Tuesday, August 25, 2020

భారతీయులు ప్రతి ఒక్కరూ తెలుసుకోదగినవి* *సంవత్సరానికి ఒక సారి సూర్య కిరణాలు తాకే దేవాలయాలు:*

*భారతీయులు ప్రతి ఒక్కరూ  తెలుసుకోదగినవి* 

*సంవత్సరానికి ఒక సారి సూర్య కిరణాలు తాకే దేవాలయాలు:* 
1. నాగలాపురం వేదనారాయణ స్వామి దేవస్థానం. 
2. కొల్లాపూర్ లక్ష్మి దేవస్థానం. 
3. బెంగళూర్ గవిగంగాధర్ దేవస్థానం. 
4. అరసవెల్లి సూర్య నారాయణ దేవస్థానం. 
5. మొగిలీశ్వర్.
6. కోదండరామ దేవాలయం,  కడప జిల్లా.

*నిరంతరం జలము ప్రవహించే  దేవాలయాలు:* 
1. మహానంది
2. జంబుకేశ్వర్ 
3. బుగ్గరామలింగేశ్వర్
4. కర్ణాటక కమండల గణపతి.
5. హైదరాబాద్ కాశీ బుగ్గ శివాలయం.
6. బెంగళూర్ మల్లేశ్వర్ 
7. రాజరాజేశ్వర్ బెల్లంపల్లి శివాలయం
8. సిద్ధగంగా

*నిరంతరం జ్వాలారూపంగా వెలుగుతూ దర్శనం ఇచ్చే ఆలయాలు.* 
1. అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి. 
2. నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్,  
3. మంజునాథ్.
*శ్వాస తీసుకునే* కాళహస్తీశ్వర్
*సముద్రమే వెనక్కివెళ్లే* 
1. గుజరాత్ నిష్కళంక మహాదేవ్, 
2. 40 ఏళ్లకు ఒకసారి సముద్ర జల పూజ జరిగే పుంగనూరు శివాలయం.
*స్త్రీవలె నెలసరి* అయ్యే 
1. అస్సాం కామాఖ్యా అమ్మవారు,  
2. కేరళ దుర్గామాత.
*రంగులు మారే ఆలయం.* 
1. ఉత్తరాయణం,  దక్షిణాయనం లో రంగులు మారే తమిళనాడు అతిశయ వినాయక దేవాలయం.
2. పౌర్ణమికి తెల్లగా,  అమావాస్యకు నల్లగా రంగుమారే తూర్పుగోదావరి పంచారామ సోమేశ్వరాలయం.
పాపపుణ్యాలను బట్టి నీరు తాకే శివగంగ, నెయ్యి వెన్న గ మారేది ఇక్కడే.

*నిరంతరం పెరుగుతూన్న విగ్రహాలు* 
 1. కాణిపాకం,  
2. యాగంటి బసవన్న,  
3. కాశీ తిలభండేశ్వర్,  
4. బెంగుళూరు బసవేశ్వర్
5. బిక్కవోలు లక్ష్మీగణపతి

*స్వయంభువుగా* 
సంవత్సరానికి ఒకసారి వెలిసే అమర్నాధ్.
*ఆరునెలలకు ఒకసారి తెరిచే* 
1. బదరీనాథ్,  
2. కేదారనాథ్ (ఆరునెలల తరువాత దీపం వెలుగుతూనే ఉంటుంది)
3. గుహ్యకాళీమందిరం. 

*సంవత్సరానికి ఒకసారి తెరిచే ఆలయాలు* 
హాసంబా దేవాలయం,  హాసన్ కర్ణాటక. సంవత్సరం తరువాత పెట్టిన అన్న ప్రసాదాలు చెడిపోకుండా అలానే ఉంటాయి.

*12 ఏళ్లకు ఒకసారి*
పిడుగుపడే తిరిగి అతుక్కునే బిజిలి మహాదేవ్,  హిమాచల్ ప్రదేశ్.

*స్వయంగా ప్రసాదం* 
1. తినే కేరళ శ్రీ కృష్ణ దేవాలయం.
2. బృందావనం రాధాకృష్ణ శయనమందిరం

*ఒంటి స్తంభంతో*
యుగాంతానికి గుర్తుగా  ఉండే పూణే కేధారేశ్వర్,  ఇక్కడ వేసవి వేడిలోకూడా నీరు చల్లగా ఊరుతుంది.

*రూపాలు మారే*
ఉత్తరఖండ్ రోజులో మూడు రూపాలు మారే ధారీదేవి.

*నీటితో దీపం వెలిగించే*
 ఘడియ ఘాట్ మాతాజీ మందిర్,  మధ్యప్రదేశ్. అమ్మవారు కలలో పూజారికి కనబడి ఇక నుండి దీపం నీటితో వెలిగించమని చెప్పింది,  ఇప్పటికి అలాగే జరుగుతూ ఉంది.
*మనిషి శరీరం వలె ఉండే ఆలయాలు* 
1. హేమాచల నరసింహ స్వామి.
2. శ్రీశైలం వద్ద ఇష్టకామేశ్వరీ దేవి

*మనిషి వలె గుటకలు*  
వేస్తూ పానకం త్రాగే పానకాల నరసింహ స్వామీ.

*అన్నం ఉడికేంత వేడిగా నీరు ఉండే యమునేత్రి.* 

*ఛాయా విశేషం* 
1. ఛాయాసోమేశ్వరం, స్థంభం నీడ ఉంటుంది.
2. హంపి విరూపాక్షేశ్వర్,  గోపురం నీడ reverse order లో ఒక చోట పడుతుంది.
3. బృహదీశ్వరాలయం

*నీటిలో తేలే* విష్ణువు (వేల టన్నుల బరువుంటుంది ),  నేపాల్

*ఇంకా...* 
తిరుమల వెంకటేశ్వర స్వామి, అనంత పద్మనాభ స్వామి, రామేశ్వర్,  కంచి, 
చిలుకూరి బాలాజీ,  పండరినాథ్, భద్రాచలం,  అన్నవరం etc

*పూరీ* 
పక్షులు ఎగరని పూరి, సముద్ర ఘోష వినని పూరి, సముద్రం వైపే గాలి వీచే పూరి, గోపురం నీడ పడని పూరి,  దేవునికి సమర్పించగానే ఘుమ ఘుమలాడే  పూరి ప్రసాదం.

ఇవి నాకు తెలిసిన కొన్ని మహిమాన్విత దేవాలయాలు మాత్రమే. ఇటువంటివి దేశం లో కొన్ని వేల దేవాలయాలు ఉన్నాయి...

Sunday, August 23, 2020

’భాద్రపద మాసం’. పండుగలు యేక్క విశిష్టతలు*

’భాద్రపద మాసం’. పండుగలు యేక్క విశిష్టతలు*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*హైందవ సంప్రదాయంలో ప్రతి మాసానికీ ఏదో ఒక విశేషం ఉంటుంది*

వాటిల్లో ముఖ్యమైంది భాద్రపదం. దేవతా పూజలకు, పితృదేవతల పూజకు కూడా ఉత్కృష్టమైన మాసం ’భాద్రపద మాసం’. చాంద్రమానం ప్రకారం భాద్రపద మాసం ఆరవమాసం. ఈ మాసంలోని పూర్ణిమ తిథినాడు చంద్రుడు పూర్వాభాద్ర నక్షత్రం సమీపంలోగాని, ఉత్తరాభాద్ర నక్షత్రం సమీపంలోగానీ ఉండడంవల్ల ఈ మాసానికి ’భాద్రపద మాసం ’ అనే పేరు ఏర్పడింది. భాద్రపద మాసం వర్షఋతువులో రెండో మాసం. చాంద్రమానం ప్రకారం పౌర్ణమి రోజున చంద్రుడు పూర్వాభాద్ర లేదా ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో సంచరించడం వల్ల ఈ మాసానికి భాద్రపదం (20 ఆగస్టు నుంచి—17-సెప్టెంబర్.. ఈ సంవత్సరం) అనే పేరువచ్చింది. 

తొలిపూజలందుకునే వినాయకుడు పుట్టిందీ, స్థితికారకుడైన శ్రీహరి భక్తులను రక్షించడానికి వరాహ, వామనావతారాలు ధరించిందీ ఈ మాసంలోనే. భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతాపూజలకు ఉత్కృష్టమైన కాలం కాగా, కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనలకు అత్యంత ప్రీతికరమైన కాలంగా పురాణాలు చెబుతున్నాయి. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కొరకు శ్రీమహావిష్ణువు దశావతారాలను ధరించినట్లు అందరికీ తెలిసిన విషయమే. అట్టి దశావతారాలలో మూడవ అవతారమైన శ్రీ వరాహ అవతారాన్ని, ఐదవదైన శ్రీ వామనావతారాన్ని భాద్రపద మాసంలోనే శ్రీమన్నారాయణుడు ధరించి దుష్టశిక్షణ గావించాడు.అందుకే ఈ మాసంలో ’దశావతార వ్రతం’ చెయాలనే శాస్త్ర వచనం. భాద్రపదమాసంలోని అష్టమి శ్రీకృష్ణ పరమాత్మ పూజకు ఉత్కృష్టమైన రోజు. ఈ నాడు పవిత్ర ప్రేమకు చిహ్నంగా చెప్పబడుతూ ఉన్న శ్రీ రాధాకృష్ణులను పూజించాలి. ఈ దినానికి ’రాధాష్టమి’ అని పేరు. 

భాద్రపద మాసంలో వచ్చే అతి పెద్ద పండగ వినాయక చవితి. ఊరూవాడా చిన్నాపెద్దా అన్న తేడాలేకుండా ప్రతి ఒక్కరూ గణనాథుడిని శక్తిమేర పూజిస్తారు. అయితే దానికంటే ముందు వచ్చే విశేషం. శుద్ధ తదియనాటి వరాహ జయంతి. కల్పాంత సమయంలో భూమి మొత్తం జలమయమైపోయింది. ఆ సమయంలో బ్రహ్మదేవుడు మనువును పిలిచి భూమిని పాలించాల్సిందిగా ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు మనువు నీట మునిగిన భూమిని పైకి తీసుకురావాల్సిందిగా బ్రహ్మను ప్రార్థిస్తాడు. ఆ సమయంలోనే బ్రహ్మ ప్రార్థించగా యజ్ఞవరాహమూర్తి పుడతాడు. యజ్ఞవరాహం అంటే యజ్ఞంలో ఉపయోగించే ద్రవ్యాలనే శరీరభాగాలుగా కలిగినవాడని అర్థం.

ఈ మాసంలో రెండు ముఖ్యమైన విశేషాలున్నాయి. మొదటగా శుక్ల పక్షంలో దేవతలకు, పూజలకు, నోములకు వ్రతాలకు ప్రాధాన్యత ఇస్తే, రెండోదైన కృష్ణపక్షంలో పితృదేవతలకు అనుకూలమైన మాసంగా పరిగణిస్తారు.
పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు దుష్టులను శిక్షించడానికి పది అవతారాలు ఎత్తాడనే విషయం చాలా మందికి తెలుసు. అయితే అందులోని వరహా, వామన అవతారాలకు ఈ మాసంలోనే ప్రత్యేక పూజలు చేస్తారు. 
బొటన వేలంత దేహంతో పుట్టిన స్వామి క్షణాల్లో ఆకాశమంత ఎత్తు పెరిగిపోతాడు. హిరణ్యాక్షుడితో యుద్ధం చేసి మరీ సముద్రంలో ఉన్న భూమిని పైకెత్తి తన కోరలమీద నిలబెట్టాడు. విష్ణుమూర్తి ధరించిన దశావతారాల్లో మూడో అవతారమే వరాహ అవతారం. ఆ రోజు మరో విశేషం కూడా ఉంది.
అదే పదహారు కుడుముల తద్దె. ఆ రోజున గౌరీదేవిని ఆరాధిస్తే అష్టైశ్వర్యాలూ సిద్ధిస్తాయంటారు. భాద్రపద శుద్ధ చవితినే వినాయక చవితిగా జరుపుకుంటారు. ఈ రోజున భక్తిశ్రద్ధలతో గణపయ్యను పూజిస్తే విద్యాబుద్ధులతోపాటు సకల సంపదలూ లభిస్తాయి.
మర్నాడు రుషి పంచమి. ఈ వ్రతం గురించి శ్రీకృష్ణుడే స్వయంగా ధర్మరాజుతో చెప్పాడంటారు. ఈ వ్రతం చేసేటప్పుడు కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు మొదలైన సప్తఋషులతోపాటు అరుంధతీ దేవినీ ఆరాధించాలి.ఆ తర్వాతి రోజు షష్ఠి. దీన్నే స్కంద షష్ఠి, సూర్యషష్ఠి అని కూడా అంటారు.
నిజానికి మాఘమాసంలో మాదిరిగానే భాద్రపద మాసంలో వచ్చే అన్ని ఆదివారాలూ సూర్యభగవానుడిని అర్చించడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుందని చెబుతారు. 

ఈ నెలలో వచ్చే ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు. తొలి ఏకాదశినాడు పాలసముద్రంలో శేషతల్పంమీద శయనించిన విష్ణుమూర్తి పరివర్తన ఏకాదశి రోజున మరో పక్కకి ఒత్తిగిలుతాడు. ఈ రోజంతా ఉపవాసం ఉండి శ్రీహరిని స్మరిస్తే కరవుకాటకాలు దరిచేరవట.
భాద్రపద మాసం శుక్ల పక్షంలో వచ్చే మరో ప్రత్యేక తిథి ద్వాదశి. శ్రవణా నక్షత్రం ఉన్న ఈ రోజునే వామనావతారానికి శ్రీకారం చుట్టాడు శ్రీహరి. ప్రహ్లాదుడి మనవడైన బలిచక్రవర్తి పరమ ధార్మికుడు. అతడు స్వర్గాన్ని జయించడంతో దేవతలు అక్కణ్ణుంచి వెళ్లిపోవాల్సి వస్తుంది.
బలిచక్రవర్తిని సంహరించకుండానే అతడి నుంచి స్వర్గాన్ని తీసుకుని దేవతలకు ఇచ్చేందుకు. అదితి, కశ్యప ప్రజాపతులకు బిడ్డగా జన్మిస్తాడు శ్రీహరి. సకల భూమండలాన్నీ స్వర్గాన్నీ దానంగా పొందుతాడు. దానికి ప్రతిగా సుతల లోకాన్ని బలిచక్రవర్తికి ఇచ్చి, చివరిలో మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అందుకే ఈ రోజున శ్రీహరిని స్మరించినంతనే మోక్షం లభిస్తుందట. పౌర్ణమి రోజున ఉమామహేశ్వర వ్రతాన్ని చేస్తారు. పార్వతీదేవి ఈ వ్రతాన్ని చేసి శివుడి శరీరంలోని అర్ధభాగాన్ని మళ్లీ పొందిందని చెబుతారు.
శ్రావణమాసం వెళ్లిపోయింది. మంగళగౌరి నోము, వరలక్ష్మి వ్రతాలతో సందడిగా ఉన్న ఇళ్లన్నీ ఒక్కసారి నిశ్శబ్దంగా మారిపోయాయి. కానీ శ్రావణం తర్వాత వచ్చే భాద్రపదమూ ప్రత్యేకమే! భాద్రపదంలో ఒకో రోజు గడిచేకొద్దీ ఊరంతా హోరెత్తిపోతుంది. మరి వినాయక చవితి వచ్చేది ఈ నెలలోనే కదా! ఆ చవితి రోజున స్వామి రూపాన్ని మట్టితో రూపొందించి, ఆ రూపాన్ని పత్రితో పూజిస్తాం. సర్వ శుభాలనూ కలిగించే ఆ విఘ్నాధిపతిని పూర్తిగా ప్రకృతితోనే పూజించి, ప్రకృతిలోనే నిమజ్జనం చేయడం ఈ పండుగకే ప్రత్యేకం.
ఒక్క చవితే కాదు, భాద్రపదంలో ప్రతి తిథీ ప్రత్యేకమే! వినాయక చవితి తర్వాత వచ్చే పంచమిని రుషిపంచమి అని పిలుస్తారు.  ఆ రోజున స్త్రీలంతా సప్తర్షులని పూజిస్తూ ఉపవాసం ఉంటారు. అలా చేస్తే... రుషుల అనుగ్రహంతో వారిలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. ఆ తర్వాత వచ్చే సూర్యషష్టి, లలితా సప్తమి, రాధాష్టమి తిథులలో ఆయా దేవతలని పూజిస్తారు. ఇలా ఒకో తిథినీ దాటుతూ పరివర్తన ఏకాదశి వస్తుంది.
తొలిఏకాదశి రోజున శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తి, పరివర్తన ఏకాదశి రోజున మరోపక్కకి ఒత్తిగిలుతాడని అంటారు. అందుకే ఈ రోజుకి ‘పరివర్తన ఏకాదశి’ అన్న పేరు వచ్చింది. కానీ ఈ పేరు వెనక చాలా నిగూఢ అర్థాలే కనిపిస్తాయి. ఆనాటికి రుతువులలో వచ్చే మార్పునీ, మనుషులలో పరివర్తన రావల్సిన అవసరాన్నీ అది సూచిస్తుంది. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి జాగరణ చేస్తే... గృహస్థు జీవితంలో చేసిన పాపాలన్నీ నశించిపోతాయని చెబుతారు.
పరివర్తన ఏకాదశి మర్నాడే వామన జయంతి వస్తుంది. విష్ణుమూర్తి అవతారమైన వామనుడు ఉద్భవించింది ఈ రోజునే! వామనుడే కాదు, బలరాముడు, వరాహస్వామి కూడా ఈ మాసంలోనే అవతరించారని చెబుతారు. భాద్రపదమాసంలో మరో ప్రత్యేకత మహాలయ పక్షం. భాద్రపద పౌర్ణమి మర్నాడు నుంచి పదిహేను రోజుల పాటు ఈ మహాలయ పక్షం వస్తుంది. పితృదేవతలందరినీ ఈ కాలంలో తల్చుకోవడం ఆనవాయితీ.
భాద్రపదంలో పండుగలే కాదు... నోములు, వ్రతాలకి కూడా కొదవ లేదు. భాద్రపద శుద్ధ చతుర్దశి రోజున వచ్చే అనంతపద్మనాభస్వామి వ్రతం ఇందులో ముఖ్యమైనది. ఈ రోజున ఆ పద్మనాభస్వామిని కొలిచినవారి కష్టాలన్నీ తీరిపోతాయని అంటారు. ఇదే కాకుండా ఉండ్రాళ్ల తద్ది నోము, ఉమామహేశ్వర వ్రతం కూడా గుర్తుంచుకోదగ్గవే!
ఇదీ భాద్రపదంలోని కొన్ని ప్రత్యేకతలు. ఇంత విశేషమైన మాసం కాబట్టే కొందరు అసలు కలియుగమే భాద్రపదంలో మొదలైందని నమ్ముతారు. భాద్రపదం అన్న పేరు కేవలం నక్షత్రాన్ని మాత్రమే సూచించదు. ఆ మాసంలో ప్రజలంతా ‘భద్రంగా’ ఉండాలన్న ఆలోచనతో ఆ పేరు పెట్టినట్లు తోస్తుంది.
భాధ్రపదంలో స్త్రీలు చేయాల్సిన వ్రతాలు : హరితాళిక వ్రతం , సువర్ణగౌరీ వ్రతం 
భాద్రపద శుక్ల పక్ష తదియనాడు ’ హరితాళిక వ్రతం’ లేదా ’ సువర్ణ గౌరీ వ్రతం ’ ’పదహారు కుడుముల తద్ది’ ఆచరిస్తారు. శివపార్వతులను పూజించి, పదహారు కుడుములను తయారుచేసి నైవేద్యంగా సమర్పించవలెను. ఈ పూజను కన్యలు పాటించడంవల్ల వారికి మంచి భర్త లభిస్తాడు. ముత్తయిదువలు పాటించడంవల్ల వారి సౌభాగ్యం అభివృద్ధి చెందుతుందని శాస్త్ర వచనం.
ఉండ్రాళ్ళ తద్ది 
భాద్రపద బహుళ తదియ నాడు అవివాహితలు చేసే వ్రతం . తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి దేవతాపూజ చేసి, ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టి సాయంత్రం ఊయలలో వూగుతారు.
భాద్రపద మాసంలో పండుగలు
శుక్ల చవితి : వినాయక చవితి 
ఏ పూజ అయినా, వ్రతమైనా, చివరకు ఏ పని ప్రారంభించాలన్నా ముందుగా వినాయకుడిని పూజించడం మన సాంప్రదాయం. అటువంటి వినాయకుడి జన్మదినంను ’వినాయక చవితి’ లేదా ’ గణేశ చతుర్ధి’ పర్వదినంగా జరుపుకుంటారు. ఈనాడు వినాయకుడి ప్రతిమను ఇంటిలో ప్రతిష్టించి స్వామివారికి పూజ చేసి గరికతో పాటు, 21 పత్రాల్తో పూజించి , వ్రతకథ చెప్పుకుని, ఉండ్రాళ్ళు, కుడుములను నైవేద్యంగా సమర్పించవలెను.
శుక్ల ఏకాదశి : పరివర్తన ఏకాదశి 
తొలి ఏకాదశినాడు క్షీరాబ్దిపై శేషతల్పంమీద శయనించిన శ్రీమహావిష్ణువు ఈ దిన ప్రక్కకు పొర్లుతాడు అంటే పరివర్తన చెందుతాడు కనుక దీనికి ’పరివర్తన ఏకాదశి’ అని, ’విష్ణు పరివర్తన ఏకాదశి’ అని ’పద్మ పరివర్తన ఏకాదశి’ అని పేరు. ఈనాడు ఏకాదశి వ్రతం ఆచరించడంవల్ల కరువుకాటకాలు రావని, వచ్చి వుంటే విముక్తి లభిస్తుందని కథనం.
శుక్ల ద్వాదశి : వామన జయంతి 
దశావతారాల్లో ఐదవదైన వామనావతారాన్ని శ్రీమహావిష్ణువు ఈ దినం ధరించినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈనాడు వామనుడిని పూజించి, వివిధ నైవేద్యములు సమర్పించి, పెరుగును దానం చేయాలని శాస్త్ర వచనం.
శుక్ల చతుర్డశి : అనంత చతుర్ధశి 
అనంతుడు అనేది శ్రీమహావిష్ణువుకు ఉండే పేర్లలో ఒకటి. శ్రీమహావిష్ణువును అనంతుడిగా పూజిస్తూ చేసే వ్రతమునకే ’అనంత చతుర్దశి వ్రతం’ లేదా ’ అనంత పద్మనాభ వ్రతం’ అని పేర్లు. ఈ వ్రతం గురించి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు వివరించినట్లు భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది.
🌸🌸🌸🌸🌸🌸

Friday, August 21, 2020

ముఖ్యంగా వినాయక చవితి కి గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు:మనం కానీ ,మన కుటుంబసభ్యులని, కానీ లేదా బంధుమిత్రులను కానీ ,భగవంతునికి ,హారతి ఇచ్చేముందు ,కాస్త జాగ్రత్త వహించడం మంచిది .ఎందుకంటే, ఈ కరోనా మహమ్మారి వల్ల మనం తరచూ ,శానిటైజర్ చేతులకు , ఉపయోగిస్తున్నాము

ముఖ్యంగా  వినాయక చవితి కి   గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు:
మనం కానీ ,మన కుటుంబసభ్యులని,  కానీ లేదా బంధుమిత్రులను కానీ ,భగవంతునికి ,హారతి ఇచ్చేముందు ,కాస్త జాగ్రత్త వహించడం మంచిది .ఎందుకంటే, ఈ కరోనా మహమ్మారి వల్ల మనం తరచూ ,శానిటైజర్ చేతులకు , ఉపయోగిస్తున్నాము.అందువల్ల  హారతి,  ఇచ్చేప్పుడు మన చేతులు గాయపడే అవకాశాలు ,ఎక్కువగా ఉంటాయి .పొరపాటున పిల్లలు కూడా శానిటైజర్ ను ఉపోయోగించి ,హారతి తీసుకోవడం వల్ల ,ప్రమాదం జరిగి   చేతులు  కాలే అవకాశం ఉంది .  కనుక పిల్లల్ని  ప్రత్యేక జాగ్రత్త  ,తీసుకొవడం మంచింది. ఈ ప్రమాదం  జరగకూడదంటే మనం    నీటి   తో కానీ  సబ్బు    నీటి తో  చేతులు  కడుకోవడం , మంచింది.నిర్లక్ష్యం ప్రమాదానికి దారి తీస్తుంది .

వినాయక వ్రత కల్ప విధానముశ్రీ వినాయక వ్రతంశ్లోకం:శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే

వినాయక వ్రత కల్ప విధానము
శ్రీ వినాయక వ్రతం

శ్లోకం:

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే

ఆచమనం:
ఓం కేశవాయ స్వాహాః
నారాయణాయ స్వాహాః
మాధవాయ స్వాహాః
(అని మూడుసార్లు చేతిలో నీరు వేసుకొని త్రాగవలెను)

గోవిందాయ నమః
విష్ణవే నమః
మధుసూదనాయ నమః
త్రివిక్రమాయ నమః
వామనాయ నమః
శ్రీధరాయ నమః
హృషీకేశాయ నమః
పద్మనాభాయ నమః
దామోదరాయ నమః
సంకర్షణాయ నమః
వాసుదేవాయ నమః
ప్రద్యుమ్నాయ నమః
అనిరుద్దాయ నమః
పురుషోత్తమాయ నమః
అధోక్షజాయ నమః
నారసింహాయ నమః
అచ్యుతాయ నమః
ఉపేంద్రాయ నమః
హరయే నమః
శ్రీ కృష్ణాయ నమః
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః

దైవ ప్రార్థన:

గణపతికి నమస్కరించి ఈ క్రింది శ్లోకములు చదువ వలెను).

1. యశ్శివో నామరూపానభ్యాం యాదేవీ సర్వమంగళా తయోస్సంస్మరణాత్పుంసాంసర్వతో జయ మంగళం

2. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ: యేషామిందీవరశ్శ్హ్యామో హృదయస్థోజనార్థన:

3. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయోనమామ్యహం

4. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యేత్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే.

తాత్పర్యము: మంగళ కరమైన వాటన్నిటిలోనూ అతి మంగళకరమై, సర్వ మంగళ నామధేయురాలవై, అన్ని అర్థములను సాధించి, శరణు జొచ్చిన వారికి ఆశ్రయమిచ్చే, ముక్కంటి దేవర అయిన శివుని అర్ధాంగి అయిన ఓ! పార్వతీ, ఓ! దుర్గాదేవీ, ఓ! నారాయణీ, నీకు నమస్కరిస్తున్నాను.

{ఈ క్రింది మంత్రమును చెపుతూ కుడి చేతితో అక్షంతలు దేవునిపై చల్లవలెను.}

ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః ఓం శచీపురందరాభ్యాం నమః ఓం అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః ఓం శ్రీ సితారామాభ్యాం నమః ||నమస్సర్వేభ్యోం మహాజనేభ్యః అయం ముహూర్త స్సుముహూర్తోస్తు||


భూతోచ్చాటన: (క్రింది విధముగా చదువుతూ అక్షతలు వెనుక వేసుకొనవలెను.)

శ్లో: ఉత్తిష్టంతు భూతపిశాచా: ఏతే భూమి భారకా: ఏతాషామవిరోధేనబ్రహ్మకర్మ సమారభే

తా: భూతోచ్చాటన అంటే భూతపిశాచములను పారద్రోలుట. చేయబోవు కార్యమునకు అవరోధము కలిగించు భూతపిశాచములను అచటినుండి వెడలిపొమ్మని భావము.

ప్రాణాయామం (మూడు సార్లు లోపలికి గాలి పీల్చి నెమ్మదిగా వదలడం)

ఓం భూః | ఓం భువః | ఓగ్ సువః | ఓం మహాః | ఓం జనః | ఓం తపః | ఓగ్ సత్యం |

ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ||

||ఓమా పోజ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్||

కారణము: (గృహస్థులు ఐదు వ్రేళ్ళతోను ముక్కును పట్టుకుని ఎడమరంధ్రం ద్వారా గాలిని పీల్చి, ఓం భూ: నుండి భూర్భువస్సువరోం వరకు మంత్రము చదివేంతకాలము గాలిని బంధించి తర్వాత మెల్లగా గాలిని కుడి ముక్కు రంధ్రం ద్వారావిడువ వలెను. దీనినే పూరకం, కుంభకం, రేచకం అంటారు. మంత్రం చదివే సమయంలో గాలిని బంధించుటను ప్రాణాయామము అంటారు. బ్రహ్మచారులు బొటన వ్రేలు, చిటికెన వ్రేళ్ళతో దీనిని చేయవలెను.)

అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపినా యః స్మరేద్వై విరూపాక్షంస బాహ్యాభ్యంతరశ్శుచిః || (అని నాలుగు దిక్కులా ఉద్ధరనితో నీళ్ళు చల్లవలెను. సుద్ధి చేసినట్టుగా)

ప్రాణాయామం

సంకల్పము: (ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఏమి కోరి, ఏ పనిచేస్తున్నారో స్పష్టముగా చెప్పుకొనుటను సంకల్పము అంటారు.) మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభేశోభనే ముహూర్తే, శ్రీ మహావిష్ణోరాజ్ణాయా ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ: ద్వితీయపరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూ ద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్ధక్షిణదిగ్భాగే, …….. నదీ సమీపే……… ( శ్రీ శైలస్య) నివాసిత గృహే అస్మిన్ వర్తమాన వ్యావహారిక, చాంద్రమానేన శ్రీ…………….నామ సంవత్సరే, …………… (దక్షిణాయనే), …….. (వర్ష) ఋతౌ, ……… (భాద్రపద) మాసే, ……… (శుక్ల) పక్షే,..….. (చతుర్థ్యాం) తిథి ………………. వాసరే, శుభ నక్షత్రే, శుభయోగే శుభకరణే, ఏవంగుణ విశేషేణ విశిష్టాయాం, శుభతిధౌ శ్రీమాన్………… గోత్ర: ……….నామధేయ: ధర్మపత్నీ……………… సమేతోహం సకుటుంబస్య క్షేమస్ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృధ్హ్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్ధం సకలకార్యేషు సర్వదా దిగ్విజయసిద్ధ్యర్ధం, శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ముద్ధిస్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతాపూజాం కరిష్యే అదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్ధం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. (నీరు ముట్టుకొనవలెను)



భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణమ్ విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహంభజే
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవమ్ ధ్యాయేత్సిద్ధి వినాయకమ్
ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం

షోడశోపచార పూజ:

ధ్యాయేత్గజాననం దేవం తప్తకాంచనసన్నిభం, చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం॥

శ్రీ మహా గణాధిపతయే నమః ధ్యాయామి
అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్బవ

ఆవాహయామి
మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనంచారు ప్రీత్యర్థం ప్రతి గృహ్యాతాం॥

ఆసనం సమర్పయామి
గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయాదత్తం గంధ పుష్పాక్షతైర్యుతం ॥

ఆర్ఘ్యం సమర్పయామి
గజవక్త్ర నమస్తే~స్తు సర్వాభీష్ట ప్రదాయక భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన॥

పాద్యం సమర్పయామి
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహాణాచమనం దేవ, తుభ్యం దత్తంమయా ప్రభో ॥

ఆచమనీయం సమర్పయామి.
దధిక్షీర సమాయుక్తం థామద్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్రం నమోస్తుతే ॥

మధుపర్కం సమర్పయామి.
స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత ॥

పంచామృత స్నానం సమర్పయామి.
గంగాదిసర్వతీర్థేభ్యః ఆహృతైరమలిర్ణలైః స్నానం కురుష్వభగవానుమాపుత్ర నమోస్తుతే॥

శుద్దోదక స్నానం సమర్పయామి.
రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ ॥

వస్త్రయుగ్మం సమర్పయామి.
రాజితం బహ్మసూత్రం చ కాంచనం చో త్తరీయకం గృహాణ సర్వదేవజ్ఞ భక్తానామిష్టదాయక॥

ఉపవీతం సమర్పయామి.
చంద నాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యాతాం॥

గంధాన్ సమర్పయామి.
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాంస్తండులాన్ శుభాన్, గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే॥

అక్షతాన్ సమర్పయామి.
సుగంధాని సుపుష్పాణి జాజీకుంద ముఖానిచ ఏక వింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే॥

పుష్పాణి పూజయామి.

అద్దంగా  పూజ (పువ్వులతో పూజించాలి)*****
గణేశాయ నమః - పాదౌ పూజయామి
ఏకదంతాయ నమః - గుల్ఫౌ పూజయామి
శూర్పకర్ణాయ నమః - జానునీ పూజయామి
విఘ్నరాజాయ నమః - జంఘే పూజయామి
అఖువాహనాయ నమః - ఊరూ పూజయామి
హేరంబాయ నమః - కటిం పూజయామి
లంబోదరాయ నమః - ఉదరం పూజయామి
గణనాథాయ నమః - నాభిం పూజయామి
గణేశాయ నమః - హృదయం పూజయామి
స్థూలకంఠాయ నమః - కంఠం పూజయామి
గజవక్త్రాయ నమః - వక్త్రం పూజయామి
విఘ్నహంత్రే నమః - నేత్రం పూజయామి
శూర్పకర్ణాయ నమః - కర్ణౌ పూజయామి
ఫాలచంద్రాయ నమః - లలాటం పూజయామి
సర్వేశ్వరాయ నమః - శిరః పూజయామి
విఘ్నరాజాయ నమః - సర్వాణ్యంగాని పూజయామి

శ్రీ వినాయక అష్టోతర శతనామ పూజ******
ఓం గజాననాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం ద్వైమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః
ఓం సుప్రదీప్తాయ నమః
ఓం సుఖనిధయే నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం మాన్యాయ నమః
ఓం మహాకాలాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం లంబజఠరాయ నమః
ఓం హయగ్రీవాయ నమః
ఓం ప్రథమాయ నమః
ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం ప్రమోదాయ నమః
ఓం మోదకప్రియాయ నమః
ఓం విఘ్నకర్త్రే నమః
ఓం విఘ్నహంత్రే నమః
ఓం విశ్వనేత్రే నమః
ఓం విరాట్పతయే నమః
ఓం శ్రీపతయే నమః
ఓం వాక్పతయే నమః
ఓం శృంగారిణే నమః
ఓం ఆశ్రితవత్సలాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం శీఘ్రకారిణే నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం బల్వాన్వితాయ నమః
ఓం బలోద్దతాయ నమః
ఓం భక్తనిధయే నమః
ఓం భావగమ్యాయ నమః
ఓం భావాత్మజాయ నమః
ఓం అగ్రగామినే నమః
ఓం మంత్రకృతే నమః
ఓం చామీకర ప్రభాయ నమః
ఓం సర్వాయ నమః
ఓం సర్వోపాస్యాయ నమః
ఓం సర్వకర్త్రే నమః
ఓం సర్వ నేత్రే నమః
ఓం నర్వసిద్దిప్రదాయ నమః
ఓం పంచహస్తాయ నమః
ఓం పార్వతీనందనాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం కుమార గురవే నమః
ఓం కుంజరాసురభంజనాయ నమః
ఓం కాంతిమతే నమః
ఓం ధృతిమతే నమః
ఓం కామినే నమః
ఓం కపిత్థఫలప్రియాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బ్రహ్మరూపిణే నమః
ఓం మహోదరాయ నమః
ఓం మదోత్కటాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం మంత్రిణే నమః
ఓం మంగళసుస్వరాయ నమః
ఓం ప్రమదాయ నమః
ఓం జ్యాయసే నమః
ఓం యక్షికిన్నరసేవితాయ నమః
ఓం గంగాసుతాయ నమః
ఓం గణాధీశాయ నమః
ఓం గంభీరనినదాయ నమః
ఓం వటవే నమః
ఓం జ్యోతిషే నమః
ఓం అక్రాంతపదచిత్ప్రభవే నమః
ఓం అభీష్టవరదాయ నమః
ఓం మంగళప్రదాయ నమః
ఓం అవ్యక్త రూపాయ నమః
ఓం పురాణపురుషాయ నమః
ఓం పూష్ణే నమః
ఓం పుష్కరోత్ క్షిప్తహరణాయ నమః ?
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం అగ్రపూజ్యాయ నమః
ఓం అపాకృతపరాక్రమాయ నమః
ఓం సత్యధర్మిణే నమః
ఓం సఖ్యై నమః
ఓం సారాయ నమః
ఓం సరసాంబునిధయే నమః
ఓం మహేశాయ నమః
ఓం విశదాంగాయ నమః
ఓం మణికింకిణీ మేఖలాయ నమః
ఓం సమస్తదేవతామూర్తయే నమః
ఓం సహిష్ణవే నమః
ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః
ఓం విష్ణువే నమః
ఓం విష్ణుప్రియాయ నమః
ఓం భక్తజీవితాయ నమః
ఓం ఐశ్వర్యకారణాయ నమః
ఓం సతతోత్థితాయ నమః
ఓం విష్వగ్దృశేనమః
ఓం విశ్వరక్షావిధానకృతే నమః
ఓం కళ్యాణగురవే నమః
ఓం ఉన్మత్తవేషాయ నమః
ఓం పరజయినే నమః
ఓం సమస్త జగదాధారాయ నమః
ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః
అగజానన పద్మార్కం గజాననమహర్నిశమ్
అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే

దశాంగం గుగ్గలోపేతం సుగంధం, సుమనోహరం, ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ॥

ధూపమాఘ్రాపయామి॥
సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినాద్యోజితం మయా, గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే

దీపందర్శయామి।
సుగంధాసుకృతాంశ్చైవమోదకాన్ ఘృతపాచితాన్, నైవేద్యం గృహ్యతాంచణముద్దేః ప్రకల్పితాన్,

భక్ష్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ, ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక,

నైవేద్యం సమర్పయామి।
సచ్చిదానంద విఘ్నేశ పుష్కరాని ధనానిచ, భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుష్వ వినాయక

సువర్ణపుష్పం సమర్పయామి.
పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం, కర్పూర చూర్ణసంయుక్తం తాబూలం ప్రతిగృహ్యతాం

తాంబూలం సమర్పయామి।
ఘృతవర్తి సహస్రైశ్చ శకలైస్థితం నీరాజనం మయాదత్తం గృహాణవరదోభవ

నీరాజనం సమర్పయామి

అద్ద దుర్వాయుగ్మ పూజ*****

గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

అఖువాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

సర్వసిద్ది ప్రదాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

ఇభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

మూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

కుమారగురవే నమః దూర్వాయుగ్మం పూజయామి।

ఏకదంతైకవదన తథామూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

కుమారగురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం మంత్రపుష్పం సమర్పయామి।

*నమస్కారం,ప్రార్థన*

ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ నమస్తే విఘ్ననాశన,

ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి,
అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వ భద్ర ప్రదాయక గంధ పుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన,

పునరర్ఘ్యం సమర్పయామి,
ఓం బ్రహ్మవినాయకాయ నమః

నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన,

ఈప్సితంమే వరం దేహి వరత్రచ పరాంగతిమ్

వినాయక నమస్తుభ్యం సంతతం మోదక ప్రియ

నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా.

*శ్రీ వినాయకుని కథ*
గణపతి జననము సవరించు
సూతమహర్షి శౌనకాది మునులకు ఇట్లు చెప్పెను। గజముఖుడయిన అసురుడొకడు తన తపస్సుచే శంకరుని మెప్పించి కోరరాని వరము కోరినాడు। తనను ఎవరూ వధించజాలని శక్తిని, శివుడు తన ఉదరమునందే నివసించవలెనని కోరినాడు। ఆ ప్రకారము శివుడు అతడి కుక్షియందు బందీ అయినాడు। అతడు అజేయుడైనాడు।

భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీ దేవికి చాలా దుఃఖహేతువైనది, జగత్తుకు శంకరుడు లేనిస్థితియది, జగన్మాతయగు పార్వతి భర్తను విడిపించు ఉపాయమునకై విష్ణువు నర్థించినది, విష్ణువు గంగిరెద్దువాని వేషము ధరించినాదు। నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకొని వెళ్లినాడు। గంగిరెద్దునాడించి గజముఖాసురుని మెప్పించాడు గజముఖాసురుడు ఆనందంతో "ఏమి కావలయునో కోరుకో" అన్నాడు। విష్ణుదేవుని వ్యూహము ఫలించినది, నీ ఉదరమందున్న శివుని కొరకై ఈ నందీశ్వరుడు వచ్చాడు। శివుని నందీశ్వరుని వశము చేయుమన్నాడు। గజముఖాసురునికి శ్రీహరి వ్యూహమర్థమయింది। తనకు అంత్యకాలము దాపురించినదని గుర్తించాడు। అయినా మాట తప్పుట కుదరదు। కుక్షియందున్న శివుని ఉద్దేశించి "ప్రభూ శ్రీహరి ప్రభావమున నా జీవితము ముగియుచున్నది। నా యనంతరం నా శిరస్సు త్రిలోకపూజితమగునట్లు, నా చర్మమును నిరంతరము నీవు ధరించునట్లు అనుగ్రహించవలసింది" అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశము చేశాడు। నందీశ్వరుడు యుదరమును చీల్చి శివునికి అందుండి విముక్తి కల్గించాడు। శివుడు గజముఖాసురుని శిరమును, చర్మమును తీసుకొని స్వస్థానోన్ముఖుడైనాడు।

అక్కడ పార్వతి భర్త రాక గురించి విని పరమానందముతో భర్తకు స్వాగతము పలుకుటకై సన్నాహమందున్నది। తనలో తాను ఉల్లసిస్తూ, స్నానాలంకారముల ప్రయత్నములో తనకై ఉంచిన నలుగుపిండితో ఆ ఉల్లాసముతో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసినది। అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించినది। దానికీ ప్రాణప్రతిష్ఠ చేయవలెననిపించినది। అంతకు పూర్వమే ఆమె తన తండ్రియగు పర్వత రాజు ద్వారా గణేశ మంత్రమును పొందినది, ఆ మంత్రముతో ఆ ప్రతిమకు ప్రాణ ప్రతిష్ఠ చేసినది। ఆ దివ్యసుందర బాలుని వాకిటనుంచి, తన పనులకై లోనికి వెళ్ళింది।

శివుడు తిరిగి వచ్చాడు, వాకిట ఉన్న బాలుడు అతనిని అభ్యంతరమందిరము లోనికి పోనివ్వక నిలువరించాడు. తన మందిరమున తనకే అటకాయింపా! శివుడు రౌద్రముతో ఆ బాలుని శిరచ్ఛేదము చేసి లోనికేగినాడు।

జరిగిన దానిని విని పార్వతి విలపించింది। శివుడు చింతించి వెంటనే తన వద్దనున్న గజముఖాసురుని శిరమును ఆ బాలుని మొండెమునకు అతికి ఆ శిరమునకు శాశ్వతత్వమును, త్రిలోకపూజనీయతను కలిగించాడు। గణేశుడు గజాననిడై శివపార్వతుల ముద్దులపట్టియైనాడు। విగతజీవుడైన గజముఖాసురుడు అనింద్యుడై మూషిక రూపమున వినాయకుని వాహనమై శాశ్వ్తతస్థానమును పొందాడు. గణపతిని ముందు పూజించాలి:

గణేశుడు అగ్రపూజనీయుడు సవరించు
ఆది దేవుడు విఘ్నేశ్వరుడు కాని ప్రకృత గజాననమూర్తి మాట ఏమిటి? ఈ గజాననునికి ఆ స్థానము కలుగవలసి ఉంది। శివుని రెండవ కుమారుడైన కుమారస్వామి తనకు ఆ స్థానమును కోరినాదు। శివుడు ఇరువురికీ పోటీ పెట్టినాడు। "మీలో ఎవరు ముల్లోకములలోని పవిత్రనదీ స్నానాలు చేసి ముందుగా నావద్దకు వచ్చెదరో వారికి ఈ ఆధిపత్యము లభిస్తుందన్నాడు। కుమారస్వామి వేగముగా సులువుగా సాగి వెళ్ళినాడు। గజాననుడుమిగిలిపోయినాడు। త్రిలోకముల పవిత్ర నదీ స్నాన ఫలదాయకమగు ఉపాయమర్థించాడు। వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన పరమశివుడు అట్టి ఫలదాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు। నారములు అనగా జలములు, జలమున్నియు నారాయణుని ఆధీనాలు। అనగా ఆ మంత్ర ఆధీనములు, మంత్ర ప్రభావము చేత ప్రతీ తీర్థస్నానమందును కుమార స్వామి కన్నాముందే వినాయకుడు ప్రత్యక్షము కాజొచ్చాడు। వినాయకునికే ఆధిపత్యము లభించినది।

చంద్రుని పరిహాసం సవరించు
గణేశుడు జ్ఞానస్వరూపి, అగ్రపూజనీయుడు, జగద్వంద్యుడూ। ఈ విషయమును విస్మరించిన చంద్రుడు వినాయకుని వింతరూపమునకు విరగబడి నవ్వాడు।

(చంద్రుడుమనస్సుకు సంకేతము) ఫలితముగా లోకమునకు చంద్రుడనను సరణీయుడైనాడు। ఆతని మాన్యత నశించింది। నింద్యుడయినాడు। ఆతడిపట్ల లోకము విముఖత వహించాలి। అనగా అతనిని చూడరాదు చూచిన యెడల అజ్ఞానముతో నింద్యుడయినట్లే, లోకులు కూడా అజ్ఞానులు నింద్యులు అవుతారు। నిందలకు గురియగుతారు।

చంద్రునికి కలిగిన శాపము లోకమునకు కూడా శాపమైనది. లోకులు చంద్రుని చూడకుండుటెట్లు? నీలాపనిందల మధ్య సవ్యముగా సాగుట ఎట్లు? చంద్రుడు జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపము చెందాడు. లోకులును ఈ శాపము నుండి విముక్తికై గణపతిదేవుని అర్థించారు. కరుణామయుడగు ఆ దేవుడు విముక్తికై ఉపాయము సూచించాడు. బాధ్రపద శుద్ధ చవితినాడు తన పూజచేసి తన కథను చెప్పుకొని అక్షతలు శిరమున ధరించిన యెడల నిష్కళంక జీవితములు సాధ్యమగునని అనుగ్రహించాడు.

ఇది ఎల్లరికి విధియని వక్కాణించబడింది. దీనిలో ఏమరుపాటు ఎంతటివారికి అయినా తగదని శ్యమంతకమణ్యుపాఖ్యానము ద్వారా మరింత స్పష్టము చేయబడింది.

శ్యమంతకోపాఖ్యానము సవరించు
చంద్ర దర్శనం నీలాపనింద: ఒకానొక వినాయక చతుర్థి సందర్భమున శ్రీ కృష్ణపరమాత్మ పాలలో చంద్రబింబమును చూచుట సంభవించింది. దాని దుష్ఫలితము ఆయనకు తప్పలేదు. సత్రాజిత్తు అను నాతడు సూర్యోపాసనచే శ్యమంతకమను మణిని సంపాదించాడు. దినమునకు ఎనిమిది బారువుల బంగారము నీయగల మణియది. అంతటి శక్తివంతమైన మణి పరిపాలకుని వద్ద ఉండదగినదని ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు భావించాడు. ఆ విషయము సత్రాజిత్తునకు సూచించాడు. అతనికి ఆ సూచన రుచించలేదు.

అనంతరము సత్రాజిత్తు తమ్ముడగు ప్రసేనుడు విలాసముగా ఆ మణిని ధరించివేటకై అడవికి వెళ్ళినాడు. అది ఆతనికి నాశనహేతువైనది. ఆ మణిని చూచి మాంసఖండమని భ్రమించిన సింహమొకటి అతడిని వెంటాడి చంపి మణిని నోటకరచుకొని పోయింది.

నిజము తెలియని సత్రాజిత్తు మణి ప్రలోభముతో శ్రీకృష్ణుడే తన తమ్ముని చంపి అపహరించాడని అనుమానించి నిందపాలు చేసాడు.

ఆ నింద బాపుకొనుట శ్రీకృష్ణునికి ఆవశ్యకమైనది.

అడవిలో అన్వేషణ సాగించాడు. ఒకచోట ప్రసేనుని కళేబరము కనిపించింది. అచట కనిపించిన సింహపు కాలిజాడల వెంట సాగి వెళ్ళాడు. ఒక ప్రదేశమున సింహము, భల్లూకం పోరాడిన జాడలు కనిపించాయి. శ్రీకృష్ణుడు భల్లూకపు కాలిజాడల వెంట వెళ్ళాడు. అవి ఒక గుహలోకి వెళ్ళాయి. గుహలో ఒక బాలునికి ఉన్న ఊయల తొట్టికి మణి వేలాడగట్టబడి ఉంది. శ్రీకృష్ణుడు ఆ మణిని అందుకున్నాడు. ఇంతలో భయంకరముగా అరచుచు ఒక భల్లూకం అతనిపై బడింది. భీకర సమరం సాగింది ఒక దినము కాదు, రెండు దినములు కాదు, ఇరువది ఎనిమిది దినములు. క్రమంగా ఆ భల్లూకమునకు శక్తి క్షీణించజొచ్చింది.



అది సామాన్య భల్లూకము కాదు. మహాభక్తుడు శక్తివంతుడైన జాంబవంతుడు. రామాయణ కాలమునాటి ఆ జాంబవంతుడు కర్మబంధములు విడివడక నిలిచియున్నాడు. అజేయుడాతడు. ఎవరివల్లను అతడు క్షీణబలుడగు ప్రశ్నేలేదు. ఒక్క శ్రీరామచంద్రుని వల్లనే అది సాధ్యము. ఈ విషయము తెలిసిన జాంబవంతుడు తాను ఇన్ని దినములు పోరాడుతున్నది శ్రీరామచంద్రునితోనేనని గుర్తించి స్తోత్రము చేయనారంభించాడు.

అది త్రేతాయుగపు గాథ. ఇది ద్వాపరయుగము. ఆ యవతారములో జాంబవంతుని సేవలకు మెచ్చిన శ్రీరామచంద్రుడు ఒక వరము కోరుకొమ్మనగా అవివేకముతో జాంబవంతుడు స్వయముగా శ్రీరామచంద్రునితో ద్వంద్వ యుద్ధమును కోరినాడు. అది శ్రీరామకార్యము గాదు కానఅప్పుడు నెరవేరలేదు. అవివేకముతో అతడు కోరిన కోరిక జాంబవంతునకు దీర్ఘకాల కర్మబంధమయినది. ఇప్పుడు కర్మ పరిపక్వమయినది. నేడీ రూపమున ఆ ద్వంద్వ యుద్ధము సంఘటిల్లినది. అవివేకము వైదొలగినది. అహంభావము నశించింది. శరీరము శిథిలమయింది. జీవితేచ్ఛ నశించింది. శ్రీకృష్ణపరమాత్మ రూపమున తనను అనుగ్రహించ వచ్చినది ఆ శ్రీరామచంద్ర ప్రభువేనని గ్రహించి ప్రణమిల్లి ఆ మణిని, ఆ మణీతో పాటు తన కుమార్తె జాంబవతిని అప్పగించి కర్మబంధ విముక్తి పొందాడు జాంబవంతుడు.

శ్రీకృష్ణుడు మణిని తీసుకుని నగరమునకు వెళ్ళి పురజనులను రావించి జరిగిన యదార్థమును వివరించి నిందబాపుకున్నాడు. నిజము తెలిసిన సత్రాజిత్తు కూడా పశ్చాత్తాపము చెంది మణిని తన కుమార్తెయగు సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహము చేశాడు. ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు మణిని నిరాకరించి సత్యభామను స్వీకరించాడు.

వినాయక వ్రతము చేయక చంద్రబింబమును చూచుట వలన జరుగు విపరీతమును స్వయముగా అనుభచించిన శ్రీకృష్ణపరమాత్మ లోకుల యెడల పరమదయాళువై బాధ్రపద శుద్ధ చవితినాడు వినాయకుని యథాశక్తి పూజించి ఈ శ్యమంతకమణి కథను అనగా అందలి హితబోధను చెప్పుకొని, గణేశతత్వము పట్ల భక్తి వినయములతో శిరమున అక్షింతలు ధరించిన యెడల నాడు చంద్రదర్శనము చేసినను నిష్కారణ నిందా భయముండదని లోకులకు వరము ఇచ్చాడు. అది మొదలు మనకు శ్యమంతకమణి గాథను వినుట సాంప్రదాయమయినది.

పూజచేసి కథనంతయు విను అవకాశము లేనివారు... సింహ ప్రసేనమవధీత్‌ సింహో జాంబవతా హతాః ఇతి బాలక మారోదః తవ హ్యేషశ్యమంతకః

సింహము ప్రసేనుని చంపినది. ఆ సింహమును జాంబవంతుడు చంపెను. కనుక ఓ బిడ్డా ఏడువకు. ఈ శ్యమంతకము నీదే అను అర్థము గల పై శ్లోకమునైనా పఠించుట ద్వారా ఆ విషయము స్మరించదగియున్నదని చెప్పబడింది. ఇది జాంబవంతుని గుహలో ఊయలలోని బిడ్డను లాలించుతూ పాడిన పాట అని చెప్పబడింది.

సర్వేజనాః సుఖినో భవంతు.

*వినాయక చతుర్థి పద్యం*

ప్రార్థన :

తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌.
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్‌.


తలచెదనే గణనాథుని
తలచెదనే విఘ్నపతిని దలచినపనిగా
దలచెదనే హేరంబుని
దలచెద నా విఘ్నములను తొలగుట కొరకున్‌


అటుకులు కొబ్బరి పలుకులు
చిటిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్‌
నిటలాక్షు నగ్రసుతునకు
బటుతరముగ విందుచేసి ప్రార్థింతు మదిన్

Wednesday, August 19, 2020

మంగళవారం పూట ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా అప్పుల బాధలను, ఆర్థిక ఇబ్బందులను దూరం చేసుకోవచ్చునని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. మంగళవారం సూర్యోదయానికి ముందే లేచి ఇంటిల్లపాదిని శుభ్రం చేసుకుని... శుచిగా స్నానమాచరించి... పూజకు అగరబత్తులు, అరటిపండ్లు, శుభ్రమైన నీరు, పువ్వులు, కుంకుమ సిద్ధం చేసుకోవాలి

మంగళవారం పూట ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా అప్పుల బాధలను, ఆర్థిక ఇబ్బందులను దూరం చేసుకోవచ్చునని ఆధ్యాత్మిక  పండితులు సూచిస్తున్నారు. మంగళవారం సూర్యోదయానికి ముందే లేచి ఇంటిల్లపాదిని శుభ్రం చేసుకుని... శుచిగా స్నానమాచరించి... పూజకు అగరబత్తులు, అరటిపండ్లు, శుభ్రమైన నీరు, పువ్వులు, కుంకుమ సిద్ధం చేసుకోవాలి. పూజ చేసేవారు ఎరుపు రంగు దుస్తులు ధరించాలి.
 
నిష్ఠతో హనుమాన్ యంత్రాన్ని పఠించాలి. మంగళవారం పూట శాకాహారాన్ని మాత్రమే తీసుకోవాలి. మద్యం, మాంసాహారం ముట్టకూడదు. ఐదు అరటి పండ్లను హనుమాన్‌కు సమర్పించినా చాలు. 21 మంగళవారాలు సూర్యోదయానికి ముందే లేచి శుచిగా హనుమాన్ పూజ చేయాలి. హనుమాన్ చాలీసాతో 15 నిమిషాలు హనుమంతుడిని ధ్యానించాలి. 
 
బెల్లం ముక్కను, అరటిపండ్లు, తమల పాకులు సమర్పించి స్వామికి దీపారాధన చేయాలి. ఇలా ప్రతీ మంగళవారం పూట హనుమంతుడిని పూజిస్తే.. సమాజంలో గౌరవం, ధైర్యం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఉపాధి అవకాశాలు చేకూరుతాయి. సంతానం కలుగుతుంది. ఈతి బాధలుండవు. ముఖ్యంగా పురుషులు ఈ వ్రతాన్ని చేస్తే.. అధిక నైపుణ్యం సంపాదిస్తారు. బుద్ధిబలం చేకూరుతుంది. హనుమంతుడిని శనివారం  పూజిస్తే.. శనిగ్రహదోషాలు తొలగిపోతాయిశ్రీరామచంద్రుని భక్తాగ్రేసరుల్లో ఆంజనేయ స్వామి అగ్రగణ్యుడు. రామాయణంలో సీతాన్వేషణలో శ్రీరామునికి ఇతోధికంగా సాయపడిన వానరుడు హనుమంతుడు. చైత్రశుద్ధ పౌర్ణమి నాడు ఆయన అంజనాదేవి, కేసరి దంపతులకు జన్మించాడు. వాయుదేవుని అనుగ్రహంతో పుట్టడంతో అశేష బలసంపన్నుడిగా అవతరించారు. చిరంజీవిగా వుంటూ శ్రీరామనామం శబ్దం విన్నంతనే అక్కడకు ప్రత్యక్షమవుతాడని కోట్లాది భక్తుల నమ్మకం. 
 
హనుమంతునిని నిత్యం ప్రార్థిస్తే శని కూడా మన ఛాయకు రాడని పెద్దలు అంటారు. రావణుడు బ్రహ్మ శనిని లంకలో బంధించివుంచాడు. సీతమ్మ జాడ తెలుసుకునేందుకు హనుమంతుడు రావణ అంతఃపురంలోని ఒక్కొక్కగది తెరుస్తాడు. ఈ క్రమంలోనే శనిదేవున్ని బంధించిన గది తాళం తీస్తాడు. దీంతో శని రావణుడి నుంచి విముక్తి పొందినట్టు పురాణాలు చెప్తున్నాయి. అందుకనే అంజనీపుత్రున్ని సేవిస్తే శని నీడ మనపై పడదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

* పోలాల అమావాస్య - (పోలాంబ వ్రతం) నాడు పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి ?🚩*_

_* పోలాల అమావాస్య - (పోలాంబ వ్రతం) నాడు పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి ?🚩*_

🕉☘️🕉️☘️🕉️☘️🕉️

పోలేరమ్మ అమ్మవారు గ్రామదేవతగా పూజలందుకుంటూ ఉన్న దేవత. దాదాపు ప్రతి గ్రామం , పట్టణాల్లో పొలిమేర్లలో ఈ అమ్మవారి ఆలయాలు కొలువుదీరి పూజలందు కుంటూ ఉండడం చూడవచ్చు.

ఆమె సంతానం లేనివారికి సంతానం ప్రసాదిస్తుందనీ , సంతానం కలిగినవారికి కడుపు చలువ చేస్తుందని విశ్వాసం. అటువంటి దేవతను పూజిస్తూ చేసే వ్రతమే ఇది.

పోలాల అమావాస్య
వ్రతాలమాసంగా ప్రసిద్ధి చెందినది శ్రావణమాసంలోని వ్రతాలలో  *“పోలాల అమవాస్య వ్రతం”* ఒకటి.

దీనిని శ్రావణ మాసంలోని బహుళ పక్ష అమవాస్యనాడు ఆచరిస్తారు. ఈ అమవాస్యకు *‘పోలామావాస్య’*  అని పేరు. దీనికే *‘పోలాల అమావాస్య , పోలాలమావాస్య , పోలాంబవ్రతం’* వంటి పేర్లు కూడా ఉన్నాయి.

ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల పిల్లలకు *‘అపమృత్యు భయం’* తొలగిపోయి ఆయురారోగ్యాలు వర్ధిల్లుతాయని చెప్పబడుతూ ఉంది.

*ఈ వ్రతమునకు సంబంధించి ఆసక్తికరమైన ఒకగాథ ప్రచారంలో ఉంది.*

పూర్వం బ్రాహ్మణ దంపతులు ఒక గ్రామంలో నివసిస్తూ ఉండేవారు. వారికి ఏడుగురు కుమారులు కలిగారు. యుక్త వయస్సు రాగానే వారందరికీ వివాహాలు చేశారు.

వారికి సంతానం కూడా కలిగింది. ఆ ఏడుమందీ తల్లిదండ్రుల వద్ద నుంచి వేరై…  అదే గ్రామంలో విడివిడిగా నివాసాలను ఏర్పాటు చేసుకుని నివసిస్తూ ఉండేవారు.
 
తమ సంతానం బాగా ఉండాలంటే ‘పోలాంబ’ అమ్మవారిని శ్రావణమాసంలో అమవాస్య నాడు పూజిస్తూ వ్రతం చేయడం మంచిదని ఎవరో చెప్పగా విన్న ఆ ఏడుమంది శ్రావణ అమవాస్య కోసం ఎదురుచూడ సాగారు.

శ్రావణమాసం వచ్చింది. అనేక వ్రతాలను ఆచరించారు. చివరిరోజు అయిన అమవాస్యనాడు పోలాంబవ్రతం ఆచరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు.

ఏడుగురు కోడళ్ళ ఉత్సాహంగా వ్రతం చేసేందుకు సిద్ధమయ్యారు. వ్రతం నాటి ఉదయాన్నే ఏడో కోడలి బిడ్డ మరణించింది.

ఫలితంగా ఆ రోజు వ్రతం చేయలేకపొయ్యారు. మరుసటి సంవత్సరం వ్రతం చేయడానికి ప్రయత్నం చేశారు.

కానీ మళ్ళీ ఆ సంవత్సరమూ ఏడవ కోడలి మరో బిడ్డ చనిపోవడంతో వ్రతానికి ఆటంకం ఏర్పడింది. ఈ విధంగా ప్రతి సంవత్సరం వ్రతం చేయడానికి ఏర్పాట్లు చేసుకోవడం ఆ దినం ఉదయం ఏడవ కోడలి బిడ్డ మరణించడం వ్రతంచేయలేకపోవడం…

ఈ విధంగా ఏడు సంవత్సరాలు జరిగింది. మిగతా ఆరుమంది కోడళ్ళు ఏడవ కోడలి వల్ల వ్రతం చెడిపోతూ ఉంది అని తిట్టుకోసాగారు. ఆమెకు ఎక్కడలేని దుఃఖం కలుగుతూ ఉండేది.

మరుసటి సంవత్సరం అంటే ఎనిమిదో సంవత్సరం నోముకు అవసరమైన ఏర్పాట్లు అన్నీ చేసుకున్నారు.

అయితే ఆ రోజు ఉదయమే ఏడో కోడలి బిడ్డ చనిపోయింది. ఈ విషయం తెలిస్తే అందరూ నిందిస్తారని , వ్రతం తన వల్ల ప్రతి సంవత్సరం చెడిపోతూ ఉందని కోప్పడతారని భావించిన ఏడో కోడలు ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా.

చనిపోయిన బిడ్డ శరీరాన్ని ఇంట్లో ఉంచి , మిగతా కోడళ్ళందరి తో కలిసి వ్రతంలో పాల్గొంది.

అందరూ ఆనందంతో వ్రతం చేస్తూన్నా…  తాను మాత్రం ఏదో పాల్గొంటూ ఉన్నట్లుగా యూంత్రికంగా వ్రతంలో పాల్గొంది. రాత్రి వరకూ అలా గడిచింది.

చీకటిపడి గ్రామం సదుమణిగిన అనంతరం చనిపోయిన బిడ్డను భుజాన వేసుకుని గ్రామ పొలిమేరలో ఉన్న *‘పోలేరమ్మ’* గుడికి వెళ్ళి బిడ్డను గుడిమెట్ల మీద ఉంచి , తన పరిస్థితిని తలుచుకుని దుఃఖించసాగింది. ఎలా ఖననం చేయాలి ? అని ఏడ్వసాగింది.

ఇలాంటి స్థితిలో గ్రామదేవత అయిన పోలేరమ్మ గ్రామ సంచారం ముగించుకుని , అక్కడికి చేరుకుని ఆమెను చూసి ఆ సమయంలో ఏడుస్తూ అక్కడ కూర్చొనడానికి కారణం అడిగింది.

దీనితో ఆమె గత ఎనిమిది సంవత్సరాలుగా జరుగుతున్నదంతా వివరించింది.

వీటన్నింటిని విన్న పోలేరమ్మ అమ్మవారు కరుణించి ఆమెకు అక్షతలు యిచ్చి పిల్లలను కప్పిపెట్టిన చోట వాటిని చల్లి పిల్లలను వారి వారి పేర్లతో పిలువవలసిందిగా చెప్పింది.

ఏడవకోడలు అదేవిధంగా చేసింది. ఫలితంగా చనిపోయిన పిల్లలందరూ నిద్ర నుంచి లేచి వచ్చినట్లుగా లేచి వచ్చారు. వారందరినీ తీసుకొని పోలేరమ్మ అమ్మవారికి నమస్కరించి , ఇంటికి చేరుకుంది.

మరుసటి రోజు ఉదయం తన ఆరుగురు తోడి కోడళ్ళతోపాటూ గ్రామంలోని వారందరికీ ఈ విషయాన్ని వివరించింది.

వారందరూ ఎంతో సంతోషించారు. అంతే కాకుండా అప్పటి వరకూ కేవలం కొద్ది మందికి మాత్రమే పరిమితమైన ఈ వ్రతం అప్పటి నుంచి అందరూ చేయడం ప్రారంభించినట్లు చెప్పబడుతూ ఉంది.

కాగా , *‘పోలేరమ్మ అమ్మవారు’* గ్రామదేవతగా పూజలందుకుంటూ ఉన్న దేవత. దాదాపు ప్రతి గ్రామం , పట్టణాల్లో పొలిమేర్లలో ఈ అమ్మవారి ఆలయాలు ఉండడం గాని , లేదంటే బహీరంగంగా కొలువుదీరి పూజలందుకుంటూ ఉండడం గానీ చూడవచ్చు.

ఆమె సంతానం లేనివారికి సంతానం ప్రసాదిస్తుందనీ , సంతానం కలిగినవారికి కడుపు చలువ చేస్తుందని విశ్వాసం. అటువంటి దేవతను పూజిస్తూ చేసే వ్రతమే ఇది.

పొలాల అమావాస్య ముందు రోజు ఒక కంద మొక్క  కాని కంద పిలక కాని తెచ్చుకోండి. మిగతా పూజ సామాను అంతా మీకు తెలిసినవే; పసుపు,  కుంకుమ, పూలు, కొబ్బరి కాయ ఒకటి, పసుపు కొమ్ములు రెండు, అరడజను అరటి పళ్ళు....

పొలాల అమావాస్య రోజున స్త్రీలు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి కంద మొక్క ని కాని  కందపిలకను కాని పూజా మందిరంలో పెట్టుకుని పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. పసుపు  వినాయకుని, పసుపు గౌరమ్మని, చేసుకుని తమల పాకుల్లో కంద మొక్క దగ్గరగా పెట్టుకోవాలి.  నైవేద్యానికి పళ్ళు, కొబ్బరి కాయతో పాటు అమ్మ వారికీ వడ పప్పు, పానకం, చలిమిడి, ఆడ  సంతానం కలవారు గారెలు, మగ సంతానం కల వారు బూరెలు సిద్దం చేసుకోవాలి. ఇద్దరు  వున్నవారు రెండూ సిద్దం చేసుకోవాలి. రెండు దారం పోగులకు పసుపు రాసి పసుపు కొమ్ములు  కట్టి ఉంచుకోవాలి. ఈ వ్రత కథ ప్రతి స్త్రీల వ్రత కథల పుస్తకంలో కనిపిస్తుంది. ఆ పుస్తకం కూడా  దగ్గర పెట్టుకోండి.

ఇక పూజా విధానం ఇతర పూజల లాగానే. ముందుగా ఆచమనం చేసుకుని, సంకల్పం చెప్పుకుని గణపతి పూజ చేసుకుని అమ్మ వారికి షోడశోపచార పూజ చేసుకోవాలి. పసుపు అమ్మ వారిని, కంద మొక్క లేక కంద పిలకని, కుంకుమతో పుష్పాలతో పూజించి, దీప, ధూప, నైవేద్యాలు సమర్పించి, అక్షతలు చేత పట్టుకుని, వ్రత కథ చదువుకుని, కొన్ని అక్షతలు అమ్మ వారి మీద, కొన్ని కుటుంబ సభ్యుల అందరి మీద జల్లు కోవాలి. పసుపు కొమ్ము కట్టిన ఒక దారం అమ్మ వారి దగ్గర ఉంచి, ఇంకో దారం పూజ చేసిన స్త్రీ మెడలో కట్టు కోవాలి. తీర్థ ప్రసాదాలు భక్తి తో స్వీవీకరించాలి.

ప్రతి సంవత్సరం శ్రావణ బహుళ అమవాస్య రోజు వ్రతాన్ని ఆచరించడం వల్ల సంతానభాగ్యం కలుగుతుందనీ , సంతానానికి అపమృత్యు భయం తొలగిపోయి ఆయురారోగ్యాలు వర్ధిల్లుతాయని శాస్రాలు చెబుతున్నాయి.
🙏🙏🙏🙏🙏🙏🙏

🌷ఈ పొరబాట్లు మహా గ్రహాపాట్లు🌷

🌷ఈ పొరబాట్లు మహా గ్రహాపాట్లు🌷

తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరబాట్లు చాలా సమస్యలకు కారణం అవుతుంది.. ఇది చాదస్తం అనుకునే వారు దయచేసి చడవకండి, హిందూ సంప్రదాయాలను నమ్మే వాళ్ళు మటుకు తెలుసుకుంటే ఆచరిస్తారా లేదా అనేది మీ వ్యక్తిగతం ఇవన్నీ మన పెద్దవాళ్ళు ఆచరించిన నియమాలు తెలియ చేయడం వరకు నా బాధ్యత..అవి ఏమిటో తెలుసుకుందాము....

1.పొద్దు ఎక్కేవరకు ఇంట్లో నిద్రపోకూడదు, ఆ టైం లో వాకిలి చిమ్ముకో కూడదు ,సూర్యుని మోహన నీళ్లు చల్లినట్టు అప్పుడు నీళ్లు చల్ల కూడదు...

2. నిద్ర లేవగానే ఆ దుప్పటి విదిలించి మడవాలి లేకుంటే దరిద్రదేవత అసనంగా అక్కడ కూర్చుంటుంది. 

3. తిన్న ఎంగిలి కంచం ముందు చేతిని ఎండబెట్టి చాలా సేపు కూర్చో కూడదు..తిన్న స్థలం నుండి కాస్త జరిగి అయినా కూర్చో వాలి కానీ చై కడిగి అక్కడే కూర్చుంటే రోగం వస్తుంది అంటారు..

4.మాసిన బట్టలు ఉతికాక స్నానం చేయాలి,బట్టలు అలిచిన నీటిని కాళ్లపైన పోసుకో కూడదు అందులో జేష్ఠ దేవికి ప్రవేశం దొరుకుతుంది. 

5. ఇళ్లు ఊడ్చిన చీపురు నిల్చో బెట్టకూడదు. 

6. వంట గదిలో వాడిన మసి బట్టలను పొద్దు పోయాక ఉతక కూడదు..

7.సంధ్య కాలంలో సంసారం నిషేధం ,నిద్రపోకూడదు, ఆహారం తిన కూడదు గొడవలు పడకూడదు, ఆ సమయం ప్రదోషం కాలం ,ధ్యానం పూజ,మంచి ఫలితం ఇస్తుంది. 

8.పూజ గదిలో ఒకే రూపానికి చెందిన రెండు విగ్రహాలు ఉండకూడదు , లోహం అయితే ఎత్తు తక్కువగా ఉండాలి, కొంచెం పెద్దగా ఉంటే వెనుక వీపు భాగం ఉండకుండా ఉండాలి, 

9. పోయిన ప్రతి దేవాలయాల నుండి విగ్రహాలు తెచ్చుకుని ఇంటినిండా పెట్టకూడదు, మీ పెద్దలు నుండి వస్తున్న ఆనవాయితీలు వదలకూడదు.

10. పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం కచ్చితంగా మంచినీరు ఉంచాలి, 

11. ఒక్క కుంది దీపం పెట్టె వాళ్ళు 3 ఒత్తులు వేయాలి, రెండు అంత కన్నా ఎక్కువ పెట్టేవారు రెండు ఒత్తులు వేస్తే సరిపోతుంది..

12. రోజూ వారి దీపారాధన కు మీరు వాడే నూనె మీ శక్తి కొద్దీ ఏదైనా పర్వాలేదు కానీ వ్రతము,నోము, దీక్ష,పరిహారాలు,సమయంలో, దీపారాధన నూనె అని మార్కెట్ లో దొరికెవి తెచుకోకండి నువ్వుల నూనె, ఆవు నైయి స్తోమత లేకపోతే ఆముదం తెచ్చుకోండి, కొబ్బరి నూనె తెచ్చుకోండి..కానీ కల్తీ నూనె వాడకండి..

13. పూజ చేసిన వెంటనే ఆ ఆసనం తెసివేయాలి అలానే 5 min కూడా ఉంచకూడదు 

14. సాయంత్రం ఆరు దాటాక సూది, ఉప్పు,నూనె,కోడి గుడ్లు. ఇంటికి తెచుకోకండి అవి శని స్థానాలు మీ వెంట కొని తెచుకున్నట్టు..

15. పొద్దు పోయాక పెరుగు, ఊరగాయాలు, మిరపొడి ఎవ్వరికీ ఇవ్వకండి ముఖ్యముగా శుక్రవారం, మంగళవారం ఇవ్వకండి అవి లక్ష్మీ స్థానాలు. 

16.శనివారం రోజు చెప్పులు, గొడుగు, గుడ్లు, నూనె, మాంసము ఇంటికి తెచుకోకూడదు, మీకు తినే అలవాటు ఉంటే గుడ్లు ముందు రోజు తెచ్చుకోండి..

17. జాతకంలో కుజ దోషం ఉన్న వారు,వ్యాపారం లో గొడవలు ఇబ్బందులు ఉన్న వారు  మంగళవారం రోజు గుడ్లు తినకండి దాని ప్రభావం ఇంకా ఎక్కువ అవుతుంది. 

18. శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకొని రాకండి, ఎవరైనా శనివారం రోజు బహుమతులు గా ఇనుము వస్తువులు,  నల్లటి,నీలి,వస్త్రాలు, గొడుగు, చెప్పులు ఇస్తే తీసుకోకండి.

 19.  ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా శుభ్రం గా ఉంచండి,పూజ గది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి..పూజ ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు  ఆహారం అందదు అంటారు

20. వంట చేసే వారు మాట్లాడుతూ అరుస్తూ చేయ కూడదు, వండే టప్పుడు పోరాబాటుగా కూడా మట్టాలాడే టప్పుడు పడే ఉమ్ము అందులో పడితే అది మహా దోషం పోరాబాటుగా అది అతిథులకు పెడితే చాలా పాపం చుట్టుకుంటుంది.

 21. ఇంటి ముంగిటలో తమల పాకు చెట్టు ఉంచకండి తోట ఉంటే తోటలోనే ఉంచండి తమల పాకు గౌరమ్మ మైలు గాలి తగల కూడదు..

22. ఇంటి ముందు భాగంలో అరటి చెట్టు ఉంచకూడదు. 

23.తులసి చెట్టు ఆకులు గోటితో గిల్ల కూడదు ఆడవారు అసలు కోయకూడదు, పొద్దు పోయాక నీరు పోయాకుడదు, ఒక చిన్న రాయిని తులసి కోటలో ఉంచి కృష్ణుడు గా భావించాలి...

24. దేవాలయం లో పూజించే విధంగా గాని గుడిలో గాని ఫ్లూట్ ఉన్న కృష్ణుడు ఉండాలి, గృహంలో ఫ్లూట్ ఊదు తున్నట్టు కృష్ణుడి విగ్రహం ఉండకూడదు...ఆవుతో ఉన్న కృష్ణుడు విగ్రహం మంచిది.

25.ఇంటికి వచ్చిన సుమంగలికి కుంకుమ బొట్టు పెట్టి పంపాలి.

26. రాత్రి పూట గాజులు, తాళి పక్కన తీసి పెట్టకూడదు, తాళిబొట్టులో దేవతా విగ్రహాలు   డాల్లర్స్ వేసుకో కూడదు, పిన్నిసులు వేయకూడదు, దేవుడికి వాడిన పసుపు మంగళసూత్రంకి పెట్టాలి..

27.అపశకునాలు మాటలాడకూడదు తథాస్తు దేవతలు మన భుజాల పైనే ఉంటారు. 

28.వారానికి ఒక్కసారి అయినా ఇల్లు తుడిచే నీటిలో ఉప్పు వేయాలి. డబ్బు నగలు పెట్టె బీరువాకు అద్దం ఉండకూడదు అందులో ముఖం చూసుకోవడం తల దువ్వడం లాంటివి చేస్తే డబ్బు అసలు నిలవదు.

29. దీపం పెట్టిన కుంది కింద పళ్ళెంలో నీరు పోసి పసుపు కొద్దిగా వేసి దీపం పెడితే కరువు లేకుండా ఉంటుంది. 

30. విడిచిన బట్టలు కాలితో తొక్క కూడదు,

31. స్నానం చేసి తుడుచుకున్న టవల్ ఇంటి తలుపు పైన వేయకూడదు.

32.ప్రతి రోజు ఇంట్లో దీపారాధన అలవాటు చేసుకోవాలి వారానికి ఒక్క సారిఅయినా గడపకు పసుపుకుంకుమ పెట్టాలి.

 33. ఉదయం లేవగానే పాసి మొహంతో అద్దం చూడకూడదు, తల దువ్వ కూడదు,

 34. భోజనం చేస్తున్న సమయంలో ఎవరిని తిట్టకూడదు..

35. స్నానం చేసి విడిచిన బట్ట మళ్ళీ కట్టకూడదు. 

36.మంగళవారం, శుక్రవారం క్షుర సంస్కారం చేయకూడదు, గోర్లు తీయకూడదు, పేనులు కుక్కడం దువ్వడం చేయకూడదు.

37. రెండు చేతులతో తల గోక కూడదు .గోర్లు కొరుకుతూ ఉండకూడదు, కాలుపై కాలు వేసి ఆడిస్తూ ఉండటం మంచిది కాదు, గుమ్మం చిలుకు ఆడించకూడదు.

38. తినే టప్పుడు తుమ్మితే చై కడిగి మళ్ళీ తినాలి..

39. వెండి వస్తువులు బహుమతులు గా ఇవ్వకూడదు.

40.ఇంటి గుమ్మాo ముందు చెప్పులు వదల కూడదు కొంచెం దూరంగా వదలాలి, 

41. ఇంట్లో మైలు ఉన్న స్త్రీలు వారు తాగే నీరు తిని మిగిలినవి ఎవరికి పెట్టకూడదు, ముఖ్యంగా భర్తకు ఎగిలి చేసినవి ఆ సమయంలో పెట్టకూడదు. మైలు నియమం పాటించాలి, 

42. ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు కానీ ఏ రోజు ఆ రోజు వ్యాపారం లో వచ్చే ధనం కానీ నేరుగా డబ్బులు దాచే బీరువాలో పెట్టకూడదు ముందు ఉప్పు డబ్బాలో పెట్టి తర్వాత బీరువాలో బీపెట్టాలి .

43. జితం రాగానే ఆ డబ్బుతో ముందు శుక్రవారం వారం నాడు ఊపు కొనాలి ధనం ఇంట్లో నిలుస్తుంది.

44. రాహు కాలంలో ,స్నానం, భోజనం, మైధునం చేయాకుడదు .

45. ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు. దేవాలయం లో మటుకే పెట్టాలి.

46. గృహస్థులు ఏక వస్త్రంతో పూజ చేయాకుడదు.

ఇవన్నీ పెద్ద కష్టమైనవి కాదు మనము పాటించాల్సిన కనీస నియమాలు ఇవన్నీ పాటించకుండా ఎడ్డీమడ్డి గా ఉంటూ ఆ పూజలు చేశాము ఈ పూజలు చేశాము ఫలితం లేదు అనకండి..

Monday, August 10, 2020

సృష్టి స్థితి కారుడైన శ్రీకృష్ణుడి జన్మ దినాన్ని ''కృష్ణాష్టమి''గా వేడుక చేసుకుంటాం. శ్రావణ బహుళ అష్టమి రాత్రి రోహిణీ నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. కృష్ణాష్టమిని "గోకులాష్టమి", "అష్టమి రోహిణి", "శ్రీకృష్ణ జన్మాష్టమి", "శ్రీకృష్ణ జయంతి", "శ్రీ జయంతి", "సాతం ఆతం", "జన్మాష్టమి" - ఇలా రకరకాలుగా వ్యవహరిస్తారు.

సృష్టి స్థితి కారుడైన శ్రీకృష్ణుడి జన్మ దినాన్ని ''కృష్ణాష్టమి''గా వేడుక చేసుకుంటాం. శ్రావణ బహుళ అష్టమి రాత్రి రోహిణీ నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. కృష్ణాష్టమిని "గోకులాష్టమి", "అష్టమి రోహిణి", "శ్రీకృష్ణ జన్మాష్టమి", "శ్రీకృష్ణ జయంతి", "శ్రీ జయంతి", "సాతం ఆతం", "జన్మాష్టమి" - ఇలా రకరకాలుగా వ్యవహరిస్తారు.

శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కృష్ణుడు ఇంట్లోకి రావాలని ఆశిస్తూ వాకిట్లో బియ్యప్పిండి లేదా ముగ్గుతో బాల గోపాలుడి పాదాలను తీర్చిదిద్దడంతో పండుగ వాతావరణం మొదలవుతుంది. ద్వారాలకు మావిడాకులు, వివిధ పూవులతో తోరణాలు కట్టి, కృష్ణుని విగ్రహాన్ని తడి వస్త్రంతో శుభ్రపరచి, చందనం, కుంకుమలతో తిలకం దిద్దుతారు. కృష్ణుని విగ్రహాన్ని, పూజా మందిరాన్ని పూవులతో అలంకరిస్తారు. అక్షింతలు, ధూపదీపాలతో పూజిస్తారు.

పాయసం, వడపప్పు, చక్రపొంగలి లాంటి ప్రసాదాలతో బాటు శొంఠి, బెల్లంతో చేసిన పానకం, వెన్న, మీగడ, పాలు నైవేద్యంగా పెడతారు. ముఖ్యంగా అటుకులను తప్పనిసరిగా సమర్పిస్తారు. కృష్ణుడికి కుచేలుడు ప్రేమగా అటుకులను ఇచ్చాడు. ఆ అటుకులు తీసుకుని, కుచేలునికి సర్వం ప్రసాదించాడు గనుక, ఈ పర్వదినాన బెల్లం కలిపిన అటుకులను పూజలో తప్పకుండా ఉంచుతారు.

శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని, అష్టమి నాడు ఉపవాసం ఉండి, నవమి ఘడియల్లో పారణతో ముగిస్తారు. ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి.

మమాఖిల పాప ప్రశమనపూర్వక సర్వాభీష్ట సిద్ధయే

'శ్రీ జన్మాష్టమీ వ్రతమహం కరిష్యే

అనే మంత్రాన్ని స్మరిస్తూ పూజ చేసుకోవాలి. శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు వీధుల్లో ఉట్లు కట్టి ఆడే ఆట రక్తి కడుతుంది. ఆ ఉట్టిని పైకీ, కిందికీ లాగుతూ ఉంటారు. ఒక్కొక్కరూ పోటీ పడుతూ ఉట్టిని కొట్టేందుకు ప్రయత్నిస్తారు.

శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని కృష్ణ లీలల్ని స్మరించుకుందాం.

ద్రౌపది, తనకు వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు తన భర్తలను సాయం అర్ధించలేదు. మరెవర్నీ ప్రాధేయపడలేదు. "కృష్ణా.. నన్ను నువ్వే కాపాడాలి" అంటూ శ్రీకృష్ణుని వేడుకుంది. తనను నమ్మి, శరణు వేడినవారిని దైవం ఎన్నడూ విడిచిపెట్టదు. కృష్ణుడు అందించిన దివ్య వస్త్రంతో ద్రౌపది అవమానం నుండి బయటపడింది.

కాళియ నాగుపాము యమునా నదిలో నివాసం ఏర్పరచుకుంది. ఆ పాము చిందించే విషంతో యమునా జలం కలుషితం అయింది. అంతేనా.. ఆ విషపు వేడికి నీలు మరుగుతూ, నదిపై ఎగిరే పక్షులకు కూడా హాని చేస్తోంది. ఆ వేడి సేగాలకు తట్టుకోలేక పక్షులు, నదిలో పడి చనిపోసాగాయి. ఇది చూసిన బాల కృష్ణుని మనసు ఆర్ద్రమైంది.

దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ దైవ లక్షణం కదా! యమునా జలాలకు కాలుష్యం నుండి విముక్తి ప్రసాదించాలని, కాళీయుని కోరల్లోంచి వెలువడుతోన్న విషం నుండి పశుపక్ష్యాదులను కాపాడాలని, యమునా జలాన్ని తిరిగి మంచినీటిగా మార్చాలని అనుకున్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు యమునా నదిలో దూకాడు.

కాళీయ సర్పం కృష్ణుని చూసింది. తనకు అపకారం తలపెట్టిన బాలకుడు ఎవరు అని ఆశ్చర్యపోయింది. తక్షణం బుద్ధి చెప్పాలని, తనపొడవాటి శరీరంతో కృష్ణుని చుట్టేసింది.ఒడ్డున ఉన్నగోప బాలికలు, యశోదమ్మ అందరూ కంగారుపడ్డారు. భయాందోళనలకు లోనయ్యారు. దాంతో కృష్ణుడు నవ్వుతూ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.

శ్రీకృష్ణుని ఆకృతి పెరగడంతో కాళీయ సర్పం పట్టు విడిపోయి, కోపంతో బుసలు కొట్టింది. ఇక కృష్ణుడు కాళీయుని నూరు పడగలపై నృత్యం చేశాడు. శ్రీకృష్ణుడు ఒక్కో పడగమీదికి లంఘిస్తూ కాళియ మర్దనం చేస్తోంటే కాళీయుడు తగ్గిపోయాడు. పడగలు దెబ్బతిన్నాయి. రక్తం ధారలు కట్టింది.

కాళీయుడు పశ్చాత్తాపానికి లోనయ్యాడు. శ్రీకృష్ణుని శరణు వేడాడు. కాళీయుని భార్యలు కూడా కృష్ణుని పాదాలపై పడి, కాళీయుని క్షమించమని కోరాయి. కృష్ణుడు దయ తలచాడు.. కాళీయుని వెంటనే యమునానది వదిలి వెళ్ళి, రమణక ద్వీపానికి వెళ్ళమన్నాడు. కాళీయుడు కుటుంబ సమేతంగా యమున వదిలి వెళ్లడంతో యమునాజలం పవిత్రమైంది. అందరూ ఆనందించారు.

కృష్ణ లీలలకు అంతేముంది? ఎవరైనా, ఎన్నయినా తలచుకోవచ్చు.

కృష్ణాష్టమి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు

Saturday, August 8, 2020

సాలె పురుగు ఏవిధంగా తన నుంచే తన గృహాన్ని నిర్మించుకుంటుందో.. అలాగే మనిషి కూడా తన మనస్సు నుండే తన సమస్త సుఖ: దుఃఖాల గూటిని నిర్మించుకుంటున్నాడు. ఆ విషయాన్ని మరచి ఎక్కడో భగవంతుడో... మరెవరో.. తన సుఖ: దుఃఖాలకు కారణమని నిందించడం ఎంత అజ్ఞానం....!!!!

<><><><><><><><><><><>
   🍂🍃 *మంచి మాట* 🍃🍂
•<>•<>•<>•<>•<>•<>•<>•<>•
        సాలె పురుగు ఏవిధంగా 
        తన నుంచే తన గృహాన్ని       
           నిర్మించుకుంటుందో.. 
           అలాగే మనిషి కూడా
           తన మనస్సు  నుండే 
     తన సమస్త సుఖ: దుఃఖాల 
   గూటిని నిర్మించుకుంటున్నాడు.
     ఆ విషయాన్ని మరచి ఎక్కడో 
       భగవంతుడో... మరెవరో..
       తన సుఖ: దుఃఖాలకు 
      కారణమని నిందించడం 
          ఎంత అజ్ఞానం....!!!!
                
  🎉🙏 *శుభోదయం*🙏💐
              

🌹మనం పుణ్యకార్యాలు ఎందుకు చేయాలి??

🌹మనం పుణ్యకార్యాలు ఎందుకు చేయాలి??

ఒక వ్యక్తి జీవించి ఉన్నంత వరకు బంధాలు బాధలు ఉంటాయి...
ఎలా అంటే ఒక దీపం వెలిగేటప్పుడు దానికి చమురు (నెయ్యి లేదా నూనె) కావాలి,
ఎక్కువ గాలి ఉండకూడదు, అలా అని అస్సలు గాలి లేకుండా కూడా ఉండకూడదు.. ప్రతిదీ దానికి ప్రాణ సంకటమే ...
అదే ఇక సారి దీపం ఆరిపోతే ఇక దానికి గాలితో కానీ చమురుతో కానీ దేనితో పని లేదు..
అక్కడితో దాని కధ ముగిసింది అని అర్థం ...

అలాగే ఒక వ్యకి జీవించి ఉన్నంత వరకు ప్రతిదీ కావాలి , ప్రతీది అవసరమే ...
ఒక సారి జీవం పోగానే ఈ ప్రాపంచిక విషయాలు బంధాలు అవసరం లేదు,

వారు చేసిన పుణ్యం తప్ప ఏది కూడా ఉండదు, 
ఎవరు వెంట కూడా వెళ్ళలేరు,
అక్కడితో ఆ వ్యక్తి కధ ముగిసినట్టే,...

*దీనిని పట్టి మనకు అర్థం ఏమవుతుందంటే ... ఈరోజు మనం పెంచుకున్న బంధాలు, ప్రేమలు, కోపాలు , తాపాలు, అన్ని అశాశ్వతమైనవే, కేవలం మనము చేసిన సేవనే మన వెంట వస్తుంది అని అర్థమవుతుంది, కాబట్టి నిత్యం మనం , పుణ్యకార్యాలు చేయాలి అని పురాణ వచనం🙏*

*మనలో ఆధ్యాత్మిక ఎదుగుదలకు శాంతే కొలమానం !!*_

_*అవగాహనే మనసుకు మంచి మందు. అవగాహన అంటే మనసుకు విషయం సంపూర్ణంగా, సమగ్రంగా, సమూలంగా అర్ధంకావడం. మనకు బాల్యం నుండి మనసును పోల్చుకోవడం, పోటీపడటం అలవాటుగా మారింది. అదే అలవాటుతో దేవుడు, సాధన, ముక్తి వంటి ఆధ్యాత్మిక విషయాల్లో కూడా మనసు పోల్చుకోవడం, పోటీ పడటం చేస్తోంది. నిజానికి మన జీవనం సాఫీగా సాగటానికి ఎవరితోనూ పోటీ పడక్కర్లేదు. మనతో మనం సక్రమంగా ఉంటే సరిపోతుంది. మన గుణాలను దాటటానికి, ప్రవృతిని మార్చుకోవడానికి అనుదినం మనతో మనమే పోటీపడాలి. మనలో వచ్చే మార్పే శాంతికి సోపానం. మనలో ఆధ్యాత్మిక ఎదుగుదలకు శాంతే కొలమానం. దీన్ని ఎవరినీ అడిగి తెలుసుకోవాల్సిన పనిలేదు. మనం నిత్యజీవితంలో ఎంత శాంతిగా ఉంటున్నాం, ఎన్ని విషయాల్లో శాంతిగా ఉంటున్నామనేది ఎవరిది వారికే తెలిసే విషయం !*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
---------------------------------------

*నచికేతుడు*
>÷<>÷<>÷<>÷<
           🦜

మనిషికి విద్య అవసరం. 
నేర్చుకొన్న విద్య నిర్వీర్యమవకుండా వుండాలంటే,  ఆ  విద్యలను ఇతరులకు నేర్పాలి. 
అప్పుడే  ఆ విద్యలకు శాశ్వతత్త్వం
కలుగుతుంది. 
విద్యార్జన అనంతం. జ్ఞానసముపార్జన మహాసాగరం. ఎంత లోతుకు తరచి చూస్తే అంత విజ్ఞానం కలుగుతుంది.

ఇంటి లోని పిల్లలను ఐదు సంవత్సరాలదాకా మహారాజుల్లా 
పెంచాలి. 
తరువాత15 సంవత్సరాలదాకా , పనివారిలాగ  చూడాలి. అన్ని పనులూ స్వంతంగా చేసుకునే నైపుణ్యం నేర్పాలి.  
16 సంవత్సరాల నుండి ఆ యువకుడిని  ఒక మంచి స్నేహితునిగా చూడాలని మన
శాస్త్రములు వివరిస్తున్నాయి.
పాఠశాలకు వెళ్ళడానికి ముందుగానే  ఆపిల్లవాని బుధ్ధి వికాసానికి తండ్రి తోడ్పడుతున్నాడు.
తరువాత  15 సంవత్సరాల
దాకా  పాఠశాలకు వెళ్ళి
విద్యని ఆర్జించాలి.
ఆ తరువాత ఆ  పిల్లలు తమకు కావలసిన
విద్యలన్నీ నేర్చుకుంటారు. 
అప్పటినుండి   వారు   తండ్రికి మిత్రులవుతారు.

పాఠశాలకు వెళ్ళే వయసు పెద్దలు చెప్పినట్లుగా  విని ఆచరించవలసిన కాలం.   ఆ సమయంలో వారిని 
పనివారిగా చూడాలని శాస్త్రం చెప్తోంది.
ఈ పది సంవత్సరాలలో
వారు నేర్చుకొన్న విద్యే
వారికి భుక్తిని , సంఘంలో 
విలువను పెంచుతుంది. 

దానికి ఉదాహరణ గా నచికేతుని కధ తెలుసుకుందాము.

నచికేతుడు గురుకులవాసం
చేసి ,  సకల విద్యలనభ్యసించి గొప్ప పాండిత్యం సంపాదించి
ఇంటికి  తిరిగి వచ్చాడు. 
నచికేతుడు ఇంటికి వచ్చిన
సమయంలో అతని తండ్రి
వాజశ్రవసు  మహర్షి 
ఒక యాగం తలపెట్టి ,
యాగ  ద్రవ్యాలను సమకూర్చుకోసాగాడు .
నచికేతుడు అన్నీ  విద్యలు అభ్యసించి వచ్చినందున ,తన తండ్రిని ఒక ప్రశ్న అడిగాడు.  
"మీరు యాగం చేస్తున్నారు కదా ..
 గోదానం చేయాలంటే ఒక దూడను ఈనిన తరువాత మరల చూలుతో వున్న
గోవును మాత్రమే దానమివ్వాలి .  అంతేకాని మనకు పనికిరాని
వట్టి పోయిన గోవుని దానమివ్వరాదు "  అంటూ మొదలు పెట్టి, తనకు తెలిసిన విషయ పరిజ్ఞానం అంతా తండ్రి ముందు ప్రదర్శించాడు.
తిరిగి మాట్లాడడం మొదలు పెట్టి,  "  నిజానికి యీ యాగ సమయంలో మీరు ఇక్కడ వున్నవన్నీ  దానంగా  యిచ్చి వేయాలి , ఏది సొంతానికి
వుంచుకో కూడదు.  అటువంటప్పుడు,  నన్ను
ఎవరికి  దానమిస్తారు ? 
అని  అతి తెలివితేటలతో అడిగాడు. 

యాగం ఏర్పాట్లలో నిమగ్నమైన 
అతని తండ్రి
నచికేతుని ప్రశ్నలకి  సమాధానాలు  విడమరచి చెప్పలేక ,  ఒకే మాటలో " నిన్ను  ఆ యమునికి దానం యిచ్చెస్తాను",
అని అన్నాడు.
నిజానికి ఆయనికి  ఆ మాటనడంలో ఎటువంటి ఉద్దేశ్యమూ లేదు. కొడుకు మాటలకు విసుగుచెంది
ఆ మాట అనేశాడు.
కోపంలో వచ్చిన మాట అని తెలిసినా, తండ్రి మాట నెరవేర్చడానికి , యముడు
వున్న చోటు వెతుకుతూ వెళ్ళాడు నచికేతుడు. 
నచీకేతుడు అక్కడికి  వెళ్ళేటప్పడికి యముడు అక్కడ లేడు. అక్కడే
ఆహారం లేకుండా మూడు రోజులు గడిపాడు  నచికేతుడు.  నాలుగవరోజున
వచ్చిన యమునికి తను వచ్చిన విషయం తెలిపాడు
నచికేతుడు. 

"మూడు రోజులుగా ఆహారం
లేకుండా అతిధిగా వుంచి, వుపచరించక  పోవడం
నాదే తప్పు.   దానికి పరిహారంగా  ,నీకు  వరాలిస్తాను  కోరుకోమని " అని మాట 
యిచ్

Wednesday, August 5, 2020

*రామాయణం ఎందుకు చదవాలి ?*

*రామాయణం     ఎందుకు చదవాలి ?* 

నిజమే,
రామాయణం ఎందుకు చదవాలి? ఎప్పుడో త్రేతాయుగం నాటి కథ. వందల పేజీల గ్రంథం. అదే సమయంలో ఏ వ్యక్తిత్వ వికాస పుస్తకమో చది వితే, ఎంతోకొంత స్ఫూర్తి కలుగుతుంది. ఏ నెట్ క్లోనో సినిమా చూస్తే చక్కని కాలక్షేపం 
లభిస్తుంది. ఏ ఆఫీసుపనో చేసుకుంటే బాసు ప్రశంసా అందుతుంది. కానీ, ఈ ప్రయోజనాలన్నీ తాత్కా లికం. రామాయణానికి నిన్ను పరిపూర్ణ వ్యక్తిగా మార్చే శక్తి ఉంది. ఆ స్ఫూర్తి పదాడంబర వికాస పుస్తకంలా పక్షానికో, పున్నానికో పరిమితం కాదు. జీవితాంతం వెన్నంటి నిలుస్తుంది. ఇక,చిన్నచిన్న కష్టాలకే ఆత్మహత్య ఆలోచనలు రావు. ఒకటి రెండు అపోహలతోనే బంధాలు బీటలువారవు. ఆస్తిపాస్తుల కోసం అన్నదమ్ములతో తగువు పెట్టుకోం. 
దశరథ పుత్రుడైన రాముడు ఎన్ని కష్టాలు అనుభవిం చాడూ?
ఎన్ని పరీక్షలు ఎదుర్కొన్నాడు ? 
రాజ్యాన్ని కోల్పోయాడు, తండ్రిని కోల్పోయాడు. భార్య దూరమైంది, ఓ దశలో సోదరుడూ ప్రాణాపాయంలో పడ్డాడు. అయినా, ధైర్యాన్ని వీడలేదు. ఓటమిని అంగీకరించలేదు. 
వానర సైన్యాన్ని కూడ గట్టుకున్నాడు. సముద్రాన్ని దాటి లంకకు చేరుకున్నాడు. మహా శక్తిమంతుడైన రావణుడితో యుద్ధం చేశాడు. గెలిచాడు. ప్రజల హృదయాల్లో నిలిచాడు. అదీ పోరాట పటిమ. 

రాముడితో మనకు పోలికే మిటి? అనుకోవడానికి వీల్లేదు.
రాముడు ఎక్కడా తాను దేవుడినని చెప్పుకోలేదు. అలా ప్రవర్తించనూ లేదు. దశరథ పుత్రుడినైన శ్రీరాముడిని అనే ప్రపంచానికి పరిచయం చేసుకున్నాడు. మనిషిలోని సాధారణ ఉద్వేగాలన్నీ రాముడిలోనూ ఉన్నాయి. కాకపోతే రాముడు ధర్మాన్ని నమ్మాడు. ధర్మాన్నే ఆచరించాడు. 
విగ్రహవాన్ ధర్మః అనిపించుకున్నాడు. 
అదే అతడిని పురుషోత్తముడిని చేసింది.
రామాయణం అంటేనే రాముడు నడిచిన దారి. వాల్మీకం చదవకపోతే ఓ విలువలమార్గం 
శాశ్వతంగా మూసుకుపోతుంది. రామాయణం నిజంగానే మ...హా కావ్యం! 
ఏడుభాగాలు, ఐదువందల అధ్యాయాలు, ఇరవైనాలు గువేల పద్యాల సమాహారం. ప్రతి అధ్యాయాన్నీ సర్గ అంటారు. ప్రతి పద్యాన్ని శ్లోకం అంటారు. 
రామాయణం పేరుకు రామకథే 
కానీ... నదులూ, పర్వతాలూ, అడువులూ, వివిధ దేశాలూ, అనేకానేక లోకాలూ కథాక్రమంలో ప్రస్తావనకు వచ్చాయి. భిన్న జాతుల మనుషుల్నీ, వృక్షాల్నీ, పశుపక్ష్యాదుల్ని పరిచయం చేశాడు వాల్మీకి. ఎంతోమంది రాజులు తారసపడతారు. వారి వంశాలూ తెలుస్తాయి. 
ఆ ప్రకారంగా రామాయణంలో చరిత్ర ఉంది, 
భూగోళం ఉంది, జీవ-జంతుశాస్త్రాలు ఉన్నాయి. ఇక మంచిచెడుల విషయానికొస్తే ఇది అచ్చమైన విలువల వాచకం. యుద్ధ వ్యూహాలూ, రణ తంత్రాలూ ఉన్నాయి. వాటిని నేటి రాజకీయాలకు అన్వయించుకుని పొలిటికల్ సైన్స్ కో, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తో అనుబంధంగా చేర్చుకోవచ్చు. విశ్వాన్ని కూడా వర్ణించారు కాబట్టి, అంతరిక్ష శాస్త్రంగానూ పరిగణించుకోవచ్చు.మొత్తంగా రామాయణం సమగ్ర విజ్ఞాన సర్వస్వం!
సకల శాస్త్రాల సారం వాల్మీకి మహర్షి రామాయణాన్ని శ్రీరామపట్టాభిషేకానికో, రావణ సంహారానికో పరిమితం చేయలేదు. సకల వేదాల సారాన్నీ, ఉపనిషత్తుల రహస్యాల్నీ ఒడుపుగా ఇమిడ్చాడు. వ్యక్తిధర్మం, రాజధర్మం, పుత్రధర్మం... అన్నింటికీ మించి మానవ ధర్మం - రామకథలో అంతర్లీనం. 
సీతారామ కల్యాణం సమయంలో జనకుడు...
రామయ్యకు సీతమ్మను అప్పగిస్తూ 'ఛాయేవానుగతా సదా...! ఇక నుంచీ ఈమె సహధర్మచారిణి, నీడలా నీ వెంట వస్తుంది - అని చెబుతాడు. అతను ఆమెకు నీడ. ఆమె అతనికి నీడ. ఇంతకుమించిన వివాహధర్మం ఏం ఉంటుంది? క్షణికమైన మోహాలూ, పైపై 
మెరుగులూ జీవితాల్ని ఎలా ఛిన్నాభిన్నం చేస్తాయో హృదయాలకు హత్తుకునేలా వివరించాడు వాల్మీకి. ఎంతో విజ్ఞురాలు అయినా కూడా బంగారు వన్నెలో మెరిసిపోతున్న లేడిని చూడగానే సీత మనసు వశం తప్పింది.
చర్మణా హృతచేతనా !మహా పండితుడైన రావ ణుడు సైతం బంగారుబొమ్మలా ఉన్న సీత మ్మను చూసీచూడంగానే మనసు పారేసుకున్నాడు,
మోహావేశానికి గురయ్యాడు. 
కాత్వంకాంచ నవర్ణభా! నిభాయించుకోలేని ఓ చిన్న బలహీనతే సీతను రాముడికి దూరం చేసింది, రావణుడిని ధర్మానికి దూరం చేసింది. అని సరిపోలుస్తాడు వాల్మీకి. నేటికాలపు అమాయక సీతమ్మలకూ, దురహంకారులైన దశ కంఠులకూ పరోక్షంగా హెచ్చరిక చేశాడు వాల్మీకి. మనం తీయని మాటల్నే నమ్ముతాం. అవి అబద్దాలైనా సరే ఆనందంగా ఆస్వాదిస్తాం. మనకు అయిష్టమైన సత్యాల్ని ఆమోదించడానికి సాహసించం. రావణుడూ అంతే. కాబట్టే, మారీచుడు చెప్పిన మంచి దశకంఠుడి చెవి కెక్కలేదు. 'సులభ్యా పురుషా రాజన్ సతతం ప్రియవాదినః'రావణా తీయ తీయని మాటలు చెప్పేవాళ్లు ఎక్కడైనా ఉంటారు. నాలాగా కఠిన వాస్తవాలు వివరించి మరీ హెచ్చరించేవాళ్లు చాలా అరుదు. దయ చేసి సమస్య తీవ్రతను అర్థం చేసుకో ' అంటూ జరగబోయే తీవ్ర పరిణామాల్ని కళ్లకుకడతాడు. ఏ అహంకారీ వాటిని పట్టించుకోడు. 
దీంతో, తమ పతనానికి తామే కారణం అవుతారు. రాముడి శరాఘాతానికి నేలకూలిన వాలి, చివరి మాటగా కొడుకు అంగదుడికి హితోపదేశం చేస్తాడిలా 'ఎవరి మీదా మితిమీరిన ప్రేమ చూపించ వద్దు. ఎవరినీ అతిగా ద్వేషించవద్దు'. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం ఈ రెండు కారణాలతోనే నూటికి ఎనభైశాతం హత్యలూ హత్యా ప్రయత్నాలూ ఆత్మహత్యలు జరుగుతున్నాయి.
ఇంకో మంచి మాటా అన్నాడు
కృతఘ్నే నాస్తి నిష్కృతిః' ఇతరులు చేసిన మంచిని మరచిపోవడం మహాపాపం, దానికి పరిహారమే లేదు. ఆన్లైన్ వేదికలూ డేటింగ్ యాప్స్ పొద్దున్నే నేస్తాలైపోయి, సాయంత్రానికి 
దుకాణం కట్టేసుకునే ఇంట్ ఫ్రెండ్ షిప్ కూ అన్వయించు కోదగిన సుభాషితమూ ఒకటుంది. సర్వథా సుకరం మిత్రం, దుష్కరం ప్రతిపాలనం  స్నేహం చేయడం సులభమే. 
దాన్ని నిలబెట్టుకోవడమే మహా కష్టం! ప్రమోషన్లు రాలేదనో, ఇంక్రిమెంట్లు పడలేదనో పని మానేసి మరీ బాధపడిపోయే కెరీర్ జీవులకు వాల్మీకి ఓ గెలుపు మార్గం చెప్పాడు. యజమాని మనసు ఎలా గెలుచుకోవాలో బోధించాడు.
రాముడిని మించిన బాసూ, హనుమంతుడిని మించిన దాసూ ప్రపంచంలో ఎక్కడుంటారు? 'ప్రాజెక్ట్ లంక' విజయవంతం అయిన సందర్భంగా రాముడు ఆంజనేయుడిని బెస్ట్ ఎంప్లాయీగా
గుర్తిస్తాడు. 'యజమాని అంచనాలకు మించి పనిచేసే వాడే ఉత్తమ సేవకుడు. సమర్థత ఉండి కూడా ఒళ్లు దాచుకునేవాడు అథమ స్థాయికి చెందినవాడు' అంటూ అప్రెయిజలో హెమోర్ విభాగానికి పని కొచ్చే కొలమానాన్ని అందించాడు ఆదికవి.మనం పంచ్ డైలాగులుగా చెప్పుకొని మురిసిపోయే సంభాషణల్ని తలదన్నే వాక్యాలు రామాయణంలో అనేకం. మనోఫలకం మీద ఆ దృశ్యాన్ని ఊహించుకోగలిగితే గ్రాఫిక్స్ కోసమో, ఎఫెక్ట్స్ కోసమో హాలీవుడ్ సినిమాలు చూసి సమయాన్ని వృథా చేసుకోవాల్సిన పరిస్థితే రాదు. హనుమంతుడు అశోక వృక్షం మీద వాలే సమయానికి సీతా దేవి'ముక్కలైన విశ్వాసంలా ఉంది' అంటాడు. పొడిపొడి మాటల్లో ఎంత పదునైన వ్యక్తీకరణ? ఆ వర్ణనలూ అంతే. రావణుడు అపహరించే సమయానికి పసుపు పచ్చని చీరలో ఉంది సీతాదేవి. ఆకాశంలో పుష్పక విమానం ఎగిరిపోతుంటే.. ఆ గాలికి చీర కొంగు రెపరెపలాడుతున్నది. పక్కనే నల్లగా అంతెత్తున రావణుడు. ఆ దృశ్యం ఏదో పర్వతం మీద మంటలు అంటుకున్నట్టుగా ఉందట. ఎంత గొప్ప 
వర్ణన! రాముడు అరణ్యవాసానికి వెళ్లిపోగానే దశరథుడు దుఃఖంలో మునిగిపోతాడు. 
అనారోగ్యం కబళిస్తుంది. చూపు మందగిస్తుంది. ఆ విషాదకర సన్నివేశంలో కౌసల్యతో ఓ మాట అంటాడు' రాముడు నా కనుపాప. తనతోపాటు నా చూపూ వెళ్లిపోయింది'.అనుబంధ వాచకం రాముడు భారతీయుల కుటుంబసభ్యుడు, గురువు, దేవుడు సమస్తం! భార్య భర్తలో రాముడిని చూసుకుంటుంది. తమ్ముడు అన్నలో రాముడిని చూసుకుంటాడు. తండ్రి కొడుకులో రాముడిని చూసుకుంటాడు. కానీ నేటితరాలే, క్రమక్రమంగా రాముడికి దూరం అవుతున్నాయి.
రామాయణాన్ని దూరం చేసు కుంటున్నాయి. కాబట్టే, ఆ జీవితాల్లో సంక్షోభం మొదలవుతున్నది. బంధాలకు బీటలు పడుతున్నాయి. అనుబంధాల్ని ఆస్తులు మింగేస్తున్నాయి. అదెంత నీచమైన చర్యో శ్రీరాముడే సెలవిచ్చాడు. తమను కలవడానికి వస్తున్న భరతుడిని చూసి.. దండయాత్రకు బయల్దేరాడేమో అని శంకించాడు లక్ష్మణుడు. ఆ దాడిని ఎదుర్కో వడానికి ఆయుధాలు సిద్ధం చేసుకున్నాడు. ఆ సందర్భంలో రాముడు చెప్పిన మాట ఇది యద్ధవ్యం బాస్టవానాం వా మిత్రాణాం వాక్షయే భవేత్ నాహం తత్ ప్రతిగృహ్లియాం భక్ష్యాన్విషకృతానివ బంధువుల్నో మిత్రుల్నో దూరం చేసుకోవడం వల్ల లభించే సంపద విషం కలిపిన భక్ష్యం లాంటిది. దాన్ని నేను అస్సలు ముట్టుకోను .లాభాల కోసమో, వ్యక్తిగత ప్రయోజనాల కోసమో అడ్డదారులు తొక్కే వ్యాపారవేత్తలకూ ఉన్నతాధికారు లకూ అయోధ్యకాండ ఓ హెచ్చరిక చేసింది. సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా  సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరం పదమ్.సిరిసంపదల దేవత అయిన లక్ష్మి ఎల్లప్పుడూ సత్యాన్నే ఆశ్రయించి ఉంటుంది. మనం సత్యా నికి దూరమైతే ఆ సిరి దేవి కూడా మనకు దూరమైపోతుంది. జైలుపాలూ బెయి లుపాలూ అవు తున్న మాజీ కుబే రుల వైఫల్య కారణం ఇదే. రామకథ 

తెలియక పోవడం వల్ల కావచ్చు, నవత రానికి జీవితం పట్ల ప్రేమఉండటం లేదు. సమస్యలతో పోరాడే తెగువ కనిపించడం లేదు. ఏ చిన్న ఇబ్బంది ఎదురైనా చావులోనే పరిష్కారాన్ని వెదుక్కుంటున్నారు. చేజేతులా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. నిద్రమాత్రలు మింగడానికి ఓ పూట ముందో, ఉరితాడు బిగించుకోడానికి ఓ రోజు ముందుకనీసం సంక్షిప్త రామాయణాన్ని తిర గేసినా తమ నిర్ణయం ఎంత మూర్ఖమైందో అర్థమైపోతుంది. 'బతికుంటే ఏదో ఒక రోజు విజయాన్ని సాధించవచ్చు. అదే చావును ఎంచుకుంటే, ఆ ఆస్కారమే ఉండదు' అని 
సలహా ఇస్తుంది రామాయణం. ఎట్టి పరిస్థితి లోనూ విషాదాన్ని మనసులోకి రానివ్వకూడదని సలహా ఇస్తాడు వాల్మీకి. 
'విషాదం మహా దుర్మార్గమైంది. కోపంతో బుసలు కొడుతున్న పాము, అమాయకుడైన పసివాడిని కాటేసినట్టు... విషాదం అంతెత్తు మనిషిని కూడా మింగేస్తుంది' అని బోధిస్తుంది. తల్లిదండ్రుల పట్ల దయలేని పిల్లల్ని దాశరథి రామ బాణం లాంటి ఓ మాట అంటాడు... 'కన్నవారిని గౌరవించలేని వారికి, దేవుడిని పూజించే అర్హతాఉండదు'.
ఆదికావ్యం.. ప్రాంతీయ,జాతీయ, అంతర్జాతీయ సాహిత్యాలకూ మహోపకారం చేసింది. కేంద్ర సాహిత్య అకాడమీ.... రామాయణం ఆధారంగా వచ్చిన గ్రంథాల వివరాలు సేకరించింది. వరుసగా పేర్లు రాసుకుంటూ వెళ్తే రెండు సంపుటాలు ప్రచురించాల్సి వచ్చింది. రామాయణాలే వెయ్యికి పైగా ఉన్నాయి. ఉర్దూ, నేపాలీ, జర్మన్ ఇలా దాదాపు యాభై భాషల్లోకి రామాయణాన్ని అనువదించుకున్నారు. జైనులూ, బౌద్ధులూ కూడా ఆ గ్రంథాన్ని కళ్లకు అద్దుకున్నారు.రామాయణ తత్వాన్ని మరింత లోతుగా విశ్లేషిస్తూ రామరహస్యోపనిషత్తు, సీతోపనిషత్తు తదితర ఆధ్యాత్మిక గ్రంథాలూ వెలువడ్డాయి సీతారాములు నాయికానాయకులుగా ప్రాణం పోసుకున్న నాటకాలూ చలనచిత్రాలూ జానపద గాథలూ వర్ణచిత్రాలూ లెక్కలేనన్ని. తెలుగువారైన త్యాగయ్య,రామదాసు, తూము నరసింహదాసు, అన్నమయ్య తదితర వాగ్గేయకారులు తమ సంకీర్తనలతో రామసార్వభౌముడిని అర్చించారు. తరించారు. వాల్మీకి రామాయాణాన్ని గద్యంలా చదువుకోవచ్చు. లయబద్ధంగా పాడుకోనూవచ్చు. కాబట్టే, 'పాఠ్యేగేయేచ మధురం'అంటారు లాక్షణికులు. ఆదికావ్యం తదనంతర కవులకు కూడా పెద్దబాలశిక్షలా ఉపయోగపడింది. అందుకేనేమో భోజుడు వాల్మీకిని 'మార్గదర్శిః మహర్షి!' అంటూ కొనియాడారు.
అతడికో కథ చెబుతుంది'ఓ పులి పరిగెత్తుకుంటూ వేటగాడికి ఎదురొచ్చింది. దీంతో వేటగాడు భయంతో చెట్టు ఎక్కాడు. అప్పటికే ఓ కొమ్మ మీద ఎలుగుబంటి ఉంది. 'నువ్వేం భయపడవద్దు. నేను నీకు హానిచేయను' అని అతడికి హామీ ఇచ్చింది 
ఎలుగుబంటి. వేటగాడు ఊపిరి పీల్చుకున్నాడు. వేటగాడు మన ఉమ్మడి శత్రువు. తోసెయ్' సలహా ఇచ్చింది కింది నుంచి పులి. అయినా, ఎలుగుబంటి ఆ మాట వినలేదు. కొద్దిసేపటికి ఎలుగు బంటి నిద్రలోకి జారుకుంటుంది. అదే అదనుగాభావించి... 'వేటగాడా ! ఆ ఎలుగుబంటిని నమ్మొద్దు. నేను వెళ్లిపోయాక నిన్ను తినేయాలని దాని పన్నాగం. ముందు దాన్ని కిందికి తోసెయ్' అని చెప్పింది జిత్తుల మారిపులి. వేటగాడు నిజమే అనుకున్నాడు. కిందికి తోసే శాడు. మనిషిలోని కృతఘ్నుడిని బట్టబయలు చేసే కథ ఇది. మరో కథలో రాజు ఓ బ్రాహ్మణునికి గోవును దానం చేస్తాడు. అది కాస్తా మందలో తప్పిపోయి రాజు గారి పశువులలో కలుస్తుంది. రాజు దాన్నే ఇంకో బ్రాహ్మ ణుడికి దానం చేస్తాడు. మొత్తానికి ఇద్దరూ ఆగోవు నాదంటే నాదంటూ గొడవపడతారు. న్యాయం కోసం ప్రభువు దగ్గరికి వెళ్తారు. ఎన్ని రోజులు ఎదురు చూసినా రాజదర్శనం లభించదు. నిరాశతో పాలకుడికి శాపం పెట్టి వెళ్లిపోతారు. పాలకులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలనేది ఈ కథలోని నీతి. 'రాజా ప్రియద ర్శనః' అన్న చాణక్య నీతికి ఈ కథ ఆధారం కావచ్చు.

అరణ్యవాస సమయంలో విల్లంబులతో తిరుగుతున్న రాముడికి సీత ఓ కథ చెబుతుంది... 'ఆయుధం మహాప్రమాదకారి. మనసును క్రూరంగా మార్చేస్తుంది. 
పూర్వం ఓ ముని తీవ్రమైన తపస్సు చేసుకుంటున్నాడు. అది చూసి ఇంద్రుడు అభద్రతకు లోనయ్యాడు. కొంప దీసి ఇంద్రపదవిని కోరుకుంటాడేమో అన్న అనుమానం
మొదలైంది. దీంతో మాయా రూపంలో వెళ్లి 'స్వామీ! నేను పరదేశిని. ఈ ఆయుధాన్ని మీ దగ్గర భద్రపరుచుకోండి. తిరుగు ప్రయాణంలో తీసుకుంటాను' అని కోరాడు. కాదనడానికి ఏ కారణమూ కనిపించలేదు మునీశ్వరుడికి. ఆయుధాన్ని తన కమండలం పక్కన పెట్టుకున్నాడు. కానీ, ఆయుధం చేతిలోకి రాగానే అతడి ఆలోచనలు మారిపోసాగాయి. మొదట మొక్కల్నీ కొమ్మల్నీ నరికాడు. ఆ తర్వాత జంతువుల ప్రాణాలూ తీయసాగాడు. దీంతో ఆలోచనలు పక్కదారి పట్టాయి. క్రూరాత్ముడిగా 
మారాడు. నరకానికి చేరుకున్నాడు'ఇలా, వ్యక్తిధర్మం నుంచి రాజధర్మం వరకూ రామాయణంలో లేనిదంటూ లేదు. ఆ సూత్రాలు పైపై నీతిబోధలు కావు. ఆచరణాత్మకాలు. జీవితమనే ప్రయోగశాలలో తానే ఓ గాజు నాళికగా మారిపోయి సత్య పరీక్షలు జరుపుకొన్నాడు శ్రీరాముడు. అంతిమంగా సత్యమే గెలు స్తుందని నిరూపించాడు. కాబట్టే, భారతీయులు రాము డిని గుండెల్లో నింపుకొన్నారు.

రామాయణాన్ని నెత్తిన పెట్టుకున్నారు. రామాయణాన్ని దూరం చేసుకున్న కొద్దీ.. రావణుడికి దగ్గరవుతున్నట్టే! క్రమక్రమంగా పదితలల మృగంలా మారుతున్నట్టే! జాగృతః జాగృతః జాగృతః

*గగనం గగనాకారం. సాగరః సాగరోపమః రామరావణ యోర్యుద్ధం రామరావణ యోరివ
ఆకాశానికి ఆకాశమే సాటి. సముద్రానికి సముద్రమే సాటి. రామరావణ యుద్దానికి రామరావణ యుద్ధమే సాటి.

రామాయణానికి రామాయణమే సాటి!

రాముడంటే శుచిః : మనసూ శరీరమూ పరిశుభ్రమే. సానుక్రోశః : దయామయుడు. సమదుఖః : ఇతరుల బాధల్ని పంచుకునేవాడు. అహింసా చభూతానాం : ఏ జీవికీ హింస చేయనివాడు. సత్యవాదిన్ : నిత్యం సత్యమే పలికేవాడు. క్రియాపరః : కర్తవ్యానికి 

ప్రాధాన్యం ఇచ్చేవాడు. సమర్థః : సర్వసమర్థుడు. సారగ్రాహిన్ : ఏ విషయాన్ని అయినా ఇట్టే ఆకళింపు చేసుకోగలవాడు ధర్మస్య పరిరక్షితా : ధర్మాన్ని కాపాడేవాడు. సర్వసమః : ప్రజలందర్నీ సమానంగా చూసేవాడు, స్మితపూర్వభాషీ : చిరునవ్వుతో సంభాషణ ప్రారంభించేవాడు. నిత్యంప్రశాంతాత్మా: ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవాడు. నచానృతకథః : అబద్ధం పలకనివాడు. అప్రమత్తః : ఏమరుపాటు లేనివాడు.

Sunday, August 2, 2020

శ్రావణ పౌర్ణమి రోజే రాఖి పండుగ ఎందుకు?

శ్రావణ పౌర్ణమి రోజే రాఖి పండుగ ఎందుకు?
ఈ రక్షాబంధన్ సాక్షిగా దీవిస్తే సంతోషిస్తా..
అన్నయ్యా నన్ను దీవించు..
కలకాలం నన్ను ఇలాగే ప్రేమించు..
ప్రియమైన నీ చెల్లెలు.
దేవతలు, ప్రకృతి ఆరాధన, ఆత్మీయత అనురాగబంధాలు, సకల పూజారాధనలు కారణాలు, చరిత్రలు ఏవైనప్పటికీ ఉన్మాదం, విచక్షణ లాంటి వెకిలి చేష్టలతో మానవతా విలువులు మంటగలుస్తున్న ప్రస్తుత కాలంలో రాఖీ పౌర్ణమి తన విశిష్టతను చాటిచెబుతూ సోదర ప్రేమ పటిష్టతకు దోహదపడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో తమ సోదరులకు సోదరి రాఖీ కట్టి, మిఠాయిలు తినిపిస్తారు. మనం రాఖీ పండుగను ఇలానే చేసుకుంటాం.
ఏడాదికి వచ్చే ద్వాదశ పౌర్ణమిల్లో శ్రావణ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. సాధారణంగా జంధ్యాన్ని ధరించేవారు ఈ రోజునే పాతది వదిలి కొత్త దానిని ధరిస్తారు. దీనినే ఉపాకర్మ అంటారు. ఉపాకర్మను యఙ్ఞోప‌వీతం పేరుతో పిలుస్తారు. దీనికి అంటే యాగ కర్మతో పునీతమైన దారం అని అర్థం. పాల్కురికి సోమనాథుడు దీనిని నూలి పౌర్ణమి అన్నాడు. ఎందుకంటే నూలుతో తయారుచేసిన జంధ్యాన్ని ధరించడమే దీనికి కారణం. వేద్యాధ్యయనానికి ప్రతీకైన ఉపాకర్మను ఆచరించాలి. దీనికి ముందు ఉపనయనం జరిపించి జంధ్యాన్ని వేయడం ఆచారం.
యఙ్ఞోప‌వీతం ధరించినవారు ద్విజులు. ద్విజులు అంటే రెండు జన్మలు కలవారని అర్థం. తల్లి గర్భం నుంచి జన్మించడం మొదటిది కాగా, ఉపనయనం అనంతరం గురువు నుంచి ఙ్ఞానాన్ని పొందడం రెండోది. ఉపనయం సమయంలో యఙ్ఞోపవీతానికి జింక చర్మాన్ని కడతారు. దీనిని ఉపాకర్మ కార్యక్రమంలో శ్రావణ పౌర్ణమి నాడు వదిలిపెడతారు. ఉపనయనం అయిన వారు జంధ్యాల పౌర్ణమి రోజు గాయత్రీ పూజచేసి కొత్త యఙ్ఞోపవీతాన్ని ధరించి పాతది విసర్జించాలి.
పరిపక్వతకు, పరిశుద్ధతకు యఙ్ఞోపవీతం దివ్యౌషధం. ఇది ఉపనయన సంస్కారం ఉన్నవారికే పరిమితమైనా మిగతావారు కూడా అష్టోత్తరాలతో గాయత్రీదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. అవివాహితులు మూడు పోగుల జంధ్యాన్ని, వివాహమైన వారు మూడు ముడులున్న తొమ్మిది పోగుల జంధ్యాన్ని ధరిస్తారు.
ఈ పండుగ రక్తం పంచుకుని పుట్టిన సోదరుల మధ్యే కాదు. ఏ బంధుత్వం ఉన్నా లేకపోయినా, ఒక సోదరుడు, సోదరి భావనలతో రాఖీ కట్టడం జరుగుతోంది. కేవలం సోదరీసోదరుల అనుబంధానికి గుర్తుగా మాత్రమే కాకుండా ఆత్మీయుల మధ్య కూడా ఐకమత్యానికి పరస్పర సహకారానికి చిహ్నంగా చేసుకోవడం కనిపిస్తుంది.
రాఖీ రోజు ఉద‌యాన్నే త‌లార స్నానం చేసి, కొత్త బ‌ట్ట‌లు వేసుకుని రాఖీకి సిద్ధ‌ప‌డ‌తారు. అక్క‌చెల్లెళ్లంతా బుద్ధిగా కూర్చున్న అన్న‌ద‌మ్ములకి రాఖీని క‌డ‌తారు. రాఖీని క‌ట్టేట‌ప్ప‌డు `‘యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల’` అనే స్తోత్రాన్ని కూడా చ‌దువుతారు. `ఎలాగైతే ఆ విష్ణుమూర్తి, బ‌లిచక్ర‌వ‌ర్తిని బంధించాడో, నువ్వు అలాగే ఇత‌ణ్ని అన్ని కాలాల‌లోనూ విడ‌వ‌కుండా ఉండు` అని దీని అర్థం. ఆ త‌రువాత హార‌తిని ఇచ్చి, నుదుట‌ తిల‌కాన్ని దిద్దుతారు. దానికి సంతోష‌ప‌డిపోయే సోద‌రులు త‌మ ప్రేమ‌కు గుర్తుగా వారికి చ‌క్క‌టి బ‌హుమ‌తుల‌ను అందిస్తారు.

Yes, she has gained weight? Defeated without losing a bout.

అవును, ఆమె కొంచెం బరువు పెరిగే వుంటుంది. ఎందుకంటే…. ఆటల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే నిండైన ఆత్మాభిమానాన్ని, విశ్వ వేదికపైనే కాదు వ...