము.

ఈ  శ్లోకమ్ స్త్రీలు పురుషులు అన్న బేధం లేకుండా అందరూ నిత్యం స్మరించవచ్చు.. ఉదయాన్నే వినాయకుడిని

ఓం గం గణపతయే నమః (21 సార్లు)

ఓం గంగా దేవై నమః (మూడు సార్లు) తలుచుకుని తర్వాత

సర్వ మంగళ మాంగళ్యే శివ సర్వార్ధ సాధికే
శరణ్యే త్య్రంబకే గౌరి నారాయణి నమోస్తుతే||
సృష్టి స్థితి వినాశానాం శక్తి భూతే సనాతని
గుణాశ్రయే గుణమయే నారాయణి నమోస్తుతే||
శరణాగత దీనార్త పరిత్రాణ నారాయణే
సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే||
జయ నారాయణి నమోస్తుతే ( చై చూసుకుని నమస్కారం చేసాకే గణపతి స్మరణ తో మొదలు పెట్టాలి)

ఇలా స్త్రోత్రం చేసి తర్వాత మీ నిత్య కర్మలు పూర్తి చేసి ఇంటిదేవుణ్ణి, విష్ణు ఆరాధన చేసే వాళ్ళు వారి వారి పూజ విధులు యదా విధిగా పూర్తి చేసుకోవచ్చు.

రాత్రి పడుకునే సమయంలో 11 సార్లు శివ నామ స్మరణ చేయాలి.

🌹శ్రీ మాత్రే నమః🌹

Saturday, October 3, 2020

*శ్రీమద్ మహాభారతం-956- అనుశాసనిక పర్వము-83**మునులు-తపస్సు*

*శ్రీమద్ మహాభారతం-956- అనుశాసనిక పర్వము-83*

*మునులు-తపస్సు*

" పరమశివా ! చాలామంది మునులు ఋషులు తపస్సు చేస్తారు కదా ! దాని గురించి చెప్పండి " అని అడిగింది పార్వతి. 

పరమశివుడు " పార్వతీ ! చాలామంది ఏవోవో కోరికలు తీరాలని తపస్సు చేస్తూ ఉంటారు. కాని తపస్సు అంటే వానప్రస్థాశ్రమంలో ఉన్నవారు చేసే ఒక ధర్మము. తపస్సు చేసే ముందు ఇంద్రియ నిగ్రహము పాటించాలి. ఉదయము సాయంత్రం యోగాభ్యాసం చెయ్యాలి. అలా కాకుండా ఏవేవో కోరికలతో తపస్సు చేస్తే కొంతకాలం స్వర్గసుఖములు అనుభవించి ఆ తపఃఫలం తరిగి పోగానే తిరిగి భూమిమీద జన్మిస్తారు. అంతే కాని తిరిగిరానిలోకాలకు వెళ్ళలేరు. ఇంకా కొంతమంది ఆ హారం తీసుకోకుండా కఠోరనియమాలతో పంచాగ్నుల మధ్య నిలబడి ఘోరంగా తపస్సుచేస్తారు. అలాంటి వారు కూడా కేవలం అప్సరకాంతలతో చేరి భోగములు అనుభవించి తృప్తిపడతారు. ఆ తపః ఫలం పూర్తికాగానే తిరిగి మానవులుగా జన్మిస్తారు. 

అలా కాక ఎలాంటి కోరికలు లేకుండా తపస్సు చేసే వారు ముందుగా అహింసావ్రతము ఆచరిస్తారు. మనసా వాచా కర్మణా ఎవరికీ అపకారం హానిచెయ్యరు. సాటి ప్రాణుల ఎడల దయ, కరుణ కలిగి ఉంటారు. అందరి జీవులలో ఉండే ఆత్మ ఒక్కటే అని భావిస్తారు. అలాంటి వారు కూడా మరణానంతరం తమ భార్యాబిడ్డలతో స్వర్గ సుఖాలు అనుభవించి తిరిగి ఆ పుణ్యఫలం కరిగి పోగానే తిరిగి భూలోకంలో జన్మిస్తారు. ఈ రీతిగా తపస్సు చేసే వారందరూ స్వర్గసుఖాలతోనే తృప్తిపడుతుంటారు " అని పరమశివుడు పార్వతీ దేవికి వివరించాడు.

Yes, she has gained weight? Defeated without losing a bout.

అవును, ఆమె కొంచెం బరువు పెరిగే వుంటుంది. ఎందుకంటే…. ఆటల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే నిండైన ఆత్మాభిమానాన్ని, విశ్వ వేదికపైనే కాదు వ...