Sunday, September 15, 2019

*కన్నుమూసే వరకూ కాసుల కాంక్షే*

*కన్నుమూసే వరకూ కాసుల కాంక్షే*

శ్రీమద్భాగవతంలో యమధర్మరాజు ఇలా అంటాడు.

*ధనము వీథి బడిన దైవవశంబున ఉండు, పోవు మూలనున్ననైన యబలుండు వర్థిల్లు, రక్షితుండు మందిరమున జచ్చు*

నిజమే! దైవానుగ్రహం ఉంటే ధనాన్ని వీథిలో పడవేసినా సురక్షితంగా ఉంటుంది. నుదిటి గీత బాగుండకపోతే ఇంట్లో మూలన భద్రంగా దాచిపెట్టినా మటుమాయమైపోతుంది. అలాగే దుర్బలుడు అడవిలో ఉన్నా భగవంతుని కృప ఉంటే ఆయురారోగ్యాలతో వృద్ధి చెందుతాడు. అది లేనినాడు సౌధాల లోపల రక్షకభటులతో రక్షితుడైనా గుటుక్కుమంటాడు.

జీవనపర్యంతమూ ఆస్తిపాస్తుల కోసం, వాటి సంరక్షణ కోసం, తరతరాలకు సరిపోయేటంత కూడబెట్టడం కోసం ఆపసోపాలు పడుతున్నాం. గానుగెద్దుల్లా కష్టపడుతున్నాం. కన్నుమూసే వరకు కూడా కళ్ళ ముందు కాసులు తప్ప ఇంకేమీ కనబడటం లేదు. జీవితానికి సార్థకత ఇది కానే కాదు! తృష్ణారాహిత్యాన్ని అలవరచుకొని సద్బుద్ధిని సంప్రాప్తించుకోవాలి. మనస్సును సంపదల మైకం నుంచి పక్కకు తప్పించినప్పుడే పారమార్థిక సత్యాలు బోధపడతాయి.

*శుభంభూయాత్*

No comments:

Post a Comment

Jai Shri Krishna

Excellent information about Bhagwan Shri Krishna: 1) Krishna was born *5252 years ago*  2) Date of *Birth* : *18th July,3228 B.C* 3) Month ...