Thursday, July 30, 2020

వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజ సామగ్రి :-

వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజ సామగ్రి :-

పసుపు 100 గ్రాములు

కుంకుమ100 గ్రాములు.

ఒక డబ్బ గంధం

విడిపూలు,పూల దండలు - 6

తమల పాకులు -30 వక్కలు

వంద గ్రాముల ఖర్జూరములు

50 గ్రాముల అగరవత్తులు

కర్పూరము - 50 గ్రాములు

౩౦ రూపాయి నాణాలు

ఒక తెల్ల టవల్

జాకెట్ ముక్కలు

మామిడి ఆకులు

ఒక డజన్ అరటిపండ్లు

ఇతర ఐదు రకాల పండ్లు

అమ్మవారి ఫోటో

కలశం

కొబ్బరి కాయలు

తెల్లదారము లేదా పసుపు రాసిన కంకణం 2

స్వీట్లు

బియ్యం 2 కిలోలు

కొద్దిగా పంచామృతం లేదా ఆవుపాలు

దీపాలు

గంట

హారతి ప్లేటు

స్పూన్స్

ట్రేలు

ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనే, వత్తులు

అగ్గిపెట్టె

గ్లాసులు

బౌల్స్
వ్రత విధానం :-

వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపంపై బియ్యపు పిండితో ముగ్గువేసి కలశం ఏర్పాటుచేసుకోవాలి. అమ్మవారి ఫొటో అమర్చుకోవాలి. పూజాసామగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలి. తోరణాలు ముందుగానే సిద్ధం చేసుకునిఉంచాలి. అక్షతలు, పసుపు గణపతిని సిద్ధంగా ఉంచుకోవాలి.

కావలసినవి :-

పసుపు, కుంకుమ, వాయనం ఇవ్వడానికి అవసరమైన వస్తువులు, ఎర్రటి రవికె వస్త్రం, గంధము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు,కంకణం కట్టుకోవడానికి దారం, టెంకాయలు, దీపపు కుందులు, ఐదు వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన పంచహారతి దీపారాధనకునెయ్యి, కర్పూరం, అగరువత్తులు, బియ్యం,శనగలు మొదలైనవి.

కంకణం ఎలా తయారుచేసుకోవాలి :-

తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపురాసుకోవాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి ఐదు లేక తొమ్మిదో పువ్వులతో ఐదులేక తొమ్మిది ముడులతో తోరాలను తయారు చేసుకుని పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి,కంకణాన్ని పూజించి ఉంచుకోవాలి.ఆ విధంగా కంకణాన్ని తయారు చేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి.

గణపతి పూజ:-

అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరష్యే

వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ

నిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదా॥

ఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందన

పూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయక॥

గణపతిపై అక్షతలు చల్లాలి.

యధాశక్తి షోడశోపచార పూజ చేయాలి.

ఓం సుముఖాయ నమః ,

ఓం ఏకదంతాయ నమః ,

ఓం కపిలాయ నమః ,

ఓం గజకర్ణికాయ నమః ,

ఓంలంబోదరాయ నమః ,

ఓం వికటాయ నమః,

ఓం విఘ్నరాజాయ నమః,

ఓం గణాధిపాయ నమః,

ఓంధూమకేతవే నమః,

ఓం వక్రతుండాయ నమః,

ఓం గణాధ్యక్షాయ నమః,

ఓం ఫాలచంద్రాయ నమః,

ఓం గజాననాయ నమః,

ఓం శూర్పకర్ణాయ నమః,

ఓం హేరంబాయ నమః,

ఓం స్కందపూర్వజాయనమః,

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః

నానావిధ పరిమళపుత్ర పుష్పాణి సమర్పయామి అంటూస్వామిపై పుష్పాలు ఉంచాలి.

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం ఆఘ్రాపయామి

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి.

స్వామివారి ముందు పళ్ళుగానీ బెల్లాన్ని గానీ నైవేద్యంగా పెట్టాలి.

ఓం భూర్భువస్సువః తత్సవితుర్వర్యేణ్యం,

భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్!!

నీటిని నివేదన చుట్టూ జల్లుతూ ... సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతో పస్తరణమసి... ఓం ప్రాణాయ స్వాహా, ఓం ఆపానాయ స్వాహా, ఓంవ్యానాయస్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహాగుడ సహితఫల నివేదనం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటిని వదలాలి).

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం అచమనంసమర్పయామి. (కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి) ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం సమర్పయామి నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి! అనేన మాయా చరిత గణపతి అర్చనేన భగవతః సర్వాత్మకః శ్రీ గణపతిర్దేవతా సుప్రీత సుప్రసన్న వరదాభవతు! మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు!!

వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు తలమీద వేసుకోవాలి.ఈ విధంగా మహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి.

కలశపూజ :-

కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితాః

మూలేతత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ: స్థితాః

కుక్షౌతుస్సాగరస్సర్వే సప్తద్వీపా వసుంధరా

ఋగ్వేదోధ యజుర్వేదో స్సామవేదో అధర్వణః

అంగైశ్చ స్సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః

ఆయాంతు గణపతి పూజార్థం దురితక్షయకారకాః గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధూ కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు॥
అంటూ శ్లోకాన్ని చదివి కలశంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడిపైన పూజాద్రవ్యాలపైన పూజ చేస్తున్నవారు తలపైన చల్లుకోవాలి.

అధాంగపూజ:-

పువ్వులు లేదా అక్షతలతో కలశానికి పూజ చేయాలి.

చంచలాయై నమః - పాదౌ పూజయామి,

చపలాయై నమః - జానునీ పూజయామి,

పీతాంబరాయైనమః - ఉరుం పూజయామి,

మలవాసిన్యైనమః - కటిం పూజయామి,

పద్మాలయాయైనమః -నాభిం పూజయామి,

మదనమాత్రేనమః - స్తనౌ పూజయామి,

కంబుకంఠ్యై నమః- కంఠంపూజయామి,

సుముఖాయైనమః - ముఖంపూజయామి,

సునేత్రాయైనమః - నేత్రౌపూజయామి,

రమాయైనమః - కర్ణౌ పూజయామి,

కమలాయైనమః - శిరః పూజయామి,

శ్రీవరలక్ష్య్మైనమః - సర్వాణ్యంగాని పూజయామి.

(ఆ తరువాత పుష్పాలతో అమ్మవారిని అష్టోత్తర శతనామాలతో పూజించాలి)

శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి :-

ఓం ప్రకృత్యై నమః

ఓం వికృతై నమః

ఓం విద్యాయై నమః

ఓం సర్వభూత హితప్రదాయై నమః

ఓం శ్రద్ధాయై నమః

ఓం విభూత్యై నమః

ఓం సురభ్యై నమః

ఓంపరమాత్మికాయై నమః

ఓం వాచ్యై నమః

ఓం పద్మాలయాయై నమః

ఓం శుచయే నమః

ఓంస్వాహాయై నమః

ఓం స్వధాయై నమః

ఓం సుధాయై నమః

ఓం ధన్యాయై నమః

ఓంహిరణ్మయై నమః

ఓం లక్ష్మ్యై నమః

ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యైనమః

ఓం ఆదిత్యై నమః

ఓం దిత్యై నమః

ఓం దీప్తాయై నమః

ఓం రమాయై నమః

ఓం వసుధాయై నమః

ఓం వసుధారిణై నమః

ఓం కమలాయై నమః

ఓం కాంతాయై నమః

ఓంకామాక్ష్యై నమః

ఓం క్రోధ సంభవాయై నమః

ఓం అనుగ్రహ ప్రదాయై నమః

ఓంబుద్ధ్యె నమః

ఓం అనఘాయై నమః

ఓం హరివల్లభాయై నమః

ఓం అశోకాయై నమః

ఓంఅమృతాయై నమః

ఓం దీపాయై నమః

ఓం తుష్టయే నమః

ఓం విష్ణుపత్న్యై నమః

ఓంలోకశోకవినాశిన్యై నమః

ఓం ధర్మనిలయాయై నమః

ఓం కరుణాయై నమః

ఓంలోకమాత్రే నమః

ఓం పద్మప్రియాయై నమః

ఓం పద్మహస్తాయై నమః

ఓంపద్మాక్ష్యై నమః

ఓం పద్మసుందర్యై నమః

ఓం పద్మోద్భవాయై నమః

ఓంపద్మముఖియై నమః

ఓం పద్మనాభప్రియాయై నమః

ఓం రమాయై నమః

ఓంపద్మమాలాధరాయై నమః

ఓం దేవ్యై నమః

ఓం పద్మిన్యై నమః

ఓం పద్మ గంధిన్యైనమః

ఓం పుణ్యగంధాయై నమః

ఓం సుప్రసన్నాయై నమః

ఓం ప్రసాదాభిముఖీయైనమః

ఓం ప్రభాయై నమః

ఓం చంద్రవదనాయై నమః

ఓం చంద్రాయై నమః

ఓంచంద్రసహోదర్యై నమః

ఓం చతుర్భుజాయై నమః

ఓం చంద్ర రూపాయై నమః

ఓంఇందిరాయై నమః

ఓం ఇందుశీతలాయై నమః

ఓం ఆహ్లాదజనన్యై నమః

ఓం పుష్ట్యెనమః

ఓం శివాయై నమః

ఓం శివకర్యై నమః

ఓం సత్యై నమః

ఓం విమలాయై నమః

ఓం విశ్వజనన్యై నమః

ఓం దారిద్ర నాశిన్యై నమః

ఓం ప్రీతా పుష్కరిణ్యైనమః

ఓం శాంత్యై నమః

ఓం శుక్లమాలాంబరాయై నమః

ఓం శ్రీయై నమః

ఓంభాస్కర్యై నమః

ఓం బిల్వ నిలయాయై నమః

ఓం వరారోహాయై నమః

ఓం యశస్విన్యైనమః

ఓం వసుంధరాయై నమః

ఓం ఉదారాంగాయై నమః

ఓం హరిణ్యై నమః

ఓంహేమమాలిన్యై నమః

ఓం ధనధాన్యకర్యై నమః

ఓం సిద్ధ్యై నమః

ఓం త్రైణసౌమ్యాయై నమః

ఓం శుభప్రదాయై నమః

ఓం నృపవేశగతానందాయై నమః

ఓంవరలక్ష్మ్యై నమః

ఓం వసుప్రదాయై నమః

ఓం శుభాయై నమః

ఓంహిరణ్యప్రాకారాయై నమః

ఓం సముద్రతనయాయై నమః

ఓం జయాయై నమః

ఓంమంగళాదేవ్యై నమః

ఓం విష్ణువక్షస్థల స్థితాయై నమః

ఓం ప్రసన్నాక్ష్యైనమః

ఓం నారాయణసీమాశ్రితాయై నమః

ఓం దారిద్ర ధ్వంసిన్యై నమః

ఓంసర్వోపద్రవ వారిణ్యై నమః

ఓం నవదుర్గాయై నమః

ఓం మహాకాళ్యై నమః

ఓంబ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః

ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః

ఓంభువనేశ్వర్యై నమః

కంకణపూజ :-

కంకణాన్ని అమ్మవారి వద్ద పెట్టి అక్షతలతో ఈ క్రింది విధంగా పూజ చేయాలి.

కమలాయైనమః - ప్రథమగ్రంథిం పూజయామి,

రమాయైనమః - ద్వితీయ గ్రంథింపూజయామి,

లోకమాత్రేనమః - తృతీయ గ్రంథింపూజయామి,

విశ్వజనన్యైనమః - చతుర్థగ్రంథింపూజయామి,

మహాలక్ష్మ్యై నమః - పంచమగ్రంథిం పూజయామి,

క్షీరాబ్ది తనయాయై నమః - షష్ఠమ గ్రంథిం పూజయామి,

విశ్వసాక్షిణ్యై నమః - సప్తమగ్రంథిం పూజయామి,

చంద్రసోదర్యైనమః - అష్టమగ్రంథిం పూజయామి,

శ్రీ వరలక్ష్మీయై నమః - నవమగ్రంథిం పూజయామి.

ఈ కింది శ్లోకాలు చదువుతూ తోరం కట్టుకోవాలి

బద్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం

పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే

వ్రత.

కథా ప్రారంభం :-

శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు. మునులారా! స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని పరమ శివుడు పార్వతికిచెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను.శ్రద్ధగా వినండి.

పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనముపై కూర్చుని ఉండగా నారదమహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రములతో పరమశివుడ్ని కీర్తిస్తు న్నారు.

ఆమహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి నాథా! స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని అడిగింది. అందుకా త్రినేత్రుడు దేవీ! నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది.అది వరలక్ష్మీవ్రతం.దానిని శ్రావణమాసంలో రెండవ శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పాడు.

అప్పుడు పార్వతీదేవి...దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరుచేశారు?ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది.కాత్యాయనీ...పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఒకటి ఉండేది. ఆపట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒకబ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి. వినయ విధేయతలు, భక్తిగౌరవాలు గలయోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాతఃకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించు కునిప్రాతఃకాల గృహకృత్యాలు పూర్తిచేసుకుని అత్తమామలను సేవించు కుని మితంగాసంభాషిస్తూ జీవిస్తూ ఉండేది.

వరలక్ష్మీ సాక్షాత్కారం :-

వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతీ...ఈ శ్రావణపౌర్ణమి నాటికి ముందువచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు, కానుకలనుఇస్తానని చెప్పి అంతర్థానమైంది. చారుమతి సంతోషించి. "హే జననీ! నీకృపా కటాక్షములు కలిగినవారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావనీ! నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరివిధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది.

అంతలోనే చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలిజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీవ్రతాన్ని చేసుకోమని చెప్పారు. ఊరిలోని ముత్తైదువలు చారుమతి కలను గురించివిని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూచూడసాగారు.శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు.

చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యంపోసి పంచ పల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో

సర్వమాంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే

శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే !! అంటూ ఆహ్వానించి ప్రతిష్టించింది.

అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల కంకణాన్ని చేతికి కట్టుకున్నారు.ప్రదక్షిణ నమస్కారాలు చేశారు.

మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి గజ్జేలు ఘల్లు ఘల్లున మ్రోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే చేతులకు నవరత్న ఖచిత కంకణాలు ధగధగా మెరవసాగాయి.మూడవ ప్రదక్షిణ చేయగా అందరూ సర్వా భరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆపట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోయాయి.ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజతరగరథ వాహనములతో వచ్చి వారిని ఇళ్లకుతీసుకెళ్లారు.

వారంతా మార్గమధ్యంలో చారుమతిని ఎంతగానో పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీ దేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మీ వ్రతంతో మనల్ని కూడా భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు.

వారంతా ప్రతీ సంవత్సరం వరలక్ష్మీ వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరిసంపదలు కలిగి సుఖ జీవనంతో గడిపి ముక్తిని పొందారు.

మునులారా శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీవ్రత విధానాన్ని సవివరంగా మీకు వివరించాను. ఈ కథ విన్నాను ఈ వ్రతం చేసినను ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్వైశ్వర్యాలు కలిగుతాయని సూత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు.ఈ కథ విని అక్షతలు శిరసుపై వేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు పసుపు బొట్టు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి.అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని తినేయాలి,రాత్రి ఉపవాసం ఉండాలి.

భక్తితో వేడుకొంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్నిఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృప కలిగి సకల శుభాలుకలుగుతాయి.సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. 'వర' అంటే శ్రేష్ఠమైన అర్థం కూడా ఉంది.

Tuesday, July 28, 2020

శ్రావణ శుక్రవారం పూజ ఎందుకు చేయాలి..?

శ్రావణ శుక్రవారం పూజ ఎందుకు చేయాలి..?

ఆషాడ మాసంలో అత్తింటి నుంచి పుట్టింటికి చేరతారు ఆడబడుచులు. తిరిగి శ్రావణ మాసంలో అత్తింటికి వెళ్లే ముందు పుట్టింటి వారికి ఇష్టమైన కానుకలు, అల్లుళ్లకు ప్రత్యేక బహుమతులు అందజేస్తారు.
తెలుగు క్యాలెండర్‌లో ప్రతి నెలకో ప్రాముఖ్యం.. ప్రాధాన్యం విశిష్టత ఉన్నాయి. చైత్రమాసం ప్రారంభంతో ఉగాది (తెలుగు సంవత్సరాది) జరుపుకుంటే ఆ వెంటనే శ్రీరామ నవమి తర్వాత వివాహ వేడుకలకు భారతీయులు ప్రత్యేకించి హిందువులు శ్రీకారం చుడతారు. ఆషాడ మాసంలో అత్తింటి నుంచి పుట్టింటికి చేరతారు ఆడబడుచులు. 

తిరిగి శ్రావణ మాసంలో అత్తింటికి వెళ్లే ముందు పుట్టింటి వారికి ఇష్టమైన కానుకలు, అల్లుళ్లకు ప్రత్యేక బహుమతులు అందజేస్తారు. శీతాకాలం ప్రారంభంలో వచ్చే కార్తీక మాసంలో సోమవారం ప్రత్యేకత ఉన్నట్లే శ్రావణమాసంలో మంగళ, శుక్రవారాలకు ఎంతో విశిష్టత ఉన్నదంటే అతిశయోక్తి కాదు. 
కార్తీకమాసం శివకేశవులకి ఎంత ఇష్టమో, శ్రావణమాసం లక్ష్మీపార్వతులకి అంత ప్రీతికరమైనది. ఈ శ్రావణ మాసంలో మహిళామణులు ప్రతి మంగళవారం గౌరీదేవిని పూజిస్తుంటారు. మంగళ గౌరి ఆరాధనలో భాగంగా నోములు, వ్రతాలు చేస్తుంటారు. సంతాన సౌభాగ్యాలను ఆ తల్లి రక్షిస్తూ ఉంటుందని ఆడబడుచుల విశ్వాసం.  

శ్రావణ మాసం అంటే శుభ మాసం. శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు. నభో అంటే ఆకాశం అని అర్ధం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, నాగ చతుర్థి, నాగ పంచమి ఏకాదశి, దామోదర ద్వాదశి, వరాహ జయంతి ఇలా పర్వ దినాలు  వస్తాయి. శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా, చంద్రుడు మనఃకారకుడు. అంటే సంపూర్ణముగా మనస్సు మీద ప్రభావము చూపే మాసము.
ఈ మాసంలో రవి సంచరించు నక్షత్రాల ప్రభావంతో చంద్రుని మూలకంగా మన మీద ప్రభావం చూపుతుంది. చంద్రుని చార నుంచి జరగబోయే దుష్ఫలితాల నివారణకు, మంచి చేయడానికి, ధర్మాచరణములను పండుగగా ఆచరించడం నియమమైనది. మనస్సు మీద మంచి ప్రభావము ప్రసరించి పరమార్ధము వైపు మనస్సును త్రిప్పుకొని మానసిక శాంతి పొందడానికి, ప్రకృతి వలన కలిగే అస్తవ్యస్త అనారోగ్యముల నుండి తప్పించుకొనుటకు, మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం శ్రావణమాసంలో వచ్చే పండుగలలో నిర్దేశించిన ఆచారాలను పాటించడం ముఖ్యోద్దేశం.

శ్రావణ మాసంలో లక్ష్మీ దేవిని పూజించడం వలన ఆ దేవి చాలా సంతృప్తి చెంది కరుణిస్తుంది. వివాహితులు ఈ పూజ చేసుకోవడం వలన సౌభాగ్యవంతులుగా వర్ధిల్లుతారు. లక్ష్మీ అనగానే కొందరు ధనము మాత్రమే అనుకుంటారు. ధనం, ధైర్యం, విద్య, ధాన్యం, విజయం, పరపతి, సంతానం, గుణం మనకి ప్రాప్తం కలగాలని ఆ తల్లిని పూజిస్తారు.

శ్రావ‌ణ‌మాసంలోనూ కూడా వివాహాలు ఎక్కువగా అవుతాయి. కొత్త పెళ్ళికూతుళ్లతో అత్తలు ఈ వ్రతం చేయిస్తారు. అంటే ఆమెకు పూజలు, వాటి విధానం, వాటి ప్రాముఖ్యం తెలుస్తుంది. శ్రావణ మాసంలో ఈ పూజ చేయడం వలన సకల సంపదలు, సుఖ సంతోషాలు కలుగుతాయని ప్రతీతి. ఈ వ్రత కథలో చారుమతికి అనే స్త్రీ అందరితో అణకువగా ఉంటుందని, అత్తమామలను చక్కగా చూసుకుంటుందని అలాంటి స్త్రీకి లక్ష్మీ దేవి కటాక్షం కలిగిందని చెబుతారు. అంటే ఆడవాళ్ళు ఎప్పుడూ వినయంగా ఉంటూ, అత్తమామలను అందరిని ఆదరించాలని, అప్పుడే లక్ష్మీ కటాక్షం ఉంటుందని, కొత్త కోడలికి తెలుస్తుంది.

ఏ ఇంట్లో ఆడవాళ్ళు సౌమ్యంగా ఉంటూ, ఇంటిని, ఇంటిల్లపాదిని ప్రశాంతంగా ఉంచుతారో ఆ ఇంట్లో అన్ని మరియు అందరి పనులు విజయవంతం అవుతాయి. అలాగే లక్ష్మీ స్వరూపమైన స్త్రీని, ఏ ఇంట్లో కంటతడి పెట్టనీయక చక్కగా చూసుకుంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అంటారు. మన పూర్వీకులు మనకి ఇచ్చిన ప్రతీ పూజలో, సాంప్రదాయాలలో ఎన్నో ఆరోగ్య సూత్రాలు, మనుషుల జీవన శైలికి కావాల్సిన మంచి సూత్రాలు ఉంటాయి.

నారీణాం కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధా, ధృతి, క్షమ.....స్త్రీలలో కనిపించే ఈ ఏడు గుణాలు నా విభూతులే అంటున్నాడు భగవానుడు.

నారీణాం కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధా, ధృతి, క్షమ.....

స్త్రీలలో కనిపించే ఈ ఏడు గుణాలు నా విభూతులే అంటున్నాడు భగవానుడు.

 దీనిని బట్టి ఈ ఏడు లక్షణాలు పురుషులలో కన్నా స్త్రీలలోనే ఎక్కువగా శోభిస్తాయని కావచ్చు. లేదా ఈ ఏడు లక్షణాలు స్త్రీలలోనే ఎక్కువగా కనిపిస్తాయని కావచ్చు. ఇవి స్త్రీలకు సహజగుణాలు కూడా. 

ప్రతి వస్తువులోను ఒక్కొక్క విభూతిని చెప్పి, స్త్రీలలో మాత్రం ఏడు విభూతులుగా నేనున్నాను అని భగవంతుడు అనటంలో స్త్రీల యొక్క విశిష్ఠతను చాటుతుంది. ఏమిటా ఏడు విభూతులు...

 1) కీర్తి...

సత్కర్మలు, దానధర్మాలు, పూజాపునస్కారాలు, యజ్ఞయాగాదులు మోదలైన కర్మల ద్వారా, త్యాగభావన ద్వారా కీర్తిని సంపాదించటం, భర్తకు అనుకూలంగా కుటుంబ నిర్వహణ గావించటం ఇవి స్త్రీ సహజగుణాలు. 

 2) శ్రీ...

శ్రీ అంటే సంపద. అంతేకాదు సంపదతో బాటు శరీర సౌందర్యాన్ని కాపాడుకుంటూ అందంగా అలంకరించుకోవటం కూడా స్త్రీ యొక్క సహజగుణమే. శ్రీ అంటే లక్ష్మి. 

 3) వాక్కు...

వాక్కు అంటే సరస్వతి. విద్య, బుద్ధి, జ్ఞానం సంపాదించటం, చల్లగా, తియ్యగా, మధురంగా మాట్లాడటం కూడా భగవంతుని విభూతియే. 

 4) స్మృతి...

జరిగిపోయిన విషయాలను గుర్తుపెట్టుకొనే జ్ఞాపకశక్తి, జ్ఞానాన్ని మరచిపోకుండా ఉండటం.

 సందర్భానికి తగినట్లు జరిగిన విషయాలను గుర్తు తెచ్చుకోవటం స్మృతి. ఇదీ భగవంతుని విభూతియే. 

 5) మేధా...

ధారణా శక్తి. విన్న విషయాలను బుద్ధిలో నిలుపుకొనే శక్తి. జ్ఞానవిషయాలు, తత్త్వవిచారణ చేయటానికి కావలసిన మేధాశక్తి స్త్రీలలో అధికం. ఇది కూడా భగవంతుని విభూతియే.

 6) ధృతి...

ధర్మ కార్యాలలో, దైవకార్యాలలో ధైర్యంతో, పట్టుదలతో పాల్గొనటం, మోక్ష సిద్ధి కొరకు పట్టుదల. ఇంద్రియ, మనస్సులను నిగ్రహించగల బలం. ఇది కూడా స్త్రీలలో అధికమే.

 7) క్షమా...

 అత్తమామలను ఆదరించటంలోను, *భర్తకు* అనుకూలంగా నడుచుకోవటంలోను, *పిల్లల పోషణలోను, బావలు, మరుదులు, తోటికోడళ్ళు మొదలైన వారితో నేర్పుతో వ్యవహరించటంలోను ఎంతో ఓర్పు* ఉండాలి. ఇది కూడా స్త్రీ సహజగుణమే. ఇవన్నీ స్త్రీలలో ఉంటే వాటిని భగవంతుని విభూతులుగా చూడాలి.

 విశేషార్థం...

'నార' అంటే భగవత్ సంబంధమైన.. అని. భగవత్ కార్యాలలో, లేదా భగవత్ సంబంధమైన జ్ఞానంలో జీవించేవారు పురుషులైనా, స్త్రీలైనా పైన చెప్పిన సద్గుణాలు వారిలో ప్రకాశిస్తే అవి భగవత్ విభూతులే...

*జీవిత* *సత్యం* : - 🙏

*జీవిత* *సత్యం* : - 🙏

చాలామంది అనుకుంటారు...
ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత...
స్నానం చేసి పూజ చేయొచ్చు అని.‌..
ఇంట్లో పని అంతా అయిపోయి...
అలసిపోయి , అప్పుడు స్నానం చేసి...
ఏకాగ్రత లేని మనసుతో పూజను చేస్తారు...
కానీ అది చాలా పొరపాటు...
కనీసం ఉదయం ఆరుగంటల లోపు లేచి...
ముందుగా కాలకృత్యాలు తీర్చుకోవాలి...
ఎందుకంటే మనం నిద్రపోతున్నప్పుడు...
మనలో ఉన్న చెడు పదార్థాలన్నీ...
నూనె రూపంలో బయటకు వస్తాయి...
నిద్ర లేచిన వెంటనే స్నానం చేయడం వలన...
ఈ చెడు పదార్థాలు అన్నీ బయటకుపోయి శరీరం శుభ్రం అవుతుంది...
ఆ తరువాత ముందుగా దీపారాధన చేయాలి...
ఆ తర్వాతే స్తోత్రాలూ...
నైవేద్యాలూ అన్నీ సమర్పించాలి...
అన్నిటికన్నా దీపారాధన ముఖ్యం...
ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం...
భగవంతుడు జ్యోతి స్వరూపుడు...
మనలో ఉన్న ఆత్మ కూడా జ్యోతి స్వరూపమే...
అందుకని మనం ఏమి సమర్పించినా కూడా...
ఆయన ఈ దీపారాధన ద్వారానే స్వీకరిస్తాడు...
అంతే కాకుండా...
ఈ దీపారాధన వల్ల పరిసరాలు పరిశుభ్రమై...
ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది...
రోజూ ఆవునేతితో దీపం వెలిగించడం...
ఎంతో శ్రేయస్కరం...
ఆరోగ్యదాయకం...
చాలామంది దీపాలకే కదా అని నాసిరకం నూనె వాడేస్తుంటారు...
కానీ దానివల్ల ఇంకా అనారోగ్యం పాలు కావాల్సి వస్తుంది...
మనం పదార్థాలను తింటే వచ్చే శక్తి కన్నా...
వాయు రూపంలో పీల్చడం వల్ల ఎక్కువ శక్తి ఉంటుంది...
అందువల్ల దీపానికి వాడే నూనె పట్ల శ్రద్ధ వహించాలి...
మంచి విషయం అయితే తొందరగా తెలియదు గాని...
చెడు విషయాన్ని ఉదాహరణగా తీసుకుందాం...
ఒక విష పదార్థాన్ని తినేకన్నా...
విషవాయువులు పిలిస్తేనే ప్రమాదం ఎక్కువ ఉంటుంది...
అదేవిధంగా ఇది కూడా...
అందరూ సూర్యోదయానికి ముందే...
ఈ దీపారాధన చేసే విధానం వల్ల...
మొత్తం సమాజానికి మేలు జరుగుతుంది...

 *సర్వేజనా* *సుఖినోభవంతుః* 🙏

 *జై* *శ్రీ* *కృష్ణా* ...💐🙏
                                  *సుధ*

మహా లక్ష్మ్యష్టకమ్ / महा लक्ष्म्यष्टकम्

మహా లక్ష్మ్యష్టకమ్ / महा लक्ष्म्यष्टकम्

ఇంద్ర ఉవాచ: -
నమస్తేఽస్తు మహామాయే
శ్రీపీఠే సురపూజితే |
శంఖచక్ర గదాహస్తే
మహాలక్ష్మి నమోఽస్తు తే ‖ 1 ‖
 
इन्द्र उवाच :-
नमस्तेऽस्तु महामाये
श्रीपीठे सुरपूजिते |
शङ्खचक्र गदाहस्ते
महालक्ष्मि नमोऽस्तु ते ‖ 1 ‖


నమస్తే గరుడారూఢే
డోలాసుర భయంకరి |
సర్వపాపహరే దేవి
మహాలక్ష్మి నమోఽస్తు తే ‖ 2 ‖
 
नमस्ते गरुडारूढे
कोलासुर भयङ्करि |
सर्वपापहरे देवि
महालक्ष्मि नमोऽस्तु ते ‖ 2 ‖

సర్వజ్ఞే సర్వవరదే
సర్వ దుష్ట భయంకరి |
సర్వదుఃఖ హరే దేవి
మహాలక్ష్మి నమోఽస్తు తే ‖ 3 ‖
सर्वज्ञे सर्ववरदे
सर्व दुष्ट भयङ्करि |
सर्वदुःख हरे देवि
महालक्ष्मि नमोऽस्तु ते ‖ 3 ‖


సిద్ధి బుద్ధి ప్రదే దేవి
భుక్తి ముక్తి ప్రదాయిని |
మంత్ర మూర్తే సదా దేవి
మహాలక్ష్మి నమోఽస్తు తే ‖ 4 ‖
 
सिद्धि बुद्धि प्रदे देवि
भुक्ति मुक्ति प्रदायिनि |
मन्त्र मूर्ते सदा देवि
महालक्ष्मि नमोऽस्तु ते ‖ 4 ‖

ఆద్యంత రహితే దేవి
ఆద్యశక్తి మహేశ్వరి |
యోగజే యోగ సంభూతే
మహాలక్ష్మి నమోఽస్తు తే ‖ 5 ‖
 
आद्यन्त रहिते देवि
आद्यशक्ति महेश्वरि |
योगजे योग सम्भूते
महालक्ष्मि नमोऽस्तु ते ‖ 5 ‖

స్థూల సూక్ష్మ మహారౌద్రే
మహాశక్తి మహోదరే |
మహా పాప హరే దేవి
మహాలక్ష్మి నమోఽస్తు తే ‖ 6 ‖
स्थूल सूक्ष्म महारौद्रे
महाशक्ति महोदरे |
महा पाप हरे देवि
महालक्ष्मि नमोऽस्तु ते ‖ 6 ‖

పద్మాసన స్థితే దేవి
పరబ్రహ్మ స్వరూపిణి |
పరమేశి జగన్మాతః
మహాలక్ష్మి నమోఽస్తు తే ‖ 7 ‖
 
पद्मासन स्थिते देवि
परब्रह्म स्वरूपिणि |
परमेशि जगन्मातः
महालक्ष्मि नमोऽस्तु ते ‖ 7 ‖

శ్వేతాంబరధరే దేవి
నానాలంకార భూషితే |
జగత్ స్థితే జగన్మాతః
మహాలక్ష్మి నమోఽస్తు తే ‖ 8 ‖
 
श्वेताम्बरधरे देवि
नानालङ्कार भूषिते |
जगत्स्थिते जगन्मातः
महालक्ष्मि नमोऽस्तु ते ‖ 8 ‖

మహాలక్ష్మష్టకం స్తోత్రం
యః పఠేత్ భక్తిమాన్ నరః |
సర్వ సిద్ధి మవాప్నోతి
రాజ్యం ప్రాప్నోతి సర్వదా ‖ 9 
 
महालक्ष्मष्टकं स्तोत्रं
यः पठेद् भक्तिमान् नरः |
सर्व सिद्धि मवाप्नोति
राज्यं प्राप्नोति सर्वदा ‖

ఏకకాలే పఠేన్నిత్యం
మహాపాప వినాశనం |
ద్వికాలం యః పఠేన్నిత్యం
ధన ధాన్య సమన్వితః ‖ 10
 
एककाले पठेन्नित्यं
महापाप विनाशनं |
द्विकालं यः पठेन्नित्यं
धन धान्य समन्वितः ‖ 10 


త్రికాలం యః పఠేన్నిత్యం
మహాశత్రు వినాశనం |
మహాలక్ష్మీ ర్భవేన్-నిత్యం
ప్రసన్నా వరదా శుభా ‖ 11
 
त्रिकालं यः पठेन्नित्यं
महाशत्रु विनाशनं |
महालक्ष्मी र्भवेन्-नित्यं
प्रसन्ना वरदा शुभा ‖ 11 ‖

[ఇంద్రకృత శ్రీ మహాలక్ష్మ్యష్టక స్తోత్రం సంపూర్ణమ్]
( इन्द्रकृत श्री महालक्ष्म्यष्टक स्तोत्रं सम्पूर्णम् )

సంకలనం  :- బ్రహ్మశ్రీ. కేసాప్రగడ ఫణీంద్ర రాజశేఖర శర్మ (స్మర్త)
संकलनम् :- ब्रह्मश्री केसाप्रगड फणींद्र राजशेखर शर्मा (स्मर्त)

ఇతి శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం

*🕉సుబ్రహ్మణ్య స్తోత్రం🕉*

నీల కంఠ వాహనం ద్విషద్ భుజం కిరీటినం
లోల రత్న కుండల ప్రభా అభిరామ షణ్ముఖం
శూల శక్తి దండ కుక్కుట అక్ష మాలికా ధరం
బాలం ఈశ్వరం కుమారశైల వాసినం భజే

వల్లి దేవయానికా సముల్లసంతం ఈశ్వరం
మల్లికాది దివ్య పుష్ప మాలికా విరాజితం |
ఝల్లరీ నినాద శంఖ వాదన ప్రియం సదా
పల్లవారుణం కుమారశైల వాసినం భజే

షడాననం కుంకుమ రక్త వర్ణం
మహా మతిం దివ్య మయూర వాహనం |
రుద్రస్య సూనుం సుర సైన్య నాథం
గుహం సదా శరణమహం భజే

మయూరాధి రూఢం మహా వాక్య గూఢం
మనోహారీ దేహం మహా చ్చిత్త గేహం |
మహీ దేవ దేవం మహా వేద భావం
మహాదేవ బాలం భజే లోకపాలం

*ఇతి శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం సంపూర్ణం*

*🌞శుభ శుభోదయం🌞*

🙏🦚🙏🦚🙏🦚🙏

*జీవిత కాలం పాటు సంపాదించుకున్న మంచితనం కూడాసర్వనాశనం కావడానికి *క్షణం చాలు*

꧁🌱╭⊱ꕥꕥ⊱╮🌱꧂


                 *ఒక్క క్షణం*

ఒక ఊర్లో మంచి పేరు ప్రతిష్టలు కలిగిన పండితుడు ఒకాయన ఉండేవాడు. 
చాలా చక్కని వాక్పటిమ గలవాడు. 
ఆయన ఆలయం ఆవరణలో కూర్చొని ప్రవచనం చెబుతూ వుంటే 
వేలమంది జనం అలా కదలకుండా బొమ్మల్లా వింటూ ఉండిపోయేవాళ్ళు.
ఆయన ప్రఖ్యాతి చుట్టుపక్కల చాలా గ్రామాల్లో వ్యాపించింది. 
ఒకసారి ఆయన ప్రవచనం నిమిత్తం పొరుగూరు వెళ్ళవలసి వచ్చింది. 
ఆ ఊరు వెళ్ళే  బస్సు ఎక్కి  టికెట్ తీసుకున్నాడు. 
అయితే పొరపాటున బస్సు కండక్టర్ 10 రూపాయలు ఎక్కువ ఇచ్చాడు. 
పండితుడు అది గమనించి తిరిగి ఇవ్వాలని యోచించాడు. 
కానీ బస్సునిండా జనం కిక్కిరిసి ఉండటంతో, 
దిగేటప్పుడు ఇద్దాంలే అనుకుని కూర్చున్నాడు. 
కొద్ది సేపు తరువాత అతని మనసులొ ఆలోచనలు మారాయి. 
'ఆ కండక్టరు కూడా ఎంతమంది దగ్గర చిల్లర కొట్టేయడం లేదు. 
ఈ బస్సు కూడా ఒక సంస్థదే కదా! ఎంత మంది తినటంలేదు? 
నా పది రూపాయలకే నష్టపోతుందా ఏమిటి? 
ఈ పది రూపాయలు ఏదైనా దైవ కార్యనికి ఉపయోగిస్తా......' 
అని అనుకుని మౌనంగా కూర్చున్నాడు. 
అంతలో వూరు వచ్చింది.... బస్సు ఆగింది. 
కానీ ఆయన దిగేటప్పుడు బస్సు కండక్టర్ దగ్గరికి రాగానే 
తన ప్రమేయం ఏమాత్రం లేకుండా  అసంకల్పితంగా 
కండక్టరుకు ఇవ్వవలిసిన పది రూపాయలు ఇచ్చి 
"మీరు నాకు టికెట్ ఇచ్చేటప్పుడు ఇవి ఎక్కువగా ఇచ్చారు" అన్నాడు. 
దానికి ఆ కండక్టర్ "అయ్యా! నేను  మీ ప్రవచనాలు ఎంతో శ్రద్ధగా వింటాను. 
మీరు చెప్పడంతోటే సరిపెట్టుకుంటారా లేక పాటిస్తారా 
అని చిన్న పరీక్ష చేశాను" అని అన్నాడు. 
పండితుడు చల్లటి చిరు చెమటలతో బస్సు దిగి 
'పది రూపాయల కోసం తుచ్ఛమైన ఆశతో 
నా విలువలకే తిలోదకాలు ఇవ్వబోయాను... 
నా అదృష్టం బాగుంది. 
నా మనస్సాక్షి  సరైన సమయంలో సరియైన నిర్ణయం తీసుకొని 
నా విలువలను కాపాడింది' అనుకున్నాడు.
 
*జీవిత కాలం పాటు సంపాదించుకున్న మంచితనం కూడా
సర్వనాశనం కావడానికి 
*క్షణం చాలు*


*🌴🦢🦢🦢🦢🦢🦢🦢🌴*

Friday, July 24, 2020

శ్రావణ శుక్రవారం పూజ ఎందుకు చేయాలి..?

శ్రావణ శుక్రవారం పూజ ఎందుకు చేయాలి..?


ఆషాడ మాసంలో అత్తింటి నుంచి పుట్టింటికి చేరతారు ఆడబడుచులు. తిరిగి శ్రావణ మాసంలో అత్తింటికి వెళ్లే ముందు పుట్టింటి వారికి ఇష్టమైన కానుకలు, అల్లుళ్లకు ప్రత్యేక బహుమతులు అందజేస్తారు.
తెలుగు క్యాలెండర్‌లో ప్రతి నెలకో ప్రాముఖ్యం.. ప్రాధాన్యం విశిష్టత ఉన్నాయి. చైత్రమాసం ప్రారంభంతో ఉగాది (తెలుగు సంవత్సరాది) జరుపుకుంటే ఆ వెంటనే శ్రీరామ నవమి తర్వాత వివాహ వేడుకలకు భారతీయులు ప్రత్యేకించి హిందువులు శ్రీకారం చుడతారు. ఆషాడ మాసంలో అత్తింటి నుంచి పుట్టింటికి చేరతారు ఆడబడుచులు. 

తిరిగి శ్రావణ మాసంలో అత్తింటికి వెళ్లే ముందు పుట్టింటి వారికి ఇష్టమైన కానుకలు, అల్లుళ్లకు ప్రత్యేక బహుమతులు అందజేస్తారు. శీతాకాలం ప్రారంభంలో వచ్చే కార్తీక మాసంలో సోమవారం ప్రత్యేకత ఉన్నట్లే శ్రావణమాసంలో మంగళ, శుక్రవారాలకు ఎంతో విశిష్టత ఉన్నదంటే అతిశయోక్తి కాదు. 
కార్తీకమాసం శివకేశవులకి ఎంత ఇష్టమో, శ్రావణమాసం లక్ష్మీపార్వతులకి అంత ప్రీతికరమైనది. ఈ శ్రావణ మాసంలో మహిళామణులు ప్రతి మంగళవారం గౌరీదేవిని పూజిస్తుంటారు. మంగళ గౌరి ఆరాధనలో భాగంగా నోములు, వ్రతాలు చేస్తుంటారు. సంతాన సౌభాగ్యాలను ఆ తల్లి రక్షిస్తూ ఉంటుందని ఆడబడుచుల విశ్వాసం.  

శ్రావణ మాసం అంటే శుభ మాసం. శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు. నభో అంటే ఆకాశం అని అర్ధం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, నాగ చతుర్థి, నాగ పంచమి ఏకాదశి, దామోదర ద్వాదశి, వరాహ జయంతి ఇలా పర్వ దినాలు  వస్తాయి. శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా, చంద్రుడు మనఃకారకుడు. అంటే సంపూర్ణముగా మనస్సు మీద ప్రభావము చూపే మాసము.
ఈ మాసంలో రవి సంచరించు నక్షత్రాల ప్రభావంతో చంద్రుని మూలకంగా మన మీద ప్రభావం చూపుతుంది. చంద్రుని చార నుంచి జరగబోయే దుష్ఫలితాల నివారణకు, మంచి చేయడానికి, ధర్మాచరణములను పండుగగా ఆచరించడం నియమమైనది. మనస్సు మీద మంచి ప్రభావము ప్రసరించి పరమార్ధము వైపు మనస్సును త్రిప్పుకొని మానసిక శాంతి పొందడానికి, ప్రకృతి వలన కలిగే అస్తవ్యస్త అనారోగ్యముల నుండి తప్పించుకొనుటకు, మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం శ్రావణమాసంలో వచ్చే పండుగలలో నిర్దేశించిన ఆచారాలను పాటించడం ముఖ్యోద్దేశం.

శ్రావణ మాసంలో లక్ష్మీ దేవిని పూజించడం వలన ఆ దేవి చాలా సంతృప్తి చెంది కరుణిస్తుంది. వివాహితులు ఈ పూజ చేసుకోవడం వలన సౌభాగ్యవంతులుగా వర్ధిల్లుతారు. లక్ష్మీ అనగానే కొందరు ధనము మాత్రమే అనుకుంటారు. ధనం, ధైర్యం, విద్య, ధాన్యం, విజయం, పరపతి, సంతానం, గుణం మనకి ప్రాప్తం కలగాలని ఆ తల్లిని పూజిస్తారు.

శ్రావ‌ణ‌మాసంలోనూ కూడా వివాహాలు ఎక్కువగా అవుతాయి. కొత్త పెళ్ళికూతుళ్లతో అత్తలు ఈ వ్రతం చేయిస్తారు. అంటే ఆమెకు పూజలు, వాటి విధానం, వాటి ప్రాముఖ్యం తెలుస్తుంది. శ్రావణ మాసంలో ఈ పూజ చేయడం వలన సకల సంపదలు, సుఖ సంతోషాలు కలుగుతాయని ప్రతీతి. ఈ వ్రత కథలో చారుమతికి అనే స్త్రీ అందరితో అణకువగా ఉంటుందని, అత్తమామలను చక్కగా చూసుకుంటుందని అలాంటి స్త్రీకి లక్ష్మీ దేవి కటాక్షం కలిగిందని చెబుతారు. అంటే ఆడవాళ్ళు ఎప్పుడూ వినయంగా ఉంటూ, అత్తమామలను అందరిని ఆదరించాలని, అప్పుడే లక్ష్మీ కటాక్షం ఉంటుందని, కొత్త కోడలికి తెలుస్తుంది.

ఏ ఇంట్లో ఆడవాళ్ళు సౌమ్యంగా ఉంటూ, ఇంటిని, ఇంటిల్లపాదిని ప్రశాంతంగా ఉంచుతారో ఆ ఇంట్లో అన్ని మరియు అందరి పనులు విజయవంతం అవుతాయి. అలాగే లక్ష్మీ స్వరూపమైన స్త్రీని, ఏ ఇంట్లో కంటతడి పెట్టనీయక చక్కగా చూసుకుంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అంటారు. మన పూర్వీకులు మనకి ఇచ్చిన ప్రతీ పూజలో, సాంప్రదాయాలలో ఎన్నో ఆరోగ్య సూత్రాలు, మనుషుల జీవన శైలికి కావాల్సిన మంచి సూత్రాలు ఉంటాయి.

Thursday, July 23, 2020

హనుమ నవావతారములు:

హనుమ నవావతారములు:

హనుమంతుడి రూపవర్ణనలలో 20విశేషములతో చెప్తూ 20 చేతుల ఆంజనేయస్వామివారిని మొదలుకొని 9హనుమన్మంత్రమూర్తులని శాస్త్రం చెప్తున్నది. నిజానికి ఇవి నవ ఆంజనేయ రూపములు. నవనారసింహ రూపాలు అంటాం కదా! అలాగే ఇవి. నవాంజనేయ రూపములు ప్రస్తావన చేసినట్లైతే 
ఆద్యః ప్రసన్న హనుమాన్ ద్వితీయో వీరమారుతిః
తృతీయో వింశతి భుజః చతుర్థః పంచవక్త్రకః
పంచమో అష్టాదశ భుజః శరణ్యః సర్వదేహినాం
సువర్చలా పతిఃషష్ఠః సప్తమస్తు చతుర్భుజః
అష్టమః కథితశ్శ్రీమాన్ ద్వాత్రింశత్ భుజమండలః
నవమో వానరాకారః ఇత్యేవ నవరూప ధృత్
నవావతార హనూమాన్ పాతుమాం సర్వదస్సదా!!
మొత్తం తొమ్మిది నామాలు ఇక్కడ వస్తాయి. వాటిని గుర్తుపెట్టుకొని నిత్యం పఠించుకోమని చెప్తున్నారు. మొదటి వాడు ప్రసన్నాంజనేయుడు రెండవ వాడు వీరాంజనేయుడు. మూడవది ఇరవై చేతుల వాడు. నాలుగవది అయిదుముఖాల వాడు. ఆరవ నామం సువర్చలాపతి. ఏడవది నాలుగు చేతుల ఆంజనేయ స్వామి వారు. ముప్ఫైరెండు భుజాలతో ఉన్న హనుమన్మంత్రమూర్తి ఎనిమిదవది. తొమ్మిదవది వానరాకారము.
ఈ తొమ్మిది రూపములు ఏమిటంటే వివిధ ఉపాసనలకు దర్శనమిచ్చిన రూపములు. తొమ్మిదిమంది ఉపాసకులకి తొమ్మిది రూపాలతో దర్శనమిచ్చాడట స్వామి. అలా దర్శనమిచ్చిన తొమ్మిది నామములు ఒక దగ్గర పెట్టుకొని ఎవరైతే మననం చేసుకుంటారో వారిని ఈ నవావతరణ స్మరణ ఎల్లవేళలా రక్షిస్తుంది. అవతారం అంటే తనను తాను ప్రకటించుకోవడం. వివిధ ఉపాసకులు ధ్యానం చేసినప్పుడు ఉపాసనా ఫలంగా ప్రకటింపబడిన రూపములే ఈ నవావతార హనుమద్రూపములు.

Sunday, July 19, 2020

*రామ రక్షా స్తోత్రం* శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే*ఇతి శ్రీబుధకౌశికముని విరచితం శ్రీరామ రక్షాస్తోత్రం సంపూర్ణం

*రామ రక్షా స్తోత్రం*

*ధ్యానమ్*

ధ్యాయేదాజానుబాహుం ధృతశర ధనుషం బద్ధ పద్మాసనస్థం, పీతం వాసోవసానం నవకమల దళస్పర్థి నేత్రం ప్రసన్నమ్
వామాంకారూఢ సీతాముఖ కమల మిలల్లోచనం నీరదాభం, నానాలంకార దీప్తం దధతమురు జటామండలం రామచంద్రమ్

*స్తోత్రమ్*

చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్, ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనమ్
ధ్యాత్వా నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనమ్, జానకీ లక్ష్మణోపేతం జటాముకుట మండితమ్
సాసితూణ ధనుర్బాణ పాణిం నక్తం చరాంతకమ్, స్వలీలయా జగత్రాతు మావిర్భూతమజం విభుమ్
రామరక్షాం పఠేత్ప్రాఙ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్, శిరో మే రాఘవః పాతుఫాలం దశరథాత్మజః
కౌసల్యేయో దృశౌపాతు విశ్వామిత్ర ప్రియః శృతీ, ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రివత్సలః
జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరత వందితః, స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః
కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్, మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః
సుగ్రీవేశః కటీపాతు సక్థినీ హనుమత్-ప్రభుః, ఊరూ రఘూత్తమః పాతు రక్షకుల వినాశకృత్
జానునీ సేతుకృత్ పాతు జంఘే దశముఖాంతకః, పాదౌవిభీషణ శ్రీదఃపాతు రామో‌உఖిలం వపుః
ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్, సచిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్
పాతాళ భూతల వ్యోమ చారిణశ్-చద్మ చారిణః, న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః
రామేతి రామభద్రేతి రామచంద్రేతి వాస్మరన్, నరో నలిప్యతే పాపైర్భుక్తిం ముక్తిం చ విందతి
జగజ్జైత్రైక మంత్రేణ రామనామ్నాభి రక్షితమ్, యః కంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వ సిద్ధయః
వజ్రపంజర నామేదం యో రామకవచం స్మరేత్, అవ్యాహతాఙ్ఞః సర్వత్ర లభతే జయ మంగళమ్
ఆదిష్టవాన్ యథాస్వప్నే రామ రక్షా మిమాం హరః, తథా లిఖితవాన్ ప్రాతః ప్రబుద్ధౌ బుధకౌశికః
ఆరామః కల్పవృక్షాణాం విరామః సకలాపదామ్, అభిరామ స్త్రిలోకానాం రామః శ్రీమాన్సనః ప్రభుః
తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ, పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణా జినాంబరౌ
ఫలమూలాసినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ, పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ
శరణ్యౌ సర్వసత్వానాం శ్రేష్టా సర్వ ధనుష్మతాం, రక్షఃకుల నిహంతారౌ త్రాయేతాం నో రఘూత్తమౌ
ఆత్త సజ్య ధనుషా విషుస్పృశా వక్షయాశుగ నిషంగ సంగినౌ, రక్షణాయ మమ రామలక్షణావగ్రతః పథిసదైవ గచ్ఛతాం
సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా, గచ్ఛన్ మనోరథాన్నశ్చ రామః పాతు స లక్ష్మణః
రామో దాశరథి శ్శూరో లక్ష్మణానుచరో బలీ, కాకుత్సః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘూత్తమః
వేదాంత వేద్యో యఙ్ఞేశః పురాణ పురుషోత్తమః, జానకీవల్లభః శ్రీమానప్రమేయ పరాక్రమః
ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః, అశ్వమేథాధికం పుణ్యం సంప్రాప్నోతి నసంశయః
రామం దూర్వాదళ శ్యామం పద్మాక్షం పీతావాససం, స్తువంతి నాభిర్-దివ్యైర్-నతే సంసారిణో నరాః
రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం, కాకుత్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం
రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం, వందేలోకాభిరామం రఘుకుల తిలకం రాఘవం రావణారిమ్
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే, రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః
శ్రీరామ రామ రఘునందన రామ రామ, శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ
శ్రీరామ రామ రణకర్కశ రామ రామ, శ్రీరామ రామ శరణం భవ రామ రామ
శ్రీరామ చంద్ర చరణౌ మనసా స్మరామి, శ్రీరామ చంద్ర చరణౌ వచసా గృహ్ణామి
శ్రీరామ చంద్ర చరణౌ శిరసా నమామి, శ్రీరామ చంద్ర చరణౌ శరణం ప్రపద్యే
మాతారామో మత్-పితా రామచంద్రః, స్వామీ రామో మత్-సఖా రామచంద్రః
సర్వస్వం మే రామచంద్రో దయాళుః, నాన్యం జానే నైవ న జానే
దక్షిణేలక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా, పురతోమారుతిర్-యస్య తం వందే రఘువందనమ్
లోకాభిరామం రణరంగధీరం, రాజీవనేత్రం రఘువంశనాథం
కారుణ్యరూపం కరుణాకరం తం, శ్రీరామచంద్రం శరణ్యం ప్రపద్యే
మనోజవం మారుత తుల్య వేగం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
వాతాత్మజం వానరయూధ ముఖ్యం, శ్రీరామదూతం శరణం ప్రపద్యే
కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం, ఆరుహ్యకవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం, లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహం
భర్జనం భవబీజానామర్జనం సుఖసంపదాం, తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనమ్
రామో రాజమణిః సదా విజయతే రామం రమేశం భజే, రామేణాభిహతా నిశాచరచమూ రామాయ తస్మై నమః
రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం, రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధర
*శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే*
ఇతి శ్రీబుధకౌశికముని విరచితం శ్రీరామ రక్షాస్తోత్రం సంపూర్ణం

*శ్రీరామ జయరామ జయజయరామ*

Tuesday, July 14, 2020

* సంస్కృత వాక్యాలకి మూల శ్లోకాలు#*

* సంస్కృత వాక్యాలకి మూల శ్లోకాలు#*

మనం తరుచుగా వినే కొన్ని సంస్కృత వాక్యాలకి మూల శ్లోకాలు తెలుసుకోవాలని అనిపించడం సహజం కదా!

 అలాంటి వాటిని కొన్నింటిని మీకోసం సిద్ధం చేశారు. చూడండి:

ముందుగా మనం తరుచుగా వినే మూల వాక్యాలు ఇవీ:

👉 *ధర్మో రక్షతి రక్షిత:*
👉 *సత్య మేవ జయతే*
👉 *అహింసా పరమో2ధర్మ:*
👉 *ధనం మూలమిదం జగత్*
👉 *జననీ జన్మ భూమిశ్చ*
👉 *స్వర్గాదపి గరీయసి*
👉 *కృషితో నాస్తి దుర్భిక్షమ్*
👉 *బ్రాహ్మణానా మనేకత్వం*
👉 *యథా రాజా తథా ప్రజా*
👉 *పుస్తకం వనితా విత్తం*
👉 *పర హస్తం గతం గత:*
👉 *శత శ్లోకేన పండిత:*
👉 *శతం విహాయ భోక్తవ్యం*
👉 *అతి సర్వత్ర వర్జయేత్*
👉 *బుద్ధి: కర్మానుసారిణీ*
👉 *వినాశ కాలే విపరీత బుద్ధి:*
👉 *భార్యా రూప వతీ శత్రు:*
👉 *స్త్రీ బుద్ధి: ప్రళయాంతక:*
👉 *వృద్ధ నారీ పతి వ్రతా*
👉 *అతి వినయం ధూర్త లక్షణమ్*
👉 *ఆలస్యం అమృతం విషమ్*
👉 *దండం దశ గుణం భవేత్*
👉 *ఇవీ మన చెవిని పడుతూ ఉండే మూల వాక్యాలు. కదా?*

*ఇప్పుడు వీటి పూర్తి పాఠాలు చూదామా ?*

ధర్మ ఏవో హతో హంతి
"ధర్మో రక్షతి రక్షిత:"
తస్మా ధర్మో న హంతవ్యో
మానో ధర్మో హ్రతోవ్రధీత్

🔥ధర్మాన్ని మనం ధ్వంసం చేస్తే , అది మనల్ని ధ్వంసం చేస్తుంది. దానిని మనం రక్షిస్తే, అది మనల్ని రక్షిస్తుంది. అందు చేత ధర్మాన్ని నాశనం చేయ కూడదు. ఎవరికి వారే తమంత తాముగా నశించి పోవాలని కోరు కోరు కదా !

🔥 సత్యమేవ జయతే నా2నృతం
సత్యేన పంథా వితతో దేవయాన:
యేనా క్రమం తృషయో హా్యప్త కామా
యత్ర త త్సత్యస్య పరమం నిధానమ్

🔥సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం వలన దేవతల మార్గం కనిపిస్తుంది. సత్యం వలన మహర్షులు కోరికలు లేని వారై పరమేశ్వరుని పొంద గలుగు తున్నారు. ఈశ్వరుడు సత్య స్వరూపుడు.

🔥 అహింసా పరమో ధర్మ:
తథా2 హింసా పరం తప:
అహింసా పరమం ఙ్ఞానం
అహింసా పరమార్జనమ్
🔥అహింస గొప్ప ధర్మం. గొప్ప తపం. మంచి ఙ్ఞానం. గొప్ప సాధన

🔥 ధనమార్జాయ కాకుత్స్థ !
ధన మూల మిదం జగత్
అంతరం నాభి జానామి
నిర్ధనస్య మృతస్య చ

🔥ఓ రామా ! ధనాన్ని సంపాదించాలి. ఎందు కంటే ధనంతో తోనే లోకమంతా ఉంది. ఈ విషయం లోని ఆంతర్యం గమనించాలి. ధనం లేని వాడు మృతునితో సమానం.

🔥 అపి స్వర్ణ మయీ లంకా
న మే రోచతి లక్ష్మణ !
జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపి గరీయసి.

🔥సోదరా, లక్ష్మణా ! ఈ లంక బంగరు మయ మయిన దైనప్పటికీ నాకు నచ్చదు. ఇక్కడ ఉండ లేను. ఎందుకంటే, తల్లి, పుట్టిన ఊరు స్వర్గం కంటె గొప్పవి కదా !

🔥 కృషితో నాస్తి దుర్భిక్షమ్
జపతో నాస్తి పాతకమ్
మౌనేన కలహం నాస్తి
నాస్తి జాగరతో భయం.

🔥చక్కగా వ్యవసాయం చేస్తే కరవు అనేది ఉండదు. జపతపాలు చేస్తే పాపం పోతుంది. మౌనంగా ఉంటే ఎవరితోనూ విరోధమే ఉండదు. జాగురూకతతో ఉంటే దేనికీ భయపడే పని లేదు.

🔥 గజానాం మంద బుధ్ధిశ్చ సర్పాణా మతి నిద్రతా
బ్రాహ్మణానా మనేకత్వం త్రిభిర్లోకోపకారకమ్

🔥ఏనుగుల మంద బుద్ధి తనం, పాముల అతి నిద్రా గుణం, బ్రాహ్మణులలో ఉండే అనైక్యత ... వీటి వల్లన లోకోపకారం జరుగుతోంది కదా !

🔥 రాఙ్ఞ ధర్మిణి ధర్మిష్ఠా, పాపే పాప పరా: సదా
రాజాను మను వర్తంతే, యథా రాజా తథా ప్రజా !

🔥రాజు ధర్మ పరుడయితే రాజ్యం ధర్మ పథంలో నడుస్తుంది. పాప వర్తనుడయితే రాజ్యం పాప పంకిల మవుతుంది. ఎప్పుడూ ధర్మా ధర్మాలు రాజుని అనుసరించి నడుస్తాయి. రాజు ఎలా ఉంటే, ప్రజలూ అలాగే నడచు కుంటారు.

🔥 పుస్తకం వనితా విత్తం
పర హస్తం గతం గత:
అధవా పునరా యాతి
జీర్ణం భ్రష్ఠా చ ఖండశ:

🔥పుస్తకం, స్త్రీ , ధనం ఇవి మన వద్ద ఉన్నంత సేపే . ఇతరులు చేతిలో పడితే మరి వాటి పని అంతే. తిరిగి వస్తాయను కో వద్దు. ఒక వేళ వచ్చినా. సర్వ నాశన మయి పోయిన స్థితిలో మనకి తిరిగి దక్కుతాయి సుమీ. ( స్త్రీని జాగ్రత్తగా చూసుకోవాలి అనే భావం ఇక్కడ గ్రహించాలి)

🔥 శత నిష్కో ధనాఢ్యశ్చ
శత గ్రామేణ భూపతి:
శతాశ్వ: క్షత్రియో రాజా
శత శ్లోకేన పండిత:

🔥వంద నిష్కలు ( ధన విశేషం) ఉన్న వాడే ధనవంతుడు అనిపించు కుంటాడు. వంద గ్రామాలకు అధిపతి అయిన వాడే భూపతి అవుతాడు. వంద గుఱ్ఱాలు కల వాడే రాజు అనిపించు కుంటాడు. వంద శ్లోకాలు వచ్చిన వాడే పండితుడు.

🔥విద్వత్త్వం చ నృపత్వం చ
నైవ తుల్యం కదాచన
స్వ దేశే పూజ్యతే రాజా
విద్వాన్ సర్వత్ర పూజ్యతే.

🔥పండితుడికీ, రాజుకీ పోలికే లేదు ! ఎందు కంటే, రాజు తన దేశంలో మాత్రమే పూజింప బడతాడు. కాని, పండితుడు లోకమంతా గౌరవించ బడుతాడు.

🔥 శతం విహాయ భోక్తవ్యం
సహస్రం స్నాన మాచ రేత్
లక్షం విహాయ దాతవ్యం
కోటిం త్యక్త్వా హరిం భజేత్

🔥వంద మందిని విడిచి పెట్టి అయినా భుజించాలి. వేయి మందిని విడిచి పెట్టయినా స్నానం చేయాలి. లక్ష మంది నీ వెంట రాక పోయినా దానం చేయాలి. కోటి మందిని విడిచి పెట్టయినా శ్రీహరిని సేవించు కోవాలి.

🔥 అతి దానాత్ హత: కర్ణ:
అతి లోభాత్ సుయోధన:
అతి కామాత్ దశగ్రీవో
అతి సర్వత్ర వర్జయేత్
( ఇది మరోవిధంగా కూడా ఉంది)

🔥విచ్చల విడిగా దానం చేయడం వలన కర్ణుడు చెడాడు. మిక్కిలి స్వార్ధ గుణం చేత దుర్యోధనుడు చెడాడు. అతి కామం చేత రావణుడు నాశనమయ్యాడు. కనుక అంతటా అతిని విడిచి పెట్టాలి. ఎప్పుడూ అతి పనికి రాదు. ఓవరాక్షను వికటిస్తుంది.

🔥 సత్యాను సారిణీ లక్ష్మీ
కీర్తి: త్యాగాను సారిణీ
అభ్యాసాను సారిణీ విద్యా
బుద్ధి: కర్మాను సారిణీ.

🔥లక్ష్మీ దేవి ఎప్పుడూ సత్యాన్ని అనుస రించే ఉంటుంది. ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది. అలగే, కీర్తి త్యాగాన్ని అనుసరించి ఉంటుంది. త్యాగ గుణం లేనిదే కీర్తి ప్రతిష్ఠలు రమ్మంటే రావు. అభ్యాసం లేనిదే విద్య అలవడదు. నిత్యం చదవనిదే చదువు ఎలా స్తుంది ? అభ్యాసం కూసు విద్య కదా. ఇక, బుద్ధి కర్మను అనుసరించి ఉంటుంది. చెడి పోయే రాత మనకి ఉంటే మన బుద్ధి చెడు త్రోవలోను, బాగు పడే రాత ఉంటే మన బుద్ధి మంచి దారిలోను ప్రవర్తిస్తుంది. బుద్ధి మన కర్మలను అనుసరించి ఉంటుంది సుమా !

🔥న నిర్మితో వై నచ దృష్ట పూర్వో
న శ్రూయతే హేమ మయం కురంగ:
తథా2పి తృష్ణా రఘు నందనస్య
వినాశ కాలే విపరీత బుద్ధి:

🔥బంగారు లేడి ఉన్నదని ఎన్నడయినా విన్నామా ? ఎప్పుడయినా ఎక్కడయినా  అయినప్పటికీ రాముడు తన చెలి కోరిందని ముందు వెనుకలు యోచించ కుండా బంగారు లేడిని తెస్తానని వెళ్ళాడు. వినాశ కాలం దాపురించిన నాడు ఇలాంటి విపరీత బుద్ధులే పుడుతూ ఉంటాయి. చెడ్డ కాలం వచ్చి నప్పుడు తర్కం పని చెయ్యదు. బుద్ధి మందగిస్తుంది.

🔥 ఋణ కర్తా పితా శత్రు:
మాతా చ వ్యభిచారిణీ
భార్యా రూపవతీ శత్రు:
పుత్ర: శత్రురపండిత:

🔥 అప్పు చేసి, మనకి ఆస్తి కాకుండా అప్పు మిగిల్చే తండ్రి మనకి శత్రువుతో సమానం. వ్యభిచరించే తల్లి శత్రువు. రూపవతి అయిన భార్య శత్రువు. పండితుడు కాని కుమారుడు శత్రువు.

🔥 ఆత్మ బుద్ధి: సుఖం చైవ
గురు బుద్ధిర్విశేషత:
పర బుద్ధి ర్వినాశాయ
స్త్రీ బుద్ధి: ప్రళయాంతక:

🔥 మనకి తోచినది చేయడం అన్నిటి కన్నా మేలు. పెద్దల సలహా ప్రకారం నడచు కోవడం ఇంకా మంచిది. కాని పరుల (శత్రువుల అని కూడా అర్ధం చెప్పు కోవచ్చును) ఆలోచనల మేరకు నడచు కోవడం నాశనం కొని తెచ్చు కోవడమే. ఇక, ఆడువారి ఆలోచనల బట్టి నడుచు కుంటే ప్రళయమే సుమా !

🔥 అసమర్ధస్య సాధూనాం
నిర్ధనస్య జితేంద్రియ:
వార్ధక్యో దేవతా భక్తి:
వృద్ధ నారీ పతివ్రతా.

🔥అసమర్ధుని మంచితనం, ధనం లేని పేద వాని ఇంద్రియ నిగ్రహం, ముసలి తనంలో దైవ భక్తి, వయసు ఉడిగిన ఆడుదాని పాతి వ్రత్యం ఒక్కలాంటివే.

🔥 ముఖం పద్మ దళాకారం
వచ శ్చందన శీతలం
హృదయం కర్తరీ తుల్యం
అతి వినయం ధూర్త లక్షణమ్

🔥ముఖమేమో, పద్మం లాగా ఉంటుంది. మాటలేమో చందనం వలె చల్లగా ఉంటాయి. కాని, దుర్జనుని మనసు మాత్రం కత్తెర పిట్టలాంటిది. అతి వినయం చూపడం చెడ్డ వాడి లక్షణం సుమా. 

🔥 సిద్ధ మన్నం ఫలం పక్వం
నారీ ప్రథమ యౌవ్వనం
కాలక్షేపం నకర్తవ్యం
ఆలస్యం అమృతం విషమ్

🔥వండిన అన్నాన్ని భుజించడానికీ, పండిన పండును కొరుక్కు తినడానికీ, యౌవ్వన వతి పొందును స్వీకరించడానికీ ఆలస్యం చేయ రాదు సుమా ! ఆలస్యం చేస్తే అమృతం కూడా విషమై పోతుంది. అన్నం చల్లారి పోవడం, పండు కుళ్ళి పోవడం, యౌవ్వనం తరగి పోవడం జరుగుతాయి. ఆలస్యం చేయడం వల్ల అమృతం కూడా విషతుల్యమవుతుంది.

🔥 విశ్వా మాత్రా హి పశుషు, కర్ద మేషు జలేషుచ
అంధే తమసి వార్ధక్యే, దండం దశ గుణం భవేత్.

🔥పక్షులు, కుక్కలు, శత్రువులు, పాములు, పశువులు వీటిని అదుపు చేయడానికి వరుసగా, బురదలో, నీటిలో, చీకటిలో, గ్రుడ్డితనంలో , ముసలి తనంలో సాయంగా ఉండేది చేతి కర్ర. అందు వల్ల దండానికి (కర్రకి) దశగుణాలు ఉన్నాయి సుమీ !🔥

*ఇవీ మూల వాక్యాలకి పూర్తి పాఠాలు.*

*పూర్వులు చెప్పిన దానిని మార్చరాదు*

Yes, she has gained weight? Defeated without losing a bout.

అవును, ఆమె కొంచెం బరువు పెరిగే వుంటుంది. ఎందుకంటే…. ఆటల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే నిండైన ఆత్మాభిమానాన్ని, విశ్వ వేదికపైనే కాదు వ...